మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటించింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపింది.
ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో పల్సర్ బైక్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment