
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయంలో చాలామంది నటీనటులు ఎప్పుడూ ముందుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. లీడ్ రోల్ దశ దాటాక కొందరు తారలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తుంటారు. అయితే ఈ విషయంలో తన రూటే సపరేటు అంటున్నారు హీరోయిన్ దుషారా విజయన్ . క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయరట. ఎందుకంటే ముప్పై ఐదేళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానంటున్నారామె.
‘బోదై ఏరి బుద్ధి మారి’ (2019) సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దుషారా. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ‘సార్పట్ట పరంబరై’ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, విక్రమ్ ‘వీర ధీర శూరన్’, ధనుష్ ‘రాయన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు దుషారా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘నాకు ముప్పై ఐదేళ్లు వచ్చాక నటనకు స్వస్తి పలుకుతాను. ఆ తర్వాత విదేశాలన్నీ చుట్టేయాలనుకుంటున్నాను. నేను చూడని దేశమంటూ ఉండకూడదు. అలా ΄ప్లాన్ చేసుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment