newly married couple
-
విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
మల్లన్న సన్నిధిలో కొత్త జంట
-
డబ్బే ముద్దు.. పిల్లలు వద్దు
డబుల్ ఇన్కమ్... నో కిడ్స్ ఫ్యామిలీ ΄ప్లానింగ్‌లో ఓ కొత్త ఒరవడి మొదలయ్యింది. నవ దంపతులు రెట్టింపు ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారు. పిల్లలు మాత్రం వద్దు అనుకుంటున్నారు. రాహుల్ మంచి జీతంతో స్థిరపడ్డాడు. పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు చూసి, ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి మాత్రం ‘నేను పిల్లలను కనాలనుకోవడం లేదు’ అని కచ్చితంగా చెప్పేసింది. ఎంత నచ్చజెప్పినా పెళ్లి క్యాన్సిల్ చేస్తానంది కానీ, మాట మార్చుకోనంది. స్నిగ్ధ, కిరణ్ లు పెళ్లి తర్వాత మూడేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారు. ఆ తర్వాత అసలు పిల్లలే వద్దు అనే ఆలోచనకు వచ్చేశారు.పెద్దవాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తమ ఉద్యోగాలు మరో స్టేట్‌కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లిపోయారు. ‘ఇది ఒకరో ఇద్దరిదో సమస్య కాదు. మేం డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ దంపతులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో కనుక్కుంటున్నాం’ అని తేల్చింది ప్రముఖ లాన్సెట్ అధ్యయనం. రానున్న రోజుల్లో ఇది తీవ్రమైన ఆర్థిక, సామాజిక అంశాలపై పెనుభారంగా పరిణమించనుందని స్పష్టం చేసింది.మోయడం కష్టమట..మొదట పిల్లలు వద్దనుకునే దంపతులు చాలా తక్కువగా కనిపించేవారు. అది పెద్దగా పట్టించుకోదగిన విషయంగా కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి సాంస్కృతిక ప్రధాన స్రవంతిగా మారాయి. అమెరికాలో పిల్లలు లేని కుటుంబాలు 2022 నాటికి 43 శాతానికి చేరుకున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చి చూస్తే 36 శాతానికి పైగా పెరిగింది. సమీప భవిష్యత్తులో వీరు 50 శాతానికి చేరుకోబోతున్నారు. కడుపున బిడ్డను మోయడం అనేది ఓ పెద్ద పనిగా, సమయం తీసుకునే అంశంగా భావిస్తున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు ఆర్థికాభివృద్ధిలో కొంతస్థాయికి చేరుకుంటున్న దాదాపు 90 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నిర్ణయాలు అమలు‘మేం ఇద్దరం.. మాకు ఇద్దరు’ అనేది 1970 – 80లలో ఆకట్టుకునే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం. కొత్త తరాలు కోరుకునే ఈ నినాదాలేమీ విననివి కాదు. అధిక పేదరికం ఉన్న రోజుల్లో ప్రతి స్త్రీకి 4–5 మంది పిల్లలు ఉండేవారు. దీంతో సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి ప్రభుత్వం ఈ నినాదాలు రూపోందించింది. అవి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు.నాటి నుంచి ప్రపంచం చాలా పురోభివృద్ధి సాధించింది. సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నందున, ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరగడం ఆగిపోతుందని యునైటెడ్ నేషన్స్ జనాభా డేటా వ్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో అంటే 2050 నుంచి 2100 మధ్య కాలంలో 90 దేశాల్లో జనాభా బాగా తగ్గి΄ోనుంది. వాటిలో ఎక్కువ భాగం ఐరోపా, లాటిన్ అమెరికాలో ఉన్నాయి. జనాభా పెరుగుదల నమోదవు తున్న ఏకైక ప్రాంతంలో ఆఫ్రికా మాత్రమే. 2020–2100 ఆఫ్రికా ఖండంలో మధ్య భాగం జనాభా 1.3 మిలియన్ల నుండి 4.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దక్షిణ కొరియాలో రాజకీయ నాయకులు సంతానోత్పత్తి రేటును పెంచాలని అక్కడి దంపతులను వేడుకుంటున్నారు.మన దేశంలో... లాన్సెట్ కొంతకాలంగా వేస్తున్న అంచనా ప్రకారం 2050 నాటికి పిల్లల రేటు భారీగా తగ్గి, ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు సీనియర్ సిటిజన్‌గా ఉంటారు. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపే శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. మనం ఎంత దూరం వచ్చామో అర్థం చేసుకోవాలంటే 1950 మన దేశ సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంది. 1980లో 4.60 ఉండగా, 2021లో 1.91కి తగ్గింది. కొన్ని స్థానిక అంశాలు మానవ మనస్తత్వ కోణాలను పూర్తిగా మార్చేశాయి. చాలా మంది పిల్లలు వృద్ధ తల్లిదండ్రులకు పెట్టుబడి. కానీ, ఈ ఆలోచన పూర్తిగా తిరగబడింది. నేడు పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నది. పైగా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారనే నమ్మకం లేదు.పరిస్థితి ఇలా మారుతోంది⇒ పేరెంట్‌హుడ్‌ను నివారించడానికి యువ జంటలు పట్టణాలలో పెంపుడు జంతువులను ఎంచుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు తక్కువ బాధ్యత ఉన్నప్పటికీ, యజమానులను బాగా ప్రేమిస్తాయి.⇒ మరికొందరు తమ జీవితాన్ని కొత్త స్వేచ్ఛను, ప్రయాణ, సాహస క్రీడల కోసం ఉపయోగిస్తున్నారు.⇒ నగరాలు, చిన్న పట్టణాలలో జీవనం కష్టంగా మారి పిల్లలతో కలిసి శివారుప్రాంతాలకు వలస వెళుతున్నారు. పట్టణీకరణ కేంద్రాలలోనూ జనాభా వేగంగా తగ్గిపోతోంది.⇒ పిల్లలు లేకుండా, తల్లిదండ్రులుగా మారడానికి ఇష్టపడే జంటలు సాధారణంగా ఐటీ, అడ్వరై్టజింగ్ ఇతర అధిక కార్పొరేట్ ఉద్యోగాలలో ఉంటున్నారు. సుదీర్ఘ పని గంటల తర్వాత సమయాన్ని, డబ్బును సెలవుల కోసమే కేటాయించుకుంటున్నారు. -
మంది మాటలు వినే..! పిన్ని, అన్నల కొత్త డ్రామానా..?
-
పోలీసులకు సెల్ఫీ వీడియో పంపి నవ దంపతుల ఆత్మహత్య
-
పెళ్లైన ఐదు రోజులకే.. గోదావరిలోకి దూకిన నవదంపతులు
పెనుగొండ, పశ్చిమ గోదావరి: ఏ కష్టం వచ్చిందో తెలియదు. నవ దంపతులు గోదావరిలో దూకారు.. వరుడు ప్రాణాలతో బయట పడగా.. వధువు కోరాడ సత్యవతి మృతి చెందింది.. అయితే వరుడుపై వధువు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి(19)ని తండ్రి లేకపోవడంతో తాతే పెంచి ఈ నెల 15న ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే శివరామకృష్ణతో వివాహం జరిపించాడు. వీరు మంగళవారం రావులపాలెం సినిమాకు అని చెప్పి వెళ్లారు. శివరామకృష్ణ కథనం ప్రకారం ఇద్దరూ సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రిడ్జి నుంచి ఆర కిలో మీటరు దూరంలో ఉన్న శివరామకృష్ణ కేదారీఘాట్ సమీపంలో రక్షించమని అరవడంతో మత్స్యకారులు కాపాడారు. విషయాన్ని వధువు బంధువులకు చెప్పి తణుకు ప్రభుత్వాసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లిపోయాడు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శివరామకృష్ణను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వధువు కోరాడ సత్యవతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శివరామకృష్ణ హత్య చేశాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వడలి గ్రామస్తులు భారీగా పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతి హత్య చేసి గోదావరిలో పడేయడమో చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌లు గ్రామస్తులకు సర్ధి చెప్పి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాలు పెట్టుకోవద్దంటూ భరోసా ఇచ్చారు. -
నూతన దంపతులకు శ్రీవారి సేవ, దర్శనం
-
నూతన దంపతులు సహా అయిదుగురిని చంపి..
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన దంపతులతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను, ఓ స్నేహితుడిని ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోను యాదవ్(22), సోని(20)లకు శుక్రవారమే వివాహమైంది. రాత్రి బారాత్ వేడుక జరిగింది. అనంతరం అందరూ నిద్రిస్తుండగా సోను సోదరుడు శివ్ వీర్ యాదవ్(28) గొడ్డలితో నూతన దంపతులతోపాటు మరో సోదరుడు, బావ మరిది సౌరభ్, స్నేహితుడిని చంపేశాడు. తన భార్య, అత్తపైకి తుపాకీతో కాల్పులు జరపగా వారు గాయపడ్డారు. అనంతరం నిందితుడు శివ్ వీర్యాదవ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
పెళ్లయిన మూడు నెలలకే కబళించిన మృత్యువు..
మరిపెడ రూరల్ : లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో నవ దంపతులు అక్కడి అక్కడే మృతి చెందారు. కాగా, పెళ్లయిన మూడు నెలలకే దంపతులను లారీ రూపంలో మృత్యువు కబలించింది. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరిపెడ మండల కేంద్రం పూలబజార్‌కు చెందిన అంజలి (21)కి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగెకు చెందిన తునగర్ నారాయణసింగ్ (23)కు గత మార్చి 9న వివాహం జరిగింది. నారాయణ సింగ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీకెండ్ కావడంతో దంపతులు బైక్‌పై అత్తగారింటికి వస్తుండగా మరిపెడ మండలం కోమటికుంటతండా సమీపంలో ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడి అక్కడే మృతి చెందారు. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
విశాఖపట్నం: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. రుషికొండలోని ఎంపీ నివాసానికి చేరుకున్న సీఎం.. ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం భూమి పూజ చేశారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతో పాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రోడ్డు ప్రమాదం.. పెళ్లైన మూడో రోజే నవవధూవరులు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధూవరులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దులోని గొల్రంత వద్ద దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండు రోజులకే దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణుకు (26) ఒడిశాలోని బరంపురానికి చెందిన స్ ప్రవల్లికతో (23) ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం ఇచ్ఛాపురంలో రిసెప్షన్ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సోమవారం సాయంత్రం నూతన జంట ద్విచక్రవాహనంపై ప్రవల్లిక ఇంటికి బరంపురానికి బయల్దేరారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో గొళంత్రా దగ్గర వెనక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే మృతిచెందింది. వరుడికి తీవ్ర గాయాలవ్వగాని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతిచెందారు. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన ఇలా కాళ్ల పారాణి ఆరకముందే మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ -
విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం
తుమకూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో టెక్కీ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద కర్నాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు గేట్ వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు (35) అతని భార్య అనూష (28)లుగా గుర్తించారు. వివరాల ప్రకారం.. హాసన్ జిల్లాలోని అరసికెరెకు చెందిన రఘు, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని తిగడనహళ్లికి చెందిన అనూషతో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వారు బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. బళ్లారిలో బంధువుల పెళ్లి ఉండడంతో చిక్కనాయకనహళ్లి నుంచి కారులో వెళుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు నుజ్జయింది. దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో కన్నుమూశారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఆమె అందం చూసి అనుమానం.. వివాహితను చంపిన సైకో భర్త
సాక్షి, బెంగళూరు: అనుమానపు భర్త భార్యను హత్య చేశాడు. నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలోని తావరకెరెలో ఉన్న సుభాష్ నగరలో చోటు చేసుకుంది. హత్యకు గురైన నవ వివాహిత నాజ్ (22) కాగా, ఆమె భర్త నాసిర్ హుస్సేన్ పరారీలో ఉన్నాడు. గత ఆరు నెలల క్రితమే వీరికి పెళ్లయింది. బీటీఎం లేఔట్ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్ నగరలో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే నాసిర్ భార్య అందాన్ని చూసి ఈర్ష్య చెందాడు. ఆమెకు ఇతరులతో సంబంధం ఉందని నిత్యం అనుమానించేవాడు. అనుమానం పెనుభూతమై ఆదివారం ఆమెను గొంతు పిసికి చంపాడు. తరువాత నాజ్ అన్నకు ఫోన్ చేసి నీ చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: వలపు వల హనీ ట్రాప్‌తో నిలువు దోపిడీ) -
పెళ్లైన ఆరు నెలలకే నవ దంపతులు ఆత్మహత్య
నల్గొండ: ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. గుడిపల్లి ఎస్ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమటితండాకు చెందిన రమావత్ లక్ష్మణ్(24) ఆరునెలల క్రితం నేరెడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ మేగావత్తండాకు చెందిన నిఖిత(20)తో వివాహం జరిగింది. అప్పటినుంచి స్వగ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం తమ కిరాణ దుకాణంలోనే లక్ష్మణ్, నిఖిత దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కిరాణ దుకాణానికి వచ్చిన తండావాసి చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగు చూసింది. వివాహం జరిగిన ఆరు నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలా? లేదా ఆర్థిక ఇబ్బందులా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!
సాక్షి, చెన్నై: పెళ్లైన కొద్ది రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. పుదుకోట్టై జిల్లా అరంతాంగి తాలూకా పెరుమాల్పట్టికి చెందిన సురేష్‌కు (30). ఆవుడయార్ కోయిల్ సమీపం పెరియవీర మంగళంలకు చెందిన ఉష (22)తో గత 40 రోజుల క్రితం వివాహమైంది. ఆషాడం నెలను పురస్కరించుకుని ఉషను ఆమె తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఈజెల 17వ తేదీ భార్యను చూడడానికి సురేష్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఉష అన్న ఉలగనాథన్ విదేశాలకు వెళ్లడానికి సిద్ధం కావడంతో అతనికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి ఉష, సురేష్, ఉష తల్లి అరంతాంగికి వెళ్లిసాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. తరువాత తాను అరంతాంగికి వెళుతున్నానని భార్యకు చెప్పి సురేష్ బయటకు వెళ్లాడు. తరువాత రాత్రి 8 గంటలకు ఉష భర్తకు ఫోన్‌చేయగా తాను ఉదయం ఇంటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉష ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టుకు సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆవుడయార్ కోవిల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సరేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు అరంతాంగి ప్రభుత్వాస్పత్రిని ముట్టడించారు. అధికారులు వారితో సమాధానం మాటలు మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తూ వున్నారు. -
అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కి కొత్తగా పెళ్లైన జంట
మండ్య(బెంగళూరు): ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ జంటను పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండ్య తాలూకాలోని చీరనహళ్ళిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేశ అలియాస్ బల్లేశ, శిడ్లఘట్టకు చెందిన భాగ్య ప్రేమలో పడ్డారు. ఈ నెల 8న రిజిస్టర్ పెళ్ళి చేసుకుని చీరనహళ్ళిలోని ఇంట్లో దిగారు. తమ కూతురు కనపడడం లేదని భాగ్య తల్లిదండ్రులు శిడ్లఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులు వచ్చి యువ దంపతులను స్థానిక ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. విషయం ఎస్పీకి తెలిసి తక్షణమే జంటను వదిలిపెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని చెప్పి పంపారు. తమకు ప్రాణభయం ఉందని కొత్త జంట ఆందోళన వ్యక్తంచేసింది. చదవండి: Jammu and Kashmir: 100 నాటౌట్ -
CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి,అమరావతి: అమలాపురం వైఎస్సార్సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళవారం విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సురేంద్ర నాయుడు, వధువు ప్రత్యూషలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: (ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్ జగన్) -
పెళ్లైన 20 రోజులకే.. ప్రేమజంట ఆత్మహత్య
తిరువొత్తియూరు (తమిళనాడు): నామక్కల్ జిల్లాలో ప్రేమించి వివాహం చేసుకున్న 20 రోజులకే ఓ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభజిత్(22). ఇతను నామక్కల్ జిల్లా పల్లిపాలెం డీవీఎస్ మెట్టు ప్రాంతంలో ఉంటూ అక్కడున్న ఒక పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతను వెస్ట్ బెంగాల్, మేథి ఊరుకు చెందిన 10వ తరగతి చదువుతున్న సంభజన (17)ను ప్రేమించాడు. వీరి ప్రేమను ఇద్దరి ఇంట్లో వ్యతిరేకించారు. ఈ క్రమంలో సుభజిత్ పశ్చిమబెంగాల్‌కు చెందిన మేథి ఊరుకు వెళ్లాడు. తరువాత గత 20 రోజులకు ముందు సంభజనను ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడున్న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. తరువాత భార్య అయిన సంభజనను నామక్కల్ జిల్లా పల్లిపాళయంకు తీసుకువచ్చాడు. అక్కడ ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ సుభజిత్, సంభజన బయటకు రాకపోవడంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పల్లిపాళయం పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుభజిత్, సంభజన ఉరేసుకుని శవాలుగా వేలాడుతున్నారు. దీంతో వారి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఒంగోలు పర్యటనలో భాగంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సభ ముగిసిన అనంతరం సీఎం నేరుగా స్థానిక బందరు రోడ్డులోని రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ నివాసానికి చేరుకున్నారు. రవిశంకర్, ప్రియదర్శిని, వారి కుమారుడు సాయినాథ్‌లు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. నూతన దంపతులు కంది విష్ణుమోహన్, స్నేహలను సీఎం ఆశీర్వదించారు. రవిశంకర్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. స్నేహ తల్లిదండ్రులైన బొత్స లక్ష్మణ్‌రావు, కన్నమ్మదేవిలను, మంత్రి బొత్స సత్యన్నారాయణను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మున్సిపల్ శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా వెంకట రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచుగరటయ్య, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, బాలినేని ప్రణీత్‌రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ వ్యాపార వేత్త శిద్దా హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. అక్కడ నుంచి బయల్దేరి 1.53 గంటలకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. 1.59 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు నుంచి తాడేపల్లికి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. చదవండి: (Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్) -
ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో
సాక్షి, మిర్యాలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు కుమార్తె ప్రియాంక, అదే గ్రామానికి చెందిన తుర్క సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్లు అయినప్పటికీ, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా గత నెల 20న హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. బుధవారం ఈ విషయం ప్రియాంక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కలసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. చదవండి: మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ వారి వద్ద వివరాలు తీసుకున్న డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు కార్యాలయంలో మహిళా పోలీసులు లేనందున మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు డీఎస్పీ కార్యాలయం గేటు వద్దకు చేరుకునే లోగా అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ సైదులు అనుచరులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ జంట తిరిగి డీఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఎస్ఐని రక్షణగా ఉంచి పోలీస్ వాహనంలో వారిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో.. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్తికేయ దంపతులు
Actor Karthikeya Visits Tirupati With Wife And Family: హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం(నవంబర్26)న నూతన దంపతులిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు. -
టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు, ఎందుకిలా జరుగుతోంది?
‘మనస్పర్థలు వచ్చి, ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇటీవల కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సమీపానికి వచ్చి, పురుగు మందుతాగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.’ ‘కరీంనగర్ పట్టణానికి చెందిన దంపతులకు వివాహమై మూడు నెలలు మాత్రమే అయింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఒకరోజు భర్త ఓ విషయంలో గొడవపడి భార్యను ‘పో’ అన్నాడు. నన్ను పో అంటావా అని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదిపాటు ఒకరినొకరు పలకరించుకోలేదు. చివరకు విడాకులు కావాలని పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసు అధికారికి పై కారణం చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత చిన్న విషయానికి విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని తలపట్టుకున్నాడు.’ఇలాంటి కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకునే వరకు వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.’ సాక్షి, కరీంనగర్: కడదాకా ఒకరికొకరం తోడుంటామని చేసుకున్న బాసలు నీటిమీద రాతలవుతున్నాయి.. ఏడడుగులు నడిచి, మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు నెలలు తిరగకుండానే మనస్పర్థలతో పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దంపతులు పరస్పరం కేసులు పెట్టుకుంటూ తామన్నది సాగకపోతే ఠాణాల్లోనే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు. కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కూర్చొని మాట్లాడుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, అప్పటికీ కలిసి ఉండటం కష్టం అనుకుంటే చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆత్మహత్యాయత్నాలు, బ్లాక్ మెయిల్ ద్వారా కాపురాలు నిలబడవని అంటున్నారు. బ్లాక్‌మెయిల్‌తో కాపురాలు సాగవు దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినప్పుడు కూర్చొని, మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఠాణాల వద్ద ఆత్మహత్యకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు. ఎదుటివారిని లొంగదీసుకోవాలని భావించి, బ్లాక్మెయిల్ చేస్తే కాపురాలు సాగవు. – తుల శ్రీనివాసరావు, కరీంనగర్‌టౌన్ ఏసీపీ ఆవేశంలో నిర్ణయాలు.. చాలామంది చిన్నచిన్న గొడవలను పెద్దవిగా చేసి, తమ కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. చీటికీమాటికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో ఎంతచెప్పినా అర్థం చేసుకోకుండా తాము అనుకున్నదే సాగాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగడం ఈ మధ్య పరిపాటిగా గొడవ చిన్నదిగా ఉన్నప్పుడే దంపతులు కూర్చొని, మాట్లాడుకోవాలని, లేదంటే ఇరుకుటుంబాల వారు పరిష్కారం చూపాలని పోలీసులు చెబుతున్నారు. పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా కొందరు మారుతున్నారని, మరికొందరు మాత్రం ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ కాపురాలను నాశనం చేసుకుంటున్నారని అంటున్నారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరి అజమాయిషీ కోసం తాపత్రయపడటం, అహంభావంతో ఒకరినొకరు గౌరవించుకోలేకపోవడం, వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలది తప్పయినా వారినే సమర్థించడంతో చిన్న గొడవలు పెద్దవై, విడాకులకు దారి తీస్తున్నాయని పేర్కొంటున్నారు. బెదిరింపులకు దిగితే చర్యలు.. సమస్యలపై ఠాణాలకు పిలిపించినప్పుడు బెదిరింపులకు దిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఒకరినొకరు లొంగదీసుకోవచ్చనే ఆలోచనలు మానుకోవాలని అంటున్నారు. కలిసి బతకడం కుదరకపోతే కోర్టు ద్వారా విడాకులు పొందాలని చెబుతున్నారు. -
Tourist Spot: కొత్తదంపతులు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు..
స్వయంబువుగా వెలిసిన కొమురెల్లి మల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారం. చందమామలాంటి బిడ్డనిచ్చి ఒడినింపుతాడని నమ్మకం. మల్లన్నకు ఉయ్యాల కడితే ఇంట్లో ఉయ్యాల ఊగుతుందని విశ్వాసం. అందుకే... ఉయ్యాల కట్టి మరీ మల్లన్నకు మొక్కుతారు. నూతన దంపతులు కొమురెల్లి మల్లన్నను దర్శించుకుంటే పండండి బిడ్డ నట్టింట నడయాడుతుందని నమ్ముతారు భక్తులు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం కుందారం గ్రామంలో కొలువైన స్వయంభువు కొమురెల్లి మల్లన్న. కడుపు పండాలని మల్లన్నకు మొక్కి, కొత్త గుడ్డలో కొబ్బరికాయను కట్టి చెట్టుకు వేళ్లాడదీస్తారు. ఈ ఆలయంలోని చెట్ల కొమ్మలు నిండుగా ఈ ఉయ్యాలలే కనిపిస్తాయి. కుందారం గ్రామంలో పదేళ్ల కిందట కాకతీయుల కాలం నాటి కొమురెల్లి మల్లన్న విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా మారింది. కార్తీకమాసం మొదలైంది. ఇక శివుని కోవెలలన్నీ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఈ టూర్లో శివ్వారంలోని మొసళ్ల మడుగును కూడా కవర్ చేయవచ్చు. – వేముల శ్రవణ్‌కుమార్, సాక్షి, మంచిర్యాల చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంట
Newly Married Couple Pays Tributes To Puneeth Rajkumar At Mysore: కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి అభిమానాన్ని చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది. మూడుముళ్ల సంబరమయ్యాక అక్కడే పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ వ్యక్తమైంది.చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ అభిమాని ఆత్మహత్య మైసూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుడైన అశోక్ (40) పునీత్ లేడన్న నిజాన్ని భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు -
వివాహ వేడుకకు అనుకొని అతిథి..
-
తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు
ఓ మండలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి కూతురు ఉంది. ఇటీవల అత్త, మామ ఇంట్లో ఉంటున్నారని భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో ఉండేవారు. లాక్డౌన్ తర్వాత ఇద్దరూ జిల్లా కేంద్రానికి వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతను ఆటో నడిపేవాడు. భార్య ఓ దుకాణంలో పనిచేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో ద్వారా అశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో పాటు తరచూ అతను మద్యం తాగడం వల్ల గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మహబూబ్‌నగర్ క్రైం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కాలంతో పాటు మనుషులు పరుగెడుతున్నారు. ఫలితంగా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పలుసార్లు మనస్పర్థలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్తున్నారు. మహిళలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని ఒక్కటి చేస్తున్నారు. మరికొందరు మాత్రం పట్టు విడవకుండా చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏడాది కాలంగా గృహహింస కేసులు పెరిగాయి. ఆనందోత్సాహాలతో అన్యోనంగా కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య క్షణికావేశాలు, భావోద్వేగాల కారణంగా పట్టు, విడుపులు లేని ధోరణి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే గోరంత సమస్యను కొండంతలుగా చేసుకుని విడిపోతున్నారు. పంతాలు, పట్టింపులకు పోయి తానేమీ తక్కువ కాదంటూ రాజీ పడకుండా ఆలోచన శక్తిని కోల్పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారి కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. దంపతులతో పాటు వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్న కుటుంబాల్లో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేక పక్కదారి పడుతున్నారు. (చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే) కౌన్సెలింగ్ సెంటర్‌తో భరోసా ఇలా చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చక్కదిద్దేందుకు, వివిధ రూపాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ విడిపోవాలనుకుంటున్న దంపతులకు సర్దుకుపోవాలంటూ వారిలో అనుబంధాన్ని పెంచేందుకు మహిళా పోలీస్‌స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ భరోసా ఇస్తోంది. విడిపోవాలనుకున్న దంపతుల్లో ఆశలు చిగురింపజేసి కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు సరైన మార్గనిర్దేశం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. (చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో) వందల సంఖ్యలో దంపతుల మధ్య వివాదాలు ప్రతినెలా వందల సంఖ్యలో ఠాణాకు వస్తున్నాయి. వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే హిందూ సంప్రదాయంలోనూ అనుబంధాలు బీటలు బారుతున్నాయి. ఇద్దరి మధ్య అవగాహనలోపం.. భార్యాభర్తల బంధం విలువ తెలియకపోవడంతో ఇటీవల కాలంలో పోలీస్స్టేషన్లకు ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయి. అందులో కొన్ని కౌన్సెలింగ్ ద్వారా సద్దుమణుగుతుండగా చాలా వరకు యువ జంటలు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దంపతుల మధ్య విభేదాలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటమే కారణమవుతోంది. ఎవరికి వారు ఒంటరిగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నందున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా అనుభవం ఉన్న పెద్దలు సర్దిచెప్పే అవకాశం ఉండేది. దీంతో అక్కడికక్కడే సమస్య పరిష్కారమై దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. అయితే ఉరుకులు, పరుగుల జీవితంలో పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే మనోధైర్యం లేక విడాకుల వరకు తీసుకెళ్తోంది. కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాం కౌన్సెలింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తాం. చిన్న సమస్యలతో కోపంగా మా వద్దకు కొందరు వస్తారు. వారి కుటుంబసభ్యులు కానీ, పెద్ద మనుషులతో కానీ మాట్లాడాలని చెబుతాం. చాలా కేసులు ఫిర్యాదుల వరకే ఉంటాయి. ఇటీవల పెళ్లయి నెల రోజులకే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు రావడం చూస్తుంటే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన భార్యాభర్తల సమస్యను మొదట గుర్తిస్తాం. దీనికి పరిష్కారం దొరికితే నిజాయితీగా కలుస్తారనుకుంటే కలపడానికి యత్నిస్తాం. ఇక ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మారరనే వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తాం. - హన్మప్ప, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్, మహబూబ్‌నగర్ వివాదాలకు కారణాలివే ఆర్థిక సమస్యలు, భర్త మద్యానికి, ఇతర వ్యసనాలకు బానిస కావడం, వివాహేతర సంబంధాలు, దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి అనుమానం, అదనపు కట్నం, ఇరువర్గాల కుటుంబసభ్యుల అనవసర జోక్యం, ఇతర వేధింపులు కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం చదువుకున్న వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువ జంటలు భర్త తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుందోనని ముందే మానసికంగా ఇబ్బందిపడి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ గొడవలకు కారకులవుతున్నారు. -
ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?
ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్‌లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం. ► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు. వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి.. శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వధూవరుల విరహం.. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు పుట్టింటికి... ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే. ఎందుకిలా.. ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. చాతుర్మాస దీక్షలు చేపడతారు.. ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు. – విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప ఎన్నో ప్రత్యేకతలు.. ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి. – హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప -
గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి..
సాక్షి, భువనేశ్వర్: జీవితంలో పెళ్లి అనేది ఓ మరుపురాని సంఘటన. అదేరోజు అందరికీ గుర్తుండిపోయే ఓ మంచిపని చేస్తే అది ఇంకా ప్రత్యేకం. ఆదివారం హితేష్ అనే యువకుడి పెళ్లి జరుగుతుండగా, ఓ ఉన్నతాధికారి నుంచి రక్తదానం చేయాల్సిందిగా వరుడికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా వధువుకి తాళికట్టిన మరుక్షణమే పెళ్లిపీఠలపై నుంచి లేచి, నేరుగా ఆస్పత్రికి వెళ్లి, రక్తదానం చేసి, ఆదర్శంగా నిలిచాడు. వివరాలిలా ఉన్నాయి.. కొరాపుట్ జిల్లాలోని బొయిపరిగుడ సమితి, మఠపడ గ్రామపంచాయతీలో ఉన్న తెంతులిపొదర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణికి ఆదివారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం సహిద్ లక్ష్మణ్ నాయక్ ఆస్పత్రికి ఆమెని తరలించారు. రక్తం కొరతతో.. ఆమెకి రక్తం తక్కువగా ఉందని, చికిత్స చేయడం కుదరదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆమెకి కావాల్సిన గ్రూపు–ఏబీ పాజిటివ్ రక్తం కోసం చాలాచోట్ల ప్రయత్నించారు. కరోనా కారణంగా దాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో నిస్సహాయ స్థితికి చేరుకున్న వారి విషయం గురించి కొరాపుట్ డిప్యూటీ కలెక్టర్ అలోక్‌కుమార్ అనుగూలియకి తెలిసింది. దీంతో ఆయన బాధితులకు సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి రక్తం దానం చేయాల్సిందిగా కోరారు. ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో చివరికి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న హితేష్‌కి ఆయన ఫోన్ చేశారు. అధికారి ఫోన్ కాల్కి స్పందించిన సదరు యువకుడు తనకు పెళ్లి జరుగుతోందని, తాళి కట్టి వచ్చేస్తానని సమాధానమిచ్చాడు. పెళ్లయిన వెంటనే హితేష్ ఆస్పత్రికి చేరుకుని, రక్తదానం చేసి, గర్భిణికి అండగా నిలిచాడు. కరోనా భయంతో రక్తం దానం చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో పెళ్లికొడుకు పెళ్లిమండపం నుంచి వచ్చిమరీ రక్తదానం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గర్భిణి పరిస్థితి బాగుందని, చాలా సులభంగా డెలివరీ కూడా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చదవండి: కరోనాతో అసిస్టెంట్ డైరెక్టర్ మృతి -
రిసెప్షన్ ఫంక్షన్: నూతన దంపతులపై కేసు
తొగుట(దుబ్బాక): తొగుట మండలం చందాపూర్‌లో లాక్డౌన్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసెప్షన్ నిర్వహించిన పది మందిపై గురువారం కేసు నమోదు చేసినట్టు తొగుట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై, పోలీసులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. రిసెప్షన్ నిర్వహించుకుంటున్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేశామన్నారు. నూనె మహేశ్ (26) ఎ1, నూనె మౌనిక (25) ఎ2, టెంట్ హౌజ్ నిర్వాహకుడు నర్సెట్టి ఎల్లం (28) ఎ3, ఆత్మకూరి శ్రీనివాస్ (35) ఎ4, పాడలా విజయ (28) ఎ5, నూనె సుబధ్ర (60) ఎ6, జనగామ సుభాష్‌గౌడ్ ఎ7. బొడ్డు స్వామి (38) ఎ8, బొడ్డు భూమయ్య (42) ఎ9, నర్సెట్టి సురేష్ (35) ఎ10 పై క్రైం నంబర్ 82/2021 యూ/ ఎస్ 341, 186, 188, 269 మరియు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు తప్ప రిసెప్షన్, పుట్టిన రోజు ఇతర ఫంక్షన్లకు ఎలాంటి అనుమతి లేవన్నారు. లాక్డౌన్ మరియు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఫంక్షన్లు చేసుకునే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే -
యువతి ప్రాణం నిలిపిన కొత్త జంట
లక్నో : ప్రాణాపాయంలో ఉన్న ఓ యువతికి రక్త దానం చేసి ప్రాణం నిలిపింది కొత్తగా పెళ్లైన ఓ జంట. పెళ్లి బట్టల్లో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి ఆపరేషన్ చేయటానికి రక్తం అత్యవసరమైంది. దీంతో పోలీస్ మిత్ర ద్వారా రక్తదానం చేసే వారి కోసం అన్వేషించారు. అయితే ఎవ్వరూ రక్తం ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో యువతికి రక్తం అవసరమన్న సంగతి తెలుసుకున్న ఓ వధూవరుల జంట రక్తం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ( భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం) పెళ్లి బట్టలతో ఆసుపత్రికి వెళ్లి రక్త దానం చేసి యువతి ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారి ఆశిష్ మిశ్రా తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించారు. వధూవరుల జంటపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కూడా వారిద్దరిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ( వైరల్: టైటానిక్ మరో క్లైమాక్స్ సీన్ వీడియో ) -
విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే
సాక్షి, మంచిర్యాల : పెళ్లి సమయంలో చేసిన బాసలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన ఆ దంపతులు అంతలోనే మృత్యు ఒడిలోకి చేరారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఆ నవదంపతులను లారీ మృత్యురూపంలో కబళించింది. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ వారి ఆశలను చిదిమేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రుద్ర రాజయ్య–పద్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు స్వరాజ్(30). ఇతడికి పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య కూతురు కృష్ణవేణి(23)తో గతేడాది జూన్ 11న వివాహమైంది. భార్యాభర్తలు గద్దెరాగడిలోనే ఉంటున్నారు. చదవండి :అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. ఈ క్రమంలో కృష్ణవేణి జిల్లాకేంద్రంలో కుట్టు నేర్చుకుంటోంది. స్వరాజ్ ఆమెను ప్రతిరోజూ కుట్టు శిక్షణ కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి.. అనంతరం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం దంపతులిద్దరూ బైక్‌పై మంచిర్యాలకు బయల్దేరారు. ఏసీసీ అంబేద్కర్ కాలనీ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ.. వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై మారుతీ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: నిద్రిస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రక్కు..13 మంది మృతి మరో 15 రోజుల్లో ఉద్యోగం.. రాజయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. స్వరాజ్ ఒక్కడే కుమారుడు. స్వరాజ్ కొంతకాలం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేశాడు. రాజయ్య సింగరేణి ఉద్యోగి కావడం.. మెడికల్‌గా అన్‌ఫిట్ కావడంతో తన ఉద్యోగాన్ని కుమారుడికి పెట్టించాడు. అప్పటినుంచి స్వరాజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఇంటివద్దనే ఉంటున్నాడు. నెలరోజుల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మరో 15రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు భద్రత వారోత్సవాల రోజే.. రోడ్డు భధ్రత వారోత్సవాల రోజే ఈ ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది. స్వరాజ్ హెల్మెట్ ధరించినా ప్రమాద సమయంలో బెల్ట్ ఊడిపోయిందని, దీంతో హెల్మెట్ ఎగిరిపోయి లారీ దంపతుల తలలపై నుంచి వెళ్లడంతోనే మృత్యుఒడికి చేరారని స్థానికుల ద్వారా తెల్సింది. స్వరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష..
సాక్షి, నెల్లూరు: ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆనందంగా సాగాల్సిన వారి జీవితం విధి ఆడిన వింత నాటకంతో అర్ధాంతరంగా ముగిసింది. నెలన్నర క్రితం భర్త గుండెపోటుతో మృతిచెందాడు. తీవ్ర మనోవేదనకు గురైన భార్య గురువారం తనువు చాలించింది. ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం నెల్లూరులోని జెడ్పీకాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) నగరంలోని జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిపై స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ పొదలకూరురోడ్డు జెడ్పీ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమెకు గూడూరు అయ్యవారిపాళేనికి చెందిన జగదీష్‌తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలనెదిరించి గతేడాది అక్టోబర్ 29వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త మృతితో.. డిసెంబర్లో జగదీష్ గుండెపోటుతో మృతిచెందాడు. భర్త హఠాన్మరణం చెందడం, కుటుంబసభ్యులు దూరంగా ఉండడంతో శిరీష తీవ్రమనోవేదనకు గురైంది. స్నేహితులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల ఆరో తేదీన శిరీష తనకు తోడుగా స్నేహితురాలు రమాదేవిని ఇంట్లో చేర్చుకుంది. 7వ తేదీ సాయంత్రం కళ్లు తిరుగుతున్నాయని శిరీష స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆమెను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ ఘటనపై స్నేహితులు మృతురాలి కుటుంబసభ్యులకు, దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (ఆస్తి కోసం అమానుషం: నిన్న తండ్రి, నేడు కొడుకు..) మృతదేహాన్ని దర్గామిట్ట ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, ఎస్సై విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. మృతురాలు ఎడమ, కుడి చేతుల మీద ఇంజెక్షన్లు చేసుకున్న ఆనవాళ్లను గుర్తించారు. కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. భర్త మృతిచెందిన కొద్దిరోజులకే శిరీష మృతిచెందడంతో విషాదం నెలకొంది. -
రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
సాక్షి, కర్ణాటక (చెళ్లకెరె రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని నవ దంపతులు మృతి చెందిన ఘటన గరణి క్రాస్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు టీ.సందీప్(25), భవ్య(22)లకు ఆరు నెలల క్రితమే వివాహమైనట్లు సమాచారం. సందీప్ నగరంగెరె వాసి కాగా భార్య పుట్టినిల్లయిన హనుమంతనహళ్లికి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. తళకు పోలీసులు మృతదేహాలను చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..) (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) -
నవ దంపతులకు అంత్యక్రియలు
సబ్బవరం(పెందుర్తి): పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సబ్బవరానికి చెందిన నవ దంపతులు యడ్లపాటి వెంకటేష్, నవ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు డ్రైవర్ చంద్రశేఖర్ కూడా మరణించడం విదితమే. ఇదిలా ఉండగా.. నవ జంట మృతదేహాలు సబ్బవరం శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి శుక్రవారం చేరుకున్నాయి. వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు గుంటూరు జిల్లా గోవాడకు చెందిన ఆళ్లపాటి నవ్య కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ కాలనీ అంతా విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటేష్ తల్లి కృష్ణవేణి రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. కొత్త జంట మృతదేహాలను సబ్బవరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. (కాళ్ల పారాణి ఆరక ముందే..) -
కాళ్ల పారాణి ఆరక ముందే..
భీమడోలు సమీపంలోని పూళ్ల గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనవ జంట దుర్మరణం పాలైంది. కారు డ్రైవరూ అసువులు బాశాడు. ఇటీవలే వివాహమైన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన మానస నవ్య భర్త వెంకటేష్‌తో కలిసి అత్తవారింటికి విశాఖ జిల్లా సబ్బవరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనెల 14న జరిగిన నవ్య పెళ్లినాటి ఫొటో ఇది.. ఏలూరు టౌన్/భీమడోలు: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధూవరులు ఘోర రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొత్త ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంటూ... నాలుగు రోజుల క్రితం ఎంతో వైభవంగా వివాహ వేడుకలు చేసుకున్న నవ జంటను చూసి కాలానికి కన్నుకుట్టిందో ఏమో గానీ... గురువారం మధ్యాహ్నం మృత్యుపాశం విసిరింది. సంతోషంగా అత్తారింటికి బయలుదేరిన నవ్యను, ఆమె భర్త వెంకటేష్‌ను విగత జీవులను చేసింది. నవ జంట కాళ్ళకు వేసిన పారాణి ఇంకా ఆరలేదు... కానీ ఇద్దరినీ మృత్యువు కబళించింది. ఈహఠాత్తు సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చింది. వధువు ఇంటి వద్ద వివాహ వేడుకలు పూర్తి చేసుకుని, వరుడి స్వస్థలం విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ఇంటికి కారులో వెళుతుండగా గురువారం మధ్యాహ్నం భీమడోలు సమీపంలోని పూళ్ళ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవజంటతోపాటు డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కంటతడి పెట్టిస్తున్న వైనం సాఫ్ట్వేర్ ఇంజినీర్ యడ్లపల్లి వెంకటేష్, ఆలపాటి మానస నవ్య ఇద్దరూ.. ఈనెల 14న ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు. తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు. తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. భర్త వెంకటేష్ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు. కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తెలిసి ఇరు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా తిరిగిరాని లోకాలకు చేరటం తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ ప్రమాదం ఎలా జరిగింది ? కారు ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కారు డ్రైవర్ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది. పెళ్ళి కుమార్తె నవ్య సోదరుడు భరత్ చెప్పే విషయాలను బట్టి.. ఏదో లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్ దాటి అటువైపు దూసుకుపోయిందని చెబుతున్నాడు. కారు టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించిన డీఎస్పీ పూళ్ళ గ్రామం వద్ద జరిగిన ఈ కారు ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ చూడడంతో వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే సరికే ముగ్గురు మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ పరి శీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదం: నవ దంపతులు దుర్మరణం
ఏలూరు టౌన్: రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈనెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు సబ్బవరానికి కారులో బయలుదేరారు. పూళ్ల గ్రామం సమీపానికి వచ్చేసరికి హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో ఎగురుతూ ఆవలి వైపు పడింది. అదే సమయంలో ఏలూరు వైపు వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే దంపతులు, కారు డ్రైవర్ చంద్రశేఖర్ (57) మృతి చెందారు. భరత్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
లాక్‌డౌన్‌తో 6 కాస్తా 68..
సాక్షి, భువనేశ్వర్ : ఏడు రోజుల హనీమూన్ కోసం మలేషియా వెళ్లిన నవదంపతులు లాక్డౌన్ కారణంగా 68 రోజుల తరువాత ఇంటికి చేరారు. ఈ సంఘటన రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. నవరంగపూర్ ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్ అతడి భార్య పల్లవి మిశ్రాలు పెళ్లి తరువాత గత మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. హానీమూన్ ముగించుకొని మార్చి 17వ తేదీన భారత్ రావాల్సి ఉంది. అదే సమయంతో కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా దాదాపు లాక్డౌన్లో ఉండటంతో వీరు మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి స్వదేశం వచ్చేందుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోన కారణంగా భారత్ దేశ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ( తల్లి ప్రేమకు ప్రతీక ) దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడి ప్రయాణికులందరికి వసతి ఏర్పాటు చేసింది. భారత్ ప్రభుత్వం లాక్డౌన్ 4లో విదేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమంలో భాగంగా నవదంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం భువనేశ్వర్ చేరుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
కరోనా వేళ...పెళ్లి పెద్దలు నలుగురే
-
పెళ్లి జంటకూ నో పర్మిషన్!
శ్రీకాకుళం :ఇటీవల వివాహాలు చేసుకున్న నూతన వధూవరులకూ కరోనా ఎఫెక్ట్ తప్పడం లేదు. హిందూ ఆచార సంప్రదాయాలు ప్రకా రం కొత్త జంటలు అత్తారింటికి, కన్నవారింటికి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో రాజాంలో కట్టుదిట్ట చర్యలను చేపడుతున్నారు. ఫలితంగా నూతన జంటలు సైతం ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం నరసన్నపేట నుంచి పార్వతీపురం వెళ్లేందుకు రాజాం వచ్చిన నూతన వధూవరులు ఇక్కడి ఆంక్షలు కారణంగా వెనక్కు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన వేళ..
-
హనీమూన్ కోసం మనాలి.. అంతలో
టీ.నగర్ : విహారయాత్రకు హిమాచ్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లిన చెన్నై నవవరుడు మృతి చెందాడు. సోమవారం భార్య కళ్లెదుటే జరిగిన ఈ విషాద సంఘటన శోకాన్ని నింపింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్ ఆలయం వీధికి చెందిన అరవింద్ (27). ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. డోబీ అనే ప్రాంతంలో ప్యారాగ్లైడింగ్‌లో పర్యాటకులు విహరించడం విశేషం. దీనిని గమనించిన అరవింద్‌కు కుతూహలం ఏర్పడింది. ఇందుకోసం టికెట్ కొనుగోలు చేసి సోమవారం ప్యారాగ్లైడర్ పైలట్ హరూరామ్‌తో అరవింద్ విహరించాడు. దీనిని ఆసక్తితో ప్రీతి గమనిస్తూ వచ్చింది. ఆకాశంలో విహరిస్తుండగానే కొద్ది సేపట్లో ప్యారాగ్లైడర్లో అరవింద్ నడుముకు కట్టుకున్న బెల్ట్ వీడిపోయినట్లు తెలిసింది. దీంతో అరవింద్ ప్యారాగ్లైడర్ నుంచి కింద నున్న పల్లంలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అత్యవసరంగా కిందకు దిగుతూ పైలట్ హరూరామ్ గాయపడ్డాడు. అతన్ని అదే ప్రాంతంతోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కులు హాస్పిటల్‌కు తరలించారు. భర్త మృతదేహాన్ని చూసి ప్రీతి రోదించడం అక్కడి వారిని కలచి వేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో భద్రతా బెల్ట్‌ను సరిగా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి
సాక్షి, పట్నా: బిహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో భారీ వరదల కారణంగా కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి ఎదురైంది. వివాహం అనంతరం వరుడితో కలిసి వధువు ఇంటికెళుతున్న సమయంలో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఫలితంగా కారు ప్రయాణం కష్టంగా మారింది. దీంతో స్థానికులు ప్లాస్టిక్ డ్రములతో తయారుచేసిన ఓ నాటు పడవలో వధూవరులను అక్కడి నుంచి రోడ్డు దాటించి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిహార్‌కు వరద ముప్పు నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా సరిహద్దు రాష్ట్రమైన బిహార్ వరద ముప్పులో చిక్కుకుంది. బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్, మజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్ గంజ్ జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పరీవాహక ప్రాంత గ్రామాల్ని ముంచెత్తుతున్నాయి. దీంతో వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్, బుది గండక్, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని బిహార్ సీఎం నితీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అల్లాడుతున్న అసోం వరద ఉధృతితో అసోం అల్లాడుతోంది. బ్రహ్మపుత్ర సహా 5 ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతూ ఊళ్లను ముంచెత్తుతున్నాయి. వరదల వల్ల అసోంలో మృతిచెందినవారి సంఖ్య ఇప్పటికే 7కు చేరింది. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో 14 లక్షలమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్ర అధికారులు తెలిపారు. 2వేలకుపైగా గ్రామాలు నీటిముంపులో ఉన్నాయి. కజిరంగా జాతీయ పార్క్70శాతం మునిగిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితిని సీఎం సరబానంద సోనోవాల్ వివరించారు. అసోంలో వరదల ధాటికి ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. మోరేగావ్ జిల్లా తెంగాగురిలో స్కూల్ బిల్డింగ్ క్షణాల్లో నేలమట్టమైంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది వరద జనావాసాల్లోకి చేరడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్ విలవిల్లాడుతోంది. గత 5 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు నదులు పోటెత్తుతున్నాయి. వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. వరదల్లో చిక్కుకుని, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకూ 50మంది మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయ్యారు. మరో 12మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. లలిత్పూర్, ఖోతంగ్, భోజ్‌పూర్, కావ్రే, మాక్వాన్‌పూర్, సిందూలి, ధాదింగ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది. మరో 24గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు నేపాల్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అధికారులు సహాయక చర్యలు మరింత వేగంవంతం చేశారు. -
అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి
సాక్షి, ఖమ్మం : ఉరిమే మేఘాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. మెరిసే మెరుపులు భయకంపితులను చేస్తాయి. ఉరుమూ, మెరుపుల కలయికలో కురిసే చినుకులు మాత్రం మేనుకు కొత్త హాయినిస్తాయి. తోడుగా నిలవాల్సిన సహచరి సాన్నిహిత్యం ఉంటే ఆ హాయి ఆనందాన్నిస్తుంది. కొత్త దంపతులకు ఈ రకమైన పరిసరాలు ఉత్తేజాన్నిస్తాయి. కానీ ఏం లాభం.. చూసుకోవడానికి కూడా వీలు లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే విపరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. నిజంకాకపోయి ఉంటే బాగుండేదన్న తలంపులు. పదే పదే గుర్తొచ్చే భాగస్వామి(ని). అయినా కుదరదంటే కుదరదంతే..అనే పెద్ద వాళ్ల ఆంక్షలు.. కాంక్షలున్న చోట ఆంక్షలు ఎలా నిలుస్తాయనే కుర్రకారు ఆలోచనలు. వెరసి ఆషాఢమాసం నవ దంపతులకు ఎడబాటు తప్పదు. ఈ నేపథ్యంలో నూతనజంటను ఆషాఢంలో విడిగా ఎందుకుంచాలంటే.. బంధం బలోపేతం.. ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు పెళ్లయిన కొత్త జంట మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో దంపతుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అంతగా ప్రాధాన్యత లేకుండేది. ఈ ఆషాఢ మాసం ఎడబాటు కారణంగా వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయాలు బోలెడు.. ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఎడబాటు భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సప్‌లు, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాలు ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. తమ విరహాగ్ని చల్లార్చు కునే పలు రకాల ప్రత్యామ్నాయాలకు కొదవేం లేదు. అభిప్రాయాలు, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ కాలాన్ని సులువుగా గడిపేయొచ్చు. శాస్త్రీయ కోణంలోనూ... మంచిదే నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం ఏనాటి నుంచో వస్తోంది. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో ఆరునెలల పాటు అత్తవారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు స్తంభించిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండడం అంత మంచిది కాదని ఎందుకంటారంటే.. ఈ సమయంలో ఒక వేళ గర్భధారణ జరగడం తల్లి, బిడ్డలకు అంత క్షేమకరం కాదు. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా సమీప జలాశయాలతోపాటు పరిసరాల్లోని నీళ్లుకలుషితం అవుతాయి. కలుషిత నీటిని వినియోగించినా అనారోగ్యాలు ప్రబలే అవకాశాలున్నాయి. చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు విస్తరించే ప్రమాదం ఉంటుంది. చీడ, పీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం. ఇపుడు గర్భధారణ జరిగితే ప్రసవ సమయం వచ్చే ఎండాకాలంలో ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే వేసవి సమయం జన్మించే శిశువు బాహ్య పరిసరాలు, ఉష్ణోగ్రతను భరించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఆషాఢ మాసంలో దంపతులు వియోగం పాటిస్తే సంతానోత్పత్తి సమయాన్ని జూన్, జూలై వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా సుఖ ప్రసవానికి అనుకూలంగా ఉంటుంది. శిశువు సైతం తన నూతన పరిసరాలకు సులువుగా అలవాటు పడతాడు. ఈ శాస్త్రీయ నేపథ్యంలో కొత్త జంటకు ఎడబాటును అనివార్యమని పెద్దలు నిర్ణయించారు. ఎడబాటు ఎందుకంటే..? కొత్త కోడలు తన అత్తను చూడకూడదు. అల్లుడు అత్త వారింటి గడప దాటకూడదు అనే నిబంధనలు మానవ సమాజంలో తరచూ వినపించేవే. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీలేవు. అయితే దీని వెనుక శాస్త్రీయత, సంప్రదాయం దాగి ఉంది. ప్రధానంగా మన దేశం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని అందరికీ తెలిసిందే.. మృగశిరకార్తె నుంచి ప్రారంభమైన తొలకరి చినుకుల రాక.. క్రమంగా ఆషాఢ మాసంలో అడుగు పెట్టే సరికి పూర్తి వర్షాకాలంగా మారిపోతుంది. సాగు ప్రధానవృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. చినుకుల రాక కోసం ఎదురుచూస్తూ నల్లటి మేఘాలపై కొండంత ఆశతో దుక్కులు దున్నడం, నాట్లు వేయడం వంటి పనులు అనివార్యంగా జరపాల్సి ఉంటుంది. బడికి వెళ్లే పిల్లల్ని వదిలేస్తే పెద్దవాళ్లంతా వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు కాబట్టి కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. కాబట్టి కర్మభూమిగా కీర్తిగాంచిన దేశంలో చేసే వృత్తిని కాదని మిగిలినవేవీ చేయాలనుకోరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం వి«ధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు. ఆషాఢం ‘పట్టి’ ఆషాఢమాసంలో పుట్టింటికి పంపించే కోడలికి గతంలో అత్తవారింటి నుంచి ఆషాఢపట్టి అని ఒక పెట్టెను ఇచ్చి పంపించేవారు. దీనిలో ఉత్తరాలకట్ట, పెన్ను, పచ్చీసులాంటి ఆటవస్తువులుండేవి. నెలరోజుల ఎడబాటు కాలంలో భర్తకు ఉత్తరాలు రాసేందుకు, భర్త జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండేందుకు, కాలక్షేపానికి పచ్చీసు ఉపయోగపడేది. ఈ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మేఘ సందేశాలు, పావురాల సందేశాలు ఉండేవంటారు. ఆషాఢ మాసంలో ఎదురయ్యే ప్రేయసీప్రియుల విరహవేదన ప్రధాన కథావస్తువుగా మహాకవి కాళిదాసు మేఘసందేశం రచించారు. ఇప్పుడు సెల్ఫోన్లు వచ్చాక.. వాట్సప్.. వీడియోకాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. కొత్త కోడళ్లకు ప్రత్యేకం నాకు ఇటీవలే వివాహమైంది. ఆషాఢమాసంలో పెట్టుపోత విషయంలో అత్తారింటివారు, అమ్మనాన్నలు కొత్తగా కొత్త బట్టలు ఇవ్వడం ఆచారం. అందుకోసం ఇటీవల షాపింగ్ చేశాం. చాలా రకాల కొత్త చీరలు, డ్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు ఆకర్షించాయి. చాలా తక్కువ ధరకే అనుకున్న బట్టలు వచ్చాయి. – నవ్యశ్రీ, నూతన వధువు, ఖమ్మం -
పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి..
-
పారాణి ఆరకముందే..
సాక్షి,భువనగిరిఅర్బన్ : అగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న నవ దంపతులు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కూనూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బేజాడి కుమారస్వామి కుమారుడు బేజాడి నరేష్(29) సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బేజాడి నరేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన భువనగిరి మండలంలోని కేసారం గ్రామానికి చెందిన బాల్ద మల్లేష్ కుమార్తె దివ్య(21)తో వివాహమైంది. కాగా బ్రహ్మణపల్లి గ్రామం నుంచి బేజాడి నరేష్ తన బైక్‌పై భార్య దివ్యతో కేసారం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మోత్కూర్ వైపు నుంచి రాయగిరి వైపునకు వస్తుండగా మండలంలోని కూనూరు గ్రామ శివారులోని యాదాద్రి ఫంక్షన్‌హాల్ వద్ద అగి ఉన్న ఓ ట్రాన్స్‌ఫోర్టు లారీని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు రోడ్డుపై ఎగిరిపడటంతో వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నవదంపతులు నరేష్, దివ్య మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఇరు కుటుంబాల బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. -
నవదంపతుల ఆత్మహత్య
-
వెడ్డింగ్ వీడియో: తప్పిన ప్రమాదం
-
వెడ్డింగ్ వీడియో షూట్..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఆ జంట బంధువుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైంది. తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన జీవితంలో మధుర ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఎదురైన ప్రమాదం నుంచి తప్పించుకోవటంతో వారితో పాటు బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే... చెయినే, లుకాస్ కోపెస్ అనే జంట జూన్ 30న వివాహాం చేసుకున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన మధుర ఙ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వెడ్డింగ్ వీడియో చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఒక చెట్టు కింద కూర్చున్న ఈ జంట ముచ్చట్లలో మునిగిపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆనంద క్షణాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు. చెట్టు కొమ్మ విరిగిపడటాన్ని గుర్తించిన వధూవరులు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. వీరి వెడ్డింగ్ వీడియో చిత్రీకరించిన ఫొటోగ్రఫీ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘ఆ చెట్టు కంటే వీరి ప్రేమ బంధం ఎంతో దృఢంగా ఉండాలంటూ’ క్యాప్షన్ జత చేసింది. -
జేసీబీలో ఊరేగిన వధూవరులు
బొమ్మనహళ్లి : పెళ్లి అనేది జీవితంలో మరుపురాని ఘట్టం. వారి వారి ఆర్థిక స్థోమతలను బట్టి వివాహాలను వైభవంగా చేసుకుంటారు. ఇందులో మరో తరహా వ్యక్తులు ఉంటారు. ఆకాశంలో, నీటి అడుగు భాగంలో పెళ్లిల్లు చేసుకుని సాహసాలు చేసేవారు మరికొందరు. ఇక్కడ జేసీబీలో ఊరేగుతున్న ఈ నూతన జంటను చూడండి... పనిపై ఉన్న ప్రేమతోనే సదరు వరుడు, వధువును ఒప్పించి పెళ్లి అయిన తరువాత ఊరేగింపు ఇలా వెరైటీగా చేసుకున్నారు. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సంట్యార్ అనే ప్రాంతానికి చెందిన చేతన్ జేసీబీ ఆపరేటర్. పని పట్ల నిబద్దత ఎంతో ఎక్కువ. పనిని ప్రేమిస్తాడు. సోమవారం చేతన్‌కు మమతతో వివాహం జరిగింది. పెళ్లి తతంగం అంతా పూర్తయిన తరువాత పెళ్లి కుమారుడు చేతన్ జేసీబీలో ఊరేగింపు నిర్వహించాలని కోరాడు. ఇందుకు ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో ఒక జేసీబీని తెప్పించి దానికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నూతన వధూవురులను రెండు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేశారు. దారి పొడవునా వధువు ముసిముసి నవ్వులు అందర్ని ఆకట్టుకున్నాయి. చేతన్ స్థానికంగా మంచి పేరు ఉండటంతో పెద్ద ఎత్తున బంధువుల, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. -
విషాదం: నవదంపతుల ఆత్మహత్య
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రొయ్యలగూడెం మండలం చొప్పనరామన్నగూడెంలో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన విజయరాజు, ప్రియాంకలకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కాపురం ఎక్కడ పెట్టాలనే అంశంలో దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య చర్చ జరిగింది. హైదారాబాద్‌లో కాపురం పెట్టాలని ప్రియాంక, చొప్పనరామన్నగూడెంలోనే ఉండాలని విజయరాజు వాదులాటకు దిగారు. అనంతరం అర్థరాత్రి సమయంలో ప్రియాంక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. దాంతో మనస్థాపానికి గురైన విజయరాజు కూడా బలవన్మరణం చేసుకున్నాడు. దంపలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తని చంపించిన కేసులో సంచలన నిజాలు
-
హత్యకేసులో ఫేస్బుక్ ప్రేమికుడు అరెస్ట్
సాక్షి, విజయనగరం టౌన్: ఇటీవల విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలో భర్త గౌరీశంకర్‌ను హతమార్చిన భార్య సరస్వతి ఫేస్బుక్ లవర్ మడ్డు శివను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్తున్న శివను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. పెళ్లైన తొమ్మిది రోజులకే భర్తను మట్టుబెట్టిన కేసులో భార్య సరస్వతితో పాటు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గౌరీశంకర్ హత్య జరిగిన నాటి నుంచి మడ్డు శివ పరారీలో ఉన్నాడు. అతడి కోసం అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు రాష్ట్రం దాటి వెళ్తుండగా పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు. -
ఆ హత్య చేయించింది భార్యే!
చిన్నప్పటినుంచీ అనుకుంటున్నా... మేనమామతో ఇష్టంలేని పెళ్లి... ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడిని వదిలి ఉండలేని పరిస్థితి... ఆమెను హత్యవైపు ఉసిగొల్పాయి. పెద్దలకు ప్రేమ విషయం చెప్పలేక అప్పటికి తాళి కట్టించుకున్నా... ఎలాగైనా వదిలించుకోవాలన్నదే ఆమె ఆలోచన. అందుకు ప్రేమికుడి తోడు అర్థించింది. ఆయన ద్వారా ఓ కిరాయి హంతకుడితో బేరం కుదుర్చుకుంది. పథకం ప్రకారం వారిని రప్పించి... తాము వెళ్తున్న ప్రాంతాన్ని గూగుల్‌మ్యాప్ ద్వారా పంపించి.. ఆన్లైన్లో డబ్బు చెల్లించి ఎంచక్కా కట్టుకున్నోడిని హత్యచేయించి... అదో దోపిడీగా చిత్రీకరించేందుకు యత్నించి... విఫలమైంది. విజయనగరం టౌన్: గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న హత్యోదంతం ఎంతగా సంచలనం కలిగిం చిందో... కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సంఘటనకు సూత్రధారి హతుడి భార్యే అని తేలడంతో ఇప్పుడు అవాక్కవ్వడం జిల్లా ప్రజల వంతయిం ది. పథకం ప్రకారం కట్టుకున్నోడిని కడతేర్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం అయిన ప్రియుడు... విశాఖకు చెందిన కిరాయి హంతకుడిని వినియోగించుకున్నట్టు స్పష్టమైంది. దీనికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ జి.పాలరాజు జిల్లా కాన్పెరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది...? గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపుడివలసకు చెందిన యామక గౌరీశంకరరావు, పదిరోజుల క్రితం పెళ్లి చేసుకున్న అదే మండలం కడకెళ్లకు చెందిన సరస్వతితో కలసి బైక్‌పై వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి వారిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తనభర్తను హతమార్చి, తన మెడలోని బంగారాన్ని అపహరించుకుపోయారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడనీ, గత నెల 28న తమ వివాహం జరిగిందనీ, ఇద్దరం కలసి పార్వతీపురం వచ్చి, హోండా మోటార్ సైకిల్‌ను దాడి హోండా షోరూమ్‌లో సర్వీసింగ్‌కి ఇచ్చి అక్కడి బంధువుల ఇంటికి వెళ్లామనీ, మధ్యాహ్నం భోజనం తర్వాత షోరూమ్నుంచి బైక్ తీసుకుని వీరఘట్టం వెళ్తుండగా మార్గమధ్యలో లఘుశంక తీర్చుకునేందుకు దిగగా ఈ సంఘటన జరిగిందనీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ఎస్పీ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జి.పాలరాజు వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. పెదమానాపురం తనిఖీ కేంద్రం వద్ద ముగ్గురు వ్యక్తులు రాత్రి 11.30 గంటల సమయంలో రావడంతో అనుమానంతో వారిని ప్రశ్నించారు. వాళ్లు ప్రయాణిస్తున్న ఆటో విశాఖ రిజిస్ట్రేషన్ కలిగి ఉండటంతో పాటు, వారు ముగ్గురూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిది విశాఖపట్నానికి చెందిన మెరు గు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజుగా తెలిపారు. వారితో వచ్చిన ఆటోడ్రైవర్ పేరు దేవరాపల్లి కిశోర్‌గా తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెదమానాపురం పోలీసులు వారిని మరింత లోతుగా ప్రశ్నించడంతో గౌరీశంకర్‌పై దాడికి పాల్పడి, అతడిని హతమార్చింది తామేనని అంగీకరించారు. పథకం ప్రకారమే హత్య సరస్వతికి ఇష్టం లేకుండా మేనమామ గౌరీశంకర్‌తో వివాహం జరిగింది. ఆమె విశాఖకు చెందిన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తిని ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమలో ఉంది. ఇష్టం లేని వివాహాన్ని రద్దుచేసుకోవాలంటే భర్త ను హతమార్చడమే సరైన నిర్ణయమని శివతో పథకం రూపొందించింది. విశాఖపట్నానికి చెంది న మెరుగు గోపిని కలిసి, తన భర్తను హత్యచేసేం దుకు సాయంచేయాలనీ, అందుకు ప్రతిగా బంగా రం ఇస్తానని తెలిపింది. ముందుగా మొబైల్లో టీఈజెడ్ యాప్ ద్వారా రూ.8వేలు బదిలీ చేసిం ది. బంగారు ఉంగరాన్ని అందించింది. తర్వాత శివ రూ.10వేలు అడ్వాన్సుగా అందించారు. ఒప్పందం కుదిరిన తర్వాత గోపీ తన స్నేహితులు విశాఖకు చెందిన పాతనేరస్తుడు, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజులకు విషయం తెలిపి, హత్యచేసేందుకు సాయపడాల్సిందిగా కోరారు. హత్యకు పథకాన్ని రూపొందించిన గోపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరస్వతికి తెలిపి, పథకాన్ని ఆమెకు వివరించాడు. దంపతులు పార్వతీపురం వచ్చినరోజు నిందితులు ముగ్గురూ ఆటోలో విశాఖ నుంచి పార్వతీపురానికి వచ్చి, తిరిగి బైక్‌పై వెళ్తున్నవారిని ఫాలో అవుతూ, ఆమెతో చాటింగ్ చేస్తూ వచ్చారు. ఐటీడీఏ పార్కు వద్ద కాపు కాసి ఉండగా, పథకం ప్రకారం సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు బైక్ ఆపమని చెప్పింది. భర్త గౌరీశంకర్ బైక్ ఆపడమే తరువాయి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో తలపై కొట్టగా గౌరీశంకర్ అక్కడకక్కడే ప్రాణాలు వదిలాడు. మూడు గంటల్లోనే కేసు ఛేదన రాత్రి 8 గంటలకు హత్య జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ అటుగా వెళ్లే అన్ని చోట్లా వాహన తనిఖీలు ముమ్మరం చేయించారు. సరస్వతితో మాట్లాడినప్పుడు పొంతనలేని సమాధానం ఇవ్వడం, పెదమానాపురం వద్ద అనుమానాస్పదంగా ఆటోలో ముగ్గురు కనిపించడంతో కేవలం మూడు గంటల్లోనే కేసును పరిష్కరించగలిగారు. రెండేళ్లుగా శివతో ప్రేమాయణం 2016లోనే మడ్డుశివతో సరస్వతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. వారి స్నేహం ప్రేమవరకూ దారితీసింది. అయితే తనకు ఇష్టం లేకున్నా మేనమామ గౌరీశంకరరావుతో తల్లిదండ్రులు పెళ్లిచేయడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇష్టం లేని భర్తతో శారీరకంగా కలిసేందుకూ సమ్మతించలేదు. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. ఆభరణాలు తనవద్దే ఉంచుకుని... తన గాజులను పగలగొట్టుకుని తనపైనా దాడిజరిగిందంటూ నమ్మబలికింది. విచారణలో నేరం నిరూపణ కావడంతో నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ వివరించారు. రోదనలతో మార్మోగిన ఏరియా ఆస్పత్రి పార్వతీపురం: తోటపల్లి ఐటీడీఏ పార్కువద్ద సోమవారం రాత్రి నవదంపతులపై దాడి చేసి అందులో వరుడిని హతమార్చిన సంఘటన ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళం జిల్లాలోనూ సంచలనం సృష్టించింది. ఇంతలోనే ఆ హత్యను కట్టుకున్న భార్యే చేయించిందని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఈ సంఘటనతో గౌరీ శంకర్రావు కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇంత ఘోరం జరుగుతుం దని ఊహించలేదని తల్లి, దండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడు అమాయకుడని, చాలా మంచివాడని అటువంటివాడిని ఇలా చంపేస్తారని ఊహించలేదని రోదించారు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువుల రోదనతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతం విషాదం అలముకుంది. నమ్మిన కోడలే పుత్ర శోకాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని, ఇష్టం లేకపోతే విడిచి వెళ్లిపోయినా బాగుండేదని ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. కాగా ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఆస్పత్రివద్దే మంగళవారం పరామర్శించారు. -
నీకేమి అపకారం చేశాం...
సాక్షి, విజయనగరం టౌన్ / వీరఘట్టం: విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన నవ వరుడి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. గరుగుబిల్లి మండలం ఐడీడీఏ పార్కు వద్ద సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న కొత్తగా పెళ్లయిన జంటపై ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అందులో భర్తను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్యచేసిన విషయం విధితమే. అయితే ఇది నగల కోసం దొంగలు చేసిన పని కాదని, ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసిందని జిల్లా ఎస్పీ జి.పాలరాజు మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులను పట్టుకునేందుకు రంగలోకి దిగిన పోలీసులు నలుమూలల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పెదమానాపురం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో మెరుగు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజు, ఆటోడ్రైవర్ దేవరాపల్లి కిశోర్ నిజాన్ని అంగీకరించారు. సరస్వతి ఫేస్బుక్లో పరిచయమైన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో మేనమామ అయిన గౌరీశంకరరావుతో ఇష్టం లేని పెళ్లి జరగడంతో భర్తను హతమార్చి ప్రియుడికి చేరుక కావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం శివ ద్వారా సరస్వతి విశాఖపట్నానికి చెందిన గోపీని కలిసి భర్తను హత్య చేస్తే బంగారం ఇస్తానని తెలిపింది. ముందుగా రూ.8వేలు నగదు, బంగారు ఉంగరం ఇచ్చింది. శివ మరో రూ.10వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు. పథకం ప్రకారం వారు ఆటోలో కాపుకాసి ఉన్న ప్రదేశానికి రాగానే భర్తతో బైక్‌పై వెళ్తున్న సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు వెళతానని బైక్ దిగి పక్కకు వెళ్లింది. వెంటనే దుండగులు గౌరీశంకర్‌పై ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో నిందితులు ఉపయోగించిన ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నారు. నిశ్చేష్టులైన అత్తమామలు తమ కుమారుడిని కోడలే హత్య చేయించందన్న విషయం తెలియడంతో మృతుని తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కట్టుకున్నవాడిని కడతేర్చడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ సరస్వతిపై మండిపడ్డారు. మంగళవారం స్వగ్రామం చిట్టపుడివలసకు వచ్చిన గౌరీశంకర్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు భోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కాని ఇలా భర్తనే పాశవికంగా మట్టుపెట్టడానికి చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నతనం నుంచీ తాత గారి ఇంటి వద్దే ఉండి చదువుకుంటూ, అన్ని అవసరాలకూ బావ (భర్త గౌరీ శంకర్) ఇచ్చే డబ్బులతోనే జల్సాలు చేసిన సరస్వతి చివరకు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. -
నవదంపతుల దాడి కేసులో కొత్త కోణం
-
నవదంపతులపై దొంగల దాడి
గరుగుబిల్లి(కురుపాం): వివాహామైన పది రోజులకే ఆ జంటపై విధి కన్నెర్ర జేసింది. బైక్‌పై భార్యతో వెళుతున్న భర్తపై ముగ్గురు దొంగలు దాడి చేసిన ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు (25)తో గత నెల 28న వివాహమైంది. వీరిద్దరూ సోమవారం తమ ద్విచక్రవాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి వెళ్తుండగా గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. గౌరీ శంకర్రావును రాడ్డుతో తలపై మోదడంతో అతనికి తీవ్రగాయాలై మృతి చెందగా భార్య సరస్వతి గాయాలపాలైంది. ఈమె మెడలో ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారయ్యారు. తన కళ్ల ముందే భర్తను దొంగలు హతమార్చడంతో సరస్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. దొంగల దాడి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సరస్వతికి ఆస్పత్రిలో చేర్పించారు. ఏఎస్సీ దీపికాపాటిల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ మీద వెళ్తున్న నవ జంటపై దాడి..
-
మళ్లీ వస్తానమ్మా అంటూ వెళ్లి ...
నవ దంపతులను బలిగొన్న కారు స్కానింగ్‌కు వెళ్లొస్తుండగా దుర్ఘటన బీచ్ రోడ్డులో నేమాం వద్ద సంఘటన చూపులు కలిశాయి. మనసులూ ఒక్కటయ్యాయి. పెళ్లి బంధంతో తమ ప్రేమకు సార్థకత చేకూర్చాలని ఆశపడ్డారు. పెద్దల అంగీకారంతో.. మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ప్రపంచంలో తమకంటే అదృష్టవంతులు లేరని మురిసిపోయారు ఆ నవ దంపతులు. అంతా సాఫీగా, ఆనందంగా సాగిపోతుందనుకున్న వారి జీవితాల్లో విధి వక్రీకరించింది. పెళ్లి జరిగి మూడు నెలలు ముగియకుండానే ఆ దంపతులను మృత్యువు కాటేసింది. కాకినాడ బీచ్ రోడ్లో నేమాం వద్ద ఆదివారం మోటార్ బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా : కొత్తపల్లికి చెందిన కొండేటి నరేష్(27), రవీంద్రపురానికి చెందిన భాగ్యలక్ష్మి(22) ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మార్చి 23న వీరికి వివాహమైంది. పిఠాపురంలో నరేష్ ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా రెండు నెలల నుంచి భాగ్యలక్ష్మి కడుపు నొప్పితో బాధపడుతోం ది. కొన్ని రోజులుగా పిఠాపురంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపిస్తున్నారు. శనివారం ఉదయం నొప్పి తీవ్రం కావడంతో, పిఠాపురంలో వైద్యుడి వద్దకు భార్యాభర్తలు వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు, స్కానింగ్ తీసి, వ్యాధి నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. దానిని బట్టి మందులు వాడితే, నయమవుతుందని పేర్కొన్నారు. కాకినాడలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లాలంటూ లెటర్ రాసిచ్చారు. శనివారం సాయంత్రం కావడంతో ఆ దంపతులు ఆగిపోయారు. ఆదివారం ఉదయం వర్షం కురుస్తున్నా, మోటార్ బైక్‌పై వారిద్దరూ కాకినాడకు వెళ్లి స్కానింగ్ తీయించి, రిపోర్టు తీసుకున్నారు. కొత్తపల్లిలో బంధువుల ఇంట్లో భోజనం చేశాక, వైద్యుడి వద్దకు వెళదామనుకున్నారు. ఈ క్రమంలో కాకినాడ నుంచి బీచ్ రోడ్డు మీదుగా కొత్తపల్లికి బైక్‌పై పయనమయ్యారు. కాకినాడ రూరల్ మండలం నేమాం సమీపంలో, అన్నవరం నుంచి ఉప్పాడ మీదుగా కాకినాడ వెళుతున్న కారు వారి బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయమైన నరేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొన ఊపిరితో ఉన్న భాగ్యలక్ష్మిని స్థానికులు కాకినాడ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ప్రేమను జయించి.. మృత్యువుకు తలవంచి.. ప్రేమను సార్థకత చేసుకుని, జీవితాంతం కలిసుండడానికి మూడుముళ్ల బంధమే పునాది అవుతుంది. దీనికి ఇరువర్గాల పెద్దల ఆశీస్సులు అవసరం. వీటన్నింటిలోనూ ఆ ప్రేమజంట జయించారు. పెద్దల ఆశీర్వాదంతో మూడుముళ్ల బంధంలో తమ జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అయితే.. మృత్యువు ముందు వారు తలవంచక తప్పలేదు. కాకినాడ బీచ్ రోడ్డులో కారు ఢీకొని నవ దంపతులు నరేష్, భాగ్యలక్ష్మి మరణించిన విషాద సంఘటన వారి బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. దీంతో వారి స్వగ్రామాలైన కొత్తపల్లి, రవీంద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా నరేష్, భాగ్యలక్ష్మి ప్రేమించుకున్నారు. రవీంద్రపురానికి చెందిన మావూరి ఉమామహేశ్వరికి ఎవరూ లేకపోవడంతో, బంధువుల కుమార్తె అయిన భాగ్యలక్ష్మిని పెంచుకుంది. తల్లి అనుమతి లేనిదే తాను పెళ్లి చేసుకోనని భాగ్యలక్ష్మి స్పష్టం చేయడంతో, నరేష్ అందుకు అంగీకరించాడు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇరువర్గాల పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తమ వివాహానికి సహకరించాలని కోరారు. ఇరువర్గాల పెద్దలు వారి ప్రేమకు తలవంచారు. ఈ ఏడాది మార్చి 23న వీరికి పెళ్లి చేశారు. తన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించాలన్న తపనతో నరేష్ సొంతంగా పిఠాపురంలో వస్త్ర దుకాణం ప్రారంభించాడు. కారు రూపంలో మృత్యువు వారిని కబళించింది. తన బిడ్డ ఇలా విడిచిపెట్టి వెళ్లిపోతాడనుకోలేదని నరేష్ తండ్రి సత్యనారాయణ రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. కంటికిరెప్పలా అల్లారుముద్దుగా పెంచిన కూతురు.. ‘మళ్లీ వస్తానమ్మా’ అంటూ వెళ్లి, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందనుకోలేదని భాగ్యలక్ష్మి తల్లి ఉమామహేశ్వరి గుండెలవిసేలా విలపించింది. బిడ్డ మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేని నరేష్ తల్లి రత్నంను బంధువులు ఓదార్చలేకపోయారు. -
రోడ్డుప్రమాదంలో నవదంపతుల మృతి
పిఠాపురం (తూర్పు గోదావరి) : ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ జంట కలలు కల్లలయ్యాయి. చిలకా గోరింకల్లాంటి ఆ జంటను చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో.. కారు రూపంలో వచ్చి వారి సంతోషాలను కబళించుకు వెళ్లింది. రెండు నెలల క్రితమే వివాహమైన జంట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌రోడ్డులోని నేమామ్ గెస్ట్‌హౌస్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన నరేష్(27), భాగ్యం(21) రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో భార్య గర్భవతేమో తెలుసుకునేందుకు పరీక్షల నిమిత్తం బైక్‌పై ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
ఉద్యోగం కోసం వెళుతూ నవదంపతుల దుర్మరణం
భూత్పూర్: వివాహం జరిగి నెల రోజులైనా గడవకముందే నవదంపతులు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయలుదేరిన ఆ ఇద్దరూ అనూహ్యరీతిలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి పట్టణంలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన కాటి రవికుమార్‌కు (28), తెల్కపల్లి మండలంలోని చిన్నముద్దునూరు వాసి శ్రీలత (25)తో నెలరోజుల క్రితమే వివాహమైంది. రవికుమార్ వనపర్తిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, శ్రీలత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగానూ పనిచేస్తున్నారు. కాగా, నర్సింగ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు శ్రీలత ఊరు చిన్న ముద్దునూరు నుంచి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు బైక్ పై బయలుదేరారు. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. భర్త అక్కడికక్కడే చనిపోగా, భార్య శ్రీలత జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మార్చురీలో రవి, శ్రీలతల మృతదేహాలు. -
పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన వెంకటేష్(23)... రోడ్ నెం.10 సింగాడకుంట బస్తీకి చెందిన వినీతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పకుండా చిక్కడపల్లిలోని ఆర్య సమాజంలో గత నెల 20న వివాహం చేసుకున్నారు. అయితే వినీత తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడంలేదంటూ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వినీత, వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. కాగా సోమవారం వారే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి రక్షణ కావాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. నూతన జంటకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని సూచించారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూలులో జరిగిన రామాంజనేయులు వివాహ వేడుకకు ఆయన హాజరు అయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి వేముల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆనంతరం పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొనున్నారు. -
నవదంపతులకు అంత్యక్రియలు
‘అనంత’లో భార్య, బెంగళూరులో భర్త మృతదేహాలు ఖననం అనంతపురం క్రైం:బెంగళూరు నగరంలో ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడిన నవదంపతుల్లో భర్త మృతదేహాన్ని అనంతపురం జిల్లాలో, భార్య మృతదేహాన్ని బెంగ ళూరులో ఖననం చేశారు. యువ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ పాపంపేటకు చెందిన సుబ్బారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్‌రెడ్డి (31), కోడలు గజనీశ్రీ (26) బెంగళూరు శివారులో హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గజనీశ్రీ మృతదేహాన్ని బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు స్వాధీనం చేసుకుని అ క్కడే ఖననం చేశారు. సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులు, బంధువులు శనివారం రాత్రి అనంతపురంలోని తన ఇంటికి తీసుకొచ్చా రు. ఆదివారం ఉదయం సొంతూరు శింగనమల మండలం ఉల్లికల్లుకు తీ సుకెళ్లి ఖననం చేశారు. కాగా...గజనీశ్రీ నాలుగు నెలల గర్భవతి. కొత్తగా పెళ్లైంది. కలకాలం సుఖ సంతోషాలతో ఉండాల్సిన దంపతులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తలకొరివి పెట్టాల్సిన వాడు తమ కళ్లెదుటే మృత్యువాత పడడాన్ని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. -
నెల రోజులకే నవ దంపతుల ఆత్మహత్య
విజయనగరం: ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. నిండు నూరేళ్లూ కలసి జీవించాలని కలలుకన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెల రోజులకే ఈ ప్రేమ జంట ప్రయాణం విషాదాంతమైంది. ఆశలు ఆవిరయ్యాయి. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మృతులను నెల్లిమర్ల మండలం మెయిడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అత్తింటి వారు పెళ్లిని అంగీకరించలేదనే ఆందోళనతో భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలు పట్టింపులకు పోగా, ప్రేమ జంట మనో ధైర్యం కోల్పోయింది. నవ దంపతుల జీవితాలు అర్దాంతరంగా ముగిశాయి. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల వీజే ఫంక్షన్ హాల్లో జరిగిన జాహ్నవి-ప్రవీణ్ కుమార్ రెడ్డి వివాహ వేడుకకు ఆయన హాజరు అయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. మరోవైపు పులివెందులలో నిన్న వైఎస్ జగన్ బిజీ బిజీగా గడిపారు.