
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్‌లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్‌లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment