బాలయ్య సార్ బోల్డన్ని మెళకువలు నేర్పారు! | Katrina Kaif credits Balakrishna for her dancing | Sakshi
Sakshi News home page

బాలయ్య సార్ బోల్డన్ని మెళకువలు నేర్పారు!

Published Mon, Aug 25 2014 12:54 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలయ్య సార్ బోల్డన్ని మెళకువలు నేర్పారు! - Sakshi

బాలయ్య సార్ బోల్డన్ని మెళకువలు నేర్పారు!

 ‘‘ఆయన నాకు విద్య నేర్పిన గురువు. అందుకే... ఆయన్ను మరచిపోలేను’’ అంటున్నారు కత్రినాకైఫ్. ఇంతకీ... కత్రినాకు విద్య నేర్పిన ఆ గురువు ఎవరు? అనుకుంటున్నారా! ఆయన ఎవరో కాదు... మన నందమూరి అందగాడు బాలకృష్ణే. ఇటీవల ఓ బాలీవుడ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కత్రినా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా ఆమె చెబుతూ- ‘‘తొలినాళ్లలో నా డాన్స్ చిన్నపిల్లల తప్పటడుగుల్లా ఉండేవి. ఈ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాను.
 
 కెరీర్ ప్రారంభంలో కొరియోగ్రాఫర్లతో చీవాట్లు తిన్న సందర్భాలున్నాయి. అలాంటి నేను ఇంత బాగా డాన్స్ చేస్తున్నానంటే... దానికి కారణం బాలకృష్ణసార్. ఆయనతో ‘అల్లరి పిడుగు’ అనే సినిమాలో నటించాను. ఆయన మంచి డాన్సర్. ఆయనతో కలిసి డాన్స్ చేయడమంటే తేలికైన విషయం కాదు. అందుకే భయపడ్డాను. నా భయాన్ని గమనించిన ఆయన ధైర్యం చెప్పడంతో పాటు, డాన్స్‌లో మెళకువలు నేర్పారు. డాన్స్ చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా నడుచుకోవాలి, ఒక మూమెంట్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలి... ఇవన్నీ ఓ పాఠంలా చెప్పారు.
 
  అవే ఈ రోజు నాకు ఉపయోగపడుతున్నాయి’’ అని చెప్పారు కత్రినాకైఫ్. బాలీవుడ్‌లో సక్సెస్ వస్తే చాలు, గుర్తింపు తెచ్చిన దక్షిణాది సినిమానే మరిచిపోతున్న కథానాయికలున్న నేటి తరుణంలో... బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూ, కెరీర్ ప్రారంభంలో నాట్యంలో మెళకువలు నేర్పిన బాలకృష్ణను ఇంకా గుర్తుంచుకోవడం, ఆయనకు ఋణపడి ఉంటాననడం కత్రినాలోని సంస్కారానికి నిదర్శనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement