
కోలీవుడ్‌లో గతేడాదిలో విడుదలైన లబ్బర్ బంతు సినిమా భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ హాట్‌స్టార్‌లో విడుదయ అయిన తర్వాత ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. అలాంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణన్ కుమార్, ఎ. వెంకటేష్‌తో కలిసి నిర్మిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం 'మిస్టర్ ఎక్స్'.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. కోలీవుడ్‌లో ఎఫ్‌ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తున్నారు.
'మిస్టర్ ఎక్స్' చిత్రంలో ఆర్య కథానాయకుడుగానూ, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత నటుడు ఆర్య మాట్లాడుతూ ఇందులో నటించడానికి తనకు సిఫార్సు చేసింది నిర్మాత ఎస్ లక్ష్మణన్ కుమార్ అని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ కథ చెప్పగానే ఇందుకు చాలా భారీ బడ్జెట్ అవుతుంది కదా అని నిర్మాతలతో చెప్పగా ప్రేక్షకులకు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఇవ్వాలంటే రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాల్సిందే అని చెప్పారన్నారు.

నటుడు గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తాను ఊహించిన దానికంటే 100 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం కండలు పెంచి నటించారన్నారు. తనకు తెలిసి ఈయన కోలీవుడ్ హల్క్ అని పేర్కొన్నారు. నిర్మాత ఎస్. లక్ష్మణన్ కుమార్ మాట్లాడుతూ ఇది చాలా కాలం పాటు ప్రణాళికను సిద్ధం చేసి రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ చెప్పిన ఏ విషయం నమ్మశక్యంగా లేదని అయితే ఆయన చెప్పిన నాలుగు విషయాలు మాత్రం ఎంతో నమ్మశక్యం అనిపించాయన్నారు.
చైనాను టార్గెట్ చేసేందుకు
1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోతాయన్నారు. వాటి గురించి ఇప్పటివరకు ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రం చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్‌ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
నందాదేవి మిస్టరీ ఇదే
చైనా, భారత్ యుద్ధం ముగిసిన తర్వాత చైనా మిలటరీపై ఇండియా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అమెరికాతో భారత్ చేతులు కలిపింది. 1965లో అమెరికా, భారత్ సంయుక్తంగా నందాదేవి పర్వతంపై ఒక అణుశక్తి పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. అందుకోసం ట్రాన్స్ రిసీవర్స్‌తో పాటు అణుశక్తి ఉత్పాదక జనరేటర్, అణు ఇంధనమైన ఫ్లుటోనియంను నందాదేవి కొండపైకి తీసుకెళ్లారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసి కొండ నుంచి తిరిగొచ్చారు.
1966లో తిరిగి అక్కడికి వెళ్లేసరికి పరికరాలు కనిపించలేదు. అక్కడ పూర్తిగా మంచు కప్పుకొని ఉంది. దీంతో సరైన ప్రదేశం గుర్తించలేక తిరిగొచ్చేశారు. అయితే, 2005లో అనూహ్యంగా ఈ ఫ్లుటోనియం జాడలు కింద ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్లుటోనియం వల్లే మంచు కరిగే ప్రమాదం ఉందని అంచనా వుంది. ఈ మూలకం జీవితకాలం వందేళ్లుగా ఉంది. వచ్చే 40 ఏళ్లలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోనని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిని మరో మానవ తప్పిదంగా వారు చెప్పుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment