bride
-
అమెరికా అమ్మాయి వెడ్స్.. తెలంగాణ అబ్బాయి
-
విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
యేటి వదినీ... పిల్ల దొరికిందా...
యేటి మంగొదినా పండుగ అయిపొయింది.. మాఘమాసం వచ్చిసింది.. మన రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారా లేదా.. యేటి మరి.. ఇంకెన్నాళ్లు ఉంచుతావు.. ఎంత ఉంచితే అంతెక్కువ కట్నం వస్తాదని గట్రా లెక్కేస్తున్నావా యేటి అంది వరలక్ష్మి .. లేదొదినా అదేట్లేదు .. సూత్తన్నాము.. మేము చూసిందాన్ని వాడు నచ్చడం లేదు.. వాడికి నచ్చిందేమో మాకు కుదరడంలేదు.. అన్నిటికి మించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా బోలెడు లెక్కలేస్తాన్నారు..అంటూ చెబుతోంది మంగ... 'ఆ నీ నోటికి భయపడి ఎవరూ ఇవ్వడం లేదని చెప్పొచ్చుగా.. లోలోన అనుకుంది వరలక్ష్మి.. అయినా నాకెందుకులే అని ఊరుకుని.. లేదులే వదినా నీకు కోడలు అవ్వాలంటే ఎవరికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి.. అంటూ కవరింగ్ ఇచ్చింది. వాస్తవానికి మంగమ్మ పేరులోనే అమ్మ ఉందికానీ మనిషి మాత్రం మహంకాళీ అని చుట్టుపక్కల పేరు.. నోరు తెరిస్తే శృతి ఆరున్నరకు చేరుతుంది.. మామూలోళ్ళంతా పరారవ్వాల్సిందే.. ఇప్పటికే పెద్దకోడలు ఈమెకు దండం పెట్టేసి మొగుడు సూర్యనారాయణతో పట్నంలో వేరుకాపురం పెట్టేసింది.. ఇప్పుడు చిన్నోడు రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారు. కానీ మంగమ్మ నోటికి జడిసి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు..మాకేమో కట్నం ప్రసక్తి లేదు.. పిల్ల బాగుంటే చాలు... బుద్ధిమంతురాలైతే ఇంకా మేలు.. అయినా మనం అడిగినా లేకున్నా ఆడపిల్లకు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తారు కదా వదినా అంటూ అసలు విషయం చెప్పింది మంగమ్మ. అయినా ఈరోజుల్లో మీలాగా కట్నం వద్దంటున్నవాళ్ళు ఎవరున్నారు.. నువ్వంటే మంచిదానివి కాబట్టి సరిపోయింది అని అంటూనే దీనికి కట్నం వద్దట కానీ డబ్బున్న సంబంధాలే చూస్తోంది అని మనసులోనే బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. పోనీ వాడికి ఎవరైనా నచ్చినపిల్ల ఉందేమో చూడలేకపోయావా సలహా ఇచ్చింది వరలక్ష్మి.. ఊరుకో వదినీ.. వాడికేం తెలుసు.. నోట్లో వేలెడితే కొరకలేని అమాయకుడు.. వాడికి నచ్చడం ఏంది... వాడి చెడ్డీలు. బనీన్లు కూడా నేనే కొనాలి.. నా మాటే వాడికి వేదం.. గర్వంగా చెప్పింది.. మంగమ్మ.. ఎంతైనా నువ్వు లక్కీ వదినా.. అటు అన్నయ్యను.. ఇటు పిల్లలను ఆడిస్తున్నావు అనేసింది వరలక్ష్మి.. అదేటి అంతమాట అనేశావు అంది మంగమ్మ.. ఆడించడం అంటే వాళ్లంతా నీ కనుసన్నల్లో ఉంటారు అంటున్నా.. అంటూ కవర్ చేసేసింది వరలక్ష్మి.. మొత్తానికి ఆ చుట్టుపక్కల ఆరేడు మండలాలు.. మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా మంగమ్మాకొడుక్కి పిల్ల దొరకలేదు.. పిల్లలు ఉన్నా ఈమె నోటికి జడిసి ఇవ్వడం లేదు. చూసిచూసి ఈవిడకు విసుగొచ్చింది.. అలాగని నోటిని కంట్రోల్ చేసుకుని మంచిగా ఉండడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. పైగా ఇన్నేళ్ళపాటు గయ్యాళి బ్రాండ్ దక్కించున్న మంగమ్మ ఇప్పటికిప్పుడు అమాయకపు కన్నాంబ పాత్రలోకి మారడం కష్టమే.. అందుకే ఇక ఆమె పెళ్లి విషయాల ప్రస్తావన ఆపేసింది.ఓరోజు తెల్లారేసరికి కార్లో దిగాడు రాజేష్.. పక్కన దండలతో ప్రమీల.. తాను చూస్తున్నది కలయా నిజమా .. తెలీక కాసేపు మంగమ్మ అలాగే కొయ్యలా నిలబడిపోయింది. ఒరేయ్ రాజేష్ ఏందిరా ఇది అని అడిగింది.. అవునమ్మా ఇక నీ నోటి బ్రాండ్ దెబ్బకు నాకు పెళ్లవ్వదని అర్థం ఐంది.. అందుకే ఇదిగో పక్కూరి వజ్రమ్మ కూతుర్ని చేసుకున్నాను.. ప్రమీల నాతోబాటే ఉద్యోగ చేస్తోంది.. అన్నాడు.. వజ్రమ్మ అంటే తనను మించిన నోటి దురుసు.. తనది మండల్ లెవెల్ అయితే ఆమెది జిల్లా లెవెల్.. ఆపిల్లతో తనకొడుకు ఎలా వేగుతాడో అనుకుంటూనే మరి వేరే మార్గం లేక దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది.. సిమ్మాదిరప్పన్న -
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
వివాహ రిసెప్షన్లో తండ్రి ప్రతిమ
సింగరేణి (కొత్తగూడెం): ఇంటిపెద్ద మృతి చెందితే చాలామంది ఇంట్లో ఫొటో ఏర్పాటుచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు రూ.లక్షలు వెచ్చించి తన తండ్రి ప్రతిమ చేయించి సోదరి వివాహ రిసెప్షన్ వేదికపై ఏర్పాటుచేసి మమకారాన్ని చాటుకున్నాడు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పెరికం బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కుమార్తె స్నేహకు యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగావకాశం కల్పించింది. ఆమెకు శ్రీరాంపూర్ ఏరియాలో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ తో పెళ్లి కాగా.. కొత్తగూడెంలో శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఈమేరకు ముంబైలో రూ.4 లక్షల వ్యయంతో వీల్‌చైర్‌లో కూర్చున్న రూపంలో చేయించిన బాలరాజు విగ్రహాన్ని వేదికపై ఏర్పాటుచేయగా.. స్నేహ దంపతులతో పాటు ఆమె సోదరుడు, తల్లి ఫొటోలు దిగారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని తయారుచేయించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్‌కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్‌లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 2019లో యోగా టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్.. ఒక రేంజ్లో ఉందిగా!
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్మెంట్, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్‌మీడియాలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ మాస్ మాస్‌గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత. View this post on Instagram A post shared by Shraddha Mishra (@shraddhamishra8) కాగా గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్ నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
కొద్ది గంటల్లో పెళ్లి.. సినీ ఫక్కీలో పెళ్లి కూతురు జంప్
-
బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్‌స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్
భారతదేశంలో పెళ్లిళ్లు అంటే వేదమంత్రాలు, బాజా భజంత్రీలు, మూడు ముళ్లు,ఏడడగులు మాత్రమే కాదు. అంతకుమించి పెద్ద సందడే ఉండాలి. విశాలమైన వెడ్డింగ్ హాల్స్, జిగేల్ మనిపించే డెకరేషన్, నోరూరించే వంటకాలు, మెహిందీ, సంగీత్, బారాత్..నాచ్గానా మినిమం ఉండలి. ఇక వీటన్నింటికి మంచి వధువు డిజైనర్ దుస్తులు, ధగధగలాడే ఆభరణాలతో అదిరిపోవాలి. ఇదీ లేటెస్ట్ ట్రెండ్. తాజాగా బీచ్ వెడ్డింగ్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.విశేషం ఏమిటంటే.. ఈ పెళ్లిలో వధువు తన లహంగాను స్వయంగా తానే డిజైన్ చేసింది. ఆమె పేరే కాశీష్ అగర్వాల్. పారిశ్రామికవేత్త అసీమ్ ఛబ్రాతో థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్‌లో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్ బాగా వైరల్అవుతున్నాయి. ముఖ్యంగా వైట్ లెహంగా స్కర్ట్‌లో రాధా-కృష్ణల ప్రేమకథను పిచ్వాయ్ పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. తన పిన్ని, వృత్తిరీత్యా డిజైనర్ షాగున్ పాఠక్ సహాయంతో దీన్ని అద్భుతంగా అపురూపంగా తయారు చేసిందట కాశీష్. ఇక భారీ చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ చెవిపోగులు, చూడామణి, చేతి నిండా గాజులు, అంగుళీయంతో మెరిసిపోతున్న పెళ్లికూతురు వైపునుంచి చూపు తిప్పుకోలేకపోయారట అతిథులు వీరి లవ్స్టోరీకరోనా సమయంలో పెద్దల ద్వారా వీరి పరిచయం సాగింది. కరోనాతో తమ్ముడిని కోల్పోయిన బాధలో కాశీష్, వ్యాపార నష్టాలతో ఉన్న అసీమ్ మానసికంగా బాగా దగ్గరయ్యారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలైనప్పటికీ ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ వీర ప్రేమికులుగా మారి పోయారు. ఎట్టకేలకు పెళ్లికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. మెహందీ, సంగీత్, ఇలా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు గ్రాండ్‌గా నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కాబోయే వధూవరులను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. -
వినాయకుడే వీళ్లకు పెళ్లి పెద్ద
కర్ణాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.ఇక్కడి మూలవిరాటై్టన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. -
పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!
పెళ్లితంతులో తోడిపెళ్లి కూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా చిన్న పిల్లలను కూర్చొబెడతాం. వాళ్లు సిగ్గుపడిపోతూ..బుల్లి నవ్వులతో ఏదో సాధించిన వాళ్లలా పెట్టే వారి ముఖాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చొబెడతారనేది తెలియదు. అదీగాక ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఆచారిస్తున్నారనేది కూడా కచ్చితంగా తెలియదు. కానీ ఈ సంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!పూర్వం తోడి పెళ్లికూతురుగా వధువు స్నేహితురాలు లేదా సన్నిహిత బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పనిమనిషి ఆమెను అనుసరించేదట. అంతేగాదు ఆ కాలం పెళ్లైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తారింటిలో అడుగుపెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహయం చేసేదట. అలాగే ఒకవేళ నెలతప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడి పెళ్లికూతురు అనే సంప్రదాయం వచ్చిందని కథనం. మరొక కథనం ప్రకారం..తోడి పెళ్లికూతురుని దుష్ట శక్తులు, చెడు ఉద్దేశ్యాలు ఉన్నవాళ్లని గందరగోళ పరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక్కడ ఇరువురు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు గానీ, ఆభరణాలు, అలంకరణ హైలేట్‌గా కనిపించేది అసలైన వధువే. అంటే ఇక్కడ వధువు అందమైనదనో లేక హైలెట్‌గా కనిపించేందుకు ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు ఈ సంప్రదాయం పురాతన రోమన్ కాలం నుంచి కూడా ఉందట. ఇక పండితుల ప్రకారం..ఇది వరకు కొందరు రాజులు పెద్ద మనిషి అయిన పిల్లలను ఎత్తుకు పోయేవారట. వారే పాలకులు కావడంతో ఎదిరించడం సామాన్య ప్రజల వల్ల అయ్యేది కాదు. అందుకు పరిష్కారంగా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబతున్నారు. అంటే ఇక్కడ ..పెళ్లైన వారిని ఎవ్వరూ కన్నెత్తి చూడటం, ముట్టుకోవడం వంటివి చేసేవారు కాదు. అంతేగాదు ఈ కారణం చేతనే రజస్వల కాకముందే పెళ్లి చేయడం లేదా బాల్య వివాహాలు చేయడం అనే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. మన పెద్దవాళ్లు ఏ ఉద్దేశ్యంతో ఈ ఆచారం తీసుకొచ్చారనేది స్పష్టం కాకున్న..చిన్నారులను ఇలా తోడి పెళ్లికూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా సిద్ధం చేయడం, దీనికి తోడు పెద్దలు విసిరే ఛలోక్తులు, జోకులు భలే సరదా సరదాగా ఉంటాయి కదూ..!.(చదవండి: ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు) -
బరేలీ యువకునితో ఇంగ్లండ్ యువతి వివాహం
బరేలీ: స్వచ్ఛమైన ప్రేమకు భాష, దేశం, మతం..ఏవీ అడ్డుకాదంటారు. ఈ కోవలోకే వస్తుంది యూపీలోని బరేలీకి చెందిన యువకుడు.. ఇంగ్లండ్‌కు చెందిన యువతి మధ్య నడిచిన ప్రేమ కథ. ఇప్పుడు వారు పెళ్లి పేరుతో ఒకటి కాబోతున్నారు.బరేలీకి చెందిన చెందిన శివం మిశ్రా నగరంలోనే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాడు. తరువాత ఉద్యోగం కోసం చైనా వెళ్లాడు. అక్కడ అతనికి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లూసీ రాలింగ్తో పరిచయం ఏర్పడింది. కొద్దికాలానికే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు మతాలైనప్పటికీ ప్రేమ ముందు వారికి ఇవన్నీ చిన్నవిగా కనిపించాయి.శివం తన ప్రియురాలు లూసీతో పాటు ఇంగ్లాండ్ నుండి బరేలీకి చేరుకున్నాడు. వారు న్యాయవాది శంతను మిశ్రా సహాయంతో కోర్టులో తమ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు వీరి వివాహంపై నోటీసు జారీ చేసిన తర్వాత, ఎవరి నుంచి అభ్యంతరాలు లేనిపక్షంలో కోర్టు నుండి వీరి వివాహానికి ఆమోదం లభిస్తుంది. అనంతరం వివాహ ధృవీకరణ పత్రం జారీ అవుతుంది. -
జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు
లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి కాజల్ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్ సోనూకు ఫోన్లో చెప్పింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్ తండ్రి కూడా సోనూకు ఫోన్లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు. -
చేపల కూర, మాంసం లేదని.. పెళ్లిలో కర్రలతో దాడి!
పెళ్లి అంటే విందులో నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే. అయితే వివాహ విందులో చేపల కూర, మాసం పెట్టకపోవటంతో వరుడు తరఫు బంధవులు, వధువు తరఫులు బంధవుల మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. విందులో చేపలు మాంసం లేకపోవటంతో కోపోద్రుక్తులైన వరుడి బంధువులు.. కర్రలో వధువు తరఫు బంధువలపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకొగా.. అలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకోవడానికి అభిషేక్ శర్మ, ఆయన బంధువులు డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామానికి వచ్చారు. అయితే విందులో మాంసాహారం లేదనని.. వధువు తరఫువాళ్లు వరుడి బంధువులకు తెలియజేశారు. దీంతో పెళ్లి కొడుకు తండ్రి సురేంద్ర శర్మ, మిగతా బంధువులో కలిసి మాసం పెట్టకపోవటంపై పెళ్లికూతురు తరఫువాళ్లను దారుణంగా తిట్టారు. ఇరువర్గాల వారు చైర్లు విసిరేసుకుంటూ గొడవకు దిగారు. అక్కడి ఆగకుండా పెళ్లికూతురు ఫ్యామిలి, బంధవులపై వధువు బంధువులు పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో దాడి చేశారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడి నుంచి పెళ్లి కొడుకు వెళ్లిపోయారు. అనంతరం పెళ్లి కూతురు తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు, అతని ఫ్యామిలి తమపై తీవ్రంగా దాడి చేసి, రూ. 5 లక్షల కట్నం డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
లెహెంగాలో వధువు రాధిక మనోహరంగా, మహరాణిలా (ఫోటోలు)
-
నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!
బాల్య వివాహాల కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చిదిగిపోతున్నాయి. వయసుకు మించిన కుటుంబ బాధ్యతలతో అనారోగ్యం పాలై జీవితాలను కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని కట్టడి చేసేలా చట్టాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా భారత్‌లోని ఇంకా కొన్ని గ్రామాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే రూపా యాదవ్ అనే మహిళకు ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లైపోయింది. నిజానికి రూపా చిన్ననాటి నుంచే మంచి మెరిటి స్టూడెంట్ కావడంతో ఉన్నత చదువులు చదవాలని ఎన్నో కలలకు కంది. కానీ ఈ పెళ్లితో తన ఆశలన్నీ కల్లలైపోకుండా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అనుకున్నది సాధించింది. పైగా తన గ్రామానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది.రాజస్థాన్‌లోని కరిరి అనే చిన్న గ్రామానికి చెందిన రూపా యాదవ్ ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వివాహం అయిపోయింది. ఆమె పెదనాన్న రూపా మామాగారి ఇద్దరు కొడుకులకు తనను, ఆమె అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని వాగ్దానం చేశారు. దీంతో రూపాకి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. అయితే రూపా తండ్రికి ఆమెను బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ తన అన్న ఇచ్చిన మాట కారణంగా ఏమి చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే ఆమె చిన్నిపిల్ల కావడంతో మెచ్యూర్ అయ్యేంత వరకు పుట్టింట్లోనూ ఉండేలా పెద్దలు నిర్ణయించడంతో పదోతరగతి వరకు పుట్లింట్లో హాయిగా నిరాటకంగా చదువుకుంది. పదోతరగతిలో ఏకంగా 86 శాతం మార్కులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ గ్రామంలో ఎవరికి ఇన్ని మార్కులు రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా రూపాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. అంతేగాదు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. బాగా చదివించమని గ్రామ ప్రజలంతా రూపా తండ్రిని ప్రోత్సహించారు. ఇంతలో రూప పెద్ద మనిషి అవ్వడం అత్తారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరగడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఇక్కడితో ఆమె చదువు ఆగిపోతుందని తండ్రి బాగా దిగులు చెందాడు. అయితే రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వమని ఆమె తండ్రికి హామి ఇచ్చారు.ఆ వాగ్దానాన్ని రూపా మెట్టినిల్లు నిలబెట్టుకుంది. అప్పులు చేసి మరీ ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా చేస్తున్నందుకు సమజం నుంచి హేళనలు, అవమానాలు ఎదురయ్యేవి కూడా. అయినా వాటిని పట్టించుకోకుండా కోచింగ్ క్లాస్‌లకు పంపించి మరి మంచి చదువులు చదివించారు. అలా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో చేరి చదువుకుంటూ నీట్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అయ్యింది. ఆమె ఫీజుల కోసం రూపా భర్త, బావగారు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చేది కూడా. అంతలా రూపాకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సహం లభించింది. వారి ప్రోత్సహానికి తగ్గట్టుగానే రూపా బాగా చదివి నీట్లో పాసై బికినీర్‌లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందింది. అలా తన తన అత్తమామలు, భర్త, బావగారి సాయంతో డాక్టర్ అవ్వాలనే కలను సాకారం చేసుకుంది. ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సును ఆ కళాశాలలో సాగిస్తుండగా..రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఇంటి వచ్చాక మూడో ఏడాది ఫైనల్ పరీక్షల టైంలో ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆమె ఇంకా రెండేళ్ల చదువు సాగించాల్సి ఉంది. అయినా ఆమె చదువుని, మాతృత్వాన్ని రెండింటిని వదులుకోకుడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఫైనలియర్ పరీక్షల టైంలో రూపా కుమార్తె వయసు కేవలం 25 రోజులు. అలానే బాలింతరాలిగా కాలేజ్‌కి వచ్చి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యింది. తన కూతురు పుట్టిన రోజున శస్త్ర చికిత్సకు సంబంధించిన చివరి పరీక్ష..మూడు గంటల్లో పరీక్ష రాసి వచ్చి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకుంది రూపా. ఎక్కడ అటు కుటుంబ బాధ్యతలను, కెరీర్ పరంగా తన చదవుకి ఆటంకం రానివ్వకుండా రెండింటిని చాలచక్యంగా బ్యాలెన్స్ చేసింది. అలా ఆమె 2022లో సర్టిఫైడ్ డాక్టర్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సన్నద్దమవుతూనే డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుంది. ఈ మేరకు రూపా మాట్లాడుతూ..మనం కోరుకున్నది చేయాలి అనుకుంటే ఎలాంటి స్థితిలోనూ వదిలిపెట్టని పట్టుదల ఉంటే అనుకున్నది సాకారం చేసుకోగలరు. అంతేగాదు ఆ పట్టుదలే ఆ ఆటంకాలు, అవాంతరాలని పక్కకు పోయేలా చేస్తుంది అని చెబుతోంది రూపా యాదవ్. చివరిగా ఎవ్వరికీ ఏది కష్టం కాదని, ప్రతిఒక్కరూ అన్ని సాధించగలరని అందుకు తానే ఓ ఉదాహరణ అని అంటోంది రూపా. రియల్లీ రూపా గ్రేట్ కదూ.! తన కలను సాకారం చేసుకుంది, అలాగే తన అత్తమామలకు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తెచ్చుకుంది.(చదవండి: సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్! కోచింగ్ లేకుండా తొలి..) -
తాళికట్టే సమయంలో ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు
-
స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడీ, బంధువుల సందడి.. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాకుండా.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక. అయితే కాలం మారుతున్న కొద్దీ పెళ్లి పద్దత్తుల్లోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య పెళ్లికి ముందే ఫోటో, వీడియో షూట్లు చేసుకోవడం ఎక్కువైపోయింది. పెళ్లిలో తాళి కట్టే సమయంలోనూ వరుడు, వధువు నుదుటిపై ముద్దు పెట్టిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన విధంగా, జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు.పాపం ఇలాగే ఆలోచించిన ఓ పెళ్లికొడుకు వేదిపైనే ఏకంగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది వరుడి చర్య ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో హాపూర్‌లో చోటుచేసుకుంది. అశోక్ నగర్లో శనివారం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. మొదటి పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా పాఫీగా జరిగింది. అయితే రెండో కూతురు పెళ్లి మాత్రం గందరగోళంగా మారింది. తాళి కట్టిన తరువాత ఇద్దరు దండలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా వరుడు, వధువుకు ముద్దులు పెట్టాడు. ఎలాగో భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇది చూసిన వేదికపై ఉన్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో వివాహ వేదిక రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరడంతో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వరుడు వధువును వేదికపై బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా.. వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని వధువే పట్టుబట్టిందని వరుడు చెప్పాడు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. -
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
వార్తా పత్రికల్లో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటనలను చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రకటన గురించి గతంలో ఎప్పుడూ వినివుండం. ఒక జంట 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు వరుణ్ణి వెదుతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లాలో 30 ఏళ్ల క్రితం మృతిచెందిన ఓ పసికందు (ఇప్పుడు యువతి అయి ఉండేది) కోసం తగిన వరుడిని వెతుకుతున్నట్లు ఇటీవల ఒక వార్తాపత్రిలో ప్రకటన వెలువడింది. పుత్తూరుకు చెందిన ఒక కుటుంబం ఈ ప్రకటన ఇచ్చింది. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు ఎలాగైనా వివాహం చేయాలని ఆ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారు. తమ కుమార్తె అవివాహితగా మృతి చెందిన కారణంగా తమను దురదృష్టం వెంటాడుతున్నదని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.30 ఏళ్ల క్రితం ఆ దంపతుల కుమార్తె పసికందుగా ఉన్నప్పుడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పటి నుండి వారికి కష్టాలు ఎదురవుతున్నాయట. తమ కుమార్తె వివాహం కాకుండా మృతి చెందడమే తమ కష్టాలకు కారణమని ఆ కుటుంబ నమ్ముతోంది. దీంతో తమ కుమార్తె ఆత్మకు శాంతి కలిగింపజేయాలనే భావనతో ఆ కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.‘30 ఏళ్ల క్రితం మరణించిన యువతికి.. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వరుడు కావలెను. దయచేసి ఇటువంటి వరుడు కలిగిన వారు ఇరు ఆత్మల వివాహానికి సహకరించండి. ఇందుకోసం ఫలానా నంబరుకు ఫోన్ చేయండి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఎంతగా ప్రయత్నించినా అటువంటి వరుడు దొరకడం లేదని, అందుకే ఈ ప్రకటన ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. -
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్‌ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. -
‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్ గురించే!
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన. "ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. #WATCH | Lok Sabha elections 2024 | Congress candidate from Bastar (Chhattisgarh), Kawasi Lakhma says, "I am not contesting the elections, Congress party will contest the elections...Why did I get a ticket? I had not asked for one...If it is being insisted, give the ticket to my… pic.twitter.com/WSPUJ17I9O — ANI (@ANI) March 28, 2024 -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్‌గఢ్‌లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’
దేశంలోని చాలా ప్రాంతాల్లో హోరెత్తించే పాటలకు నృత్యాలు లేకుండా వివాహాలు పూర్తికావు. పెళ్లిలో వధువు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక పెళ్లి కూతురే స్వయంగా నృత్యం చేస్తే, అతిథుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటువంటి సమయంలో తమ ఇంటి అమ్మాయి వేరొకరి ఇంటికి వెళ్లిపోతున్నదనే బాధ ఆడపిల్ల తరపువారి ముఖాల్లో కనిపిస్తుంది. పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వధువు తన హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె, ఆమె తల్లి కూడా రోదిస్తుంటారు. అలా ఏడుస్తూనే పెళ్లికుమార్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. దేశిమోజిటో అనే పేరుతో సోషల్‌మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వధువు డాన్స్ చేస్తూవుంటుంది. అక్కడే ఉన్న ఆమె బంధువులు ఆమె నృత్యాన్ని చూస్తుంటారు. ఇంతలో పెళ్లి కుమార్తె భావోద్వేగానికి లోనవుతోంది. కన్నీళ్లను నియంత్రించుకోలేకపోతుంది. పక్కనేవున్న తల్లి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతటి భావోద్వేగాల మధ్య కూడా వధువు ఆపకుండా తన నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ వీడియోకు 3.5 లక్షలకుపైగా వ్యూస్ దక్కాయి. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి డ్రామాలు పెరిగిపోయాయని, అందుకే ఈ రోజుల్లో సినిమాలు ఆడడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది బాలీవుడ్ అందించిన బహుమతి అని మరొక యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు.. Performance nahi rukni chahiye pic.twitter.com/JxNEEbbP4U — desi mojito 🇮🇳 (@desimojito) December 7, 2023 -
రూ. 8 కోట్ల వెడ్డింగ్ కేక్..ముత్యాలు, డైమండ్లు.. ఇంకా..!
వెడ్డింగ్ కేక్‌లు ఇపుడు పెళ్లిళ్లలో చాలా కామన్. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. బర్త్‌డే కేక్, ఎంగేజ్మెంట్ కేక్- వెడ్డింగ్ కేక్‌ల నోరూరించే రుచితో సందర్భానికి తగ్గట్టుగా అనేక డిజైన్లలో కేక్‌లు తయారు చేయడం ఆనవాయితీ. అలాగే దాని డిజైన్, వెయిట్, ఫ్లేవర్ఆధారంగా ధర ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్ చూశారా. దీనికి ఖరీదు 8 కోట్ల రూపాయలకంటే ఎక్కువే. అరబ్ వధువు ఆకారంలో ఉన్న కేక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. లైఫ్ సైజ్ అరబ్ బ్రైడల్ కేక్ దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్, బృందం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌ను తయారు చేశారు. దుబాయ్ వధువు ఆకారంలో దీన్ని రూపొందించడం ఒక ఎత్తయితే ఎడిబుల్ ముత్యాలు, డైమండ్స్‌తో తయారు చేయడం మరో ఎత్తు. అరబ్ బ్రైడల్ కేక్ 182 సెం.మీ ఎత్తు, 120 కిలోల బరువు కలిగి ఉంది. కేక్ తయారీకి పది రోజుల సమయం పట్టింది. దుబాయ్‌లోని రాఫెల్స్ హోటల్లో 1,000 గుడ్లు , 20 కిలోల చాక్లెట్‌తో కేక్‌ను తయారు చేశారు. కేక్‌లో 50 కిలోల లాసీ మిఠాయి వివరాలు, తినదగిన 3-క్యారెట్ వజ్రాలు ,ముత్యాలు కూడా ఉన్నాయి. కేక్‌లో పొదిగిన ప్రతి వజ్రం మిలియన్ల కంటే ఎక్కువ విలువైనదట అందుకే ఈ కేక్ ధర అంత పలికింది. రైస్ క్రిస్పీ ,మోడలింగ్ చాక్లెట్‌తో దీన్ని రూపొందించారు.దీనికి అదనంగా20 కిలోల బెల్జియన్ చాక్లెట్లను కూడా ఉపయోగించారు. 50 కిలోల కేక్ ఫాండెంట్, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్ పువ్వులతోఘీ వెడ్డింగ్ గౌన్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. View this post on Instagram A post shared by Couture Sugarpaste (@couturesugarpaste) -
పెళ్లికూతురు మిస్సింగ్, తండ్రి ఆత్మహత్య
మైసూరు: బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. కొన్ని గంటలు గడిస్తే తలంబ్రాల వేడుక. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వధువు తండ్రి చెవిన పడింది. పెళ్లికూతురు ప్రియునితో వెళ్లిపోయింది, ఇది తట్టుకోలేక ఆవేదనతో ఆమె తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని హొరదహళ్లి గ్రామంలో జరిగింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. పుట్టేగౌడ (55) కుమార్తె అయిన సుచిత్రకు ఈ నెల 18, 19వ తేదీన గుండ్లుపేటెలోని రామమందిరంలో పెళ్లి నిశ్చయించారు. కానీ ఈ నెల 17వ తేదీన సుచిత్ర తన ప్రియునితో వెళ్లిపోయింది. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. ఈ అవమానభారాన్ని పుట్టేగౌడ తట్టుకోలేకపోయాడు. శనివారం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. తరకనాంబి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు వరుస విషాదాలతో కన్నీటి సంద్రమైంది. -
Vadhuvu OTT Web Series: అప్పుడు చిన్నారి పెళ్లి కూతురు.. ఇప్పుడేమో వధువుగా!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌లో ఓటీటీ అభిమానులను అలరించేందుకు వస్తోంది. హోయ్‌చాయ్ ఓటీటీలో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేశారు. వధువు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్‌లో అవికా గోర్, అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జేడీ చక్రవర్తి నటించిన దయా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తోన్న వధువు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో వధువు వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
20 ఏళ్లు వెదికినా తగిన జోడీ దొరకలేదని..
బ్రిటన్‌కు చెందిన సారా విల్కిన్సన్ (42) అనే మహిళ సరైన భాగస్వామి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో, ఇక మరోమార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టో నివాసి సారా ఇటీవల హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిన్నప్పటి నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలుగనేదానినని, ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకున్నానని సారా మీడియాకు తెలిపింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం సారా వివాహం ముఖ్యాంశాలలో నిలిచింది. అయితే అధికారికంగా ఈ పెళ్లికి గుర్తింపు దక్కలేదు. సారా తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన వివాహ వేదికను సిద్ధం చేసుకుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ల మాదిరిగానే డెకరేషన్ నుంచి ఫుడ్, డ్రింక్స్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు సారా తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. తన పెళ్లి ఖర్చుల కోసం సారా చాలా ఏళ్లుగా పొదుపు చేస్తూ, డబ్బులు దాచింది. ఈ వివాహానికి సారా విల్కిన్సన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా పెళ్లి వేడుకలో స్నేహితులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉందని కేథరీన్ చెప్పింది. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని తెలిపింది. ఇది కూడా చదవండి: నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ. 914 కోట్లు!
భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా చేశారు. ఇది అత్యంత ఖరీదైన వివాహంలో ఒకటిగా నిలిచింది కూడా. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహల్లో నెంబర్‌వన్ మాత్రం కాదట. ఆ స్థానం ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ డయాన వివాహమే ఉంది. వారి వివాహమే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఔను! ఇది నిజం. ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీని పిరమల్ గ్రూప్ అధినేత ఆనంద్ పిరమల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. దానికి అయ్యిన ఖర్చు ఏకంగా రూ. 400 కోట్లు. దీన్ని చూసి మనం నోరెళ్లబెటం కానీ ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా వివాహ ఖర్చు దాదాపు రూ. 914 కోట్లు పైనే అయ్యిందట. అత్యధిక మంది వీక్షించిన వివాహ ఈవెంట్లలో ఇది ఒకటిగా నిలిచింది కూడా. అంతేగాదు ప్రిన్సెస్ డయానా ధరించి దుస్తులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డయనా డ్రస్‌ను ప్రముఖ డిజైనర్లు మాజీ భార్యభర్తలు డేవిడ్, ఎలిజబెత్ ఇమాన్యుయెల్ రూపొందించారు. ఈ డ్రస్ ఖరీదు దాదాపు రూ. 4.1 కోట్లు. ఈ జంట పెళ్లి రోజున ఏకంగా మూడు వేల ఖరీదైన బహుమతులు అందుకున్నారు కూడా. వాటిలో ఎక్కువగా ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, పాత్రలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ప్రిన్స్ చార్లెస్ ప్రిన్సెస్ డయానా వివాహమే రికార్డులు నెలకొల్పగా, అత్యంత ఖరీదైన వివాహ డ్రస్ ధరించని వధువుగా రికార్డు ఇషా అంబానీకే దక్కుతుంది. ఎందుకంటే ఇషా అంబానీ ఏకంగా ఏకంగా రూ. 90 కోట్ల విలువైన గోల్డెన్ అండ్ రెడ్ లెహెంగా ధరించారు. కాగా, ప్రిన్స్ చార్లెస్, డయానాల వివాహానికి దాదాపు 250 మంది సంగీతకారుల లైవ్ మ్యూజిక్ అందించగా, ఈ వేడుకకు దాదాపు 1400 మంది అతిరథులు హాజరయ్యారు. విషాదం ఏంటంటే ఈ జంట చివరికి విడాకులు తీసుకున్నారు. పైగా కొద్ది సంవత్సరాల్లోనే యువరాణి డయనా ఒక విషాద కారు ప్రమాదంలో మరణించారు. ఏదీ ఏమైనా ఇంప్పటికీ ఆ జంట పేరు మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు ఉండటం విశేషం. (చదవండి: అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్‌గా 'మమ్మీలా'...) -
పెళ్లినాటి ప్రమాణాలు
‘పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లయిన మరుసటి రోజే కనిపించవు’ అనే చమత్కారం మాట ఎలా ఉన్నా నవ వధువు సుచీత ముఖర్జీ మాత్రం పెళ్లినాటి ప్రమాణాల విషయంలో పక్కాగా ఉంది. పెళ్లిమండపంలో ఆహ్వానితుల సమక్షంలో చాంతాడంత పొడవు ఉన్న పెళ్లి ప్రమాణాల లిస్ట్ చదవడం మొదలు పెట్టింది. ‘ఇవి నెరవేర్చడం అంత సులువేమీ కాదు’ అని చదవడం మొదలు పెట్టింది. అవి విని పెళ్లికి వచ్చిన వాళ్లు నవ్వులే నవ్వులు. చివరికి వరుడు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 17.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘ఈ వీడియో సరదాగా చేశారో, సీరియస్‌గా చేశారో తెలియదుగానీ పెళ్లి మండపంలో ఇలా చదవడం ఒక ట్రెండ్‌గా మారనుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్
ఇటీవల యువత వివాహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి వివాహ తంతు వరకు ఏదో ఒక విషయంలో వినూత్న రీతిలో ప్రత్యేకత చూపిస్తున్నారు. అవన్నీ అదరహో అనేలా ఉంటున్నాయి. అబ్బా! ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేంతగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి ఆ డిఫరెంట్ ఐడియాలు. ఇక్కడ కూడా ఓ జంటా అలానే చేసి బంధువులంతా వావ్! అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఓ జంట కళ్యాణ మండపానికి ఇచ్చిన ఎంట్రీ ఓ రేంజ్లో ఉంది. అక్కడ ఉన్నవాళ్లంతా వధువుని అలా చూసి స్టన్ అయిపోయారు. ఆ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఓ మహారాణి మాదిరిగానే వచ్చింది. కాకపోతే కొంచెం డిఫెరెట్గా వచ్చింది. మాములుగా రాణుల వచ్చేటప్పడూ వెనక వైపు పొడుగుగా ఉండే క్లాత్‌ని సేవకులు మోస్తు తీసుకొస్తారు. ఔనా! కానీ ఇక్కడ బెలూన్ల సాయంతో ఆ క్లాత్‌ని పైకెత్తించి తీసుకువచ్చారు. ఆ వధువు స్టయిలిష్‌గా అలా వరుడు చేతిలే చేయి వేసి వస్తుంటే..బంధువలంతా నోరెళ్లబెట్టి..చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) View this post on Instagram A post shared by Surrey Memes 🇨🇦 (@thesurreymemes) -
పెండ్లి బట్టలతో పరీక్ష రాసిన నవ వధువు
కర్ణాటక: ప్రేమించిన యువకున్ని పెళ్లి చేసుకున్న వెంటనే వధువు పరీక్షకు హాజరైంది. ఈ సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. భర్మప్ప నగరకు చెందిన సత్యవతి ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది, చెన్నైకి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకునితో ఆమెకు రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమ చిగురించింది. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి సోమవారం ఉదయం ఊళ్లోనే పెళ్ళి చేసుకున్నారు. వధువుకు బీఏ చివరి ఏడాది పరీక్ష ఉండడంతో తాళి కట్టడం పూర్తి కాగానే భర్తతో కలిసి బైక్‌పై కాలేజీకి చేరుకుని పరీక్ష రాసింది. తరువాత పెళ్లి మండపానికి చేరుకుని మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేసింది. -
హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా?
హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. నిజానికి ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. పురాతన గ్రంథాలలో హిజ్రాలను యక్షులు, గంధర్వులతో సమానంగా పరిగణించారు. మహాభారతం నుండి యక్ష పురాణం వరకు శిఖండి, మోహిని లాంటి పాత్రలు కనిపిస్తాయి. అయితే మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది. ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు. జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్‌ను వివాహం చేసుకుంటాడు. అరవన్ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు. ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్‌ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్‌ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు. ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు. హిజ్రాల పరిస్థితి భారత్‌లోనే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో కూడా దారుణంగా ఉంది. స్త్రీల వేషధారణలో ఉంటూ, వారు సమాజానికి దూరంగా ఉంటున్నారు. పలు పాశ్చాత్య దేశాలలో హిజ్రాలు సామాన్య ప్రజల మధ్యనే ఉంటారు. వారు కూడా వివాహం చేసుకుని బిడ్డను దత్తత తీసుకుంటుంటారు. ఛాందసవాద సమాజం వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తుంటాయ. ఇది కూడా చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
ఖబ్రస్థాన్‌కు దారేది..?!
ఆదిలాబాద్: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మండలంలోని గూడ గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన షేక్ అజీజ్ మరణించగా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఖబ్రస్థాన్‌కు వెళ్లే దారిలో వాగు ఉండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా దాటి వెళ్లారు. ఏళ్లు గడిచినా గ్రామంలో కనీస సౌకర్యాలు కానరావడం లేదని, అంత్యక్రియలకు సైతం అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. -
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్‌కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
తగ్గుతున్న జనాభా.. చైనా కీలక నిర్ణయం..
చైనాలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ యుక్తవయస్సు వారు తగ్గిపోతున్నారు. యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమే దీనికి కారణం అని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు వయస్సు 25 ఏళ్లు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతోనైనా యువత త్వరగా పెళ్లి చేసుకుని జననాల సంఖ్యను పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది. సరైన వయస్సులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుక వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు ఘణనీయంగా తగ్గిపోతోంది. వృద్దుల సంఖ్య పెరుగుదలతో ఆందోళన చెందుతున్న అధికారులు.. జననాల సంఖ్యను పెంచడానికి అనేక చర్యలను తీసుకుంటున్నారు. చైనాలో సాధారణంగా పెళ్లికి కనీస వయ్సస్సు అబ్బాయికి 22, అమ్మాయికి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థికపరమైన చిక్కులతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. 2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 కంటే 2022లో 8 లక్షల వివాహాలు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా చేరుకుంది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది. ఇదీ చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు.. ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి.. -
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని.. రాత్రి పొలంలోకి వెళ్లి
మైసూరు(బెంగళూరు): సాధారణంగా మనం దుస్తులు షాపింగ్ అంటేనే గంటల తరబడి సమయం తీసుకుంటుంటాం, అలాంటిది జీవితాంతం ఒకరితో కలిసుండాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఫాస్ట్ యుగంలో అంతా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇటీవల కొన్ని వివాహాలు పీటల వరకు వచ్చి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడమే అందుకు ఉదాహరణ. తాజాగా వక్కతోటను దుండగులు ధ్వంసం చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మనుగనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మూడు ఎకరాల్లో అల్లం, ఒక్కచెట్లు సాగు చేశాడు. ఈ క్రమంలో అతను నాటిన 850 మొక్కలను పెరికివేశారు. ఇదిలా ఉంటే బాధిత రైతు తన కుమార్తెను అశోక్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. అయితే అదే గ్రామానికి చెందిన అశోక్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాత్రి సమయంలో అశోక్ వక్కచెట్లను పెరికివేయించినట్లు బాధిత రైతు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: అమెరికాలో మోదీకి పాదాభివందనం.. ఇప్పుడు మణిపూర్‌పై కీలక వ్యాఖ్యలు -
''అంత తొందరేంటో''? వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు
డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకోకపోవడం గ్రేట్ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
భర్త ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా డోర్ తీయలేదు.. లోపల వెళ్లి చూస్తే
చిలకలగూడ(హైదరాబాద్): కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ మట్టంరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ ఖానాపూర్‌కు చెందిన విజయకుమార్ నగరంలోని స్టాఫ్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన నందిని (23)తో నెలన్నర క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు చిలకలగూడ ఠాణా పరిధిలోని పద్మారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆషాఢమాస నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన నందిని ఈనెల 22న పద్మారావునగర్‌కు తిరిగి వచ్చింది. ఈనెల 26న రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లిన విజయకుమార్ గురువారం ఉదయం ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా నందిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తమ కుమార్తె కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతుందని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి Tomato Truck Over Turned: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! -
బిగ్ అలర్ట్..ముసారాంబాగ్ బ్రిడ్జ్
-
పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..? -
భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా చేసే ఓ వేడుక. జీవితంలో ఇదొక మధురమైన జ్ఞాపకంగా కూడా భావిస్తుంటాం. అంతటి ప్రాముఖ్యం ఉంది గనుకే ప్రజలు వివాహాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే కొందరు మాత్రం ఈ వివాహ బంధాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడ్డదారులు తొక్కడమే కాకుండా ఎంతటి దారుణాలకైన పాల్పడేందుకు వెనకాడడం లేదు. తాజాగా, జమ్మూకాశ్మీర్‌లో ఓ కిలాడీ డబ్బుల కోసం ఏకంగా ఒకరు ఇద్దరు కాదు 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది. స్కెచ్ వేసిందిలా వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం. దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా.. కాస్త అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం.. పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడం. ఇలా ఆ కిలేడి ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు రావడంతో ఈ బండారం మోత్తం బయటపడింది. 27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి.. డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసిన వారు రకరకాలుగా అనుకుంటున్నారు. చదవండి స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వస్తూ.. -
పెళ్లి రోజు నుంచి ప్రియుడితో వీడియో కాల్.. భర్త ఇంట్లోకి వచ్చి చూసేసరికి షాక్!
బెంగళూరు: ఇష్టం లేని పెళ్లి చేయడంతో నవ వధువు తన భర్త ఇంటిలోని నగలు తీసుకొని ప్రియుడితో ఉడాయించిం ది. ఈ ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలకా ఉల్లరు–74 గ్రామంలో జరిగింది. కుందాపుర వడేరహోబళికి చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే పెద్దలు ఆమెకు ఉళ్లరుకు చెందిన యువకుడితో ఈ ఏడాది మే 21న వివాహం చేశారు. పెళ్లి జరిగిన రోజు నుంచి ఆమె ప్రియుడితో వీడియో కాల్లో మాట్లాడేది. పద్ధతి మార్చుకోవాలని పుట్టింటివారు, మెట్టింటివారు చెప్పినా పెడచెవిన పెట్టేది. ఈక్రమంలో జూన్ 16న భర్త ఇంటికి వచ్చి చూడగా షాక్ తిన్నాడు. ఆమెతో పాటు ఇంట్లో ఉన్న రూ.10 లక్షల విలువైన బంగారు అభరణాలు కనిపించలేదు. దీంతో సొమ్మును దోచుకుని ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకున్న భర్త.. ఈ ఘటనపై బాధితులు ఈనెల 12న శంకరనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: కన్న కూతురిపై తల్లి కర్కశం.. బిడ్డ గొంతునులిమి, భర్తకి ఫోన్ చేసి! -
భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది!
పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్లైన్ లింక్‌ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఆన్లైన్ వెడ్డింగ్‌లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్లైన్లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. -
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
భర్త, అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు కవిత ఆత్మహత్య
-
హనీమూన్‌లో భర్తకు షాక్: సినిమా మధ్యలో భార్య పరార్!
పోలీస్ స్టేషన్‌కు పరుగుపరుగున వచ్చిన ఒక యువకుడు తనకు ఇటీవలే పెళ్లయ్యిందని, తన భార్య సినిమాహాల్లో తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించేంతలోనే ఆ యువకుని భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన వాదన వినిపించింది. దీంతో ఆ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఇంటర్వెల్ సమయంలో.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక భర్త తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలిద్దలం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లామని, ఇంటర్వెల్ సమయంలో తన భార్య కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లానని, తిరిగి వచ్చిచూసేసరికి ఆమె కనిపించలేదని తెలిపాడు. హనీమూన్‌కు వచ్చి.. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు అతని భార్య గురించి గాలింపు చేపట్టేంతలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను వదిలేసి బయటకు వచ్చేశానని తెలిపింది. వివరాల్లోకి వెళితే సీకర్‌కు చెందిన ఒక యువకుడు పెళ్లయిన 7 రోజుల తరువాత తన భార్యతో పాటు హనీమూన్ కోసం జైపూర్ వచ్చాడు. వారు ఒక హోటల్లో బసచేశారు. పింక్ స్క్యేర్ మాల్లో అతను భార్యలో పాటు సినిమా చూసేందుకు ప్లాన్ చేశాడు. మధ్యాహ్నం 12 గంటల షో చూసేందుకు టిక్కెట్లు బుక్ చేశాడు. తినుబండారాలు కొనుగోలు చేసి వచ్చేంతలో.. అనంతరం ఇద్దరూ ఆనందంగా సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా మధ్యలో అంటే 1:30కి ఇంటర్వెల్ సమయంలో భర్త తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడు. అతను తిరిగివచ్చి చూసే సరికి భార్య ఆ సీటులో కనిపించలేదు. వెంటనే అతను థియేటర్‌తో పాటు మాల్ అంతటా వెదికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. షాక్ అయిన పోలీసులు.. భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, భార్య మాయమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమా హాలు నుంచి పరారైన ఆమె కొద్ది సేపటికి జైపూర్‌లోని షాహ్పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని, అందుకే థియేటర్లో భర్తను విడిచిపెట్టి వచ్చేశానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ విషయాన్ని ఫోనులో ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు ఆమెకు వివాహం విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లయిన 7 రోజులకే కొత్త జంట ఇలా విడిపోవడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఇది కూడా చదవండి: కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు? -
ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది..
-
పందిట్లోనే పెళ్ళికొడుకు పరువు తీసిన పెళ్లికూతురు
-
ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్!
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక ఇంటిలోని ఇద్దరు అమ్మాయిలకు ఒకే మూహూర్తానికి పెళ్లి నిశ్చయమయ్యింది. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపు వారు ఊరేగింపుగా వధువుల ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరు వరులను ఆహ్వానిస్తూ వధువులు వారికి పూల దండలు వేశారు. అయితే ఒక వరుని తరపువారితో వధువు తరపు వారికి ఏదో విషయమై వివాదం తెలెత్తింది. దీంతో చివరకు రెండు వివాహాలు జరగాల్సిన చోట ఒక వివాహమే జరిగింది. ఈ ఘటన ఫిరోజాబాద్‌లోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం జస్రానా గ్రామానికి చెందిన రాధేశ్యామ్ రాజ్‌పూత్ ఒకే ముహూర్తానికి తన ఇద్దరు కుమార్తెలకు వివాహం తలపెట్టారు. వివాహ వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరపువారు సోమవారం రాత్రి కల్యాణ మండపానికి చేరుకున్నారు. డాన్స్ చేయడంపై వివాదం వధువులిద్దరూ తమతమ వరులకు పూల దండలు వేసి ఆహ్వానించారు. తరువాత రాయపూర్ నుంచి వచ్చిన మగపెళ్లివారికి, వధువు తరపు వారికి డాన్స్ చేయడం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఇది ఇరు పక్షాల వారు పరస్పరం కొట్టుకునేంతవరకూ దారితీసింది. దీంతో ఒక వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది. వరుని తరపు వారు తమవారిపై చేయిచేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని.. అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. పోలీసుల జోక్యంతో.. ఈ వివాదం పోలీసుల వరకూ చేరింది. జస్రానా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకుని, ఇరుపక్షాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వధువు తరపువారికి ఎంతనచ్చజెప్పినా వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రాయ్‌పూర్ నుంచి వచ్చిన వరుడు పెళ్లి కాకుండానే తన కుటుంబ సభ్యులు, బంధువులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ వివాదం ముగిసిన తరువాత రాధేశ్యామ్ రాజ్‌పూత్ తన మరో కుమార్తెకు వివాహం జరిపించాడు. ఇది కూడా చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి.. ₹2000 దొంగనోట్లు ముద్రించి.. -
పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Candid Impressions🧿📸 (@candid_impressions) చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే -
వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘ప్రేమికుడే ఈ పని చేశాడు’ ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే! -
వరుడి మొబైల్‌కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్‌లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
లింగంపేట: లింగంపేటకు చెందిన నర్వ సవిత (36) తన కూతురు పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన నర్వ ఆశయ్య, సవిత దంపతులకు కూతురు చందన, కుమారుడు చరణ్ ఉన్నారు. చందనకు 3 నెలల క్రితం సమీప బంధువుతో పెళ్లి కాయం చేసుకున్నారు. సదరు యువకుడు కొద్ది రోజుల క్రితం మరో అమ్మాయిని తీసుకొని గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దాంతో అప్పటి నుంచి తన కూతురు వివాహం విషయంతో తరుచూ బాధపడేవారు. ఈ క్రమంలో సవిత ఈ నెల 15న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాదు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త ఆశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరగదని యువతి.. బిచ్కుంద: ప్రేమించిన యువకుడితో పెళ్లి జరగదని ఓ యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బిచ్కుందలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన దివ్యశ్రీ (21) శాంతాపూర్ గ్రామానికి చెందిన దత్తును ప్రేమించింది. ఆ యువకుడు ఆమెకు అన్నయ్య వరుస కావడంతో మరిచిపోవాలని దివ్యశ్రీ తల్లి సూచించింది. దీంతో ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరగదని మనస్తాపం చెందిన దివ్యశ్రీ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు.. బిచ్కుంద: మండలంలోని ఫత్లాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ సాయిలు (30) జీవితంపై విరక్తి చెంది శనివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సాయిలు కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఉపాధి దొరకక ఆర్ధిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. కుటుంబ కలహాలతో ఒకరు.. గాంధారి: కుటుంబ కలహాలతో మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కాముని మైశయ్య(40) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణేష్ తెలిపారు. వివరాలు.. మైశయ్య 2012లో బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బులు ఎప్పటికప్పుడు భార్య యశోదకు పంపించాడు. అయితే నెల క్రితం మైశయ్య గ్రామానికి తిరిగి వచ్చాడు. కొత్త ఇల్లు నిర్మించుకుందామని, ఇప్పటి వరకు పంపించిన డబ్బులు లెక్క చెప్పాలని భార్యను అడిగాడు. తరువాత చెపుతానంటు భర్తకు నచ్చచెపుతూ వస్తుంది. అయితే శుక్రవారం రాత్రి డబ్బుల విషయంలో భార్య భర్తతు గొడవ పడ్డారు. మైశయ్య భార్యను కొట్టాడు. తరువాత ఇద్దరు వరండాలో పడుకున్నారు. రాత్రి 1.30 ప్రాంతంలో మైశయ్య చిన్న కొడుకు సోమ్దాస్ సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చి చూసే సరికి మైశయ్య గదిలో దూలానికి వేలాడుతు కనిపించాడు. యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పేర్కొన్నారు. కాగా మైశయ్య మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మటన్ కర్రీ కోసం వరుడి గొడవ.. పెళ్లిని రద్దు చేసిన వధువు..
ఒడిశా:మటన్ కర్రీపై గొడవ కారణంగా పెళ్లిని రద్దు చేసింది ఓ వధువు. వరుడు అతని స్నేహితులు మటన్ కోసం తన కుటుంబంపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా వధువు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది. స్థానిక వివరాల ప్రకారం.. అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూలు, పందిళ్లు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. రుచికరమైన వంటకాలు వడ్డించారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెట్టారు. పెళ్లి అయ్యాక రాత్రిలో వరుడి స్నేహితులు ఆరుగులు భోజనాలకు వచ్చారు. అప్పటికే మటన్ కర్రీ అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంపై వాగ్వాదానికి దిగారు. మటన్ కూర పెట్టాల్సిందేనని వధువు తండ్రిని అవమానించారు. వరుడు కూడా అతని స్నేహితులకు వంత పాడాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. అయితే.. వరుడు జాతీయ స్థాయి బ్యాంకులో పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. 'పెళ్లి అంతా బాగానే అయింది. మటన్‌తో పాటు అన్ని వంటకాలు అందరికీ సరిపోయాయి. చివరగా వచ్చిన ఓ ఆరుగురికి మాత్రం సరిపోలేదు. రాత్రి అయినందున వడ్డించలేకపోయాము. పెళ్లికొడుకుతో సహా అతని స్నేహితులు మా కుటుంబాన్ని అవమానించారు. నాన్నపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించలేనివారితో నేను ఎలా భద్రతను పొందగలను?' అని వధువు అంటోంది. ఇదీ చదవండి:యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి -
పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి
సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూసిన ఘటన .కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోదలకు ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26). ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నమగ్నమైన తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్న తిరుపతిని కుటుంబ సభ్యులు కాగజ్‌గనర్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల వద్ద మృతదేహం పెట్టాల్సి రావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వధువు మాయమయ్యింది. విషయం తెలుసుకున్న వధువు తండ్రి నిర్ఘాంతపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని ఆయన చేసిన పనికి అక్కడున్నవారంతా అతనిని అభినందనలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బాందాలోని ఒక ఇంటిలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వధువు తన ప్రియునితో పరారయ్యింది. విషయం తెలియగానే వధువు తండ్రితో పాటు పెళ్లికి హాజరైనవారంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే వధువు తండ్రి తన చిన్న కుమార్తెను అదే వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తన పెద్ద కుమార్తెను తీసుకువెళ్లిపోయిన యువకునిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం తిద్వారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె వివాహం జూన్ 8న నిశ్చయించామన్నాడు. కన్నౌజ్ జిల్లా నుంచి మగపెళ్లివారు వచ్చారన్నారు. ఇంతలో గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కుమార్తెను తీసుకువెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు.అతనిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరాడు. పెద్ద కుమార్తె వెళ్లిపోయిందని, చిన్న కుమార్తెతో.. మగపెళ్లివారు కల్యాణమండపానికి చేరుకున్నంతలో వధువు తన ప్రియునితో పరారైన విషయం అక్కడున్నవారందరికీ తెలిసింది. వెంటనే వధువు తండ్రి తన చిన్న కుమార్తెతో ఈ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని చిన్న కుమార్తె, వరునితో పాటు అతని తరపువారంతా సమ్మతించారు. దీంతో వివాహ వేడుక యధావిధిగా జరిగింది. పోలీసులు ఏమన్నారంటే.. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక యువతిని ఒక యువకుడు తీసుకుని వెళ్లిపోయాడంటూ ఫిర్యాదు అందింది. ఆ యువతి తండ్రి దీనిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ యవతీ యువకులను వెదికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందూ యువకుని ముస్లిం ‘వ్యవహారం’ -
సత్తుపల్లి అమ్మాయి..అమెరికా అబ్బాయి
-
వరుడు రంగు తక్కువగా ఉన్నాడని...
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక పెళ్లి కుమార్తె తనకు కాబోయే భర్తలోని ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇదెక్కడి గోలరా అనుకుంటూ అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు వివాహ వేదికపైకి వచ్చింది. అతనిని పరిశీలనగా చూసి పూల దండ వేసేందుకు నిరాకరించింది. వధువు నిర్ణయాన్ని విన్న అక్కడున్నవారంతా నిర్ఘాంత పోయారు. వరుడు రంగు తక్కువగా ఉన్నాడని అతనిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీనికితోడు ఆ యువకుడు వయసు మీదపడినవానిలా కనిపిస్తున్నాడని కూడా వధువు ఆరోపించింది. వధువు ఈ విధంగా మాట్లాడేసరికి కల్యాణమండపంలో కలకలం చెలరేగింది. పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంతనచ్చజెప్పినా ఆమె ససేమీరా అనడంతో వరుడు కల్యాణమండపం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన మే 29న జరిగింది. పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పురాలో ఉంటున్న యువకునికి చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. 29న వరుడు తమ తరపు పెద్దలతో పాటు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వధువు తరపువారంతా పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. తరువాత వరమాల కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. వధువు పూల దండ తీసుకుని వివాహ వేదికపైకి వచ్చింది. అయితే అతనిని పరిశీలనగా చూసి, అతనికి పూల దండ వేసేందుకు నిరాకరించింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. వరుడు కూడా ఆందోళకు లోనయ్యాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు వధువును కారణం అడగగా వరుడు రంగు తక్కువగా ఉన్నాడని, వయసు ఎక్కువగా కనిపిస్తున్నదని, అందుకే తాను ఈ వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పేసింది. దీంతో వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆమె వారి మాట వినలేదు. దీంతో ఈ వివాదం పరిష్కారానికి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అక్కడున్నవారంతా ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె తనకు ఈ పెళ్లి వద్దంటూ తెసేసి చెప్పేసింది. వధువు తరపువారు చేసేదేమీ లేక వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. -
నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే
లక్నో: పెళ్లినాడు అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటారని వధూవరులు ప్రమాణం చేస్తుంటారు. ఓ జంట మాత్రం ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. మరణంలో కూడా ఒకరిని మరొకరు విడిచిపెట్టలేదు. కొత్తగా పెళ్లైన ఆ జంట.. నవదంపతులుగా గదిలోకి వెళ్లి.. శవాలుగా బయటకు వచ్చారు. దీంతో వధూవరుల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న ప్రతాప్ యాదవ్, పుష్పకు ఘనంగా వివాహం జరిగింది. సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత రోజు ఈ కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవదంపతులు ఆ రాత్రి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం ఎంత సేపు గడుస్తున్న ఈ కొత్త దంపతులు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. గదిలోకి వెళ్లి చూడగా.. వారిద్దరూ శవాలుగా కనిపించారు. కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య -
భోజనం చేస్తుండగా.. వధూవరులు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు!
అన్నానగర్(చెన్నై): తిరువారూరు జిల్లా కొత్తూరులో నూతన దంపతులు చేసిన నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తూరుకు చెందిన శేఖర్, కొలంజి దంపతుల కుమారుడు విజయ్‌కి కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన వల్లియన్ –మలర్ దంపతుల కుమార్తె హంసవల్లికి గురువారం అక్కరైకోటలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది. అనంతరం వరుడి ఇంట్లో అతిథులకు భోజనం వడ్డించారు. వారు భోజనం చేస్తుండగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ వీడియోను వరుడు విజయ్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. చదవండి: అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు... -
ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు!
అక్కడ బంధువులందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. దీంతో ఆనందంగా వధువును తీసుకుని వరుడు తమ ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. వరుడు ఆ నూతన వధువును పుట్టింటికి దిగబెట్టేశాడు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తురక్‌వలీ గ్రామం నుంచి మగపెళ్లివారు ఊరేగింపుగా ఆలమ్‌పురి గ్రామానికి చేరుకున్నారు. ఆడపెళ్లివారు వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. రాత్రివేళ వివాహతంతు ఘనంగా ముగిసింది. అయితే ఆడపెళ్లివారు వరునికి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చుకోలేకపోయారు. దీంతో వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్యాణమండపం బయట నిలిపివుంచిన కారు వద్దకు నేరుగా చేరుకున్నాడు. దీంతో వధువు కూడా వచ్చి అదే కారులో కూర్చుంది. వారు ప్రయాణిస్తున్న కారు వరుని ఇంటివైపు బయలుదేరింది. అయితే కొద్దిదూరం వెళ్లాక వధువు పుట్టింటివారికి ఫోను చేసిన వరుడు.. తాము వధువుతోపాటు తిరిగి వెనక్కి వస్తున్నామని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత వధువు ఇంటికి చేరుకున్న వరుడు తనకు వెంటనే బంగారు ఉంగరం, గొలుసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వధువు తాను అత్తారింటికి వెళ్లేదిలేదని తెగేసి చెప్పింది. తరువాత పెళ్లికూతురి తరపు బంధువులు వరునితోపాటు అతని తండ్రిని, మరో బంధువును తాళ్లతో కట్టేసి, తాము పెళ్లి ఖర్చుచేసిన రూ.6 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పంచాయితీ జరిగిన అనంతరం వరుని తరపువారు అమ్మాయి తరపువారి నుంచి తీసుకున్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. అలాగే ఈ పెళ్లికి ఆడపెళ్లివారు ఖర్చుచేసిన దానిలో ఒక లక్షా 90 వేల రూపాయలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ వివాహం రద్దయ్యింది. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి కేకే అవస్థీ మాట్లాడుతూ ఈ పెళ్లికి సంబంధించి ఇరువర్గాలవారు రాజీమార్గంలో వివాహాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. -
వధువు పరార్... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..
మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పెళ్లవగానే వరుడి తాతయ్య ఇంటికి.. అదే రోజు రాత్రి వధువు మృతి
వాషింగ్టన్: నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. కానీ అనుకోని ప్రమాదం ఆ వధువు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది. ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆ ఇంట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని విస్కాన్సిస్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పైజీ రుడ్డీ అనే 19 ఏళ్ల యువతికి.. లోగాన్ మిచెల్ కార్డర్‌తో మే 22న వివాహం జరిగింది. అదే రోజు వరుడి తాతయ్య ఇంటికి విందుకు హాజరయ్యేందుకు ఈ దంపతులు వెళ్లారు. ఆ రాత్రంతా ఎంతో ఆనందంగా గడిపారు. మే 23న తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఆ ఇంటి రెండవ అంతస్తులో వ్యాపించాయి. ఆ సమయంలో పైజ్ రడ్డీ ఆ గదిలోనే నిద్రిస్తోంది. మంటల కారణంగా ఆ గది మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో నిద్రలో ఉన్న వధువు పొగని పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. పొగ పీల్చడం వల్ల బ్రెయిన్ హెమరేజ్‌కి గురైన ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దంపతులు ఉంటున్న ఇల్లు వరుడి తాతలకు చెందినదని, స్మోక్ డిటెక్టర్లు లేకపోవడంతో కుటుంబసభ్యులు సకాలంలో స్పందించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఆ ఇంట్లో అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రమాదనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ల్యాండింగ్ టైంలో ఊపిరాడటం లేదని ఆ డోర్ తెరిచాడు..అంతే విమానం.. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
కూతురు పెళ్లి చూసి..పెళ్లి పందిట్లోనే కుప్పకూలిన తండ్రి
సాక్షి, పెద్దపల్లి: కూతురి పెళ్లిని కళ్లారా చూసిన కాసేపటికే.. ఒక తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్ (55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిపించారు. పెళ్లితంతు ముగిసిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలారు. బంధువులు అతన్ని హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసిన శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: కూతురికి కానుకగా వచ్చిన బంగారంతో పుస్తెలు చేయించి.. -
వరుడు పెళ్లి టైంలో హ్యండిచ్చి పారిపోతే..ఆ వధువు ఏకంగా..
చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి రేపు అనగా పరారవ్వడం గురించి విన్నాం. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలే చూశాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కుమరనకుండా చేయాలని నిరూపించింది ఓ వధవు. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి..చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న వధువు ఈ షాకింగ్ ఘటనను జీర్ణించుకోలేకపోయింద. ఏమైన సరే అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్‌లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అతడు ఫోన్లో వాళ్ల అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ చెప్పినా అమె నమ్మలేదు. ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వదువరులిద్దరికి పెళ్లి చేశారు.నిజానికి అతడు ఆ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అతడి హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెదిక పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది ఆ నవ వధువు. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది. (చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు) -
వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు. పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి. చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు -
వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్!
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు. యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్‌పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్‌తో కలిసి... -
పెళ్లి చేసుకోవాలిని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు
భోపాల్: పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన వధూవరులు విషం తాగి అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతోంది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగి ఈ విషయాన్ని వధువుకు తెలియజేశాడు. వరుడు విషం సేవించాడని తెలిసిన వెంటనే వధువు కూడా తాగింది. వధూవరుల బంధువుల వారిద్దరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వరుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వధువు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తన పెళ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేస్తోందని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కెరీర్ దృష్ట్యా తమ పెళ్లికి రెండేళ్లు గడువు కావాలని కోరడంతో యువతి వినక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
కర్ణాటక ఎన్నికలు: పెళ్లి దుస్తుల్లో ముస్తాబై ఓటేసిన వధువు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 13న ఫలితాలు వెల్లడి కానునఆనయి. కాగా అసెంబ్లీ పోలింగ్‌లో భాగంగా చిక్కమగళూరు జిల్లాలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. తన పెళ్లి రోజు ఓ వధువు ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చింది. మకొనహలి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి దస్తుల్లో ముస్తాబై ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన వధువును ఎన్నికల అధికారులు అభినందించారు. కాగా ముదిగెరె నియోజకవర్గంలో బీజేపీ నుంచి దీపక్ దొడ్డయ్య, జేడీఎస్ ఎంపీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి నయన జ్యోతి ఝవార్ మధ్య పోటీలో నిలిచారు. చదవండి: Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. లైవ్ అప్డేట్స్ #WATCH | Infosys founder Narayana Murthy arrives at a polling booth in Bengaluru to cast his vote.#KarnatakaElections pic.twitter.com/uhQv2RMUVU — ANI (@ANI) May 10, 2023 కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఓటేశారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేఖని బెంగళూరులోని కొరమంగళ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. నిర్మలా సీతారామన్, సీఎం బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడ్యూరప్ప, డికే శివకుమార్, సిద్ధ రామయ్య, సినీనటులు ప్రకాష్‌రాజ్, కాంతారా ఫేం రిషభ్ షెట్టి, గణేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | "I've been constantly saying that Congress will get 130 plus seats, it may go up to 150 seats also," says Former Karnataka CM and Congress leader Siddaramaiah#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/65LX8TODut — ANI (@ANI) May 10, 2023 వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని బీజేపీ భావిస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి దేశ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక ‘హంగ్’పై జేడీఎస్ మరోసారి ఆశలు పెట్టుకుంది. #WATCH | "I am 200% confident Congress party will have 141 seats. We will win an absolute majority..," says Karnataka Congress president DK Shivakumar#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/0wlj5wkQ57 — ANI (@ANI) May 10, 2023 -
వర్షం సాక్షిగా వర్షంలో పెళ్లి
-
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
మండంపంలోనే ఓ రేంజ్లో పోట్లాడుకున్న కొత్త జంట!
ఒక కొత్త జంట మండపంలోనే దారుణంగా పోట్లాడుకున్నారు. ఆపడం బంధువుల తరం కాలేదు. ఎంత ఘోరంగా కొట్టుకున్నారంటే..బంధువులు సైతం ఏం చేయాలో పాలుపోక షాక్‌లో ఉండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వరుడు వధువుకి స్వీట్లు తినిపిస్తున్నాడు. ఐతే వధువు తినడానికి ఇబ్బందిగా ఫీలవుతూ వెనక్కి వెళ్తోంది. పైగా అతని చేతిని కూడా వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తోంది. అతను ఆ ఇబ్బందిని అర్థం చేసుకోకుండా అలానే పెడుతుండటంతో విసిగిపోయిన వధువు కోపంతో చెంప మీద ఒక్కటి ఇచ్చుకుంది. అంతే అతడు కూడా ఏ మాత్రం తగ్గకుండా మరోకటి ఇచ్చుకున్నాడు. ఇక ఇద్దరు ఒకరుకొకరు తీసిపోం అన్నట్టుగా ఓ రేంజ్లో కొట్టుకున్నారు. ఆపాలని బంధువులు ఎంత ప్రయ్నతించినప్పటికి వారితరం కూడా కాలేదు. అంత ఘోరంగా ఇద్దరు జుట్లు పీక్కుంటూ చిన్నపిల్లల మాదిరి కొట్టుకున్నారు. దీంతో నెటిజన్లు వారిద్దరూ అసలు కలిసి ఉండాలనకుంటున్నారా లేదా అంటూ మండిపడుతూ కామెంట్లు చేస్తు ట్వీట్ చేశారు. Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt — Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022 (చదవండి: లైవ్‌లో భర్తతో గాల్లో ఫీట్లు అంతలోనే..) -
పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్
లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్‌లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు. The video went #viral while firing pistol bride The bride fired joy at a guest house in Salempur of Thana #Hathras Junction area Bride's video of Harsh firing went viral on #socialmedia The bride is a resident of village Nagla Sekha of Hasayan police stn area.#UttarPradesh pic.twitter.com/neXrJexBik — Siraj Noorani (@sirajnoorani) April 8, 2023 అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు. చదవండి: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి -
ఎంతటి విషాదం! బాంబులా పేలిన గిఫ్ట్.. పెళ్లైన రెండు రోజులకే..
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు కానీ పెళ్లైన రెండు రోజులకే ఓ వరుడు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే ఆ వధువు కలలు కలలుగానే మిగిలిపోయింది. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లాలోని చమరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి ఇటీవల అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి రకరకాల బహుమతులు వచ్చాయి. సోమవారం ఉదయం ప్రాంతంలో హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్ చేసి చూస్తున్నారు. అందులో వారికి ఒక హోమ్ థియేటర్ ఉంది. పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులతో కలిసి బహుమతిగా వచ్చిన హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్ చేశాడు. అయితే ఒక్కసారిగా హోమ్ థియేటర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయి గోడ కూలిపోవడంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఫోరెన్సిక్స్ నివేదిక వచ్చే వరకు ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది ప్రమాదవశాత్తు పేలిందా లేదా మరేదైన కుట్ర దాగుందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపారు.