Ravi Teja And Sreeleela In Spain For Dhamaka Movie Shooting Deets Here - Sakshi
Sakshi News home page

Ravi Teja-Sreeleela: స్పెయిన్‌లో పెళ్లి సందడి హీరోయిన్‌తో రవితేజ సందడి

Published Thu, Mar 17 2022 8:05 AM | Last Updated on Thu, Mar 17 2022 10:38 AM

Ravi Teja And Sreeleela In Spain For Dhamaka Movie Shooting - Sakshi

Mass Hero Ravi Teja, Sreeleela In Dhamaka Movie Shooting: రవితేజ, శ్రీలీల కలిసి స్పెయిన్‌లో ఆడిపాడుతున్నారు. ఈ ఆటాపాటా వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ కోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ధమాకా’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ కోసం ఈ చిత్రబృందం స్పెయిన్‌లో ల్యాండ్‌ అయింది.

చదవండి: ప్రశాంత్‌ కిషోర్‌తో తమిళ స్టార్‌ హీరో భేటీ.. పోలిటికల్‌ ఎంట్రీకీ సంకేతమా?

ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఔట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. స్పెయిన్‌లోని ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్‌ లొకేషన్లో రొమాంటిక్‌ పాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూచి¿ొట్ల, సంగీతం: భీమ్స్, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని.

చదవండి: రామ్‌ చరణ్‌ అర్ధరాత్రి ఇంటి ముందుకొచ్చేవాడు: జూనియర్‌ ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement