mvv satyanarayana
-
ఈనాడులో నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. ఎంవీవీ సత్యనారాయణ సవాల్
-
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. ఎంవీవీ సత్యనారాయణ సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్, తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు.‘‘నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా.. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్‌కు ఖరీదైన కార్లు, బంగాళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. ‘‘నేను, నా వియ్యంకుడు 12 స్థలాలు హేమంత్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నా పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు. -
జగన్ ప్రభుత్వం బాగుందని వాళ్లే పబ్లిక్ గా ఒప్పుకున్నారు
-
డ్రగ్స్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంటే టీడీపీ చిల్లర రాజకీయం
-
థ్రిల్లర్ దర్శిని
వికాస్ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాను.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్వీ సూర్యం. -
డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన జోకర్..వంశీ కృష్ణని జనసేన వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
-
జనసేన నేత వంశీకృష్ణ, టీడీపీ నేత వెలగపూడిపై ఎంపీ ఎంవీవీ ఆగ్రహం
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
సాక్షి, విశాఖపట్నం: రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్సార్సీపీ ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎంపీ ఎంవీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్ ఫొటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయలపెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు. వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారు. మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వంశీ. పవన్ కల్యాణ్‌ను వంశీ ఎన్నో సార్లు తిట్టారు. వంశీ చిత్త కార్తి కుక్కతో సమానం. బాబు మోహన్, బ్రహ్మానందంలా కామెడీ యాక్టర్ వంశీ. అతడిలాగా నేను చిల్లర వ్యక్తిని కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బాబు, పవన్ పై ఎంపీ సత్యనారాయణ ఫైర్
-
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు చేర్పించారు: ఎంపీ ఎంవీవీ
-
నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు ?
-
పవన్ కల్యాణ్‌కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నా మాటలను పవన్ వక్రీకరించి చెప్పారు. నేను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు?. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్’’ అంటూ మండిపడ్డారు. ‘‘పవన్ ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడరు?. విశాఖను ఏం చేయాలనుకుంటున్నారో పవన్ చెప్పాలి. నువ్వు సీఎం అభ్యర్థివి అని చంద్రబాబుతో చెప్పించగలవా?. పవన్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారు’’ అని ఎంపీ నిప్పులు చెరిగారు. చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి! ‘‘కనీసం ఎమ్మెల్యేగా కూడా పవన్ గెలవలేకపోయారు. ఎంపీగా గెలిచిన నా గురించి పవన్ మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా పవన్‌కు లేదు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరు. వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదు’’ అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ధ్వజమెత్తారు. -
ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
పీఎం పాలెం(భీవిులి)/ దొండపర్తి(విశాఖ దక్షిణ) : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివారాలిలా ఉన్నాయి. కోలా వెంకటహేమంత్‌కుమార్, ఉలవల రాజేష్, బమ్మిడి రాజేష్ మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులను ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ.1.75 కోట్లు వసూలు చేయడంతో పాటు బంగారు నగలు లాక్కున్నారు. నగర పోలీస్ కమిషనర్‌కి ఎంపీ ఘటనపై ఫోన్లో తెలియజేయగా పోలీసులు బృందాలుగా ఏర్పడి సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి ఆటకట్టించారు. కిడ్నాప్‌నకు గురైన ఎంపీ భార్య, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాన నిందితుడైన కోలా వెంకటహేమంత్‌కుమార్, అతడికి సహకరించిన ఉలవల రాజేష్, న్యాయవాది బమ్మిడి రాజేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న యర్రోలు సాయి(19), బాడితబోయిన బాలాజీ(24)ను ఆనందపురం హైవే కూడలి వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. దమ్ము ఆనందబాబు (26)ను ఆదర్్శనగర్ హైవే రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిదీ గాజువాక. వీరి నుంచి రూ.10 లక్షలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీకి భద్రత పెంపు ఎంపీ ఎంవీవీకు భద్రత పెంచారు. ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)కు కూడా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీని హేమంత్‌కుమార్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు హేమంత్‌కుమార్, రాజేష్, సాయితో పాటు మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకి టూ ప్లస్ టూ, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవీకి వన్ ప్లస్ వన్ భద్రతా సిబ్బందిని కేటాయించారు -
నా భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరం: ఎంపీ ఎంవీవీ
సాక్షి, విశాఖపట్నం: తన భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్లు హేమంత్, రాజేష్‌లు పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘నా ఐదేళ్ల కాల్‌డేటా తీసుకుని, ఎప్పుడైనా ఫోన్ చేసినా, నాకు అతని నుంచి ఫోన్ వచ్చినా చెప్పండి. నాకు అతని నుంచి ఫోన్ వచ్చినా విచారించండి. 13న ఉదయం హేమంత్‌తో పాటు కొందరు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. నా కొడుకును హింసించి డబ్బు, ఆభరణాలు తీసుకున్నారు. మా అబ్బాయి శరత్‌తో నా భార్యను అదేరోజు పిలిపించారు..కానీ మరుసటిరోజు వెళ్లారు. శరత్‌తో ఫోన్ చేయించిన డ్రైవర్‌ను వెళ్లిపొమ్మన్నారు. నా కుమారుడు శరత్‌తో హేమంత్ భీమిలి సీఐకి ఫోన్ చేయించి.. రెండురోజులు పాటు హేమంత్ మా ఇంటి పనిలో ఉంటారని చెప్పించారు’’ అని ఎంపీ ఎంవీవీ అన్నారు. చదవండి: చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు ‘‘వ్యాపారం విషయంలో ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రశాంతంగా వుండే విశాఖలో ఇలాంటివి జరగడం బాధాకరం. రఘు రామకృష్ణం రాజు అనే వ్యక్తి కుక్క తో సమానం.. ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి ఇబ్బందుల్లో ఉంటే ఆయన అలా మాట్లాడటం దారుణం. చంద్రబాబు వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదం.. ఆయన పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.’’ అని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. -
కోటి 75 లక్షలు తీసుకుని ఏం చేసాడు అంటే..!
-
నిందితుల పై పీడీ యాక్ట్..!
-
డబ్బుల కోసమే ఏ కిడ్నాప్..!
-
ఆడిటర్ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్
దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను అరెస్టుచేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ.. కిడ్నాప్ జరిగింది ఇలా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్‌తో లాసెన్స్ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్ చేయించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్ జీవీకి జ్యోతితో ఫోన్‌చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్‌చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్‌కు ఫోన్‌చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆడిటర్ ఫోన్ ట్రాక్‌కు ఎంపీ వినతి ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్‌చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్‌చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు. ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్‌చేసి అతని నెంబర్‌ను ట్రాక్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్‌తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి.. మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్‌కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్‌కు తరలించారు. హేమంత్‌కుమార్‌పై 12 కేసులు.. భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ హేమంత్‌కుమార్ ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్‌చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్‌కుమార్‌ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్‌కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్నాథ్ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు. ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్కుమార్తో పాటు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. -
విశాఖ కిడ్నాప్ ఎపిసోడ్: రియల్ ఎస్టేట్ గొడవలు కాదు.. సినీఫక్కీలో నిందితుల ఛేజ్
సాక్షి, విశాఖపట్నం: కలకలం రేపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖ ఆడిటర్.. వైఎస్సార్సీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరావు కిడ్నాప్ వ్యవహారంపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ స్పందించారు. కిడ్నాపర్లు బుధవారమే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారని.. తొలుత శరత్‌ను, ఆపై ఎంపీ భార్యను, అటుపై జీవీని తమ అదుపులోకి తీసుకున్నారని సీపీ వివరించారు. ఎంపీ కిడ్నాప్‌నకు సైతం యత్నించిన కిడ్నాపర్లు.. అది కుదరదని అర్థమై డబ్బు డిమాండ్ చేసి ఈ క్రమంలోనే పట్టుబడ్డారని వివరించారాయన. ఎంపీ ఎంవీవీ తన తనయుడు శరత్ చంద్రాకు, అలాగే ఆడిటర్ జీవీ(గన్నమనేని వెంకటేశ్వరావు)కి ఎంతసేపు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఉదయం 8గంటలకు ఎంపీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఆడిటర్ జీవీకి ఫోన్ చేస్తే ఆయన లైన్ లోకి వచ్చారు... నాకేమీ కాలేదు, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారు. కానీ మా వద్ద ఉన్న టెక్నికల్ ఎవిడెన్సులు చూస్తే, ఆడిటర్ జీవీ ఏదో పొంతన లేకుండా మాట్లాడినట్టు అర్థమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ రుషికొండ ఏరియాను చూపిస్తోంది. అప్పుడే వాళ్లు కిడ్నాప్‌నకు గురైనట్లు అర్థమైంది. మా దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులందరం ఈ కిడ్నాప్ వ్యవహారం మీద ఫోకస్ పెట్టాం. ఋషికొండ ఏరియాలో కిడ్నాపర్ల సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయి. పద్మనాభాపురం ఏరియాలో కిడ్నాపర్లు వెళ్తున్న కారును గుర్తించాం. ఛేజింగ్ లో కిడ్నాపర్లు తమ వాహనంతో.. మా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు కూడా. కారు సీఐ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దాంతో హేమంత్, రాజేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరిగెత్తారు. వాళ్లిద్దరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కిడ్నాపర్లలో ఒకరు గతంలో ఎంపీకి చెందిన కంపెనీలో సబ్ కాంట్రాక్టరుగా పనిచేశారు. ఎంపీ వద్ద బాగా డబ్బు ఉంటుందని భావించి ఈ కిడ్నాప్ కు ప్రయత్నించారు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయి. హేమంత్ స్వస్థలం భీమిలి" అని సీపీ తివిక్రమ వర్మ వివరించారు. ఎంపీ ఎంవీవీ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. కిడ్నాపర్ల నిన్ననే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారు. మొదట ఎంపీ తనయుడు శరత్‌ని కిడ్నాప్ చేశారు. ఎంపీ భార్యను ఆపై జీవీని కిడ్నాప్ చేశారు. ఎంపీని కిడ్నాప్ చేయడం వీలుకాదని గుర్తించి.. చెరలో ఉన్నవాళ్ల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఎంపీ తనయుడు, జీవీ కలిసి తమకు తెలిసిన వాళ్ల నుంచి డబ్బు రప్పించారు. ఇద్దరూ కలిసి రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లకు ఇచ్చారు. ఈ ఉదయం మరో పాతిక లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పట్టుబడ్డారని సీపీ వివరించారు.17 బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొని కిడ్నాపర్లను పట్టుకున్నాయని వివరించారాయన. నిందితుడు హేమంత్ మీద 12 కేసులు ఉన్నాయి. అతను ఉండేది భీమిలిలో. గతంలో కూడా ఒక హత్య కేసులు, పలు కిడ్నాప్ కేసులు నిందితుడు పై ఉన్నాయి. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. హేమంత్, రాజేష్‌లను పట్టుకున్నాం. మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టాం అని సీపీ వెల్లడించారు. రౌడీషీటర్ హేమంత్ కేవలం డబ్బు కోసమే.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తన కుటుంబం, జీవీ కిడ్నాప్‌నకు గురైనట్లు తనకు అనుమానం వచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. తన కొడుకుని కిడ్నాప్ చేసింది హేమంత్ అనే రౌడీ షీటర్ అని తెలిసిందని ఎంవీవీ తెలిపారు. గతంలో కూడా రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అసలు ఈ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. డబ్బు కోసమే తన కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కమిషనర్, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎటువంటి రియల్ ఎస్టేట్ గొడవలు లేవు. కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. మా అబ్బాయిని కిడ్నాప్ చేసే సమయంలో మా కోడలు ఇంట్లో లేదు. పీకపై కత్తి పెట్టి కిడ్నాపర్లు ముగ్గుర్నీ బెదిరించారు. మొదట మా అబ్బాయిని మొన్న కిడ్నాప్ చేశారు. నిన్న మా భార్యను మా అబ్బాయితో ఫోన్ చేయించి రప్పించారు. తరువాత మా అబ్బాయి నా భార్యతో ఫోన్ చేయించి జీవీని రప్పించారు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు. నన్ను కూడా రప్పించాలని ప్రయత్నించారు. నాకు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో మా వాళ్ళని డబ్బు డిమాండ్ చేశారు. నిన్న(బుధవారం) ఉదయం నేను హైదరాబాద్ వెళ్ళాను. జీవీతో నాకు తప్పుడు సమాచారం ఇప్పించారు. సెక్యూరిటీ వాళ్లు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డారు అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఛేజ్ చేసి మరీ.. శరత్ కిడ్నాప్‌కు గురయ్యాడనే విషయం బయటకు తెలియకుండా కిడ్నాపర్లు జాగ్రత్తలు పడ్డారు. తనకు నీరసంగా ఉందంటూ శరత్ చేత ఎంపీ భార్య జ్యోతికి ఫోన్ చేయించారు. దీంతో ఆమె రుషికొండలోని ఇంటికి చేరుకోగా.. ఆమెనూ తమ చెరలోకి తీసుకున్నారు. ఆపై జీవీని సైతం కిడ్నాప్ చేశారు. ఈ ఉదయం రుషికొండ ఇంటి నుంచి శరత్ ఆడి కార్లోనే ముగ్గురినీ దుండుగులు తీసుకెళ్లారు. పద్మనాభం సమీపంలో ఆడి కార్ పంక్చర్ కావడంతో వాళ్ళను వదిలి పారిపోయిన కిడ్నాపర్లు. అప్పటికే ప్రాధమిక సమాచారం తో వారిని అనుసరించిన పోలీసులు.. ఆపై కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు. -
విశాఖపట్నం: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. రుషికొండలోని ఎంపీ నివాసానికి చేరుకున్న సీఎం.. ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం భూమి పూజ చేశారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతో పాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సౌకర్యాలు మెరుగు పరచండి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పరచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) శరద్‌కుమార్ శ్రీవాస్తవకు పలువురు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో డివిజనల్ కమిటీ సమావేశం మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ కమిటీకి చైర్మన్‌గా బ్రహ్మపూర్‌కు చెందిన చంద్రశేఖర్ సాహూ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగు, పలు హాల్ట్‌లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపుదల, గమ్య స్థానాల పొడిగింపు వంటి వాటిపై వినతి పత్రాలు అందజేశారు. డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జీఎం, వాల్తేర్ డీఆర్ఎంలను అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), భీశెట్టి సత్యవతి(అనకాపల్లి), గొడ్డేటి మాధవి(అరకు),బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), కె.రామ్మోహననాయుడు(శ్రీకాకుళం), రమేష్‌చంద్ర(నవరంగ్‌పూర్), సప్తగిరి శంకర్ ఉలకా(కోరాపుట్), దీపక్బాజీ(బస్తర్ ఎంపీ ప్రతినిధి) హాజరయ్యారు. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి, ఏడీఆర్‌ఎంలు సుధీర్కుమార్గుప్తా(ఇన్ఫ్రా), మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్) పాల్గొన్నారు. -
‘ఈనాడు’పై విశాఖ ఎంపీ పరువు నష్టం దావా
మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ఈనాడు పత్రికపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరువు నష్టం దావా వేయడంతోపాటు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఈనెల 13న ఈనాడులో ‘ఎంపీ గారి దందా’ శీర్షికతో వచ్చిన క«థనం పూర్తిగా నిరాధారమైనదని, తన పరువుమర్యాదలకు భంగం కలిగించేలా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనాడు కథనంలో చెప్పిన పది ఎకరాల 57 సెంట్ల భూమికి సంబంధించిన వాస్తవాలను ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఆ వివరాలేవీ ఈనాడు ప్రస్తావించలేదు ఈ భూమి వ్యాపార లావాదేవీలు 2012లో మొదలై భూ యజమానులతో అగ్రిమెంటు 2018 జనవరి 8న జరిగిందని.. అప్పటికి తాను పార్లమెంటు సభ్యుడ్నిగానీ, కనీసం వైఎస్సార్సీపీ సభ్యుడ్ని కూడా కాదని ఎంపీ స్పష్టంచేశారు. తాను 2018 మేలో వైఎస్సార్సీపీలో చేరానన్నారు. ఒక వ్యాపారిగా ఈ భూమికి చెందిన ప్రైవేటు వ్యక్తులందరితోను ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని నిర్మాణం మొదలుపెట్టానని తెలిపారు. ఈ భవనానికి జీవీఎంసీ 2019 మార్చిలో అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, ఈనాడు పత్రికలో ఈ విషయాలేవీ ప్రస్తావించకుండా తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం.. నిజానికి.. కూర్మన్నపాలెంలో ఈ భూమిపై వివాదం 1982 నుంచి సుదీర్ఘకాలంగా నడుస్తోందన్నారు. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్ లేబర్ బోర్డు (డీఎల్బీ) ఉద్యోగులతోపాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య ఈ వివాదం ఉందని.. దీన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న తనను 2012లో డీఎల్బీ ఉద్యోగులు ఆశ్రయించారని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. ఆ 160 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లాట్ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తామని తాను చెప్పడంతో వారు తమ వాటాను తనకు 2012లోనే అగ్రిమెంటు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో తాను సంప్రదింపులు జరిపానని, 2012లో మొదలైన ఈ ప్రక్రియ చివరకు 2017లో ముగిసిందని, వారికి 30 వేల చదరపు అడుగులు ఇచ్చేలా 2017లో ఎంఓయూ కుదిరిందన్నారు. ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులు ఇచ్చే విధంగా 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నామని, ఇవన్నీ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు, వీటికి ప్రభుత్వంలో ఉన్న వారికి ఎటువంటి సంబంధంలేదని ఎంపీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందాలతోపాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లింపులు కూడా చేశామన్నారు. 2019 మార్చిలోనే ప్లాన్‌కు జీవీఎంసీ ఆమోదం ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించిందని ఎంపీ తెలిపారు. అక్కడ ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా ఇందులో కొన్న సుమారు 1,800 మందికి రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ.30 లక్షలలోపు ధరకే అందించానని, ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో.. ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనం అవాస్తవమని.. ఈనాడు యాజమాన్యం ఖండన ప్రచురించాలని, అలాగే.. ఈనాడు నెట్‌వర్క్‌లో ఈ కథనానికి సంబంధించి ఆన్లైన్ లింక్స్ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనాడు గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, అదే విధంగా ఎడిటర్ (ప్రింట్ మీడియా) పై చట్టబద్ధమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, వారికి రిజిస్టర్డ్ పరువు నష్టం నోటీసును ఇస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇవెక్కడి దుర్మార్గపు రాతలు రామోజీ!
రామోజీరావు దందా ఎలా ఉందంటే.... ఎంవీవీ వ్యవహారం 2012లో మొదలై 2018లో ముగిసింది. దీన్ని కూడా వైఎస్సార్సీపీకి అంటగట్టేశారు. ఎంవీవీ, భూ యజమానుల మధ్య అగ్రిమెంట్ 2018 జనవరి 8న జరిగిందని ఆయనే రాశారు. అప్పటికి ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంటు సభ్యుడేమీ కాదు. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన పార్టీలో చేరిందే 2018 మేలో. పైపెచ్చు ఇది పూర్తిగా కొందరు ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం. ఒక వ్యాపారిగా ఆ ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని ఆయన నిర్మాణం మొదలెట్టారు. విచిత్రమేంటంటే వాళ్లతో అగ్రిమెంట్లు జరిగేటపుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయే. ఈ భవనానికి జీవీఎంసీ అనుమతులిచ్చింది 2019 మార్చిలో. నాడు కూడా అధికారంలో ఉన్నది చంద్రబాబే. కానీ ‘ఈనాడు’ ఈ విషయాలేమీ రాయదు. అప్పటికాయన ఎంపీ కాదని గానీ... ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జరిగాయని గానీ నిజాలు చెప్పదు. ఇంత దారుణంగా దిగజారిపోయి రామోజీరావు రాసిన రాతలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వాస్తవాలను వివరించారు. అవి... వాస్తవాలు ఇవీ....! ► కూర్మన్నపాలెంలో10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్ లేబర్ బోర్డు (డీఎల్బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను 2012లో డీఎల్బీ ఉద్యోగులు ఆశ్రయించారు. ► ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని ఎంవీవీ చెప్పటంతో... వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్ చేశారు. ► ఆ తరవాత కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో ఎంవీవీ సంప్రతింపులు మొదలెట్టారు. 2012లో మొదలైన ఈ ప్రక్రియ... చివరకు 2017లో ముగిసింది. వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంవోయు కుదిరింది. ► ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు. ► ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించింది. అప్పడూ అధికారంలో ఉంది టీడీపీయే. ► అక్కడ ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా... ఇందులో కొన్న సుమారు 1800 మందికి చ.అ. రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ. 30 లక్షలలోపు ధరకే అందించామని, ఇదంతా పూర్తిగా ప్రై వేటు వ్యవహారమని చెప్పారు ఎంవీవీ.