Dushara Vijayan
-
‘ఒరే తలైవర్’ అంటూ బర్త్‌డే విషెస్.. హీరోయిన్‌పై రజనీ ఫ్యాన్స్ ఫైర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్ ‘ఒరే తలైవర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. రజనీకాంత్ గౌరవం తగ్గించి ఒరే తలైవర్ అంటూ పోస్ట్ చేయడాన్ని తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్’ (సూపర్‌స్టార్ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్ (వేట్టయాన్), ధనుశ్ (రాయన్), విక్రమ్ (వీర ధీర శూరన్ 2) వంటి స్టార్ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
రజినీకాంత్‌తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్‌తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్‌ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు. -
ఆయనతో నటించడం కలలా అనిపించింది
కొందరికి గ్లామరస్ పాత్రలో నటించాలనే కోరిక ఉన్నా, నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలే వస్తుంటాయి. అలాంటి వారిలో నటి దుషారా విజయన్ ఒకరు. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన నటి ఈమె. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడు దర్శకుడు పా.రంజిత్ దృష్టిలో పడ్డారు. అలా ఆయన దర్శకత్వంలో ఆర్య కథానాయకుడిగా నటించిన సర్పట్ట పరంపరై చిత్రంలో నాయకిగా నటించారు. ఆ చిత్రం విజయాన్ని సాధించడంతోపాటు దుషారా విజయన్ నటనకు ప్రశంసలు లభించాయి. ఆ చిత్రంతోనే ఇలాంటి మంచి నటి ఉన్నారన్నది కోలీవుడ్‌కు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలోనే నక్షత్రం నగరగిరదు చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా దుషారా విజయన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కళువేత్తి మూర్ఖన్, అనీతి వంటి చిత్రాల్లో నటించారు. విశేషమేమిటంటే ఇప్పటివరకు ఈమె నటించిన కథా పాత్రలన్నీ గ్లామర్‌కు తావు లేకుండా నటనకు అవకాశం ఉన్న చిత్రాలే కావడం గమనార్హం. కాగా ఇటీవల కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా నటించడానికి సిద్ధమే అని దుషారా విజయన్ స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. అయినప్పటికీ ఈమెకు అలాంటి పాత్రలు రావడం లేదు ఇటీవల ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్ చిత్రంలో కీలకపాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. దీని గురించి దుషారా విజయన్ పేర్కొంటూ వేట్టైయన్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించాల్సి ఉండడంతో ముందురోజే తనకు చలి జ్వరం వచ్చేసిందన్నారు. ఆయనతో కలసి నటించడం తనకు కలగా అనిపించిందన్నారు. ఈ చిత్రంలో తనది చాలా బరువైన పాత్ర అని పేర్కొన్నారు. అదేవిధంగా ఫాహత్ ఫాజిల్ వంటి నటుడితో కలిసి నటించే అవకాశం వేట్టైయన్ చిత్రం కలిగించిందని దుషారా విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. -
రాయన్ మూవీలోని ధనుష్ చెల్లెలు.. బయట ఇంత అందంగా ఉందా?(ఫోటోలు)
-
అప్పుడు సినిమాలకు గుడ్‌బై చెబుతా!
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయంలో చాలామంది నటీనటులు ఎప్పుడూ ముందుంటారు. క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. లీడ్ రోల్ దశ దాటాక కొందరు తారలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తుంటారు. అయితే ఈ విషయంలో తన రూటే సపరేటు అంటున్నారు హీరోయిన్ దుషారా విజయన్ . క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయరట. ఎందుకంటే ముప్పై ఐదేళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానంటున్నారామె.‘బోదై ఏరి బుద్ధి మారి’ (2019) సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దుషారా. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ‘సార్పట్ట పరంబరై’ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, విక్రమ్ ‘వీర ధీర శూరన్’, ధనుష్ ‘రాయన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు దుషారా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘నాకు ముప్పై ఐదేళ్లు వచ్చాక నటనకు స్వస్తి పలుకుతాను. ఆ తర్వాత విదేశాలన్నీ చుట్టేయాలనుకుంటున్నాను. నేను చూడని దేశమంటూ ఉండకూడదు. అలా ΄ప్లాన్ చేసుకుంటున్నాను’’ అన్నారు. -
ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై: యంగ్ హీరోయిన్
బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి.అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్ హీరోగా వస్తోన్న రాయన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన వీర ధీర శూరన్ చిత్రంలో నటిస్తున్నారు.మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్‌కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఆ తరువాత విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్ పేర్కొన్నారు. -
నాడు గ్లామర్ ఫోటోలతో రచ్చ.. నేడు మూడు భారీ సినిమాల్లో ఛాన్సులు
చియాన్ విక్రమ్ అంటేనే వైవిధ్యానికి మారు పేరు. ఈయన తాజాగా నటించిన తంగలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో విక్రమ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన నటించే 62వ చిత్రం అవుతుంది. ఇటీవల చిత్తా (చిన్నా) వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌యూ అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హెచ్ఆర్.పిక్చర్స్ పతాకంపై రియా శిబూ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టెయిన్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. కాగా ఇందులో నటుడు ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరముడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. హీరో యిన్‌గా నటించే లక్కీఛాన్స్‌ను యువ నటి దుషారా విజయన్ దక్కించుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంపరై చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ చిన్నది అందులో మరియమ్మ పాత్రలో జీవించి, అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత నక్షత్రం నగరుదు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ వైపు దృష్టి సారించారు. అలా గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని, సామాజక మాధ్యమాల్లో విడుదల చేశారు. అలా మరింత వార్తల్లోకి ఎక్కిన దుషారా ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో నటించారు. ఇది త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ ఈ అమ్మడు నటించడం విశేషం. తాజాగా విక్రమ్‌తో జత కట్టే లక్కీఛాన్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ క్రేజీ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
గ్లామర్‌కు గేట్లు ఎత్తేసిన బ్యూటీ.. ఫోటోలు వైరల్
నటి దుషారా ఇప్పుడిప్పుడే కోలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ తరువాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో నక్షత్రం నగరగిదు చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత కరువేక్తి ముహుర్తం, వసంత పాళెం దర్శకత్వంలో చిత్రాలు చేశారు. తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 50వ చిత్రంలో దుషారా నటిస్తున్నారు. అదే సమయంలో నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయ్యన్ చిత్రంలోని ప్రత్యేక పాటలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా కనిపించిన దుషారా ఇప్పుడు గ్లామర్‌కు గేట్లు ఎత్తివేయటం విశేషం. ఇటీవల ఈమె ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించుకుని తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయాన్ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు పుష్ప చిత్రంలో సమంత నటించిన ఊ అంటావా మామా పాట జైలర్ చిత్రంలో తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాట ఎంత పాపులర్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా వేట్టైయాన్ చిత్రంలో దుషారా ఐటమ్ సాంగ్ పాపులర్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరందుకుంది. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
‘బ్లడ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి
అర్జున్ దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. ఎస్ పిక్చర్స్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదలకానుంది. ఈ మూవీని తెలుగులో ఎస్ఆర్డీఎస్ సంస్థపై దేవసాని శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వసంత బాలన్ మాట్లాడుతూ..‘బ్లడ్ అంటే సాధారణంగా మనకు వయొలెన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే బ్లడ్ అండ్ చాక్లెట్ అంటే ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి’ అన్నారు. ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్లో రిలీజ్ చేయటంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి. ‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్’అని హీరో అర్జున్ దాస్ అన్నారు. -
తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్
తమిళ సినిమా: రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ దుషారా విజయన్. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్ దృష్టిలో పడ్డారు. అలా ఆయన నిర్వహించిన ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి సార్పట్టా పరంపరై చిత్రంలో కథానాయకగా నటించారు. అందులో నటుడు ఆర్యకు జంటగా మరియమ్మ అనే పాత్రను పోషించారు. ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతగా ఆ పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌నే రూపొందించిన నక్షత్రం నగర్గిరదు చిత్రంలోని నటించారు. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి, నటుడు అర్జున్‌దాస్ సరసన ఒక చిత్రం అంటూ మూడు, నాలుగు చిత్రాలు దుషారా చేతిలో ఉన్నాయి. వీటిలో అరుళ్ నిధికి జంటగా నటించిన కళువేత్తి మూర్కన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఎస్.అంబేత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించారు. (చదవండి: కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు) ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నటి దుషారా విజయన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ కళువేత్తి మూర్కన్ తనకు స్పెషల్ చిత్రమని పేర్కొన్నారు. నటుడు అరుళ్ నిధితో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఆయన సెట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని అన్నారు. తాను ఇందులో కవిత అనే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించినట్లు చెప్పారు. (చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) చిత్రంలో అరుళ్ నిధితో కలిసి నటించిన రొమాన్స్ సన్నివేశాలు డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. దర్శకుడు పా..రంజిత్ సార్పట్టా పరంపరైకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందనీ అదే జరిగితే అందులో తానే నటిస్తానని చెప్పారు. తాను నట జీవితం సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉందనీ అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు.