Ravi Teja Dhamaka song shoot in Spain Deets Here - Sakshi
Sakshi News home page

Ravi Teja Dhamaka: స్పెయిన్‌లో ధమాకా

Published Sat, Mar 12 2022 12:02 AM | Last Updated on Sat, Mar 12 2022 8:47 AM

Ravi Teja Dhamaka song shoot in Spain - Sakshi

రవితేజ, శ్రీ లీల

Ravi Teja Movie Shoot in Spain: స్పెయిన్‌లో రవితేజ డాన్సింగ్‌ స్టెప్పులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’ చిత్రం కోసం స్పెయిన్‌లో సాంగ్‌ షూట్‌లో రవితేజ పాల్గొంటున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ధమాకా’ తదుపరి షెడ్యూల్‌ కూడా స్పెయిన్‌లోనే జరగనుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్‌. స్పెయిన్‌లో ఈ సినిమా పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. జానీ మాస్టర్‌ ఈ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్‌. పాటలతో పాటు రవితేజ, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ను కూడా చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతదర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement