Sarpatta Parambarai Dancing Rose Actor Shabeer Kallarakkal's Next Movie - Sakshi
Sakshi News home page

'సార్పట్టా' నటుడు డాన్సింగ్‌ రోస్‌ హీరోగా కొత్త సినిమా.. ఎలాంటి కథతో వస్తున్నాడంటే?

Jun 10 2023 9:46 AM | Updated on Jun 10 2023 10:33 AM

Sarpatta Parambarai Dancing Rose Actor Shabeer Kallarakkal New Movie - Sakshi

కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్‌ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్‌ రోస్‌ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్‌ కల్లరాక్కల్‌ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.  తాజాగా డాన్సింగ్‌ రోస్‌ షబ్బీర్‌ కల్లరాక్కల్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్‌ మార్క్‌' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్‌గా నటిస్తున్నారు. విక్రమ్‌ శ్రీధరన్‌ కథ, దర్శకత్వం వహిస్తున్నారు.

(ఇదీ చదవండి: వరుణ్‌- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌, వీడియో వైరల్‌)

1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్‌ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్‌ అనే గ్రామంలో షూటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్‌ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్‌, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్‌ మార్క్‌' అని తెలిపాడు. 

(ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement