వెడ్డింగ్‌ వీడియో షూట్‌..తృటిలో తప్పిన ప్రమాదం | During Wedding Video Shoot Newlyweds Escape From Falling Tree Branch | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్‌ వీడియో షూట్‌..తృటిలో తప్పిన ప్రమాదం

Published Mon, Jul 9 2018 2:12 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

During Wedding Video Shoot Newlyweds Escape From Falling Tree Branch - Sakshi

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఆ జంట బంధువుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైంది. తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన జీవితంలో మధుర ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఎదురైన ప్రమాదం నుంచి తప్పించుకోవటంతో వారితో పాటు బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  అసలేం జరిగిందంటే... చెయినే, లుకాస్‌ కోపెస్‌ అనే జంట జూన్‌ 30న వివాహాం చేసుకున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన మధుర ఙ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వెడ్డింగ్‌ వీడియో చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఒక చెట్టు కింద కూర్చున్న ఈ జంట ముచ్చట్లలో మునిగిపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆనంద క్షణాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు. చెట్టు కొమ్మ విరిగిపడటాన్ని గుర్తించిన వధూవరులు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. వీరి వెడ్డింగ్‌ వీడియో చిత్రీకరించిన ఫొటోగ్రఫీ ఏజెన్సీ ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఆ చెట్టు కంటే వీరి ప్రేమ బంధం ఎంతో దృఢంగా ఉండాలంటూ’  క్యాప్షన్‌ జత చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement