Dancing
-
సూపర్‌గా డ్యాన్స్ చేస్తున్న యువతి..ఒక్కసారిగా..
భోపాల్:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. Madhya Pradesh - A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు. -
వాట్ ఏ ఆఫర్: డ్యాన్స్ చెయ్యి..కాఫీ తాగు..!
కొన్ని కేఫ్‌లు ప్రజలను సంతోష పెట్టేలా మంచి ఆఫర్లు అందిస్తాయి. అవి వినడానికి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. కానీ ఈ కేఫ్ ఇచ్చిన ఆఫర్ మాత్రం సంతోషం తోపాటు మంచి రుచిని కూడా ఆస్వాదించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. యూఎస్‌లోని కేఫ్‌లోకి డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్ అయ్యితే చాలు మంచి రుచికరమైన ఓ కప్పు కాఫీని సిప్ చెయ్యొచ్చు అంటూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. అంతే జనాలంతా తమ టాలెంట్‌ని వెలికి తీసి మరీ మంచి మంచి స్టెప్పులతో అలరించారు. వృద్ధులు సైతం ఈ ఆఫర్ కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెలకోసారైనా..ఈ ఫన్ ఇనిషియేటివ్‌ని అందివ్వాలని కేఫ్ ఓనర్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఉదారంగా ఆలోచించే కేఫ్‌లు దొరకడం అత్యంత అరుదు. View this post on Instagram A post shared by Hope Rises (@hoperisesnetwork) (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
డ్యాన్సింగ్ పోలీస్ విత్...
ముంబైకి సంబంధించినంత వరకు ‘డ్యాన్సింగ్ పోలీస్’ అంటే గుర్తుకు వచ్చే పేరు అమోల్ కాంబ్లే. పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తున్న అమోల్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా అమోల్ కాంబ్లే డ్యాన్స్‌కు టిక్‌టాక్ సెన్సేషన్ ఇసాబెల్ ఆఫ్రో డాన్స్ తోడైంది. కాదు... కాదు... ఆమె డ్యాన్స్‌కే అమోల్ డ్యాన్స్ తోడైంది. రద్దీగా ఉండే ముంబై వీధి మధ్యలో ఆఫ్రో డ్యాన్స్ మొదలుపెట్టగానే... చుట్టుపక్కల ఉన్న ఆటోడ్రైవర్లు, ఇతరులు గుమిగూడి ఆ డాన్స్‌ను తమ ఫోన్లలో షూట్ చేయడం మొదలుపెట్టారు.ఇంతలో బిగ్ సర్ప్రైజ్.ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో తెలియదుగానీ ‘డాన్సింగ్స్ పోలీస్’ అమోల్ ఆఫ్రోతో కలిసి స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించే అమోల్ ఈసారి మాత్రం కేవలం టోపీతో మాత్రమే కనిపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫ్రో షేర్ చేసిన ఈ వీడియోను 3.4 మిలియన్ల మంది వీక్షించారు. -
డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్‌కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్‌లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్‌లో వెస్ట్రన్ స్టైల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్‌గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.టాలీవుడ్ టూ బాలీవుడ్..నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్‌లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్‌లో విరివిగా ప్లాష్మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు. సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్‌కు..సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్‌లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్‌లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్‌లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్‌లో సందడి చేస్తున్నారు.అవకాశాలెన్నో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్‌తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్సాల్సా సైతం..20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్‌లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్హాప్కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్‌తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
ఈ డాన్సింగ్ కుషన్స్‌ని ఎప్పుడైనా చూశారా!?
సోఫా, బెడ్‌పైకి రకరకాల మోడల్స్‌లో కుషన్స్ కనపడుతుంటాయి. వాటిల్లో డాన్సింగ్ కుషన్స్‌ని చూశారా? ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్, పెయింటింగ్ కాంబినేషన్స్‌తో రూపుదిద్దుకునే ఈ కుషన్ డిజైన్స్ సృజనాత్మకతకు అద్దంపడతాయి. లివింగ్ రూమ్, బెడ్ రూమ్, కిడ్స్ రూమ్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.పిల్లల ఫ్రాక్స్ను పోలిన నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసి, అటాచ్ చేసిన డాన్సింగ్ డాల్స్‌ని కుషన్ కవర్స్‌కి జతచేసినా.. డోర్స్‌కి హ్యాంగ్ చేసినా అదనపు హంగునిస్తాయి. ఈ డెకరేటివ్ కుషన్స్‌ని వివాహ వేడుకలు, పిల్లల పుట్టినరోజు పార్టీల కోసం కూడా డిజైన్ చేస్తున్నారు క్రియేటర్స్. వీటిలో నెటెడ్, లేస్, ముత్యాలు, కలర్ రిబ్బన్స్ వంటి వాటì నీ ఉపయోగిస్తున్నారు. -
Monal Gajjar: వర్షంలో బిగ్‌బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్
సోషల్ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.इन रील्स वालों के लिए एक दो मेट्रो कही साइड में खड़ी कर दो यार जहां देखो वहां चालू हो जाते है । #DelhiMetro में तो ये चल ही रहा है कही #MumbaiMetro में भी ये चालू न हो जाए pic.twitter.com/l8pzDHKxpy— Mahendra Singh (@mahendrasinh280) June 11, 2024సోషల్ మీడియాలో యూజర్ల రీల్స్‌తో గతంలో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్‌పురి పాటకి రాడ్ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో పోస్ట్ అయింది. మహేంద్ర సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రీల్స్ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రోలు సైడ్‌కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
చిన్న పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయ్. అందులోనూ అమ్మాయిలు చేస్తే ఇంకా ముచ్చటగా ఉంటుంది. అమ్మచీర దొంగచాటుగా చుట్టేసు కోవడం, పెద్ద జడకోసం ఆరాట పడటం . అబ్బో..ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇది మాత్రమే కాదు.. అమ్మ చేసే పనులను కాపీ చేస్తూ ఉంటారు. పెద్ద ఆరిందాలాగా చీపురు పట్టకొని ఊడ్వడం, బుజ్జి బుజ్జి చేతులతో వంట చేసేయడం, వడ్డించడం లాంటి పనులు చేసి మురిపిస్తుంటారు. ఇక ఒక టీవీ చూస్తూ డాన్స్‌లు వేయడం,అద్దం ముందు నించొని చేసే చేష్టల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.Who says group dance is not possible with a single performer? 😀😛😂 #Dance #cutenessoverload pic.twitter.com/mOJIVgB6yR— Ananth Rupanagudi (@Ananth_IRAS) May 5, 2024 ఒక షాపింగ్ మాల్లో ఒక చిన్నారి ఒక రేంజ్లో డ్యాన్స్ చేసింది. ఎక్కడ ఎవరు తీసారు అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, షాపింగ్ మాల్ ట్రయిల్ రూంలో అద్దం ముందు నిల్చొని అద్భుతంగా స్టెప్పులేసింది. దీంతో అద్దాల్లో నలుగురు చిన్నారులు గ్రూపు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి అభియం కూడా నిజంగా అక్కడ నలుగురు అమ్మాయిలున్నారా అనిపించేలా చేసింది. దీంతో నెటిజన్లు వావ్..సూపర్ అంటున్నారు. మరి మీరు కూడా ఒకసారి చూసేయ్యండి ఆ వీడియోను. -
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
50వ వసంతంలోకి అడుగుపెడుతోన్న కండలవీరుడు హృతిక్ రోషన్
-
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా?
పిల్లలు చాలా పనుల్లో పెద్దలను అనుకరిస్తారు. చైనాలో ఒక పిల్లవాడు నిపుణుడైన చెఫ్‌ను అనుకరిస్తూ జనం హృదయాలను దోచుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూనే, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్లో నివసిస్తున్న అతని తల్లి, తమ పిల్లవాడు నెలల వయస్సులో వంట చేయడంపై ఆసక్తిని కలిగి ఉన్నాడని గ్రహించింది. పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో చెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించింది. వీడియోలో ఆ పిల్లాడు గరిటెతో పాన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ఈ వీడియోను ఒలివియా వాంగ్ అనే యూజర్ షేర్ చేశారు. ‘ఈ పిల్లాడు వంట పాన్‌ను అంత వేగంగా ఎలా తిప్పుతున్నాడు? పిల్లాడి వంట ప్రతిభ అద్భుతంగా ఉంది’ అంటూ ఫొటో కామెంట్ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘మూడేళ్ళ పిల్లాడికి నా కంటే బాగా వంట చేయడం వచ్చని తెలిసి, తట్టుకోలేకపోతున్నాను’ అని రాశారు. కాగా ఏడాది క్రితం ఇటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఒక పిల్లాడు అద్భుతంగా వంట చేస్తున్నాడు. @sonikabhasin పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. వీడియో ప్రారంభంలో ఆ పిల్లాడు స్టూల్‌పై నిలబడటాన్ని గమనించవచ్చు. అప్పుడు ఆ పిల్లాడిని ఏం చేస్తున్నావని అతని తల్లి అడిగినప్పుడు ‘ఫ్రైడ్ రైస్’ అని ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చాడు. ఈ వంటకంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, క్యాప్సికమ్ జోడించానని కూడా చెప్పాడు. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? How come this little boy can handle this cooking pan so swiftly and his cooking skill is so amazing~#cooking #China pic.twitter.com/i48YcazOwZ — Olivia Wong (@OliviaWong123) February 14, 2023 -
రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..
రీల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న యువత ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఏమి చేసేందుకైనా వెనుకాడటం లేదు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేసి డ్యాన్స్ చేయడం, రైలుకు ఎదురుగా నిలుచుని పోజులు కొట్టడం లాంటి ఎన్నో చేష్టలు చేసేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఇటువంటి సందర్బాల్లో కొందరు.. పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది. ఆమె రోడ్డు మధ్యలో నిలుచుని వయ్యారాలు ఒలకబోస్తుడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ డాన్స్ వేన్తున్న యువతి స్నేహితురాలు దీనినినంతా వీడియో తీస్తుంటుంది. డాన్స్ చేస్తున్న యువతి ఈ రోడ్డుంతా తనదే అన్నట్లు ఎవరినీ పట్టించుకోకుండా డాన్స్ చేస్తుంటుంది. అయితే ఆమె తీరుకు ఆగ్రహించిన ఒక యువకుడు తన బైక్ ముందుకు పోనిచ్చి , ఆ యువతిని ఒక్క దెబ్బ కొట్టి వెళ్లిపోతాడు. ఈ వీడియో @Bornakang అనే పేరుగల యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8 మిలియన్లు వ్యూస్ దక్కాయి. 85 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తూ ఇలా డాన్స్ చేయడం తగినది కాదని వారంటున్నారు. ఇది కూడా చదవండి: 6 అంగుళాల భూమి కోసం దారుణ హత్య.. కాల్ చేసినా స్పందించని పోలీసులు! I can’t even blame him pic.twitter.com/lWydnPjk7b — Lance🇱🇨 (@Bornakang) July 26, 2023 -
ఇదేం డాన్స్ రా బాబు.. రోబోలు కూడా ఆశ్చర్యపోతాయి
-
ఇదిరా డాన్స్ అంటే
-
మీకు తెలుసా? ఆ వ్యాధి వస్తే..నాన్‌స్టాప్‌గా డ్యాన్సే..డ్యాన్స్
ఎన్నో వింత వింత వ్యాధులు గురించి విన్నాం. ఈ వ్యాధి గురించి మాత్రం వినే ఛాన్సే లేదు. అసలు విని ఉండరు. చూసి ఉండరు. అత్యంత అరుదైన వింత వ్యాధి. ఆ వ్యాధి వస్తే మనిషి అనియంత్రంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. అది కూడా నాన్‌స్టాప్‌గా చేస్తారట. ఏంటీ ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా! అని షాకవ్వకండి. ఎందుకంటే ఇది నిజం. ఈ వ్యాధి వందలమందికి సోకిందట కూడా. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌లో అల్సాస్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో ఈ వింత వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వస్తే ఆ వ్యక్తికి నృత్యం చేయాలనే కోరిక పుడుతుందట. దీంతో ఆ వ్యక్తి ఆపకుండా భయానకంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. ఈ ఘటన ఫ్రాన్స్‌లో 1518లో జూలైలో జరిగిందని చరిత్రకారుల చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని స్టాస్బర్గ్ వీధుల్లో ట్రోఫీ అనే మహిళ మొదటగా నృత్యం చేస్తూ కనిపించింది. ప్రజలు దీన్ని అప్పుడు అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కూడా. ఐతే ఆమె ఏకాంతంగ అదేపనిగా నృత్యం చేస్తుందనే విషయం ఊరంతా దావానలంలా వ్యాపించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు, ముగ్గురు.. ఆమెలానే చేయడం జరిగింది. ఇక రోజులు గడిచిన కొద్ది ఆ సంఖ్య కాస్తా వందల సంఖ్యకు చేరుకుంది. ఉన్మాదపూరితంగా సుమారు 400 మంది దాక నాన్‌స్టాప్‌గా నృత్యం చేయడం ప్రారంభించారు. అలా వారంతా కుప్పకూలిపోయి పడిపోయేంత వరకు చేశారట. చివరికి శరీరం మూర్చపోయి మెలికలి తిరిగి పడిపోయేవారని చరిత్రాకారులు పేర్కొన్నారు. వారిని నృత్యం చేయకుండా ఆపడం ఎవరితరం అయ్యేది కాదట. ఐతే నృత్యం చేస్తున్నవాళ్లు కూడా వాళ్లు సంతోషంతో చేస్తున్నట్లు కనిపించలేదని, ఏదో హింసాత్మకంగానూ, నిరాశ నిస్ప్రుహలతో చేస్తున్న విలయ తాండవంలా ఉందట. దీంతో ఈ వ్యాధిని ఎలా నిర్వచించాలలో నాటి పండితులకు అర్థం కాలేదు. ఆపుకోలేని నృత్య కోరికే ఈ వ్యాధి లక్షణం కాబట్టి దీనిని వారంతా కలిసి 'డ్యాన్స్ ప్లేగు' వ్యాధి అని పిలిచారు. ఇది ప్రజల రోజువారి జీవితాన్ని గందరగోళంలో పడేసింది. ఏం చేయాలో పాలిపోక అధికారులు ఆవ్యాధి సోకిన వాళ్ల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. అందులో వారు సొమ్మసిల్లేంత వరకు డ్యాన్స్ చేసుకుంటారు. పైగా ఎవరికి సోకదని భావించారు. కానీ ఈ డ్యాన్స్ ప్లేగు వ్యాధికి మూల కారణం ఏమిటో ఎవ్వరికి తెలియలేదు. ఐతే కొందరూ దీన్ని హిస్టీరియా లక్షణం అని, ఆర్థిక కష్టాలు, రాజకీయ ఒత్తిడిలతో ఇలా చేస్తున్నారని, మానవుని విపరీతమైన ప్రవర్తనకు సంబంధించినదని, మరికొందరూ సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇలా జరిగిందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. నృత్య శాస్త్రంలో కూడా దీని గురించి ఉందని, అక్కడ నుంచి సాముహిక నృత్యం వచ్చిందని ఐరోపా వాసులు విశ్వసిస్తారు. ఏదీఏమైన ఈ అంతుపట్టని 'డ్యాన్స్ ప్లేగు' అనే వ్యాధి ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ అంతుపట్టిని మిస్టరీలా ఉండిపోయింది. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఇద్దరు యువతులు మోడర్న్ డ్రస్ వేసుకుని బాలీవుడ్ సాంగ్‌కు మెట్రోలో పోల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 'మెయిన్ టూ బెఘర్ హున్' సాంగ్‌కు యువతులు లిప్ సింక్ చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ పాట సుహాగ్ చిత్రంలోని కాగా.. ప్రవీణ్ బాబీ, శశి కపూర్ నటించారు. ఈ పాటకు యువతులు పోల్ పట్టుకుని కింద నుంచి మీదకు లయబద్దంగా ఊగుతూ హోరెత్తించే స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సులు చూస్తే అలాగే ఉండిపోయారు తోటి ప్రయాణికులు. ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. After porn, kissing and fighting in Delhi Metro, The latest is Pole Dancing..... 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023 ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికుల తీరు మారట్లేదని వాపోతున్నారు. వైరల్ కావడానికి మెట్రో ఓ సాధనంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
Ranee Ramaswamy: నటరాజు దీవించిన నాట్య సుధా నిధులు
భావం, రాగం, తాళం... ఈ మూడు నృత్య కళాంశాల సమ్మేళనం భరతనాట్యం. అరవై నాలుగు ముఖ, హస్త, పాద కదలికల అపురూప విన్యాసం భరతనాట్యం. మూడు దశాబ్దాల క్రిందట అమెరికాలో ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ మొదలు పెట్టి ఆ నాట్య వైభవాన్ని దశదిశలా తీసుకువెళుతోంది రాణీ రామస్వామి. తానే ఒక సైన్యంగా మొదలైన రాణీ రామస్వామికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ల రూపంలో శక్తిమంతమైన సైనికులు తోడయ్యారు.... ‘మేము గత జన్మలు, పునర్జన్మల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా పెద్ద అమ్మాయి అపర్ణకు మూడు సంవత్సరాల వయసు నుంచే నృత్యంపై అనురక్తి ఏర్పడింది. ఆమె పూర్వజన్మలో నృత్యకారిణి అని నా నమ్మకం’ అంటుంది రాణీ రామస్వామి. చెన్నైలో పుట్టిన రాణీ రామస్వామికి ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంతో చెలిమి ఏర్పడింది. డెబ్బై ఒకటో యేట ఆమెకు ఆ నాట్యం శ్వాసగా మారింది. ఈ వయసులోనూ చురుగ్గా ఉండడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఆమె అమెరికాలోని మినియాపొలిస్‌లో ‘రాగమాల డ్యాన్స్ కంపెనీ’కి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ ద్వారా అమెరికాలో నృత్యాభిమానులైన ఎంతో మందికి ఆత్మీయురాలిగా మారింది. భరతనాట్యాన్ని ముందుకు తీసుకువెళ్లే ఇంధనం అయింది. ‘రాగమాల’ ద్వారా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది రాణీ రామస్వామి. ‘రాగమాల ట్రైనింగ్ సెంటర్’ ద్వారా ఏడు సంవత్సరాల వయసు నుంచే భరత నాట్యంలో శిక్షణ పొందుతున్నారు ఎంతోమంది పిల్లలు. ‘అమ్మా, నేను, అక్క ఒక దగ్గర ఉంటే అపురూపమైన శక్తి ఏదో మా దరి చేరినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో కూర్చొని వేదికపై వారి నృత్యాన్ని చూసినప్పుడు, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో కూర్చున్న వారిని చూస్తున్నప్పుడు, మేము ముగ్గురం కలిసి నృత్యం చేస్తున్నప్పుడు....అది మాటలకందని మధురభావన’ అంటోంది అశ్వినీ రామస్వామి. పాశ్చాత్య ప్రేక్షకులకు భరతనాట్యంలోని సొగసు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చేయడంలో రాణీ రామస్వామి విజయం సాధించింది. ‘క్రియేటివ్ పర్సన్ లేదా ఆర్టిస్ ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది. ఆ ప్రయాణంలో వేరే వాళ్లు తోడైనప్పుడు ఎంతో శక్తి వస్తుంది. అమ్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాతో పాటు ఎంతోమంది ఆమె వెంట ప్రయాణం చేస్తున్నాం’ అంటుంది అపర్ణ రామస్వామి. భరతనాట్యానికి సంబంధించి ఈ ముగ్గురికి 3డీలు అంటే ఇష్టం. డీప్ లవ్, డెడికేషన్, డిసిప్లిన్. ‘ప్రశంసల సంగతి సరే, విమర్శల సంగతి ఏమిటి?’ అనే ప్రశ్నకు వీరు ఇచ్చే సమాధానం... ‘విమర్శ కోసం విమర్శ అని కాకుండా హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇష్టం. దీని ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన ‘రిటెన్ ఇన్ వాటర్’ నృత్యరూపకం భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకే ప్రపంచంలోకి తీసుకు వచ్చింది. ‘రాగమాల డ్యాన్సింగ్ కంపెనీ’ ద్వారా మూడు దశాబ్దాల ప్రయాణం సులువైన విషయం ఏమీ కాదు. ప్రయాణంలో...కొందరు కొన్ని అడుగుల దూరంతో వెనుదిరుగుతారు. కొందరు కొన్ని కిలో మీటర్ల దూరంలో వెనుతిరుగుతారు. కొందరు మాత్రం వందలాది కిలోమీటర్లు అలుపెరగకుండా ప్రయాణిస్తూనే ఉంటారు. రాణీ రామస్వామి ఆమె కూతుళ్లు అపర్ణ, అశ్వినిలు అచ్చంగా ఈ కోవకు చెందిన కళాకారులు. నోట్స్ రెడీ ఇద్దరు కూతుళ్లు అపర్ణ, అశ్విని తల్లితో పాటు కూర్చుంటే కబుర్లకు కొరత ఉండదు. అయితే అవి కాలక్షేపం కబుర్లు కాదు. కళతో ముడిపడి ఉన్న కబుర్లు. అమ్మ రాణీ రామస్వామి తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన విలువైన అనుభవం ఒకటి ఆ సంభాషణలలో మెరిసి ఉండవచ్చు. ఈతరానికి నాట్యాన్ని ఎలా దగ్గర చేయాలి అనేదాని గురించి పిల్లలిద్దరూ తల్లితో చర్చించి ఉండవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. ఈ కబుర్లు వృథాగా పోవడం ఎందుకని అర్చన, అశ్విన్‌లు నోట్స్‌తో రెడిగా ఉన్నారు. -
Dr. Shilpi Reddy: డ్యాన్సింగ్ మామ్స్
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు. ‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది. గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు. సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది. సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు. ఇక్కడ మా కడల్ హాస్పిటల్లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్. రోజువారీ పనులు అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న కృషి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది. – నిర్మలారెడ్డి -
వైరల్ వీడియో బేబీ స్టెప్స్ నుంచి ఏకంగా డ్యాన్స్
-
వైరల్ వీడియో: విరాట్ కోహ్లీ యాడ్ షూట్ ఫన్నీ డాన్స్
-
పోలీస్ స్టేషన్లోనే పోలీసుల మందు.. చిందులు.. వీడియో వైరల్
రాంచీ: న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లోనే కొందరు పోలీసులు పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో మద్యం తాగుతూ చిందులేశారు. చివరికి సదరు పోలీసులకు ఉన్నతాధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. మార్చి 9వ తేదీన హోలీ సందర్భంగా కొంతమంది పోలీసులు సివిల్ దుస్తులు ధరించి పోలీస్ స్టేషన్ క్యాంపస్‌లో మద్యం సేవించారు. అంతటితో ఆగకుండా తాగిన మైకంలో ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపినట్లు ఎస్పీ నాటు సింగ్ మీనా తెలిపారు. విచారణలో అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో అయిదుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఏఎస్సైలు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇదే వీడియోను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబు లాల్ మరాండీ ట్విటర్లో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. బిహార్ డిప్యూటి సీఎంకు షాక్! कुछ पुलिसवालों की थाना कैम्पस में यह वल्गर एवं बेपरवाह फूहड़ प्रस्तुति। रक्षक के रूप में भक्षकों का यह भयावह चेहरा। सचमुच बारूद के ढ़ेर पर झारखंड को बिठा दिया है सोरेन सल्तनत के एक्सीडेंटल राजकुमार हेमंत ने। इन्हें जयचंद जैसा याद करेगा आदिवासी समाज और देश।जागो झारखंड के युवा। pic.twitter.com/OAxpohykj5 — Babulal Marandi (@yourBabulal) March 9, 2023 -
నడక మంచిదే... ఫిట్నెస్ ఊరికే రాదు!
ప్రస్తుతపు ఉరుకులు పరుగుల లైఫ్‌లో మిషన్ల సాయం లేకపో తే పని నడవదు. అలాగని కదలకుండా కూర్చుంటే చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే. మరయితే ఏం చేయాలి? మనసుంటే మార్గం ఉన్నట్లు ఈ బిజీ లైఫ్‌లో కూడా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. అవేమిటో చూద్దామా? రకరకాల కారణాల వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేనివారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండవచ్చు. అందులో నడక ఒకటి. అసలు ఎలా నడవాలి.. ఎప్పుడెప్పుడు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.. మాట్లాడుతూనే నడవండి కొంతమందికి పొద్దస్తమానం ఫోన్ మాట్లాడటం అవసరం. మరికొందరికి వృత్తిరీత్యా తప్పదు. చాలామందికి అలవాటు. అది వర్క్ కాల్ అయినా.. మీకు ఇష్టమైన వారితో చెప్పుకునే కాలక్షేపం కబుర్లే కావచ్చు... మాట్లాడండి. కానీ అలా మాట్లాడుతూనే నడవండి. ఎందుకంటే అరగంట వాకింగ్ చేస్తే వొంటికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మెట్లు ఫిట్‌గా ఉండటానికి మెట్లను ఖచ్చితంగా ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర కదలికలు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. మెట్లను ఎక్కుతున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అందుకే లిఫ్ట్‌లో వెళ్లకుండా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. అయితే కొన్ని రకాల శారీరక ఇబ్బందుల రీత్యా, కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారినీ వైద్యులు మెట్లు ఎక్కవద్దని చెబుతారు. అలాంటి వారు మాత్రం మెట్లెక్కడాన్ని మినహాయించాలి. ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి మీ ఆఫీస్ దగ్గరలో ఉంటే నడిచి వెళ్లడానికి ప్రయత్నించండి. లేదా ఆఫీసుకు కనీసం 10 నుంచి 20 నిమిషాల నడక దూరంలో దిగి.. నడిచి వెళ్లండి. బస్సులో వెళ్లినా, కారులో వెళ్లినా ఇలాగే నడవండి. ఫిట్‌గా ఉండటానికి ఈ చిన్న చిన్న మార్పులు అత్యవసరం. నిలబడి పనిచేయండి మీరు పనిచేసే ప్లేస్‌లో మీకు సౌకర్యంగా ఉంటే నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి. ఇలా కొద్దిసేపు నిలబడి పనిచేయడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతారు. అలా అని మరీ ఎక్కువసేపు నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. టీవీ చూస్తున్నప్పుడు... టీవీ లేదా సెల్ ఫోన్లో సినిమాలను చూస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా.. ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా సైక్లింగ్ లేదా శరీరాన్ని సాగదీయడం వంటి కొన్ని వ్యాయామాలను చేయడం వల్ల మీ శరీరం బాగా కదిలి ఆరోగ్యంగా ఉంటుంది. డ్యాన్స్ బెస్ట్ సమయం దొరికినప్పుడల్లా మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. అన్నింటిలో డ్యాన్స్ బెస్ట్. ఎందుకుంటే ఇది వ్యాయామంగా అనిపించదు. కొన్ని నిమిషాలపాటు డ్యాన్స్ చేస్తే మనసుకు సంతోషం, శరీరానికి ఆరోగ్యం చేకూరతాయి. వీటితోబాటు సాధ్యమైనంత వరకు ఇంట్లో మీ పనులు మీరే చేయండి. క్లీనింగ్, వాషింగ్, వంటపనుల్లో ఓ చే యి వేయండి. ఈ పనులు కూడా వ్యాయామం కిందికే వస్తాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతాయి. -
పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష
ఇరాన్లో హిజాబ్ విషయమై ప్రజలపై కఠిన ఆంక్షలను విధిస్తూ కట్టడి చేస్తున సంగతి విదితమే. ఐతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన ఒక జంట సరదాగా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేశారు. అంతే వారిపై పలు కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే.. 21 ఏళ్ల అస్తియాజ్ హకికీ, ఆమెకు కాబోయే భర్త మొహమ్మద్ అహ్మదీ టెహ్రాన్‌లోని ఆజాది టవర్ వద్ద డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. దీంతో ఇరాన్ పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు వారిపై వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు, అవినీతి వంటి తదితర అభియోగాలు మోపారు. దీంతో వారికి ఆయా నేరాలన్నింటికీ కలిపి సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఐతే ఒక్కొక్క అభియోగంలో వారు దోషులుగా తేలినట్లయితే ఇంకెంత శిక్ష పడుతుందనేది చెప్పలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పాపం ఆ జంటకు ఇన్స్టాగ్రామ్ వేలాది ఫాలోవర్స్ ఉన్నారు. పైగా ఇరాన్ నిరసనలను లింక్ చేస్తూ కూడా వారు డ్యాన్స్‌లు చేయలేదు. కానీ ఇరాన్ ప్రజలను కర్కశంగా అణచివేసే పనిలో భాగంగా ఆ జంటపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి కటకటాలపాటు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా.. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదీగాక 21 ఏళ్ల మహ్సా అమినీ హిజాబ్ చట్టాలను ఉల్లంఘించిందంటూ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తదనంతరం ఆమె కస్టడీలో మృతి చెందడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. దీంతో మానవహక్కుల కార్యకర్తలు, ప్రజలు, పెద్ద సంఖ్యలో యువత బహిరంగ నిరసనలతో ఇరాన్ అట్టుడుకింది. (చదవండి: సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్! చివరికి శ్రీలంకలానే..) -
పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె
పూణె: దసరా ఉత్సవాలు దేశమంతటా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయా సంప్రదాయాల రీత్యా డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అచ్చం ఇలానే ఆనందోత్సహంతో పండుగా చేసుకుంటూ ఒక వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...35 ఏళ్ల మనీష్ నీరాప్జీ సోనిగ్రా గ్లోబల్ సిటీలోని విరార్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న గర్బా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ రోజు రాత్రి ఆనందంగా చిందులేస్తూ ఉన్నటుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వ్యక్తి తండ్రి అతన్ని హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా... అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణ వార్త విన్న సదరు వ్యక్తి తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు) -
బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు
జైపూర్: రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు. రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
స్పెయిన్‌లో ధమాకా
Ravi Teja Movie Shoot in Spain: స్పెయిన్‌లో రవితేజ డాన్సింగ్ స్టెప్పులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ‘రామారావు: ఆన్ డ్యూటీ’ చిత్రం కోసం స్పెయిన్‌లో సాంగ్ షూట్లో రవితేజ పాల్గొంటున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ధమాకా’ తదుపరి షెడ్యూల్ కూడా స్పెయిన్‌లోనే జరగనుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. స్పెయిన్‌లో ఈ సినిమా పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. జానీ మాస్టర్ ఈ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్. పాటలతో పాటు రవితేజ, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను కూడా చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతదర్శకుడు. -
ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె . పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!
మనం సరదాగా అడువులు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ జనసంచారం లేని సమయంలో వచ్చే జంతువులను చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలానే అవి చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అదీకాక కొన్ని క్రూర మృగాలను చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది. (చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే) కానీ కొన్ని జంతువుల చేసే పనులు వాటి చేష్టలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎలుగుబంటి భలే అందంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అది డ్యాన్స్ చేయడం లేదు ఆ ఎలుగుబంటికి తన వీపు దురద పుట్టి అలా ఒక పోల్కి జారబడి తన వీపుని గోక్కుంటుంది. కానీ మనకు మొదట చూడగానే అబ్బా భలే డ్యాన్స్ చేస్తుందనిపిస్తుంది. అది కూడా " ప్రవేశం లేదు’ అనే బోర్డు ఉన్న పోల్కి జారబడి అలాచేయడం చాలా హాస్యస్పదంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది జంగిల్ బుక్‌లో ఉండే జంతువుల్లా ఉంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!) View this post on Instagram A post shared by EARTH FOCUS (@earthfocus) -
గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
గుత్తి: పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప(25) అనే యువకుడు వినాయక మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన ఓబుళమ్మ కుమారుడు పెద్ద కుళ్లాయప్ప శనివారం రాత్రి 11 గంటల సమయంలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపానికి వెళ్లాడు. అక్కడే సుమారు గంటన్నర పాటు గడిపాడు. తర్వాత మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం? -
అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి చిందులేస్తూ హల్చల్
గాంధీనగర్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా తీసుకున్న ఆంక్షలను కొందరు నిర్లక్ష్యం చేస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడింది. చివరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల కోసం చేసిన ప్రయత్నం ఆమెను చిక్కుల్లో నెట్టేసింది. గుజరాత్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్‌కోట్‌కు చెందిన యువతి ప్రిషా రాథోడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. అయితే వారిని ఆకట్టుకునేందుకు కర్ఫ్యూ రాత్రి డ్యాన్స్ చేయాలని రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. ఓ ఆంగ్ల పాటకు డ్యాన్స్‌లు చేసి రికార్డు చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు. కర్ఫ్యూ ఉల్లంఘించిందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్ చేశానని.. ఆ వీడియోను చాలా మంది షేర్ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు వివరణ ఇచ్చింది. ఏది ఏమున్నా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తుంటరి పనులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. చదవండి: ‘జియో’ దెబ్బకు తట్టా, బుట్టా సర్దుకున్నా చదవండి: బీజేపీకి అండగా టీఆర్ఎస్.. ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్ -
రెండు నాగుపాములు ఆడుతూ...
-
కళ వెలవెల
-
స్టెప్పులతో అదరగొట్టిన జపాన్ జంట
-
పెయింటింగ్... కుకింగ్.. డ్యాన్సింగ్
‘హిప్పీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న ‘సీటీమార్’లో నటిస్తున్నారుఆమె. ఇంకా ‘వలయం’ అనే సినిమాతో పాటు వేరే భాషల్లో సినిమాలు కమిట్ అయ్యారు. జోరుగా షూటింగ్స్ చేస్తున్న తనకు అనుకోకుండా వచ్చిన ఈ లాక్‌డౌన్‌తో బ్రేకులు వేసినట్లయింది అంటున్నారామె. లాక్‌డౌన్‌ని ఎలా స్పెండ్ చేస్తున్నారో దిగంగనా చెబుతూ – ‘‘చదువుకునే రోజుల్లో పెయింటింగ్స్ వేసేదాన్ని. నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు పెయింటింగ్స్ వేయడానికి టైమ్ దొరకడంలేదు. ఈ లాక్డౌన్ వల్ల నా పెయింటింగ్ స్కిల్స్‌కు మళ్లీ పదును పెడుతున్నాను. రాధాకృష్ణుల పెయింటింగ్ వేశాను. ఎక్కువగా టీవీ చూస్తే హోమ్ అరెస్ట్ అన్న ఫీలింగ్ వస్తుందేమోనని చూడడం లేదు. కానీ నేను చూడలేకపోయిన సినిమాలను ఈ సమయంలో చూస్తున్నాను. ఇంకా నాకు ఇష్టమైన వంటకాలను నేర్చుకున్నాను. పుస్తకాలు చదవడం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ఆటలు ఆడటం (ఎయిర్ ఫుట్‌బాల్, బోర్డ్ గేమ్స్) వంటివి చేస్తున్నాను. నాన్న, నేను కలిసి డ్యాన్స్ చేస్తాం. బోర్డ్ గేమ్స్, ఎయిర్ ఫుట్‌బాల్ ఇలా అన్ని ఆటలు ఆడుకుంటాము. ఇవన్నీ చేస్తూ మనం హ్యాపీగా ఉంటే ఈ ఖాళీ సమయంలో అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోం. అంతేకాకుండా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకేసారి ఎక్కువ పని చేయాలన్నా వెంటనే అలసిపోం. అందుకే ఖాళీ సమయంలో కూడా బిజీగా ఉంటున్నాను’’ అన్నారు. ఇంకా దిగంగనా మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఉండటం వల్ల నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాను. రాజకీయాల నుంచి కుటుంబ విషయాల వరకు అన్నీ చర్చించుకుంటాం. చివరిగా ఒక మాట... ఇది వైరస్ (కరోనాను ఉద్దేశిస్తూ).. యుద్ధం కాదు. యుద్ధం అంటే సైనికులు ఉంటారు. కానీ ఈ వైరస్‌తో మనమే పోరాడాలి. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అన్నారు. -
వైరల్.. వేదికపై డ్యాన్స్ చేసిన జాన్వి
అందల తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ధడక్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన జాన్వి.. తొలి సినిమాతోనే అభిమానుల మనసులు దోచుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న జాన్వి.. ఇటీవల నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆభిమానుల కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ధడక్ చిత్రంలోని ‘జింగ్ జింగ్ జింగాత్’ సాంగ్‌కు ఆమె వేదికపై స్టెప్పులేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిరోజుల కిందట ఓ పాత హిందీ పాటకు తను డ్యాన్స్ చేస్తున్న వీడియోను జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘ఘోస్ట్ స్టోరిస్’లో జాన్వి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. View this post on Instagram 💖💖💖@janhvikapoor #janhvikapoorofficial #janhvikapoor7 #janhvikapoor06 #janhvikapoorfans #janhviofficial #janhvifanclub #janhvikapoor#janhvikapoorfanclub #janhviboneykapoor #janhvikapoorfandom#janhvians #jannhvikapoorforever#janhviisbest#janhvikapoorbiggestfan #Janhviiscute #janhvikapoorfan #janhvikapoorbollywoodactress #janhvikapoormyinspiration#janhvikapoor😍 #janhvikapoor💞 #janhvi A post shared by Janhvian Forever (@janhvikapoor.diehardfan) on Mar 8, 2020 at 3:36am PDT -
డాన్స్ డాక్టర్
సంగీతంతో అనారోగ్యాలను నయం చేయవచ్చని అంటుంటారు. మరి నాట్యంతో? సినిమాల్లో అయితే.. చచ్చుపడిపోయిన కాళ్లకు తిరిగి స్పర్శ తెప్పిస్తారు. నిజ జీవితంలో ఈ ప్రశ్నకు సమాధానమే.. ఈ మహిళా డాన్సర్. ఆమె తన నాట్యంతో మానసిక రుగ్మతలను తొలగించే వైద్యాన్ని అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అనుభవించే బాధలకు నృత్య భంగిమలతో చికిత్స చేస్తున్నారు. ఇలా ఎంతోమంది జబ్బులను నయం చేస్తున్న ఆ డాన్స్ డాక్టరే.. ముంబైకి చెందిన రెనెల్ స్నెల్లెక్స్. రెనెల్ స్నెల్లెక్స్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ చిత్రమైన విద్యార్థిని. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ముభావంగా ఉండేది. నవ్వుతూ, తుళ్లుతూ ఉండాల్సిన వయసులో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉండేది. దీంతో అందరూ రెనెల్‌కు దూరంగా ఉండేవారు. అలా రోజులు గడుపుతూనే కష్టపడి చదివి ఎట్టకేలకు ఓ ఉద్యోగంలో చేరింది రెనెల్. కొన్నేళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసి, డ్యాన్స్ క్లాస్‌లో చేరింది. అదే ఆమె జీవితంలో మలుపు. అప్పటివరకూ ఎప్పుడు చూసినా కోపంగా కనిపించే ఆమె ముఖంలో తొలిసారి చిరునవ్వు నర్తించడం మొదలైంది. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించడం ప్రారంభించింది. ఈ మార్పు గమనించి.. ఆమె గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి బాల్యంలో జరిగిన ఓ ఘటనే రెనెల్ వింత ప్రవర్తనకు కారణమని అప్పట్లో ఎవరికీ తెలియదు. బరువైన బాధగా బాల్యం! పదేళ్ల వయసులోనే రెనెల్ లైంగిక వేధింపులకు గురైంది. అయితే దాని గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. అలా.. తీపి గుర్తుగా ఉండాల్సిన ఆమె బాల్యం ఓ బరువైన బాధగా మారింది. ఉద్యోగంలో చేరాక సైతం ఆ బాధ ఆమెను వదిలిపెట్టలేదు. చనిపోయేదాకా అనుభవించక తప్పదని అనుకునేది. అయితే అనుకోకుండా 2011లో డాన్స్ థెరపీ క్లాస్ గురించి తెలియడంతో అందులో చేరారు రెనెల్. ఈ నిర్ణయం ఆమె జీవితానికి ఆనందం తెచ్చిపెట్టింది. ఆ క్రమంలో డాన్సునే వృత్తిగా ఎంచుకొని, డాన్స్ థెరపీలో డిప్లొమా చేశారు. ఆ తర్వాత ముంబైలో టాటా మోటార్స్ సంస్థతో భాగస్వామ్యం పొంది ‘డాన్స్ మూమెంట్ థెరపీ’ (డీఎమ్‌టీ) సంస్థను ప్రారంభించారు. ఇందులో వివిధ మానసిక రోగాలతో బాధపడేవారికి డాన్స్‌తో వైద్యం చేస్తున్నారు. అంతేకాదు, ప్రత్యేకించి గృహహింస, అత్యాచార సమస్యలను ఎదుర్కొన్న మహిళలు, అక్రమ రవాణాకు చిక్కుకున్న బాలికలను ఆదుకోవడం కోసం కోల్‌కత్తాలోని ఓ స్వచ్ఛంద సంస్థతోనూ కలసి పనిచేస్తున్నారు రెనెల్. ఇప్పటివరకు సుమారు 20 వేల మంది బాధితులకు సాంత్వన చేకూర్చి తిరిగి వారిని మామూలు మనుషులను చేయగలిగారు. రెనెల్ చేసిన ఈ కృషి గురించి ‘ఎమ్జీ చేంజ్ మేకర్స్ సీజన్ 2’లో ప్రసారం అవడంతో దేశంలోని పలు నగరాలకు ఈ డీఎమ్‌టీ సంస్థలు విస్తరించాయి. ఈ విషయమై రెనెల్ మాట్లాడుతూ. ‘‘మనసుకు తగిలిన గాయాలు ఎంత కఠినంగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే నా జీవితాన్ని గాయపడినవారికి నయం చేయడానికే అంకితం చేశా..’’ అని అన్నారు. – దీపిక కొండి, సాక్షి స్కూల్ ఎడిషన్ -
గణేషుడి ముందు..మందు..చిందూ..
-
పాట వినిపిస్తే చాలు చిందేస్తా: కోహ్లి
ట్రినిడాడ్: ‘మంచి ఊపున్న పాట వినిపిస్తే చిందెయ్యకుండా ఎవరైనా ఉండగలరా?. నేను మాత్రం అలా ఉండలేను. పాట వినిపిస్తే డ్యాన్స్ చేయాల్సిందే. మైదానంలో నాకు నచ్చినట్టు నేనుంటా. నిస్తేజంగా, ఏదో కోల్పోయిన వాడిలా ఉండటం నాకు నచ్చదు. బహుశా నాకు అది దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా?. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటేనే ఆటపై ఎక్కువగా దృష్టి పెట్టగలం. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అదేవిధంగా దేశం తరుపున ఆడే అవకాశం కల్పించాడు. ఇంకేం కావాలి. మైదానంలో డ్యాన్స్ చేస్తా, సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లతో సరదాగా ఉంటా’అంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం చహల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తొలి వన్డే సందర్భంగా మైదానంలో క్రిస్ గేల్‌తో కలిసి కోహ్లి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండో వన్డేలో విండీస్‌పై 59 పరుగుల(డక్‌వర్త్ లూయిస్) తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల యంత్రం సెంచరీతో కదంతొక్కగా.. శ్రేయాస్ అయ్యర్ అర్దసెంచరీతో మెరవడంతో టీమిండియా సునాయాస విజయం అందుకుంది. మ్యాచ్ అనంతరం స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ సారథి కోహ్లిని ఇంటర్వ్యూ చేశాడు. ‘వర్షం పడిన అనంతరం ఆడటం చాలెంజ్‌తో కూడుకున్నది. మ్యాచ్ గెలిచేందుకు వందకు వంద శాతం కృషి చేస్తాం. ఈ మ్యాచ్‌లో అందరూ కలిసి కట్టుగా ఆడారు. సెంచరీలు సాధించిన సంతోషం కంటే.. టీమిండియా విజయానికి కావాల్సిన పరుగులు సాధించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంటుంది. కొన్ని రోజులుగా లైఫ్‌స్టైల్, ట్రైనింగ్, డైట్ పూర్తిగా మార్చుకున్నా’అంటూ విరాట్ కోహ్లి తెలిపాడు. ఇక ఇరుజట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా.. రెండో వన్డేలో కోహ్లి సేన గెలిచింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. చివరి వన్డేలో గెలిచి సిరీస్ కాపాడుకోవాలని వెస్టిండీస్ ఆరాటపడుతోంది. MUST WATCH: Chahal TV returns with #KingKohli 😄😎 From @imVkohli's record 42 ton to his dance moves 🕺🕺, @yuzi_chahal makes a smashing debut in the Caribbean. By @28anand #TeamIndia #WIvIND Full video here 📽️📽️ https://t.co/Cql7RCoaw1 pic.twitter.com/CCQu6dDRJA — BCCI (@BCCI) August 12, 2019 -
ముద్దొచ్చే అబ్బాయిలు
స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్‌ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్ సతామ్ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్ సతామ్ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ లో సావిత్రి మేధాతుల్ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్ సతామ్ తో పాటు కామ్తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు. ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్తే. ఉన్నవి రెండు విధానాలు పట్ణణ ప్రేక్షకులు లావణి కళారూపాన్ని మోహవాంఛకు రిఫ్లెక్షన్గా భావిస్తుంటారు. వాస్తవానికి ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. ప్రధానంగా అయితే ‘లావణి’ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ‘దోల్కీ ఫాడ్ తమాషా’, ‘సంగీత్ బరి’. దోల్కీ ఫాడ్ తమాషాలో లావణి ప్రదర్శన నాలుగు నుంచి ఎనిమిది గంటలపాటు నడుస్తుంది. ఇందులో కళాకారులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూంటారు. గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సంగీత్ బరిలో.. గుంపులుగా, సంచరిస్తూ, కొద్దిమంది ప్రేక్షకుల ముందు కూడా నటిస్తారు. వీరికి ఏడాదికి సరిపడా కాంట్రాక్టు ఉంటుంది. సాధారణంగా ఆడవారు మాత్రమే సంగీత్ బరిలో నటిస్తు్తంటారు. ముఖ్యంగా భాటు కోల్హాటి లేదా కళావంతుల కుటుంబాలకు చెందినవారు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. వారి ఆచారం ప్రకారం ఈ కుటుంబాలలోని మహిళలు వివాహానికి అనర్హులు. వీరు కేవలం వేశ్యావృత్తిలో మాత్రమే జీవించాలి. కొత్తగా మూడో విధానం కామ్తే, సతామ్ల ప్రదర్శనలు మూడోరకానికి చెందినవి. వీటిని బ్యానర్ ప్రదర్శనలు అంటారని చెబుతారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పి.హెచ్డీ స్కాలర్ సేజల్ యాదవ్. ఈయన లావణి ప్రదర్శకుల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 2016లో ‘లావణి లైవ్’ పేరున ఒక ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. లావణి ప్రదర్శనలాంటివే సమకాలీనంగా ఎన్నో ఉన్నాయి. ప్రతివారికి వారి సొంత ఆలోచన ఉంటుంది. లావణిలోని అసలు విషయాన్ని వీరు పక్కకు తోసేసి, సొంతంగా రూపొందించుకుంటూ, అందరినీ వారి గుంపులో చేర్చుకుంటున్నారు. లావణిని ప్రదర్శించేవారిలో ఒకరైన ‘హంకారే బృందం’ సుమారు మూడుమాసాల పాటు లావణిలా నటించడానికి సాధన చేస్తుంది. అమ్మాయిలా నడవటం, అమ్మాయిలా మాట్లాడటం వంటివి రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందే నేర్చుకుంటారు. వారిని చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారని చెబుతారు బృంద సారథి హంకారే. ఇక ‘బిన్ బేకాంచా తమాషా’ అనే మరో విధానం అయితే చాలా కాలం విజయవంతంగా నడిచింది. కాని నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, బుకింగ్స్ తగ్గిపోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఈ క్రమంలోనే లావణిలో వినూత్న శైలులకు బీజాలు పడ్డాయి. కామ్తే, సతామ్ సంగీత్ బరి విధానంలో ఇస్తున్న ప్రదర్శనలైతే పట్టణ ప్రజలలో వివిధ వర్గాల వారి మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తున్నాయి. – జయంతి తొమ్మిది గజాల చీర ఢోల్కీ అనే వాద్య పరికరం వాయిస్తూంటే ఈ లావణి నాట్యం చేస్తుంటారు. తొమ్మిది గజాల చీర ధరించి మహిళలు ఈ నాట్యం చేస్తారు. నాట్యానికి పాడే పాటలో వేసే దరువు చాలా వేగంగా ఉంటుంది. లావణ్య అనే పదం నుంచి లావణి పదం వచ్చింది. ఈ పదానికి ‘అందమైన’ అని అర్థం. మరాఠీలోని లావణే అనే పదం నుంచి వచ్చినట్టు చెబుతారు. -
నియోపదేశం
దురాశ, అత్యాశ అనేవి మనిషి గుణాలు. లోకల్ ట్యాక్సెస్ ఎక్స్‌ట్రాలా దీనికి లోభం తోడు. తత్వం బోధపడితేనే కానీ కట్టలోంచి ఒకటి తీసి ఇతరులకు ఇవ్వడానికి మనసు రాదు. ‘‘నూతన సంవత్సరం వస్తే గానీ తత్వం బోధపడదు. జ్ఞానబోధ చేయడానికి న్యూ ఇయరంత మంచి సందర్భం మరొకటి ఉండదు.’’‘‘అదేమిటి స్వామీజీ.. న్యూ ఇయర్ అంటే ఎవరికైనా క్యాలండర్లూ, డైరీలు! మద్యం, డ్యాన్సులు ఇత్యాది వినోదాలు!! అరుపులూ, కేకలు, ఉత్సాహాలూ, ఉత్సవాలు గట్రాగట్రా ఎట్సెట్రాలు!!! రాత్రిళ్లు టూ వీలర్ మీద త్రిబుల్ రైడింగ్లు, లేట్‌నైట్ విష్షింగులు. వీటితో తత్వజ్ఞానం ఎలా సాధ్యం స్వామీ?’’ ‘‘అక్కడే ఉంది నాయనా కిటుకూ. అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అనే నానుడి ఉంది చూశావ్. ఆ స్కీమ్ కింద ఇది సాధ్యపడుతుంది.’’‘‘స్వామీజీ.. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. సదరు తత్వజ్ఞానాన్ని శాంపిల్‌గా నాకే కాస్తంత ఉపదేశించవచ్చు కదా.’’ ‘‘సరే విను.. నీకు రకరకాల క్యాలండర్లు కావాలని అనిపిస్తుంది. పదిమందిని అడిగితే ఒక్కడైనా ఇవ్వకపోతాడా అనే స్కీము కింద కొందరినీ, ఎందుకైనా మంచిది అనే పాలసీ కింద మరికొందరిని అడుగుతావు. చాలామంది ఇచ్చేస్తారు. దురాశ, అత్యాశ అనేవి మనిషి గుణాలు. లోకల్ ట్యాక్సెస్ ఎక్స్‌ట్రాలా దీనికి లోభం తోడు. వాటిని ఇతరులకు ఇవ్వడానికి అంత తేలిగ్గా మనసు రాదు. నీ మనసులోని ఆ దుర్గుణాల్లాగే నీ ఇంట్లో ఈ క్యాలండర్ల కట్ట! నీ పలుకుబడికి నిదర్శనంలా పర్వతమంతటి ఈ పెద్ద గుట్ట మొదట్లో భార్యకు నచ్చుతుంది. కానీ త్వరలోనే ఆమె జ్ఞాననేత్రాలు విచ్చుకుంటాయి. అగ్గిపెట్టెంత ఈ కొంపలో ఈ కాగితరాశిని చూసి అగ్గిమీద గుగ్గిలమవుతుంది. అంతే.. ఆనాటి నుంచి ఆ దుర్గుణాల బ్యాగేజీని... ఈ కేలండర్ల లగేజీని వదిలించుకోడానికి ట్రై చేస్తావు. డైరీలకూ ఇంచుమించు ఇదే సూత్రం నాయనా. ’’‘‘మరి మొదట నేను చెప్పిన మద్యం, డాన్సులూ, ట్రిపుల్ రైడింగులో?’’ ‘‘తల్లో మెదడూ, నోట్లో నాలుకా ఉండాలేగానీ.. అన్నింటికీ వివరం చెప్పచ్చు. రాత్రి నిన్ను తేలిక చేసిన మద్యం.. మర్నాడు హ్యాంగోవరులా తలలో బరువై మెదడును హ్యాంగు చేస్తుంది. రాత్రి డ్యాన్సింగులన్నీ ఏడాది మొదటిరోజున ఒళ్లునొప్పుల రూపంలో చిరకాలం గుర్తుంటాయి. ఇక ట్రిపుల్ రైడింగులంటావా.. బై ఒన్ గెట్ త్రీ ఆఫర్లా ‘ఒన్ యాక్సిడెంట్.. త్రీ పేషెంట్స్’ అంటూ హాస్పిటళ్లకూ, అందులోని డాక్టర్లకూ మేలు చేస్తాయి. ఇలా న్యూ ఇయర్ ఈవెంటుల్లోని ప్రతిదాన్నీ తీసుకొని ఇలా ఇయరంతా చెప్పినా ఇంకా మిగిలిపోయేంత జ్ఞానాన్నివ్వగలను రా ఢింభకా. సరే గానీ.. పంచ్ డైలాగుల కోసం మూడ్ కావాలి. మాటలు ఒక ఫ్లోలో వెల్లువలా రావాలి. కాబట్టి... కాక్టెయిల్ మిక్స్ చెయ్. మంచింగ్‌కు రెడీ చెయ్’’ -
స్టెప్పులేసిన వాజ్‌పేయి
-
ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది
-
ఇరాన్లో నిరసన డ్యాన్స్‌ల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్లో ఇటీవల 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి మేదేహ్ హోజాబ్రి తాను డ్యాన్స్ చేసిన వీడియోలను ‘ఇన్స్టాగ్రామ్’లో అప్లోడ్ చేసినందుకు ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది. టీనేజ్ అమ్మాయి అరెస్ట్‌ను నిరసిస్తూ ఇరానీ మహిళలు ఇళ్లలో వీధి కూడళ్లలో డ్యాన్స్ చేస్తున్నారు. వాటి వీడియోలను ‘డాన్సింగ్ఈజ్నాట్క్రైమ్’, డాన్సింగ్టుఫ్రీడమ్’ హాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా వీడియోలను అప్లోడ్ చేసిన ఒకరిద్దురు మహిళలను ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు, పుంఖానుపుంఖంగా వచ్చి పడుతున్న వీడియోలను చూసి ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇరానీ మహిళలు తమ ఇళ్లలో, ఇంటి ముందు బ్యాక్ గ్రౌండ్‌కు మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్సులు చేస్తున్నారు. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక వీధి కూడళ్లలో అయితే మగవాళ్ల కచేరి వాయిద్యాల మధ్య మహిళలు నృత్యం చేస్తున్నారు. కొన్ని చోట్ల మగవాళ్లు ఆడవాళ్ల డ్యాన్సులకు మద్దతుగా చిన్నపాటి ఉపన్యాసాలు కూడా ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. డ్యాన్స్ వీడియోల కారణంగా అరెస్టయిన ఇరానీ టీనేజ్ అమ్మాయికి మద్దతుగా ఇప్పటికే బ్రిటీష్ మహిళలు డాన్స్ వీడియోలను బీబీసీకి పంపిస్తున్నారు. బీబీసీ వారు వాటిని ప్లే చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తే ఇరానీ అమ్మాయిలను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేసిన ఆరుగురు మహిళలను 2014లో మొదటిసారి ఇరానీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు డ్యాన్స్ చేయడం కుసంస్కారం, చట్ట విరుద్ధ చర్య అన్నది పోలీసుల వాదన. అప్పుడు కూడా అరెస్ట్‌లకు నిరసనగా పలువురు మహిళలు డ్యాన్స్ చేశారు. -
నాట్య విలాసం...
-
భార్యాభర్తనాట్యం
యాభై ఏళ్ల భార్యాభర్తల బంధం! అబ్బ.. ఎంత ముచ్చటగా ఉంది! ప్రేమ కలిపింది. నాట్యం నిలిపింది. ఎ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ! నాట్యంతో మమేకమై జీవిస్తున్న దంపతులు అనగానే మనకు ఇక్కడ రాధారెడ్డి, రాజారెడ్డి గుర్తుకువస్తారు. ఆ దంపతులు కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తుంటే, ఈ దంపతులు భరతనాట్యానికి మువ్వలుగా సందడి చేస్తున్నారు. ‘‘నేను శాంతను తొలిసారి చూసింది ‘కళాక్షేత్ర’లోని థియోసాఫికల్ గార్డెన్లో. అసలు కళాక్షేత్రలో నేను కలిసిన అమ్మాయి తనే. నాకు తమిళ్ రాకపోవడంతో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధతో నన్ను గైడ్ చేస్తుండేది. శాంతలో నాకు నచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి. తానెప్పుడూ ఏదో ఒక పనిలో ఉండేది. అయినా ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు’’78 ఏళ్ల ధనుంజయన్ 74 ఏళ్ల శాంత గురించి చెప్పిన మాటలివి. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారి ప్రేమ అపూర్వం. వారి నాట్యరీతులు అమోఘం. యాభై ఏళ్లుగా వారిద్దరూ భరతనాట్యంలో ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లో దశాబ్దాలుగా వారి పాదాలు నర్తిస్తూనే ఉన్నాయి. ధనుంజయన్ది కేరళలోని కన్నూరు జిల్లాలో పయ్యనూర్. తండ్రి స్కూల్ టీచర్. అసలే పేద కుటుంబం, ఎనిమిది మంది సంతానాన్ని పోషించడానికి ఆయన జీతం సరిపోయేది కాదు. రెండు మూడేళ్లకోసారి బదిలీ. ఒక చోట కుదురుగా లేని బాల్యం ధనుంజయన్ది. శాంతది మలేసియాలో స్థిరపడిన మలయాళీ కుటుంబం. నాట్యంలో, గానంలో చురుగ్గా ఉండేది. భరత నాట్యమంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులో డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరినీ కలిపింది తమిళనాడులోని కళాక్షేత్ర నాట్యకేంద్రం. ధనుంజయన్కి భరతనాట్యం మీద ఉన్న ఆసక్తిని గమనించిన నాట్యగురువు కళాక్షేత్రకు రికమండ్ చేసి స్కాలర్‌షిప్‌తో సీటిప్పించారు. అలా ధనుంజయన్ పధ్నాలుగేళ్ల వయసులో కళాక్షేత్రలో అడుగుపెట్టారు. అప్పటికి ఓ ఏడాది ముందే శాంత.. కళాక్షేత్రలో చేరింది. నాట్య బంధం! నాట్య గురువులు చందు పణిక్కర్, రుక్మిణీదేవిల శిక్షణలో ధనుంజయన్, శాంతలు రాముడు –సీత అయ్యారు, అనిరుద్ధ– చంద్రలేఖలయ్యారు. ‘‘మా తొలి ప్రదర్శన సీతా స్వయంవరం. 1956లో కోయంబత్తూరులో ఇచ్చాం’’ అని ధనుంజయన్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ నాట్యప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టూల్ మీద చాలా సన్నిహితంగా కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యాను. ఆ తర్వాత అదే స్టూల్ని ఇష్టంగా వాడేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు శాంత. పేదరికం ప్రేమను చంపేస్తుందా? ధనుంజయన్, శాంత ఇద్దరూ భరతనాట్యం, కథాకళిలో డిస్టింక్షన్లో పాసయ్యి 1962లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. వీటితోపాటు ఆమె కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. శాంత కోర్సు పూర్తయిన తర్వాత మలేసియాకు వెళ్లిపోయారు. ధనుంజయన్కి మిగిలింది సస్పెన్సే. అప్పటికీ ఆయన తన ఫీలింగ్స్‌ని బయట పెట్టనేలేదు. తనలో మొగ్గతొడిగిన ప్రేమ.. ప్రేయసికి తెలియజేయకుండానే వడలిపోతుందా అని బెంగ. పేదరికం తన ప్రేమను చంపేస్తుందేమోనని ఆందోళన. ఇక్కడ ఇలా ఉంటే... మలేసియాలో శాంతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు! ధనుంజయన్ని తప్ప ఎవరినీ తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగాలేదామె. పెళ్లి చూపులు వద్దంటూ ఉండడంతో ఆమె పేరెంట్స్ అర్థం చేసుకుని ఇండియాకు వచ్చారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో 1966లో ధనుంజయన్‌కు, శాంతకు పెళ్లి చేశారు. శాంత.. భర్తతో కేరళలోనే ఉండిపోయింది, తల్లిదండ్రులు మలేసియాకి వెళ్లిపోయారు. పెళ్లి సరే... బతికేదెలా?! చేతిలో డాన్స్‌తోపాటు ఎకనమిక్స్‌లో పట్టా ఉంది. ఓ చిన్న కంపెనీలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. అమ్మానాన్నలకు పంపించడానికి, తన ఇంటిని నడిపించడానికి ఒక భరోసా వచ్చింది. కానీ సంపన్న కుటుంబంలో పుట్టిన భార్యకు కనీస వసతులు కల్పించాలంటే ఆ జీతం ఏ మాత్రం సరిపోదు. అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డాన్సు క్లాసులు తీసుకునేవారు ధనుంజయన్. తాటాకు కప్పుతో చిన్న పాకలో ఆయన నాట్యగురువుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. క్రమంగా తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వారి డాన్స్ ఇన్స్టిట్యూట్ ‘భారత కళాంజలి’కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతూ, ‘‘శాంతను సంతోషంగా ఉంచడం మీదనే నా దృష్టి అంతా. వాళ్ల తల్లిదండ్రులది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి నా కోసం వచ్చింది. ఆమె మాత్రం ఎటువంటి సౌకర్యాలనూ అడిగేది కాదు. అయినా ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు శాంతకు రాకుండా చూడడం నా బాధ్యత అన్నట్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించేవాడిని. ఆమె ముందుచూపుతో మేము ఏర్పరుచుకున్న సామ్రాజ్యం ఇది’’ అంటారు ధనుంజయన్. నాట్య ప్రయోగాలు! భార్యాభర్తలిద్దరూ అప్పటి వరకు తాము నేర్చుకున్న నాట్యరూపకాలను ప్రదర్శించడంతో కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత కొత్త రూపకాలను పరిచయం చేశారు. నాట్యంలో యుగళగీతాన్ని ప్రవేశపెట్టారు. సంప్రదాయ అలరిప్పు స్థానాన్ని వారి ‘కళాంజలి’ పరిపూర్ణం చేసింది. ఆ దంపతుల అభినయం ‘నృత్యోపహారమ్’ రూపకాన్ని ఆవిష్కరించింది. వాటిని ఎల్లలు దాటించి విదేశాల్లోనూ వందలాదిగా ప్రదర్శించారు. మనదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకూ తాము రూపొందించిన కొత్త రీతులను చూపించారు. ఖజురహో ఫెస్టివల్, రాష్ట్రపతి భవన్లో... ఇలా వేలాది ప్రదర్శనలు, లక్షలాది ప్రశంసలను అందుకున్నారు. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు పదులకొద్దీ అవార్డులు వారి సొంతమయ్యాయి. ఇన్ని ప్రశంసలలో తమను అత్యంత మురిపించిన ప్రశంస అమెరికాలోని అట్లాంటాలో ఏడేళ్ల బాలుడు తమకు ఇచ్చిందేనని అంటారు. ధనుంజయన్. నాట్యమే ఊపిరి! నాట్య ప్రదర్శనలు మొదలు పెట్టి యాభై ఏళ్లు దాటినా ఇంకా ఈ దంపతులలో ఆ స్ఫూర్తి ఏ మాత్రం తరగలేదు. ‘నాట్యం చేయకపోతేనే నిస్సత్తువ ఆవరిస్తుంది. నాట్యాన్ని శ్వాసిస్తూ జీవించాం, శ్వాస ఆగే వరకు నాట్యం చేస్తూనే ఉంటాం’ అన్నారు ధనుంజయన్. ‘నాట్యంలో శిఖరాలను చూసిన ఆనందాన్ని అనంతంగా ఆస్వాదిస్తున్నాం. ఇక మేము చేయాల్సిన పెద్ద బాధ్యత ఒకటుంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం పెద్ద థియేటర్ నిర్మించాలి. సాంస్కృతిక నగరం చెన్నైలో నిత్యం కొత్త కళాకారులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారికి ప్రదర్శనలకు అనువుగా ఒక వేదిక కావాలి. అది పూర్తయితే భరతనాట్యానికి మా వంతుగా తిరిగి ఇచ్చిన వాళ్లమవుతాం’ అన్నారు శాంత. వొడాఫోన్ కపుల్ ధనుంజయన్, శాంత దంపతులకు సత్యజిత్ ఒక్కడే కొడుకు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అదే రంగంలో కొనసాగాడు. కొడుకు సరదా కోసం వాళ్లు గోవాలో చిత్రీకరించిన వొడాఫోన్ అడ్వర్టయిజ్మెంట్లో నటించారు. అందులో ఈ దంపతులు సెకండ్ హనీమూన్కొచ్చిన కపుల్ అన్నమాట. అది డాన్సు ప్రధానంగా ఉన్న యాడ్ కావడంతో చేయడానికి ఒప్పుకున్నారు శాంత. ఆ తర్వాత మరో ఐదు యాడ్ ఫిల్మ్స్‌లో నటించినప్పటికీ వొడాఫోన్ యాడ్ తనకు చాలా ఇష్టమంటారు శాంత. ఆమె స్వతహాగా కూడా అడ్వంచర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడతారు. పారాసైలింగ్ ఆమె హాబీ. ఆ యాడ్‌లో ఆమె పారాసైలింగ్ చేశారు కూడా. అందుకే ఆ యాడ్‌ను అంతగా ఇష్టపడతారు. – మంజీర -
సాగర హారతి సాక్షిగా 'సై'ఆట
బాపట్ల: సాగర తీరంలో శివుడికి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన శివలింగం సాక్షిగా టీడీపీ నాయకులు శనివారం రాత్రి బావల సై.. పాటల కచేరి నిర్వహించారు. ఎంతో పవిత్రతతో తీరానికి వస్తే ఇలాంటి పాటలేంటని భక్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. లక్షలాది మంది పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చే సాగర తీరంలో టీడీపీ నాయకులు చిందులాటకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ స్టేజీ ఏర్పాటు చేసి మహిళలు స్నానాల అనంతరం శివుడికి పూజలు చేసేందుకు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అదే స్టేజీపై ‘బావలు సయ్యా... మరదలు సయ్యా..’ లాంటి పాటలను గాయకులతో పాడిం చారు. ఉదయం కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా భక్తులు శివలింగానికి పూజలు చేయగా సాయంత్రం అదే స్టేజీపై నాయకులు బూట్లు, చెప్పులు వేసుకుని మరీ డ్యాన్స్ చేయడం గమనార్హం. గందరగోళంలో సాగరతీరం ప్రశాంతమైన సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఉదయం కొన్ని భక్తిగీతాలు ఆలపించేందుకు ఏర్పాటు చేసిన పాట కచ్చేరి విభాగం సాయంత్రం ఇంకోలాగా మారింది. సింగర్స్ పాటలు పాడుతుండగా టీడీపీ నాయకులు చిందులు తొక్కారు. సాధారణంగా భారీ జన సందోహం ఎక్కువగా ఉన్న చోట వారి వసతులు, అవసరాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా టీడీపీ నాయకులు కచేరి ఏర్పాటు చేయడం గమనార్హం. సాగర హారతి పేరుతో ఏర్పాటు చేసిన స్టేజీ కూడా పోలీసు కంట్రోల్ రూము వద్దనే ఉంది. పోలీసులు భక్తులకు మైకులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉండగా కచేరి వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక లౌడ్‌స్పీకర్ల ధాటికి విధులు సక్రమంగా చేయలేకపోయారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. భక్తులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. -
యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న పూరి హీరోయిన్
-
మెగా చరణం
రేపు చిరంజీవి పుట్టినరోజు శరణం నీ దివ్య చరణం.. నీ నామమెంతో మధురం.. చిరంజీవి నామంలో ఉన్న మాధుర్యాన్ని చరణ్ తలుచుకున్నారు. పాటలో పల్లవి తర్వాత వచ్చేది చరణం మెగా తర్వాత వచ్చే చరణమే చెర్రీ (రామ్‌చరణ్) తండ్రి చరణ ధూళిని నుదుటన దిద్దుకున్న ఒక కొడుకు అనుభవాల పరిమళాలు మీకోసం... మెగాస్టార్ 61వ జన్మదినం సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఈ ఇంటర్వ్యూని మీతో పాటు ఫస్ట్ టైమ్ చిరంజీవి కూడా చదవబోతున్నారు... ఇది తండ్రికి కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. చిరంజీవిగారు యాజ్ ఎ ఫాదర్.. సన్‌గా మీరేం చెబుతారు? రామ్‌చరణ్: బెస్ట్ డాడ్ అని సింపుల్‌గా చెప్పలేను. ఎందుకంటే మా నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఇంట్లో ఆయన మాకు పెద్ద పెద్ద రోల్స్‌లో కనిపిస్తారు. ఆయన్ని గమనిస్తే చాలు... చాలా విషయాలు నేర్చేసుకోవచ్చు. ఇంతకంటే బెస్ట్ పర్సన్‌ని డాడ్గా కోరుకోలేం. మీ చిన్నప్పుడు చిరంజీవిగారు ఫుల్ బిజీగా ఉండేవారు కదా... మిస్సయిన ఫీలింగ్ ఉండి ఉంటుందేమో? బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా మిస్సయ్యేవాళ్లం. మేం నిద్ర లేచేసరికే డాడీ షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్లం. లోకల్లో షూటింగ్ అంటే నాన్నగారు లంచ్‌కి ఇంటికే వచ్చేవాళ్లు. మేం స్కూల్‌కి వెళ్లేవాళ్లం కాబట్టి, కలసి డిన్నర్ చేసేవాళ్లం. చాలా సరదాగా కబుర్లు చెబుతారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు టేబుల్ ఏదో వెలితిగా అనిపించేది. అందరం కలసి రోజుకి ఒక్క ‘మీల్’ అయినా చేయాల్సిందే. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఆ విషయంలో మార్పు రాలేదు. పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్నగారు ఖండించే విధానం ఎలా ఉండేది.. మీరెప్పుడైనా దెబ్బలు తిన్నారా? (నవ్వుతూ). పెద్దగా కొట్టేవారు కాదు. ఒకే ఒక్కసారి మాత్రం కొట్టారు. ఎందుకు కొట్టారని మాత్రం అడక్కండి. మామూలుగా ఎవరు తప్పు చేసినా పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టి మాట్లాడేవారు. తప్పు ఎందుకు చేయకూడదో చెప్పేవారు. ఆ మాటలు మైండ్‌కి బాగా ఎక్కేసేవి. మీరు స్కూల్‌కి బాగానే వెళ్లేవారా.. మారాం చేస్తే అమ్మానాన్న తిట్టి పంపించేవాళ్లా? (గట్టిగా నవ్వుతూ)... సండే అంతా చాలా బాగుండేది. మండే అనగానే ఏదో తెలియని వికారం. మొహంలో కళే ఉండేది కాదు. ‘ఐ వాజ్ నాట్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్’. స్కూల్ ఎలా ఎగ్గొట్టాలా? అని ఆలోచించేవాణ్ణి. అమ్మా నాన్నా తిడతారనే భయంతో వెళ్లేవాణ్ణి. డాడీ ఉదయం ఐదున్నరకే షూటింగ్‌కి వెళ్లిపోయారు. నేను స్కూల్‌కి రెడీ అయ్యే సమయానికి ఆయన షూటింగ్ లొకేషన్లో రెండు, మూడు షాట్స్ ముగించేసేవారేమో. ఆయనతో మార్నింగ్ ఇంటరాక్షన్ అనేది దాదాపు మిస్సయ్యేవాళ్లం. మీ నాన్నగారు ఎలాంటి ఫుడ్ తీసుకునేవారు.. పిల్లలు ఎలాంటివి తినాలి? అని చెప్పే తీరిక ఆయనకు ఉండేది కాదేమో? అప్పట్లో పెద్ద పెద్ద డైటీషియన్లు ఉండేవారు కాదు. పర్సనల్ ట్రైనర్స్ కూడా ఉండేవారు కాదు. అందుకని ఏది మంచో చెడో స్వయంగా తెలుసుకుని అదే తినేవారు. ఇప్పట్లో మాకున్నంత ఎక్స్పోజర్ అప్పుడు ఎక్కడ ఉంది? ఇంట్లో ఏం వండినా అది హెల్దీ అనేవారు. ఆల్మోస్ట్ హోమ్‌ఫుడ్ తినేవారు. మేమూ అంతే. హోటల్స్‌కి తీసుకు వెళ్లేవారా? అలాంటి విషయాల్లో అస్సలు తక్కువ చేసేవారు కాదు. చెన్నైలో చోళా షెరటన్ అని హోటల్ ఉండేది. ఎక్కువగా అక్కడికి వెళ్లేవాళ్లం. ఖాళీ దొరికినప్పుడు బయటికి తీసుకెళ్లేవారు. డాడ్ మంచి ఫ్యామిలీ మ్యాన్. చిరంజీవిగారు అప్పుడప్పుడు కిచెన్‌లో గరిటె కూడా తిప్పుతుంటారట.. ఆయన చేసేవాటిలో టేస్టీ ఐటమ్ ఏదైనా? కుకింగ్ అంటే నాన్నకి చాలా ఇష్టం. అదో రిలాక్సేషన్ అంటారు. ఏదైనా తింటున్నప్పుడు ఎంత ఉప్పు వేశారు? ఎంత కారం వేశారు? అని విడమర్చి మరీ చెబుతారు. నాన్నగారు చేసే వాటిలో టిఫిన్స్‌లో ‘ఉప్మా’ బెస్ట్. రొయ్యలు-వంకాయ, వంకాయ కూర అదరగొడతారు. అప్పుడెప్పుడో మైసూర్ వెళ్లినప్పుడు ఓ దోసె తిన్నారు. అది నచ్చి, హోటల్‌వాళ్లని రెసిపీ అడిగితే, చెప్పనన్నారట. అలాంటి దోసెలు తయారు చేయాలని ఇంట్లో చాలాసార్లు ట్రై చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అయ్యారు.. ఆయన పడిన కష్టాలు మీకు గుర్తుండే ఉంటాయేమో? నాన్నగారి కష్టాలు తెలుసు. ఆయనతో పోల్చుకుంటే కష్టంలో ‘క’ అనే అక్షరాన్ని కూడా మేమింకా పూర్తి చేయలేదనిపిస్తోంది. ‘క’ నుంచి ‘ఱ’ వరకూ నాన్నగారు మొత్తం పూర్తి చేసేసి, మళ్లీ నటుడిగా ‘క’ మొదలుపెట్టారు. నాన్నగారు తీరిక లేకుండా షూటింగ్స్ చేయడం చూసి, మనం కూడా ఇంత కష్టపడాలి అనుకునేవాణ్ణి. నాకు తెలిసి ఆయన కష్టాన్ని రీ-క్రియేట్ చేయడం కష్టం. కొంత చేసినా చాలు. నాన్నగారు ఫుల్ ఎనర్జిటిక్. అంత ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతామా? అనే డౌట్ కలుగుతుంటుంది. మీ డాడీలా మీరూ బాగా డ్యాన్స్ చేస్తారు.. అయితే ఫార్టీ ప్లస్ ఏజ్‌లో చేసిన సినిమాల్లోనూ ఆయన బాగా డ్యాన్స్ చేయడం విశేషం... డాడీతో నన్ను నేనెప్పుడూ పోల్చుకోను. డ్యాన్సుల గురించి మాట్లాడుతోంటే నాకో విషయం గుర్తొస్తోంది. పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఠాగూర్’ సినిమాని అంత సులువుగా మర్చిపోలేం. ఆ సినిమా కోసం ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి..’ పాట తీస్తున్నప్పుడు నేను కూడా లొకేషన్లో ఉన్నాను. నాన్న డ్యాన్స్ చేస్తుంటే.. మోకాలి దగ్గర ఏదో సౌండ్ వచ్చింది. నేను, వినాయక్‌గారు, మిగతావాళ్లు కంగారుపడ్డాం. ‘డాడీ’ అని దగ్గరకు వెళ్లి, పట్టుకున్నాను. బాగానే నొప్పి అనిపించినట్లుంది. బయటకు చెప్పలేదు. వెంటనే ఐస్ ప్యాక్ పెట్టాం. పది నిమిషాల తర్వాత మామూలుగా డ్యాన్స్ చేశారు. అది చూసి, నాకు ఏడుపొచ్చింది. వినాయక్‌గారి కళ్లు కూడా చెమర్చాయి. ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చాలామందికి తెలియదు. నాన్నగారు చేసిన డ్యాన్సుల్లో కూడా తేడా ఏం కనిపించలేదు. అంత బాగా చేశారు. ఒక ఆపరేషన్ జరిగి, 50 ఏళ్లకు దగ్గరైన సమయంలో అలా డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు. అందుకే అంటున్నా.. నాన్నగారిని చూసి చాలా నేర్చుకోవాలని. బహుశా మీ రోల్ మోడల్ మీ నాన్నగారేనేమో? యస్... నాన్నగారే. పిల్లలందర్నీ చాలా ప్రేమగా చూసుకుంటారు. వైఫ్‌తో ఫ్రెండ్లీగా ఉంటారు. అమ్మానాన్న ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే... మనం కూడా ఇలా ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి ఉంటారో అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ల లైఫ్ ఈజీ అవుతుంది. ఆ పర్సన్‌ని చూసి, చాలా విషయాల మీద అవగాహన వచ్చేస్తుంది. 8 ఏళ్ల తర్వాత చిరంజీవిగారు హీరోగా మళ్లీ మేకప్ వేసుకున్నారు కాబట్టి, ఈ బర్త్‌డే మీ ఇంటిల్లిపాదికీ స్పెషల్ కదా? కచ్చితంగా అండి. ఇక వరుసగా సినిమాలు చేస్తారు. అది వేరే విషయం. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆయన హీరోగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. ‘పాత చిరంజీవిగారు’ కనిపించారు. నాన్నగారి నవ్వు చూసినప్పుడు లోపల నుంచి చాలా ఆనందంగా నవ్వినట్లనిపించింది. ఏదో బలవంతంగా ఇన్నేళ్లూ ఆయన్ను వేరే దాంట్లోకి తీసుకెళ్లినట్లు అనిపించింది. ‘హీ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్ ఎగైన్’. షూటింగ్ స్పాట్‌కి మీరు వెళుతున్నారా? ఇప్పటికి నాలుగైదుసార్లు వెళ్లాను. డెరైక్టర్ రెడీ అనగానే కెమెరా ముందుకెళ్లిపోతారు. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ రెడీ అన్న పది నిమిషాలకు వస్తారు. కానీ, వంద సినిమాలకు పైగా చేసి, 150వ సినిమా కూడా చేస్తూ ఇంకా మొదటి సినిమాలా డాడీ ఎగ్జైట్ కావడం చూసి, ఆయనెందుకు ఈ స్థాయికి వచ్చారో అర్థమైంది. ఫైనల్లీ... బర్త్‌డేకి మీరేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నాన్నగారి కోసం పెయింటింగ్ వేయించాను. అది ఆయనకు తెలియదు. ఆ పెయింటింగ్ ఏంటో ఇప్పుడు చెప్పలేను. నాన్నగారికి ఇచ్చిన తర్వాత ఫేస్బుక్లో పెడతాను. ‘లక్కీ టు హావ్ ఎ ఫాదర్ లైక్ హిమ్’. నాన్నగారికి పర్సనల్‌గా బర్త్‌డే విషెస్ ఎలానూ చెబుతాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రూపంలో ఒకరోజు ముందే చెబుతున్నా. మై డాడ్... మై హీరో కష్టపడి పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని ప్రతి పిల్లలకీ ఉంటుంది. ఏమిచ్చినా కన్నవాళ్ల రుణం తీర్చుకోలేం. అయినా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నేనే పని చేయాలనుకున్నా మా నాన్నగారు నాకు అండగా నిలుస్తారు. అలాంటి ఆయన కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఆయన 150వ సినిమా నిర్మించడం. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ఆరంభించడం, నాన్నగారి సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ‘డాడీ యు ఆర్ మై హీరో.. మై రోల్ మోడల్. మన కుటుంబం కోసం మీరు చేసిన అన్నింటికీ థ్యాంక్స్ అనేది చిన్న పదం. లవ్ యు డాడ్’. - డి.జి. భవాని -
కళ్లల్లో కళ్లు పెట్టి చూడు...
► సల్సాతో జల్సా ► భార్యాభర్తల మధ్య స్ట్రెస్ తగ్గించేందుకు ఉపయోగం ► సిటీలో పెరుగుతున్న సల్సా డ్యాన్సర్లు డ్యాన్స్ చెయ్యడం అంటే అందరికీ ఇష్టమే. మొహమాటం కొద్దీ కొంత మంది నో చెప్పినా లోలోపల మాత్రం నర్తించాలనే ఆసక్తి ఉంటుంది. సింగిల్‌గా, గ్రూప్ ఇలా చాలా రకాల నృత్యరీతులు ఉన్నా సల్సా ఒక ప్రత్యేకం. ఒక జంట పూర్తిగా మమేకమై చేస్తే సల్సాతో జల్సా చెయవచ్చు. - పెదగంట్యాడ సల్సాలో ఫీల్ ‘కళ్లల్లో కళ్లు పెట్టి చూడు..గుండెల్లో గుండె కలిపి చూడు..సందిట్లో బంధీవై చూడు’ అనే ఫీల్ ఈ డ్యాన్స్‌లో ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ డ్యాన్స్ చేస్తే స్ట్రెస్ పోయి ఒకర్ని ఒకరు ఇప్రెస్ చేసుకునే అవకాశం కలుగుతుంది. లైట్ మ్యూజిక్...రొమాంటిక్ స్టెప్స్ వావ్ అనిపించక తప్పదు. బంధం మరింత బలపడేందుకు పార్టీలకు పబ్బులకు వెళ్లినా నలుగురితో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి పనికొస్తుంది తప్ప ఆలుమగల మధ్య దూరం తరిగిపోదు. అందుకే 1970లో న్యూయార్క్ సిటీలో కొత్త జంటల మధ్య సల్సా నృత్యాన్ని ప్రవేశపెట్టారు. క్యూబా, కరేబియన్ దేశాల సంప్రదాయ నృత్యరీతులను అనుసరించి ప్రత్యేక పద్ధతిలో డాన్స్‌ను డిజైన్ చేశారు. ఉపయోగాలు.... సల్సా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మానసిక ఉల్లాసం రెట్టింపు అవుతుంది. జంటల మధ్య అనుబంధాలు పెరుగుతుంది. శరీర ధారుడ్యం బలపడుతుంది. బరువు తగ్గుతారు. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎనర్జీ లాస్ అయి కేలరీస్ వేగంగా కరుగుతాయి. డ్యాన్స్‌లో స్టైల్స్ ఇవీ... సాల్సాలో కొన్ని స్టైల్స్ ఉన్నాయి. క్యూబన్ క్యాసినో స్టైల్, మియామి స్టైల్, ర్యూడా స్టైల్, లాస ఎంజల్స్ స్టైల్, న్యూయార్క్ స్టైల్ వంటివి ఉన్నాయి. సల్సా డ్యాన్స్ అంటే... నేటి హైఫై లైఫ్‌లో భార్యాభర్తలిద్దరూ విద్యావంతులే. ఇద్దరూ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్‌కు గురవుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపే అవకాశమే ఉండటం లేదు. మనసువిప్పి మాట్లాడుకోవడమే అరుదుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సల్సా డ్యాన్స్ భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యాన్ని పెంచుతోంది. సాల్సా డ్యాన్స్ పరిచయం చేసింది ఆఫ్రికన్స్ అయినా ఇది అందరికీ మహా నచ్చేసింది. దీంతో అన్ని చోట్లా నాట్యమాడేస్తోంది. -
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!
బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు. చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి చేరడమే కాదు.... ఏకంగా 31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు. నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది. -
ఆన్లైన్లో పోలీసుల డ్యాన్స్ హల్చల్
వెల్లింగ్టన్/న్యూజిలాండ్: ఉరుకులుపరుగులు పోలీసులకు నిత్య కార్యక్రమం. ఎప్పుడు చూసిన కేసుల గొడవ. వారి ముఖంలో చిరునవ్వులు.. ఆనందంతో కనిపించే క్షణాలు అత్యంత అరుదు. కానీ, న్యూజిలాండ్ పోలీసులను చూస్తే మాత్రం వావ్.. పోలీసులు ఇంత ఖుషీగా ఉంటారా.. అమేజిన్ అనుకోవాల్సిందే. ఎంతో హుషారుగా ఓ పదిమంది పోలీసులు కలిసి పరుగెడుతున్నట్లుగా డ్యాన్స్ చేసిన వీడియోను వారు ఫేస్ బుక్‌లో.. యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా అది పెద్ద వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు వచ్చిపడ్డాయి. కనిపించగానే యూజర్లు క్లిక్ మనిపించేస్తున్నారు. గతంలో న్యూయార్క్ పోలీసులు చేసిన ప్రయోగం మాదిరిగానే తాజా కివీస్ పోలీసులు కూడా 'రన్నింగ్ మ్యాన్' అనే పేరిట ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్ద భవనం అండర్ గ్రౌండ్‌లోని పార్కింగ్ ప్లేస్‌కు ఓ పోలీసుల కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా పోలీసులు దిగి ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తారు. ఇందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. వారు అలా చేస్తున్న సమయంలోనే మరో పోలీసు అధికారి వచ్చి రన్నింగ్ మేన్ పేరిట అదిరిపోయే స్టెప్పులు నాలుగు దిక్కులు తిరుగుతూ వేస్తాడు. డ్యాన్స్, రన్నింగ్ మిక్స్ చేసి పోలీసులు చేసిన ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. తమలాగా ఇంకెవరైనా చేయగలరా అంటూ వారు సవాల్ చేస్తున్నారు. ఒక్క రోజులేనే ఈ వీడియోను 51 లక్షలమంది చూశారు. -
డ్యాన్స్ చేసిందని డైవర్స్ ఇచ్చేశాడు
ఖతార్: భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం మామూలే.. పెద్ద జగడాలు జరిగినా విడాకులు వరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సిద్ధంగా ఉండడం లేదు. కానీ, ఖతార్‌లో మాత్రం ఓ భర్త తన భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు. భక్తి చానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లి అయిన కొత్తలో ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త. అయితే ఓ చానల్లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను తమాయించుకోలేక ఆమె కాలు కదిపింది. సరిగ్గా అదే సమయానికి ఆఫీసు నుంచి వచ్చిన భర్త అది చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నా ఆజ్ఞను పట్టించుకోవా అంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలను మరచి, తనను మోసం చేసిన భార్యను క్షమించేదిలేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా ఆ భార్యభర్తల వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
నడిరోడ్డుపై నగ్నంగా డాన్స్.. గంటసేపు హల్ చల్!
ఓ మహిళ చేసిన నిర్వాకంతో హైవే మొత్తం ఓ గంటపాటు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది. ఆమె చేష్టలతో అరవై నిమిషాలు ఆ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చిందంటే ఆమె ఏ స్థాయిలో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్ లోని హోస్టన్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు విషయం ఇది... ఓ మహిళ తన కారులో హోస్టన్ ఏరియాలో హైవే 290పై వెళ్తోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, ఆమె కారుతో పాటు మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆ వెంటనే ఆమె ఓ పెద్ద వాహనంపైకి ఎక్కింది. క్షణాల్లో నగ్నంగా మారిపోయింది. కొద్దిసేపు అలాగే డాన్స్ చేసింది. అనంతరం అలాగే కూర్చుండిపోయింది. తన శరీరాన్ని సాధ్యమైనంతవరకు చేతులు, కాళ్లతో కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడిందట. ఆమె డాన్స్ చేయడం ఆపిన వెంటనే కొందరు అధికారులు ఆమెను అతికష్టం మీద ఆ వాహనంపై నుంచి కిందగి దింపారు. అంతకుముందు గంటసేపు ప్రయత్నించిన ఆమె చేష్టలను ఆపలేకపోవడం గమనార్హం. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు ఉదయం 10గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని హోస్టన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అయితే గంటపాటు ఆ ప్రాంతంలో దారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు వచ్చాయట. జెర్సీ ఏరియాలో అంతకుముందు కూడా ఆమె ఓ యాక్సిడెంట్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు. -
ముంబయి మోడల్స్‌తోపాటు యువకులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్‌లో ముజ్రాపార్టీపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ సందర్భంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మద్యం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పట్టుబడిన వారిలో ముంబయికి చెందిన నలుగురు మోడల్స్‌తోపాటు 17 మంది యువకులు ఉన్నారని... వారిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!
అందాల తార.. అమందా హోల్డెన్... ఇప్పుడో విచిత్ర ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన అబ్బా డ్యాన్సింగ్ క్వీన్ సాంగ్ ను తన అంత్య క్రియల సమయంలో ప్లే చేయాలంటూ వేదికపై వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో ఆడిషన్స్ జరుగుతుండగా ఆ పాటను ఎంతో ఉద్వేగంగా పాడిన ఆమె... ఆ తర్వాత అదే సాంగ్ తనను సమాధిలో ఉంచే సమయంలో పాడాలంటూ కోరడం విన్నవారికి విస్మయం కలిగించింది. ఇంతకూ అమందా ఆవేదన వెనుక కారణం ఏమయ్యుంటుంది? హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్'... బ్రిటన్ ఐటీవీ కార్యక్రమం 'బ్రిటన్ గాట్ ట్యాలెంట్' షోలో జడ్జిగా కూడా ప్రత్యేక ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అదే వేదికపై టాలెంట్ షో ఆడిషన్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన, తాను మొదటిసారి మనసుకు నచ్చి, మెచ్చి పాడుకున్న పాట (అబ్బా డ్యాన్సింగ్ క్వీన్) ఎంతో శ్రావ్యంగా ఆలపించింది. ఇంతలో ఏమైందో ఏమో ''ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట. నా మనసునుంచి జాలువారిన గీతం. నా మరణానంతరం నన్ను సమాధిలో ఉంచే సమయంలో ఈ పాటను ప్లే చేయండి'' అంటూ అమందా వెల్లడించింది. కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో సహ జడ్జి సైమన్ కోవెల్ చేసిన సరదా కామెంటే ఆమె అప్రస్తుత ప్రకటన వెనుక కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. బిజిటి ఆడిషన్స్ సమయంలో సైమన్ కోవెల్... అమందా మాజీ భర్త.. హాస్యనటుడు లెస్ డెన్నిస్ పై చేసిన సరదా కామెంట్.. ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించని ఉద్వేగానికి లోనయ్యింది. అదే సమయంలో డైనోసార్ డ్రెస్ తో డ్యాన్స్ ట్రూప్ స్టేజ్ పైకి రావడం ఆమెకు కలసి వచ్చింది. ఇంకేముందీ... వారికి ఓ పక్క అభినందనలు తెలుపుతూనే ఆ డైనోసార్ నావైపే చూస్తోందని, దాని మోసపూరిత ప్రవర్తన గురించి నాకు ఎప్పుడో తెలుసునని మిస్టర్ నాస్టీగా కూడా దానికి పేరు అందుకే వచ్చిందని ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమయానికి డెన్నిస్ వేదిక ముందు ఉండటం.. సైమన్ వెక్కిరించడం ఆమెను ఆవేశానికి గురి చేశాయి. ఆమె ప్రవర్తనకు సర్ది చెబుతూ 'లీవ్ లెస్ ఎలోన్' అంటూ డెన్నిస్ ను ఉద్దేశించి సైమన్ అనడం కూడా అమందాను పట్టలేని ఉద్వేగానికి లోను చేశాయి. ఆమె చేతిలో సుమారు ఏభై వేల రూపాయల ఖరీదైన ఫోన్ ను విసిరికొట్టి నాశనం చేయడమే కాక, అక్కడున్న గ్లాసుల్లో నీటిని కూడా సైమన్ పై పోసి నానా హంగామా చేసింది. అమందా ప్రవర్తనపై ఇంతకు ముందే ఓసారి అనుభవం ఉండటంతో ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సైమన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గతంలో బ్రిటన్ గాట్ మోర్ ట్యాలెంట్ సమయంలో కూడా అమందా ఇలాగే ప్రవర్తించింది. అప్పట్లో అతిథిగా వచ్చిన స్టీఫెన్ ముల్లెన్... అమందాను.. న్యూయార్క్ సామాజిక వేత్త జోస్లిన్ వైల్డెన్ స్టిన్ తో పోలుస్తూ వెక్కిరించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం కూడా ఆమె కోపం వెనుక కారణాలై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. 1995 లో లెస్ డెన్నిస్ ను వివాహమాడిన అమందా ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అంమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది. -
డాన్స్ చేయడమే ఆమె చేసిన తప్పా?
ఖతార్: తన అభీష్టానికి భిన్నంగా ప్రవర్తించదనే కారణంతో భార్యకు విడాకులిచ్చాడో భర్త. తాను వద్దన్నా వినకుండా డాన్స్ చేసిందనే సాకుతో వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన పాటకు డాన్స్ చేయడమే ఆమె చేసిన అపరాధం. అరబ్ దేశం సౌదీ అరేబియాలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. భక్తి చానళ్లు తప్ప ఇతర చానళ్లు చూడొద్దని తన భార్యకు సదరు భర్త ఫర్మానా జారీచేశాడు. తన మాట కాదని ముందుకెళ్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించేవాడు. ఒకరోజు భర్త ఇంట్లో లేనప్పుడు భార్య తనకిష్టమైన చానల్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించసాగింది. సంగీతానికి అనుగుణంగా పాదం కలిపింది. భర్త ఇంటికి తిరిగొచ్చేప్పటికి పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తున్న భార్య కనపడింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వెంటనే భార్యకు తలాక్ చెప్పేశాడు. తన ఆజ్ఞను అతిక్రమించినందుకు విడాడులిచ్చేశాడు. " పెళ్లినాటి ప్రమాణాలను పట్టించుకోకుండా తనను మోసం చేసిందని, ఆమెను క్షమించే ప్రసక్తే లేదని సదరు భర్త చెప్పడం శోచనీయం. అయితే భార్యాభర్తలు వివరాలు, సౌదీ అరేబియాలో వారు ఎక్కడ నివసిస్తున్నారనేది మీడియా వెల్లడించలేదు. -
అమ్మాయితో కలిసి చిందేసిన ఖాకీలు
-
ఊ కొడుతున్నారా? ఉలిక్కిపడుతున్నారా?
కేరెంటింగ్ ఇంచుమించు అన్ని స్కూళ్లకూ వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉండి అల్లరి చేస్తుంటారు. వారి సెలవులను సద్వినియోగం చేసేందుకు చాలామంది తలిదండ్రులు వారిని సమ్మర్ కోచింగ్లోనో, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సింగింగ్ వంటి వాటిలో చేర్చి, చేతులు దులుపుకుంటారు. అయితే చిన్నారులకు కావలసింది తలిదండ్రుల సామీప్యం. వారిని దగ్గర కూర్చోబెట్టుకుని చక్కటి కథలు చెప్పడం వల్ల వారిలో ఊహాకల్పన, ఆలోచనాశక్తి అలవడతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఒకవేళ మీకు కథలేమీ రాకపోతే, నేర్చుకోండి. లేకపోతే వారి నానమ్మలు, అమ్మమ్మలు, తాతల దగ్గరకో, ఇతర పెద్దవాళ్ల దగ్గరకో పంపండి. అంతేకానీ, వారిని వాళ్ల అల్లరి తప్పించుకోవడానికి దూరంగా పంపకండి. మా పిల్లలు కథలు వినడానికి సుతరామూ ఇష్టపడరు, అని పెదవి విరవకండి. అనగా అనగా అని మొదలు పెట్టి, వారికి ఆసక్తి కలిగించే కబుర్లే కథలుగా అల్లండి. కథలతో మొదలు పెట్టి, క్రమక్రమంగా పురాణాలు కూడా చెప్పండి. పురాణాలలోని పాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటివారు ఎంత ఆపద వాటిల్లినా, ఎంతటి కష్టం ఎదురైనా సరే, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచడాన్ని వారికి చెప్పండి. ఇతర మతాలలోని కథలు కూడా నేర్పండి. వాటిలోని మంచిని కూడా గ్రహించేలా చేయండి. భగవద్గీతతో పాటు బైబిల్ కథలు కూడా చదివించండి. ఖొరాన్తోపాటు, కృష్ణుడి అల్లరి కూడా కళ్లకు కట్టండి. పురాణాలు, రామాయణ, భారతభాగవతాలు చదివితే చాలు అని మన పూర్వీకులు అనడంలోని ఉద్దేశ్యం వాటి ద్వారానే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప మరోటి కాదు. -
నాట్యలాస్యం
ఆదివాసీలకు ఆలవాలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అడుగడుగునా జానపదలాస్యం కనిపిస్తుంది. మణిపూర్‌లో వికసించి, జానపద వైభవానికి ప్రతీకలుగా నిలిచిన ‘వసంత్ రాస్, పుంగ్ చోలమ్’.. నాట్యాలకు హైదరాబాద్ వేదిక కానుంది. శిల్పారామంలోని అంఫీ థియేటర్లో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ జంట నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ మణిపురి డ్యాన్స్ అకాడమీకి చెందిన 20 మంది కళాకారులు వీటిని ప్రదర్శించనున్నారు. రాసలీల రేయిలోని.. బృందావన శ్రీకృష్ణుడి రాసలీలను కీర్తిస్తూ సాగే నాట్యం వసంత్‌రాస్. మణిపూర్‌లో వసంత రుతువు ఆగమనం తర్వాత చైత్ర మాసంలో జానపదులు జరిపే ఉత్సవాల్లో వసంత రాస్ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాకృష్ణుల ఆనందకేళి, కృష్ణునితో గోపికల వినోదవల్లరి.. ఇలా భాషలోన రాయలేని.. రాసలీల రేయిని.. ఈ రూపకంలో కళ్లముందుంచుతారు కళాకారులు. ఢమరుకం మోగ.. హోలీ వేళలో.. మణిపూర్ పల్లెల్లో పుంగ్ చోలమ్ కన్నులవిందుగా సాగుతుంది. మృదంగాలు చేతబూనిన కళాకారుల లాస్య విన్యాసం చూసి తరించాల్సిందే. పాదరసంలా పాదాలను కదుపుతూ.. గాలిలో ఎగురుతూ.. చేసే నృత్యం అద్భుతంగా సాగుతుంది. ఫోన్: 9849298275, 9391047632 -
గజ్జె ఘల్లుమంది..
సిరిసిరిమువ్వలు కట్టుకున్న చిన్నారి అడుగులు.. నాట్యంలో అందెవేసిన మువ్వలు.. జతకలసిన వేళ అందెల రవం మార్మోగింది. కూచిపూడి నాట్య సీమలో వికసించిన కుసుమాల అభినయంతో రాజధాని మరోసారి పులకించింది. అరుణ వర్ణంలో కొందరు.. తొగరు రంగులో ఇంకొందరు.. పచ్చందన చందనంలో మరికొందరు.. ఇలా రంగురంగుల సంప్రదాయ వస్త్రాల్లో కూచిపూడి ప్రాభవాన్ని కళ్ల ముందుంచారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం కన్నులపండువగా సాగింది. -
గర్వభంగం!
అనగనగా ఒక సారి ఒక నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఆనందిస్తోంది. రంగు రంగుల పింఛంతో నెమలి మరింత అందంగా ఉంది. తన అందమైన పింఛాన్ని చూసుకుని ఎంతో గర్వపడింది. కొంతసేపటికి అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి బోసిగా ఉన్న కొంగ తోకను చూసి అసహ్యించుకుంది. ‘‘నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు?’’ అని నెమలిని కొంగ అడిగింది. అందుకు నెమలి నవ్వుతూ ‘‘నీ తోకని చూసి నవ్వొస్తోంది. ఈకలు ఏమిటి అలా ఉన్నాయి? అందంలేదు, పొడవూ లేవు. నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో’’ అంది. ఇక అంతటితో ఊరుకోక దాన్ని మరింత ఏడిపించాలని, ‘‘చూశావా! ప్రకృతి నీకు ఎంత అన్యాయం చేసిందో! బలమైన పక్షివే, కాని ఏం లాభం నీ తోక ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు. నిన్ను చూస్తే జాలి వేస్తోంది’’ అని అంది. నెమలికి బుద్ధి చెప్పాలని కొంగ అనుకుంది. ‘‘నీకేం తెలుసు? ప్రకృతి అందరికీ, అన్నింటికి ఎప్పుడూ సమన్యాయమే చేస్తుంది. నీకు అందమైన రెక్కలు, పింఛమూ ఉంటే నా తోక ఆకర్షణీయంగా ఉండదు. కాని నేను ఆకాశంలో మబ్బుల్ని తాకుతూ ఎగిరిపోగలను, నీకు ఆ అదృష్టం లేదుగదా!’’ అన్నది. నెమలి తన పొరపాటును గ్రహించి కొంగను క్షమించమని కోరింది. -
డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...
చార్మినార్‌కూ, మదీనాకీ మధ్య గుల్జార్ హౌజ్ అనే కొలను ఉంది. ఇక్కడ ‘హౌజ్’ అంటే ఫౌంటెయిన్ అని అర్థం. హైదరాబాద్ పాలకులు అప్పటి ఇంజనీర్ల సాయంతో ఇలాంటి ఫౌంటెయిన్లు చాలా చోట్ల కట్టించారు. దారి మధ్యలో కట్టించి మరీ నీరు ఉవ్వెత్తున అందంగా ఎగిసేలా చేశారు. అప్పటి ఇంజనీర్లు ఏదో కొన్ని చోట్ల ఇలా హౌజ్‌లు అనే ఫౌంటెయిన్లు కట్టించారేమోగానీ... తమ సంకల్పం లేకుండానే ఈ తరహా ఫౌంటెయిన్లను మన ఆధునిక ఇంజనీర్లూ ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్లు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కవర్స్‌ను ఏర్పాటు చేస్తే... అవి ఆటోమేటిగ్గా గుల్జార్ హౌజ్ లాంటి ఫౌంటెయిన్లుగా రూపుదిద్దుకున్నాయి. తేడా అల్లా ఒక్కటే. గుల్జార్ హౌజ్ ఫౌంటెయిన్ వర్షం కురిసినా, కురవకపోయినా నీళ్లు చిమ్మదు. కానీ మన ఆధునిక ఇంజనీర్లు డ్రైనేజీ కోసం కట్టించిన హౌస్‌లు... అదే ఫౌంటెయిన్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు చిమ్ముతాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే... వాళ్ల ప్రమేయం లేకుండానే వాళ్లు ఇంకో ఘనమైన రికార్డునూ సాధించారు. అదేమిటంటే... ఈ డ్రైనేజీ ఫౌంటెయిన్‌పై ఉండే మ్యాన్‌హోల్ కవర్‌కు నాట్యం నేర్పడం! వర్షం కురిసి డ్రైనేజీ పొంగడం మొదలుపెట్టగానే మ్యాన్‌హోల్ హౌజ్ అదే ఫౌంటెయిన్‌పై నల్లటి లోహచంద్రుడి షేపులో గుండ్రంగా ఉంటే ఇనుపచక్రం కింద నుంచి ఉవ్వెత్తున పొంగి వచ్చే నీళ్ల తాకిడికి డ్యాన్స్ చేస్తుంటుంది. వర్షం వేళ మ్యాన్‌హోల్‌పై ఉండే సదరు గుండ్రని ఇనుప కవరు మూతకు ఆనకుండా చిత్తడిలో ఇత్తడి పళ్లెంలా అటూ ఇటూ కదుల్తూ డ్యాన్స్ చేస్తుంటే... డ్యాన్స్ అంటే ఆసక్తి లేనివారైనా సరే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇలా మ్యాన్‌హోల్ పైచక్రానికి మణిపురి... డ్రైనేజీపై ఉండే కవర్‌కి కూచిపూడి నేర్పడం అలనాటి ఏ ఇంజనీర్‌కు సాధ్యమైంది చెప్పండి! సాక్షాత్తూ అప్పటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం తాను డిజైన్ చేసిన... మ్యాన్‌హోల్ మూతకూ డ్యాన్సు నేర్పలేకపోయేవాడు. కాబట్టి అలనాటి మోక్షగుండం వంటి ఇంజనీర్ల కంటే ఇప్పటి జలగండం ఇంజనీర్లే గ్రేట్ అని నా అభిప్రాయం. అలనాటి ఇంజనీర్లు మరో అద్భుతం సాధించారట. గోల్కొండ కోట ఎంట్రన్స్‌లో చప్పట్లు కొడితే ఎక్కడో కొండపైన కోట చివర ఉండే నవాబుగారికి వినిపిస్తుందట. అదేదో గొప్ప అనుకుంటున్నారుగానీ... ఇప్పడు మనం అడ్వాన్స్డ్ అంటూ పేర్కొంటున్న వైర్లెస్ లాంటిదే కదా ఇది. పైగా వాళ్లేదో ఒక్క కోటలోనే ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనం ప్రతి బస్సులోనూ చేసుకున్న ఏర్పాటే కదా ఇది. టికెట్ల కట్టలు ఉండే హోల్డరుతో కండక్టరు ఒక్క దెబ్బ కొడితే బస్సు ఆగుతుంది. అదే రెండో మూడో దెబ్బలు కొడితే అది బయల్దేరుతుంది. ఇలా ఓ మాటా-ముచ్చటా లేకుండా కేవలం లోహపు చప్పట్లతోనే డ్రైవర్‌కూ, కండక్టర్‌కూ కమ్యూనికేషన్ నడుస్తుంటుంది. ఇది కూడా వైర్లెస్సే. మరి వైర్లతో జరిగే కమ్యూనికేషన్ కంటే వైర్‌లెస్‌లు మరింత అభివృద్ధి చెందినవైనప్పుడూ... రోజూ బస్సుల్లో జరిగే ఈ సమాచార వినిమయాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి! అందుకే... మనం రోజువారీ ఉపయోగించుకునే టెక్నాలజీ విషయం నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే నిరభ్యంతరంగా మన సిటీ మరింత అడ్వాన్స్డే. అటు డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్స్ అయినా... ఇటు టాక్లెస్ టికెట్ హోల్డర్ అయినా! -
బాలయ్య సార్ బోల్డన్ని మెళకువలు నేర్పారు!
‘‘ఆయన నాకు విద్య నేర్పిన గురువు. అందుకే... ఆయన్ను మరచిపోలేను’’ అంటున్నారు కత్రినాకైఫ్. ఇంతకీ... కత్రినాకు విద్య నేర్పిన ఆ గురువు ఎవరు? అనుకుంటున్నారా! ఆయన ఎవరో కాదు... మన నందమూరి అందగాడు బాలకృష్ణే. ఇటీవల ఓ బాలీవుడ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా ఆమె చెబుతూ- ‘‘తొలినాళ్లలో నా డాన్స్ చిన్నపిల్లల తప్పటడుగుల్లా ఉండేవి. ఈ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాను. కెరీర్ ప్రారంభంలో కొరియోగ్రాఫర్లతో చీవాట్లు తిన్న సందర్భాలున్నాయి. అలాంటి నేను ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే... దానికి కారణం బాలకృష్ణసార్. ఆయనతో ‘అల్లరి పిడుగు’ అనే సినిమాలో నటించాను. ఆయన మంచి డాన్సర్. ఆయనతో కలిసి డాన్స్ చేయడమంటే తేలికైన విషయం కాదు. అందుకే భయపడ్డాను. నా భయాన్ని గమనించిన ఆయన ధైర్యం చెప్పడంతో పాటు, డాన్స్‌లో మెళకువలు నేర్పారు. డాన్స్ చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా నడుచుకోవాలి, ఒక మూమెంట్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలి... ఇవన్నీ ఓ పాఠంలా చెప్పారు. అవే ఈ రోజు నాకు ఉపయోగపడుతున్నాయి’’ అని చెప్పారు కత్రినాకైఫ్. బాలీవుడ్లో సక్సెస్ వస్తే చాలు, గుర్తింపు తెచ్చిన దక్షిణాది సినిమానే మరిచిపోతున్న కథానాయికలున్న నేటి తరుణంలో... బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతూ, కెరీర్ ప్రారంభంలో నాట్యంలో మెళకువలు నేర్పిన బాలకృష్ణను ఇంకా గుర్తుంచుకోవడం, ఆయనకు ఋణపడి ఉంటాననడం కత్రినాలోని సంస్కారానికి నిదర్శనం. -
తారక్ ‘రభస’ వర్కింగ్ స్టిల్స్
-
ఐటం సాంగ్‌తో దుమ్మురేపుతున్న క్రికెటర్ బ్రావో
-
అదిరే...
-
పవర్‌ఫుల్‌గా...
నటన, నాట్యం... ఈ రెండూ తారక్‌కి అలంకారాలు. అయితే వాటిని సరిగ్గా ప్రదర్శించే స్థాయి కథలు ఇటీవల ఆయనకు రావడంలేదు. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి మాస్‌కి అమితంగా చేరువైన తారక్‌కి... గతంలో చేసిన పాత్రలకు దీటైన పాత్రలు దొరక్కపోవడం నిజంగా లోటే. ఆ లోటుని భర్తీ చేసేలా ‘రభస’(వర్కింగ్ టైటిల్) ఉంటుందని సమాచారం. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ స్డూడియోలో జరుగుతోంది. ‘ఆది’ తర్వాత తారక్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘ఆది’ కంటే అత్యంత శక్తిమంతంగా ఇందులోని తారక్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత తొలుత ప్లాన్ చేశారు. కానీ... సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
స్టెప్పులు వేసిన మేయర్
-
పాపం సమంత
చక్కని అందం, అభినయం, ఆహార్యం లాంటివి ఒకప్పుడు కథానాయికలకు కావలసిన అర్హతలు. వీటి కోసం వాళ్లు ఎంతో సాధన చేసేవాళ్లు. ఇప్పటి హీరోయిన్లలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అంటే సమాధానం దొరకదు. ఈ తరం హీరోయిన్లలో నటన కంటే గ్లామర్‌ను నమ్ముకున్న వాళ్లే ఎక్కువ. హీరోలతో నాలుగు స్టెప్పులు వేసి అందాలరబోయడం వరకే పరిమితమైపోతున్నారు. అయితే డ్యాన్స్ విషయంలో సమంత కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో పాగా వేయాలనే కోరిక ఈ బ్యూటీకి నెరవేరడం లేదనే చెప్పాలి. నాన్ ఈ చిత్రం విజయం సాధించినా సమంతకు రావలసినంత పేరు రాలేదు. తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో సూర్యతో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తెలుగులో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతోంది. అక్కడ హీరోయిన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సమంత నటించాల్సిన ఒక అవకాశాన్ని తమన్న తన్నుకుపోయింది. ఇదిలావుండగా పాటల చిత్రీకరణలో సమంత పలు టేక్‌లు తీసుకుంటోందట. అందుకు కారణం ఆమెకు డ్యాన్స్ మూమెంట్స్ సరిగా రాకపోవడమే. అందుకే డ్యాన్స్ మాస్టర్లు తక్కువ మూవ్మెంట్ ఉండే స్టెప్పులను సమంతకు కంపోజ్ చేస్తున్నారట. ఈ విషయమై సమంత ట్విట్టర్లో స్పందించింది. సినిమాల్లో తనకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అని పేర్కొంది. అయినా డ్యాన్సర్లందరినీ గౌరవిస్తానని తెలిపింది. ముఖ్యంగా తమన్న డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.