తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు.
(ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్)
కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment