
గుత్తి: పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప(25) అనే యువకుడు వినాయక మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన ఓబుళమ్మ కుమారుడు పెద్ద కుళ్లాయప్ప శనివారం రాత్రి 11 గంటల సమయంలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపానికి వెళ్లాడు. అక్కడే సుమారు గంటన్నర పాటు గడిపాడు. తర్వాత మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
Comments
Please login to add a commentAdd a comment