
మెటా ఇండియాలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మెటా ఇండియా డైరెక్టర్ అజిత్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి మెటా ఇండియా డైరెక్టర్‌గా మనీష్ చోప్రా బాధ్యతలు స్వీకరిస్తారని రాయిటర్స్ తెలిపింది
ఇక మెటా ఇండియా డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అజిత్ మోహన్ స్నాప్‌లో చేరనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మోహన్ ఆసియా-పసిఫిక్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఉటంకిస్తూ టెక్‌క్రంచ్ నివేదించింది.
‘గత 4 ఏళ్లుగా అతను (అజిత్ మోహన్) మన భారతదేశ కార్యకలాపాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సోన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment