
జైపూర్: రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు.
రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు.
చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!)
Comments
Please login to add a commentAdd a comment