
ఎంవీవీ సత్యనారాయణ, ఎల్‌వీ సూర్యం
వికాస్ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్‌వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాను.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
థ్రిల్లర్ జానర్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్‌వీ సూర్యం.
Comments
Please login to add a commentAdd a comment