విశాఖపట్నం: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ | Cm Ys Jagan Blesses Newly Married Couple At Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Wed, May 3 2023 6:21 PM | Last Updated on Wed, May 3 2023 6:25 PM

Cm Ys Jagan Blesses Newly Married Couple At Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. రుషికొండలోని ఎంపీ నివాసానికి చేరుకున్న సీఎం.. ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానా­శ్రయం నిర్మా­ణానికి సీఎం జగన్‌ బుధవారం భూమి పూజ చేశారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతో పాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్‌ టెక్‌ పార్కు రూపుదిద్దుకోనుంది.
చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement