![Mark Zuckerberg Faces Legal Battle in Pakistan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/meata.jpg.webp?itok=sV-GZ5dd)
వాషింగ్టన్ : ఎవరో ఫేస్‌బుక్‌లో (Facebook) పోస్ట్‌లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్‌బర్గ్ పై విధంగా మాట్లాడారు.
ఆ పాడ్‌కాస్ట్‌లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో ఫేస్‌బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.
ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్‌కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.
Power of Pakistan
😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025
👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment