Vikas
-
వికాస్ ఇంజిన్ రీస్టార్ట్ విజయవంతం: ఇస్రో
సాక్షి, బెంగళూరు: మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో శుక్రవారం వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా రీస్టార్ట్ చేసినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంఛర్లకు ద్రవీకృత ఇంధన దశల్లో వికాస్ ఇంజిన్ ఎంతో కీలకమైందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్ లాంఛర్ల పునరి్వనియోగానికి సంబంధించిన సాంకేతికతలో జనవరి 17వ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటనలో ఇస్రో అభివర్ణించింది. వివిధ పరిస్థితుల్లో విక్రమ్ ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసి, పనితీరును అంచనా వేసేందుకు వరుస గా పరీక్షలు చేపట్టనున్నట్లు వివరించింది. ‘ఈ పరీక్షలో 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను పనిచేయించి, 120 సెకన్ల పాటు ఆపేశాం. తిరిగి స్టార్ట్ చేసి ఏడు సెకన్లపాటు పనిచేయించాం. ఈ పరీక్షలో ఇంజిన్ మామూలుగానే పనిచేసింది. అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుంది’అని ఇస్రో వివరించింది. డిసెంబర్ 2024లో నూ ఇలాంటి పరీక్షనే విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. అప్పుడు కేవలం ఏడు సెకన్లపాటే ఇంజిన్‌ను మండించి, 42 సెకన్ల వరకు ఆపేసి ఉంచామని వివరించింది. -
మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా 2025, జనవరి 24వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగాదర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ - అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో "నారి" సినిమాను రూపొందించాము. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా సినిమాలో ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ మా "నారి" సినిమాకు తమ వాయిస్ అందించారు. మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను ప్రముఖ సింగర్ చిన్మయి అద్భుతంగా పాడారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సీషోర్ అనే యువకుడు ఒక మంచి పాట పాడారు. మా "నారి" సినిమా ఆడియో దివో కంపెనీ ద్వారా త్వరలోనే రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మహిళల్ని గౌరవించాలనే గొప్ప కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయి. "నారి" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు. -
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం.. భార్య బాలీవుడ్ నటి: ఎవరీ బిలియనీర్? (ఫోటోలు)
-
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
-
వికాస్‌ను ఎనిమిదో‘సారీ’ కాటేసిన పాము!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..దేవుని దయతో వికాస్‌కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్‌ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్‌కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది. -
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
వికాస్, శాంతి జంటగా, డాక్టర్ ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. వీ4 సినీ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ.. . ‘ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది’ అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు’ అని దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు అన్నారు. -
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
వికాస్, శాంతి జంటగా నటించిన తాజా చిత్రం దర్శిని. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కి డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని కే ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే చూడగలిగే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శిని కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమా తీశారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.‘జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం’ ని నిర్మాత ఎల్ వి సూర్యం అన్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు, హీరో వికాస్, నటుడు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
థ్రిల్లర్ దర్శిని
వికాస్ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూశాను.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్వీ సూర్యం. -
సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్!
వికాస్ జీకే, శాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. ఈ చిత్రానికి డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎల్వీ సూర్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి అందమా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లు సినిమా అవుట్‌పుట్ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా.. ఈ సినిమాకి నిజాని అంజన్ సంగీతం అందించారు. -
వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు
Ind vs Eng Virat Kohli: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నుంచైనా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తాడా? జట్టుతో చేరతాడా? లేదా? అన్న అంశం మీద క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఢిల్లీ బ్యాటర్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, ఆ కారాణాలు ఏమిటన్న దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కోహ్లి, అతడి కుటుంబం గురించి వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే దూరంగా ఉన్నాడా? ‘‘ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడు’’ అని కొందరు.. ‘‘లేదు.. కోహ్లి తల్లి సరోజ్ అనారోగ్యం వల్లే అతడు ఆటకు దూరమయ్యాడు’’ అని ఇంకొందరు ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి తాజాగా స్పందించాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారాన్ని ఖండించాడు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు ‘‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారమవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. మా అమ్మ పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా వికాస్ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. కాగా ఢిల్లీలో జన్మించిన విరాట్ తల్లిదండ్రుల పేర్లు సరోజ్- ప్రేమ్ కోహ్లి. విరాట్‌కు అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. భావనా ఎంటర్ప్రెన్యూర్ కాగా.. వికాస్ కూడా వ్యాపారరంగంలో ఉన్నట్లు సమాచారం. కాగా టీమిండియా.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కోహ్లి పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ధ్రువీకరించింది. విశాఖలో విజయం కోసం ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. విశాఖపట్నం మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి ఈ టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. మరోవైపు.. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. View this post on Instagram A post shared by Vikas Kohli (@vk0681) -
వికాస్ లైఫ్‌కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
బాతు పిల్లతో ఆడుకుందామనుకుంటే.. మిగిలిన విషాదం!
ఖమ్మం: బాతు పిల్లతో ఆడుకుందామనుకున్నారు.. దానిలా నీటిలో అటూ.. ఇటూ.. తిరుగుదామనుకున్నారు.. కానీ, బాతును తేలియాడనిచ్చిన నీరు చిన్నారులను ముంచేసింది.. ముక్కు పచ్చలారని చిన్నారులను.. బంగారు భవిష్యత్ ఉన్న ఆ పిల్లలను విగతజీవులుగా మార్చింది.. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రు లు గుండెలు బద్ధలయ్యేలా విలపించారు.. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.. హాహాకారాలు చేస్తూ గుండెలు బాదుకున్నారు.. వీరి ఆర్తనాదాలతో సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఎస్సీకాలనీకి చెందిన కోలా సిద్ధార్థ (12), ఇసరం వికాస్ (7), చేవల రుషి కలిసి ఇళ్లకు సమీపంలో ఉన్న హెచ్.పుల్లయ్య వరిపొలంలోని నీటిగుంత దగ్గరికి వెళ్లారు. వికాస్ బాతుపిల్ల కాలికి తాడు కట్టి నీళ్లల్లో ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో రాయిపై నిల్చొని వంగి ఆడిస్తుండగా జారిపోయాడు. గమనించిన సిద్ధార్థ.. వికాస్ కాళ్లను పట్టుకొని కాపాడే యత్నంలో ఆతను కూడా నీటిలో పడిపోయాడు. ఒడ్డున ఉన్న రుషి పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలో వాలీబాల్ ఆడుతున్న వికాస్ తండ్రి శ్రీను, యువకులకు చెప్పాడు. హుటాహుటిన వారు వెళ్లి నీటిలో మునిగిన సిద్ధార్థ, వికాస్‌ను బయటకు తీసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కూలి పనులే ఆధారం.. మృతుడు కోలా సిద్ధార్థ తండ్రి మహేశ్ ఆటోడ్రైవర్. తల్లి నాగమణి వ్యవసాయ కూలీ. వికాస్ తండ్రి శ్రీను ఐరన్ రాడ్‌బెండింగ్ వర్కర్. తల్లి గంగ కూలి పనులు చేస్తుంటారు. ఆదివారం సెలవు కావటంతో పిల్లలు ముగ్గురు ఎప్పటిలాగే ఆడుకోవటానికి వెళ్లారు. సిద్ధార్థ 6వ తరగతి, వికాస్ ఒకటో తరగతి కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సిద్ధార్థకు తమ్ముడు బాలు, వికాస్‌కు తమ్ముడు వెంకట్ ఉన్నారు. ఇద్దరు ఒకే వీధి పిల్లలు మృతిచెందటంతో కాకర్లపల్లి ఎస్సీకాలనీ కన్నీటిసంద్రమైంది. సత్తుపల్లి పట్టణ సీఐ మోహన్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. ఇవి చదవండి: ఖాకీ వలలో విద్యార్థిని విలవిల -
చిన్నపుడు మా అక్క నన్ను బాగా కొట్టింది: విరాట్ కోహ్లి
When Virat Kohli Revealed His sister beat him badly: ‘‘చిన్నపుడు నాకొక అలవాటు ఉండేది. పెద్ద వాళ్లను కూడా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో పిలిచేవాడిని. మా అక్కతో మాట్లాడుతున్నపుడు కూడా ‘నువ్వూ.. నువ్వూ’ అంటూ సంభోదించేవాడిని. అలా ఏకవచనంతో పిలవడం మా అక్కకు నచ్చేది కాదు. ఓరోజు తనకు బాగా కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అంటూ నన్ను బాగా కొట్టింది. అప్పటి నుంచి పెద్ద వాళ్లందరినీ .. ‘మీరు’ అని మర్యాదగా సంభోదించడం మొదలుపెట్టాను’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రితో సంభాషణ సందర్భంగా గతంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కోహ్లి.. చిన్నపుడు తను అల్లరిపిల్లాడిలా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. రూ. 50 నోటు చూడగానే చించి పడేసి.. ‘‘పెళ్లి వేడుకలకు వెళ్లిన సమయంలో చాలా మంది నోట్లు గాల్లోకి ఎగురవేసి డ్యాన్సులు చేయడం చూశాను. అలా అది నా మైండ్‌లో ఉండిపోయింది. ఓరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. సరుకులు తెమ్మని మా అమ్మ నాకు 50 రూపాయలు ఇచ్చింది. ఆ నోటు చూడగానే పట్టరాని ఆనందంలో మునిగిపోయాను. ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నానో తెలియకుండానే.. మెట్ల మీదకు వెళ్లి నోటును చించి.. ముక్కలు పైకి ఎగురవేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కాసేపటికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాను’’ అంటూ సరదా సంఘటన గురించి పంచుకున్నాడు. తన అల్లరి కారణంగా.. చాలా మంది తమ్ముళ్లలాగే తాను కూడా అక్క చేతిలో దెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో కాగా సరోజ్- ప్రేమ్ కోహ్లి దంపతులకు జన్మించిన విరాట్ కోహ్లికి అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. ఇక క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లి.. ఇటీవల వరల్డ్‌కప్-2023 సందర్భంగా 50వ వన్డే శతకం బాది.. సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. కోహ్లి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఢిల్లీ బ్యాటర్ 38 పరుగులు చేశాడు. చదవండి: #KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా View this post on Instagram A post shared by @Virat Kohli (@virat_kohli_era__18) -
Virat Kohli Brother Vikas Family: విరాట్ కోహ్లి సొంత అన్నా- వదిన.. ఫ్యామిలీని చూశారా?
-
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు
-
Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్ వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీ-ఫామ్ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్‌పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీ-ఫామ్ అందజేసింది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
సాక్షి, ఆదిలాబాద్: పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్ టవర్ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్–మోహన్‌బాయి దంపతుల కుమారుడు వికాస్(19) ఇంటర్ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు. శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్ నుంచి ముత్నూర్ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్‌టవర్ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘నీతోనే నేను’ చూసి మంచి ఫీలింగ్‌తో బయటకొస్తారు: నిర్మాత
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీతోనే నేను’. శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మెదక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేవలం 33 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. టీచర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి అని ఈ జర్నీలో నన్ను చాలా మంది అడిగారు. అంటే మంచి కమర్షియల్ సినిమా చేయవచ్చు కదా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద, నా కథ మీద, నా టీమ్ మీద, నా మీద నాకు ఉన్న నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాను. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను. నా టీమ్‌తో కలిసి సినిమాను చూశాం. సినిమా చాలా బావుందని నా టీమ్ సభ్యులు చెప్పారు. వంద శాతం సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అక్టోబర్ 13న ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటాను’. దర్శకుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెలల పాటు ఎంటైర్ టీమ్ కష్టపడింది. అందువల్లే సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యాం. మా సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్‌గారు ఈ జర్నీలో అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్టర్స్ హీరో వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు, ఆకెళ్ల సహా అందరూ చక్కగా నటించారు. ఇక నిర్మాత సుధాకర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు నడిపించారు. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టినప్పటికీ ఆయన డేడికేషన్, కమిట్మెంట్తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయన అందించిన సపోర్ట్‌కి ధన్యవాదాలు. కిరణ్‌గారికి, తేజగారికి, ఎడిటర్ ప్రతాప్ సహా టీమ్‌కి థాంక్స్. అక్టోబర్ 13న థియేటర్స్‌లోకి వస్తున్నాం’ అన్నారు. -
స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!
ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ టూర్లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది? 1977లో నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్‌గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్‌తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. స్వదేశ్‌తో బాలీవుడ్లో అరంగేట్రం 2004లో మోడల్‌గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్ గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్‌లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు. -
‘సినిమా బండి’ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా ‘నీతోనే నేను’
‘సినిమా బండి’ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీతోనే నేను’. మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లు. అంజిరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’అని హీరో వికాస్ వశిష్ట అన్నారు. ‘అనుకున్న టైంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. మా సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు అంజి రామ్ అన్నాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు మోక్ష, కుషిత, ప్రభాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్, సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి.కడగండ్ల, చంద్రశేఖర్ రెడ్డి, అకెళ్ల తదితరులు పాల్గొన్నారు. -
సమంత, నిహారిక బాటలో కలర్స్ స్వాతి? విడాకులు తీసుకోబోతోందా ?
-
వికాస్ ‘కంచు’ పట్టు
అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో... రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో... నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికాస్ ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాదులు నవీన్‌కుమార్, జొహబ్ హొస్సైన్ వాదనలు వినిపిస్తూ సౌత్గ్రూపులో కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేయగానే తన వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్ దాఖలు దాఖలు చేశారని పరోక్షంగా కవితకు నోటీసులు జారీ అయిన తదుపరి ఇలా జరిగిందని ధర్మాసనానికి వివరించారు. సీసీ టీవీ సమక్షంలోనే పిళ్లైను విచారించామన్నారు. కేసు కీలక దశలో ఉందని ఆడిటర్ బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని విచారించాల్సి ఉన్న కారణంగా కస్టడీని పొడిగించాలని కోరారు. మద్యం పాలసీ ముసాయిదా ఫోన్లోకి రావడం, హోటల్ సమావేశాలపై సౌత్‌గ్రూపులోని వారిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. తనని టార్చర్ చేశారని పిళ్లై ఆరోపిస్తున్నారని ఒకవేళ అలా చేస్తే మరో 12 సార్లు స్టేట్మెంట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విచారణ తర్వాతే పిళ్లై స్టేట్మెంట్లు రూఢీ చేసుకున్నామన్నారు. ఈడీ వాదనలతో పిళ్లై న్యాయవాదులు విభేదించారు. అనంతరం ఈ నెల 16 వరకూ పిళ్లైని ఈడీ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ నెల 15న విచారణకు రావాలని ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో 9న విచారణకు రావాలని కోరగా బుచ్చిబాబు 13న వస్తానని అంగీకరించారని అయితే పిళ్లై ను కోర్టులో హాజరు పరచాల్సి ఉండడంతో తేదీ మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15న íపిళ్లై, బుచ్చిబాబులను కలిపి ఈడీ విచారించనుండగా 16న విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గత విచారణ సమయంలో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే. -
వికాస్ హీరోగా దుశ్శాసన్ చిత్రం
తమిళ సినిమా: నటుడు వికాస్ కథానాయకుడిగా నటిస్తున్న దుశ్శాసన్ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాయ్ తిరైయరంగం పతాకంపై ఎస్.అరుణ్ విఘ్నేశ్, ఆర్వేల్ మురుగన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. దళపతి దర్శకత్వం వహిస్తున్నారు. నటి రోహిణి నాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మనోహర్, మిల్టన్ మెడిసన్, ప్రభు శాస్త్రి, వేలాంగణి, సాయి రోహిణి, విఘ్నేష్ వీఎస్, శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి బాల మురుగన్ చాయాగ్రహణం, విజయ్ ప్రభు సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. ద్రౌపతికి వ్రస్తాపహరణం చేసిన వాడే దుశ్శాసనుడు కాదు. ఇతరుల అవమానాలను, బాధలను పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ఇతరులను మానసికంగా హింసించేవాడు.. వారి హక్కులను, ప్రాణాలను బలికొనేవాడూ దుశ్శాసనుడే అని చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దుకాణాల్లో దొంగతనం సంఘటనతో చిత్ర కథ మొదలయ్యి పోలీసుల దర్యాప్తు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం దుశ్శాసన్ అని చెప్పారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. -
Pro Kabaddi League: సూపర్ వికాస్... హరియాణా స్టీలర్స్ అద్భుత విజయం
Pro Kabaddi League: చివరి సెకన్లలో కెప్టెన్ వికాస్ కండోలా అద్భుతంగా రెయిడింగ్ చేసి ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టును 38–36తో గెలిపించాడు. మ్యాచ్ చివరి నిమిషంలో వికాస్ రెండుసార్లు రెయిడింగ్‌కు వెళ్లి ఒక్కో పాయింట్ చొప్పున సాధించి హరియాణా ఖాతాలో విజయం చేర్చాడు. ఈ మ్యాచ్‌లో వికాస్ మొత్తం 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–29 పాయింట్లతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
అతడు చెంప వాచిపోయేలా కొట్టాడు: నటి
ఎమోషనల్ సీన్లలో నటిస్తే సరిపోదు, జీవించాలి. ఆ సన్నివేశాలు సహజంగా రావడానికి ఎంతో కష్టపడుంటారు నటీనటులు. ఈ క్రమంలో పరిణీతి చోప్రా కూడా తను నటించిన 'సందీప్ ఔర్ పింకీ పరార్' సినిమా కోసం రెండు రోజులు స్నానం చేయలేదు. అనుకోకుండా అబార్షన్ జరిగినప్పుడు షాక్‌లో ఉండిపోయిన మహిళగా సహజంగా కనిపించేందుకు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. తాజాగా నటి నందినీ రాయ్ కూడా "ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్" వెబ్ సిరీస్ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామంటోంది. "ఈ సినిమాలో నేను, నా సహ నటుడు వికాస్ ఒకరినొకరం కొట్టుకోవాలి. ఇది చాలా సహజంగా రావాలన్నది డైరెక్టర్ ఆదేశం. మొదట వికాస్ నన్ను పైపైన కొట్టినట్లు చేశాడు కానీ అది అంత బాగా రాలేదు. దీంతో తామిద్దం ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి నిజంగానే చెంపలు వాచిపోయేలా కొట్టుకుందామని ఫిక్సయ్యాం. అప్పుడుగానీ ప్రేక్షకులు మా కన్నీళ్లు నిజమని ఫీలవరు. మేం ప్రతాపం చూపిస్తూ కొట్టుకోవడంతో చెంపలు వాచిపోయాయి. దీంతో దర్శకుడు ఆ వాపు తగ్గేవరకు వేచి చూసి ఆ తర్వాతే మరో సీన్ షూట్ చేశారు' అని నందినీ చెప్పుకొచ్చింది. కాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్" సిరీస్‌లో నందినీ పల్లెటూరి పడుచు పిల్లగా అలరిస్తోంది. నటన మీద ఉన్న ఆసక్తితో ఊరి నుంచి పట్నంకు వెళ్లిన అమ్మాయిలా ఆమె నటన ఆకట్టుకుంటోంది. శుక్రవారం రిలీజైన ఈ సిరీస్ ఆహాలో ప్రసారమవుతోంది. చదవండి: ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్ -
వైరలవుతున్న కోహ్లి కూతురు ఫస్ట్ ఫోటో..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలదిసిందే. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు పాప పుట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమానురాగాలకు ధన్యవాదాలు. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నారు. దీంతో మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’ అని ట్విటర్లో లేఖ ద్వారా వెల్లడించాడు. కాగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నకోహ్లి ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. చదవండి: అనుష్క-కోహ్లి దంపతులకు కుమార్తె..! ఇదిలా ఉండగా.. పాప పుట్టిన వార్తను తెలియజేసిన కోహ్లి తన ఫోటోను మాత్రం పంచుకోలేదు. ఈ నేపథ్యంలో విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సోదరుడు వికాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారాయి. వికాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ తండ్రి అయ్యాడన్న విషయాన్ని షేర్ చేస్తూ.. అప్పుడే పుట్టిన పాప కాలి ఫోటోను పోస్టు చేశారు. దీనికి ‘ఇంట్లోకి దేవత వచ్చింది. పట్టరానంత సంతోషంగా ఉంది.’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఫోటోలో చిన్న పాప ఉండటంతో తనే కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతుంది. మరోవైపు అనుష్క, విరాట్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం తెలియగానే అభిమానులు ఆనందంలో మునిగితేలిపోతున్నారు. విరుష్క దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Vikas Kohli (@vk0681) View this post on Instagram A post shared by Bhawna Kohli Dhingra (@bhawna_kohli_dhingra) -
డాన్ అరెస్ట్
-
వికాస్ దూబే ఎన్కౌంటర్
-
వికాస్ దుబే అరెస్ట్
భోపాల్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ చేశారు. దుబే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ‘ఉజ్జయిన్‌లోని మహాకాల్ ఆలయానికి వికాస్ దుబే ఈ ఉదయం కార్లో వచ్చాడు. మొదట ఒక కానిస్టేబుల్ దుబేని గుర్తించాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆ కానిస్టేబుల్ అప్రమత్తం చేశాడు. వారు దుబేను పక్కకు తీసుకెళ్లి, ప్రశ్నించి, అనంతరం అరెస్ట్ చేశారు’ అని మిశ్రా వివరించారు. అయితే, ఆలయ వర్గాలు మరోలా చెప్పాయి. ‘ఉదయం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన దుబే.. రూ. 250 ల టికెట్ కొనుగోలు చేశాడు. ఆ తరువాత దేవుడికి సమర్పించేందుకు ప్రసాదం కొనాలని దగ్గర్లోని షాపు వద్దకు వెళ్లాడు. దుబేను ఆ షాప్ ఓనర్ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు’ అని ఆలయ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా, అక్కడ గుమికూడిన ప్రజలను చూస్తూ.. ‘నేను వికాస్ దుబే.. కాన్పూర్ వాలా’ అని గట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో, దుబేను పట్టుకుని ఉన్న కానిస్టేబుల్ దుబే తలపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. నోర్మూసుకో అని గద్దించాడని వివరించారు. దుబేను తమ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. అరెస్ట్ తరువాత ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. కాన్పూర్ నుంచి వచ్చిన పోలీసులకు మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దుబేను అప్పగించారు. ఇద్దరు అనుచరుల హతం రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో దుబే అనుచరులు ఇద్దరిని గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసులు హతమార్చారు. ఫరీదాబాద్‌లో బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన కార్తికేయను కాన్పూర్ తీసుకువెళ్తుండగా, పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని, పోలీసులపై కాల్పులు జరుపుతూ, పారిపోయేందుకు ప్రయత్నించాడని, దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో కార్తికేయ చనిపోయాడని ఏడీజీ ప్రశాంత్‡ తెలిపారు. ఎటావా వద్ద జరిగిన మరో ఎన్కౌంటర్లో దుబే అనుచరుడు, కాన్పూర్ కాల్పుల ఘటనలో నిందితుడు ప్రవీణ్ అలియాస్ బవువా చనిపోయాడని ఎటావా ఎస్పీ ఆకాశ్ ప్రకటించారు. ఎస్పీలో ఉన్నాడు తన కుమారుడు వికాస్ దుబే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో ఉన్నాడని ఆయన తల్లి సరళాదేవి తెలిపారు. అయితే, దీన్ని ఎస్పీ ఖండించింది. వికాస్ దుబే మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్ బయటపెడితే ఏ పార్టీకి చెందినవాడో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సరిగ్గా వారం కిత్రం, శుక్రవారం రాత్రి దుబేను అరెస్ట్ చేసేందుకు కాన్పూర్‌లోని చాబీపుర్ ప్రాంతంలో ఉన్న బిక్రు గ్రామంలో ఉన్న ఆయన ఇంటికి పోలీసు బృందం వెళ్లింది. వారిపై దుబే, ఆయన అనుచరులు ఇంటిపై నుంచి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు చనిపోయారు. హత్యలు సహా దాదాపు 60 క్రిమినల్ కేసుల్లో దుబే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. వాటిలో 20 ఏళ్ల క్రితం ఒక బీజేపీ ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్లోనే చంపేసిన కేసు కూడా ఒకటి. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. ఎన్కౌంటర్ తప్పించేందుకే.. దుబే లొంగిపోయాడని, దీనివెనుక మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. యూపీ పోలీసుల ఎన్కౌంటర్ నుంచి తప్పించేందుకే ఉజ్జయిన్లో దుబే దొరికిపోయేలా చేశారన్నారు. మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. -
కాన్పూర్ ఎన్కౌంటర్: శవపరీక్షలో విస్తుగొలిపే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వికాస్ దూబే అనే గ్యాంగ్‌స్టర్ అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా మొత్తం 8 మంది పోలీసులు మృతిచెందారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి శవపరీక్ష నివేదికల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది మంది పోలీసుల శవపరీక్ష నివేదికలు శనివారం విడుదలయ్యాయి. చనిపోవడానికి ముందు పోలీసులను అతి క్రూరంగా హింసించబడ్డారని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. బిల్హౌర్ సర్కిల్ ఆఫీసర్(సీఐ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ దూబే మనుషులు గొడ్డలితో నరికినట్లు శవపరీక్షలో వెల్లడైంది. అతని కాలు కత్తిరించబడి, శరీరం తీవ్రంగా గాయాలపాలైనట్లు తేలింది. అదే విధంగా పోలీసుల వద్ద నుంచే దూబే అనుచరులు తుపాకులు లాక్కొని మరీ కాల్పులు జరిపినట్లుగా తెలిసింది. (యూపీ గ్యాంగ్‌స్టర్ అనుచరుడి అరెస్టు) కానిస్టేబుల్స్ బబ్లు, రాహుల్, సుల్తాన్ బుల్లెట్ గాయాలతో మరణించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. అదే విధంగా కానిస్టేబుల్ జితేంద్ర పాల్కుపై ఎకే-47తో కాల్పులు జరిగినట్లు చెప్పారు. మరణించిన పోలీసుల భుజాలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వైద్యులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నివేదికలపై కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ శనివారం మాట్లాడుతూ.. దుబే గ్యాంగ్ మనుషులు మావోయిస్టులు దాడి చేసే విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఇక దుబే గ్యాంగ్‌లో పని చేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్‌పూర్‌లో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు) చదవండి: గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం -
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుడి అరెస్టు
లక్నో/కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుల్లో ఒకడిని పోలీసులు అరెస్టు చేశారు. దుబే గ్యాంగ్‌లో పనిచేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్‌పూర్‌లో శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఆ క్రమంలో అగ్నిహోత్రి కుడి కాలుకు బుల్లెట్ గాయమైందని పేర్కొన్నారు. కాగా, పోలీసులపై కాల్పుల ఘటనలో వికాస్ దుబేతోపాటు 18 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు వికాస్ దుబే తలపై రూ.50 వేలు రివార్డు, అగ్నిహోత్రి తలపై రూ.25 వేలు రివార్డు పోలీసుల ఇదివరకే ప్రకటించారు. (చదవండి: గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం) పోలీసుల విచారణలో అగ్నిహోత్రి కీలక సమాచారం వెల్లడించినట్టు తెలిసింది. దుబేను పట్టుకునేందుకు పోలీసులు వస్తున్న సంగతి తమకు ముందే తెలుసని అగ్నిహోత్రి విచారణలో చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ నుంచి సమాచారం అందిందని నిందితుడు వెల్లడించినట్టు పోలీసులు చెప్పారు. కాగా, కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి కాల్పుల ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్కౌంటర్లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కరుడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. (చదవండి: వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు) -
ఇల్లు కూల్చివేత.. సరళాదేవీ విచారం
లక్నో/కాన్పూర్: కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేయాలని కోరిన అతని తల్లి సరళాదేవీ.. పోలీసులు తమ ఇంటిని కూల్చివేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని చాలా కాలం క్రితం తాము కష్టపడి నిర్మించుకున్నామని శనివారం మీడియాతో అన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు తెగబడి తప్పించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఇక నేరగాడు దుబే, అతని గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. దాంతోపాటు గ్యాంగ్‌స్టర్ దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో శనివారం నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. (వికాస్ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు) -
గ్యాంగ్‌స్టర్ ఇల్లు నేలమట్టం
లక్నో/కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు వికాస్ దుబే గ్యాంగ్ ఎనిమిదిమంది పోలీసులను పొట్టన బెట్టుకున్న ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. నేరగాడు దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. కాల్పులు జరిగినప్పటి నుంచి జాడ తెలియకుండాపోయిన దుబే కోసం 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుబే లొంగిపోకుంటే, పోలీసులు అతడిని కాల్చి చంపాలని అతడి తల్లి సరళా దేవి అన్నారు. ‘అతడి కారణంగా మేం సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. -
కలర్స్ సంక్రాంతి
తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కనిపించని కష్టకాలంలో స్వాతి తన ఎంట్రీతో ఇండస్ట్రీకి పండగ తెచ్చింది!ఇప్పుడీ ‘పండగ’ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.పెళ్లయ్యాక వచ్చిన మొదటి సంక్రాంతి ఇది. ఈ పండగని స్వాతిఎలా సెలబ్రేట్ చేసుకోబోతోంది?పెళ్లి జీవితం ఎలా ఉంది?మన సినిమాకి మళ్లీ తెలుగు కళను తెస్తుందా?చదవండి.. ‘సాక్షి’కి స్వాతి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ. మీ పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి... స్పెషల్ ఏంటి? స్వాతి: స్పెషల్ అంటే అమ్మానాన్న నా దగ్గరకు రావడమే. ప్రస్తుతం వికాస్ (స్వాతి భర్త)తో జకార్తాలోనే ఉంటున్నాను. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ‘నా ఇల్లు’ చూడటానికి అమ్మానాన్న వచ్చారు. ఇంటిని ఎలా సెటప్ చేసుకున్నామో చూశారు. వాళ్లకు నా ఇంటిని చూపించడం హ్యాపీ. పండగ అంటే వాళ్లకు వండిపెట్టడమే స్పెషల్. హైదరాబాద్‌లో అంటే వంట చేసి పెట్టడానికి ఎవరో ఒకరుంటారు. ఇక్కడ నా పని నేనే చేసుకోవాలి. కూతురి కొత్త ఇల్లు మీ పేరెంట్స్‌కి నచ్చిందా? వాళ్లకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇల్లు ఇరుకు ఇరుకుగా ఉండదు. చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు ఖాళీ స్థలంలో పచ్చని చెట్లతో చాలా కూల్‌గా అనిపిస్తుంది. వాళ్లు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నారు. ఇంతకీ పండగకి కొత్త అల్లుడు తన అత్తమామలకు పెట్టిన డిమాండ్స్ ఏంటి? వికాస్ వాళ్లది కేరళ. మనలా వాళ్లకు సంక్రాంతి పెద్ద పండగ కాదు. అందుకని పండగకు డిమాండ్ చేయాలని తనకు తెలియదు. కానీ మా ఆయనకు ఓ తెలుగు పైలట్ ఫ్రెండ్ ఉన్నారు. ‘నువ్వు కొత్త అల్లుడివి. పండగకు ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేయాలి’ అని ఆ ఫ్రెండ్ చెప్పారు. కానీ మా ఆయన అలాంటివేం పట్టించుకోడు. నవ్వేసి ఊరుకున్నాడు. చాలా సింపుల్ వ్యక్తి. అత్తింటివాళ్లతో బాగా కలిసిపోయాడు. మేం కంఫర్ట్‌బుల్‌గా ఉండాలనుకుంటాడు. మరి మీ అమ్మావాళ్లు ఏమైనా తీసుకొచ్చారా? అలాంటివేం లేదు. వాళ్లు తెస్తేనే అన్నట్లు లేదు కదా. మా పెళ్లయ్యాక అమ్మానాన్న మాతో ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు మెయిన్‌గా మాతో ఉండాలని వచ్చారు. ఇందాక ‘నా ఇల్లు చూడ్డానికి వచ్చారు’ అన్నాను. ఏదో మాటకి అలా అన్నాను కానీ ఇంకా ‘నా ఇల్లు.. మీ ఇల్లు’ అనే ఫీల్ రావడంలేదు. ఇంతకీ వంట మనదేనా? వికాస్‌తో చేయిస్తున్నారా? అఫ్కోర్స్ నాదే. తను అప్పుడప్పుడు చేయందిస్తాడు. చిన్నప్పటి నుంచి అన్ని దేశాలు తిరుగుతున్నాడు. అందుకని వంట నేర్చుకున్నాడు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ‘వంట రాదు’ అని ఒక వయసు తర్వాత చెప్పుకోవడానికి బాగోదు. వంట అనేది మన సర్వైవల్ కోసమే. వంట చేయడం, వేరే దేశంలోనో, రాష్ట్రంలోనో ఉండాలన్నప్పుడు అక్కడి భాష, డ్రైవింగ్... ఇలాంటివన్నీ నేర్చుకుంటే మన కే మంచిది. వికాస్‌కి వంట వచ్చు. కానీ నేను వంట చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ల కోసం చేయడం ఇంకా మజా వస్తుంది. వికాస్ తెలుగు వంటలను ఇష్టపడతారా? తనకి చికె¯Œ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా చేశాను. వంట ఇక్కడికి వచ్చి నేర్చుకోవడమే. ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫో¯Œ చేస్తా. ఇప్పుడు అమ్మ వాళ్లు మనం గరిటె తిప్పుతున్న స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారు (నవ్వుతూ). ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు.. బయట మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు ఉండే ఉంటారు. ఫైనల్లీ కేరళ అబ్బాయిని పెళ్లాడారు. ఎవరు ఎవర్ని పడేశారు? నేను పడేయలేదు. నన్నే పడేశాడు. తెలుగువాళ్లు ‘కలర్స్ స్వాతి’, హీరోయి¯Œ అన్నట్లుగానే చూశారు తప్పితే నన్ను నన్నుగా చూడలేదు. నావైపు ఆశ్చర్యంగా చూసినవాళ్లే తప్ప మామూలుగా చూసినవాళ్లు లేరు. వాళ్లల్లో ఆ ఎగై్జట్‌మెంట్ చాలా క్లియర్‌గా కనిపించేది. ఇక సినిమా తప్ప వేరే సంభాషణలే ఉండేవి కాదు. వికాస్ అలా కాదు. నేను పరిచయమైనప్పడు నన్ను ఓ మామూలు అమ్మాయిలానే చూశాడు. తన జాబ్ (పైలట్) అంటే తనకు చాలా ఇష్టం. సినిమాలు కూడా తక్కువగా చూసేవాడట. తన క్లాస్‌మేట్‌తో నేను రెండు తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాను. అతని ద్వారానే మా ఫ్యామిలీకి వికాస్ పరిచయం. మేమేదో డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదు. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. ఫిల్మ్ హీరోయిన్, గ్లామర్ ఇండస్ట్రీ అని అంతగా ఆశ్చర్యపడడు. అదీ ఓ ప్రొఫెష¯Œ అన్నట్టుగా చూస్తాడు. నాకది బాగా నచ్చింది. సినిమాలకు బ్రేక్ అనుకోవచ్చా. వికాస్ బైబై చెప్పమన్నారా? ఛా.. ఊర్కోండి (నవ్వుతూ). మనం 2019లోఉన్నాం. ఇంకా భార్యని ఉద్యోగం మానేయమని చెప్పే మగవాళ్లు ఉంటారనుకోను. ఉన్నా చాలా చాలా తక్కువ ఉండొచ్చు. వికాస్‌ది ఆ మెంటాలిటీ కాదు. తను చాలా దేశాలు ట్రావెల్ చేశాడు. బ్రాడ్మైండెడ్. నా ఫ్రెండ్స్ అందర్నీ కలిశాడు. హీరోయిన్లని, డైరెక్టర్లని పరిచయం చేసినప్పుడు ఎగై్జట్ అయిపోతాడని అనుకున్నాను. కానీ చాలా మామూలుగా మాట్లాడాడు. వేరే ప్రొఫెష వాళ్లను కలిశాం అనుకున్నాడు. అలాంటి మెంటాలిటీ ఉన్నతను సినిమాలు మానేయమనడు.యాక్చువల్లీ ఏ సినిమాలోనూ మీరు గ్లామరస్‌గా కనిపించలేదు. కానీ ఇటీవల ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్లో కనిపించడం ఆశ్చర్యం అనిపించింది?బికినీ సీన్స్ చేయాలంటే ఎప్పుడో చేసేదాన్ని కదా. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా వల్గర్‌గా అనిపించలేదు. తెలుగమ్మాయిలంటే సిమ్మింగ్ చేయరా? నేను ఎప్పటినుంచో స్విమ్మింగ్ చేస్తున్నాను. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిని కదా... జాగ్రత్తగా ఉన్నాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయం. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చినట్లనిపిస్తోంది. అంటే.. స్విమ్మింగ్ పూల్ విజువల్స్‌కి వికాస్ ఏమీ అనలేదన్నమాట? అవును. తను కూడా చూశాడు. పైగా ఆ ఇంటర్వ్యూ అప్పుడు ‘నీ నెక్స్›్ట సినిమా ఎప్పుడు?’ అని ఏడిపించాడు. ‘ఇంకేదైనా అడగొచ్చు కదా.. ఆ ప్రశ్న ఎందుకు అడిగావు’ అని ఆ తర్వాత అంటే, ‘స్వాతీ.. నీకు సినిమాలు చేయాలని ఉంటే నిన్ను నేను ఆపను. ఆ విషయం నీకు తెలియజేయడం కోసమే అలా అడిగాను’ అన్నాడు. ఇంతకు ముందు మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఫ్రీడమ్ వచ్చినట్లు ఉందన్నారు. అంటే.. అంతకు ముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఒకలాంటి నెమ్మదితనం, ఒకలాంటి ప్రశాంతత అనిపిస్తోంది. పెళ్లికి ముందు వరకు లైఫ్ అంతా హడావుడి. టీవీ షోలు, సినిమాలు అంటూ బిజీ. ఇప్పుడు ఆ హడావుడి నుంచి బయటకు వచ్చాను కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను. మనసంతా తేలికగా అనిపిస్తోంది. ఏదో విముక్తి లభించిన ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాను. పెళ్లయింది. మనకేం భయం లేదనే భరోసా. జనరల్‌గా చుట్టూ ఉన్నవాళ్లు పెళ్లంటే అదీ ఇదీ అని భయపెడతారు. కానీ నాకేం భయం లేదు. చక్కగా సెటిల్ అయ్యాను అనిపిస్తోంది. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను.. కానీ ధైర్యంగా ఉంటున్నాను. ఆ ఫీలింగ్‌ని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనెలా ఉన్నా ఫర్వాలేదు అనిపిస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. అది సరే... మీ మాటల్లో వెటకారం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి మీద సెటైర్లు వేస్తున్నారు? సందర్భాన్ని బట్టి ఒకరిపై ఒకరం పంచ్‌లు వేసుకుంటాం. అందరం ఫన్ లవ్వింగే. అయితే వికాస్ చాలా కామ్‌గా ఉంటాడు. అయినా ఎప్పుడూ గడగడా మాట్లాడేవాళ్లది ఏం ఉండదు. అంతా తుస్సే. కామ్‌గా ఉండేవాళ్లు పంచ్లేస్తేనే ఇంకా నవ్వొస్తుంది. తక్కువ మాట్లాడేవాళ్లు ఎక్కువ గమనిస్తుంటారు. వాళ్లు వేసే జోక్స్ వర్కౌట్ అవుతాయి. వికాస్ పంచ్‌లన్నీ అలా వర్కౌట్ అవుతాయి. మా అత్తామామలు కూడా చాలా కూల్. మా విషయాల్లో ఎక్కువ తలదూర్చరు. అలాగని పూర్తిగా వదిలేయరు. వాళ్లి ద్దరూ కేరళలోనే ఉంటారు. చిచ్చరపిడుగులా ఉండే స్వాతి పెళ్లయ్యాక ఏమైనా మారిందా? కొంచెం నెమ్మదస్తురాలైందా? బాగా నెమ్మదితనం అయితే వచ్చింది. అది కూడా చాలా బావుంది. హడావుడి పడటం తగ్గింది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కవాళ్లు ఏం చేస్తారు? ఎవరేమంటారు? అనే టెన్ష¯Œ ఉండేది. ఇప్పుడా భయం లేదు. పెళ్లి చేసుకుని ఇక్కడికొచ్చాక నాకు చాలా టైమ్ దొరుకుతోంది. లైఫ్‌ని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను. ఒక్కో దశలో జీవితం ఒక్కోలా కొనసాగుతుంది. వాటి నుంచి నేర్చుకోవాలి. అన్నింటినీ తలుచుకుంటే జరిగిందంతా మంచికే అనే నమ్మకం వచ్చేసింది. పైలట్ కాబట్టి వికాస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. మీకు ఇంట్లో బోర్ అనిపించదా? ఒక్కోసారి వారంలో నాలుగు రోజులు వెళ్లిపోతాడు. కొన్నిసార్లు పొద్దున్నే వెళ్లి ఈవెనింగ్ వచ్చేస్తాడు. ముందు నాకు అర్థం అయ్యేది కాదు. రెండు మూడు రోజులే కదా.. ఒక్కదాన్నే రిలాక్స్ అయిపోవచ్చు అనుకునేదాన్ని. కానీ మెల్లిగా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇంటిపట్టున ఉంటే బావుండు అనిపిస్తుంది. అంటే.. ఓన్లీ రొమాంటిక్ రీజన్స్ కోసమే కాదు. అలాగని రోజంతా కబుర్లు చెప్పుకుంటాం అని కాదు. ఇద్దరం కలిసి టీవీ చూస్తుంటాం. ఇష్టమైన ఇంకో మనిషి దగ్గర ఉంటే అదో ఆనందం. అవునూ.. పెళ్లికి పెద్దగా ఎవర్నీ పిలవనట్లుంది? చాలా క్లోజ్ సర్కిల్లో పెళ్లి చేసుకోవాలనిపించింది. అందుకని కొంతమందినే పిలిచాను. అందర్నీ పిలిస్తే వాళ్లకు వచ్చే వీలుండకపోవచ్చు. ఎవరి షూటింగ్స్‌తో వాళ్లు బిజీగా ఉంటారు. పైగా వచ్చాక వాళ్లకు అసౌకర్యంగా ఉండకూడదు. మన పెళ్లి మంటపాల్లో నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఇవన్నీ ఆలోచించుకుని సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాను. పెళ్లిని దాచేద్దాం అని కాదు. చేసుకున్న తర్వాత చెబుదాంలే అనుకున్నాను. మాకో క్లోజ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో పెళ్లి విషయం పెట్టాను. అది ఎవరో లీక్ చేశారు. అలా బయటకి వచ్చింది. ఎవర్నీ పిలవకూడదనే అభిప్రాయం అయితే లేదు. చిన్నగా చేసుకుందాం అని. కొందరైతే మీడియా వాళ్లను పిలవలేదని విమర్శించారు. కేవలం తక్కువమంది మధ్యలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనే ఎవర్నీ పిలవలేదు. ఫైనల్లీ మళ్లీ అడుగుతున్నాం.. సినిమాలకు దూరం అవ్వరు కదా? నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అవకాశాలు వస్తే యాక్ట్ చేస్తా. ఒక్కసారి యాక్టింగ్ చేసిన తర్వాత దాన్ని వదల్లేం. మీ చిన్నప్పటి సంక్రాంతి గురించి? గాలిపటాలంటే ఇష్టమే. కానీ నాకు ఎలా ఉండేదంటే మా అన్నయ్య, వాళ్ల ఫ్రెండ్స్ మా మేడ మీద ఎక్కువగా ఆడేవారు. వాళ్లందరికీ చిన్న సైజ్ అసిస్టెంట్‌ని నేను. కింద నుంచి తినడానికి ఏదైనా తీసుకురా. నీళ్లు అయిపోయాయి బాటిల్ తీసుకురా. ఇది పట్టుకో అంటూ ఆర్డర్లు. వాళ్లందరికీ నేనే అసిస్టెంట్‌ని. ఎప్పుడైనా ౖకైట్ ఇచ్చి ఎగరేయమన్నా కింద పడిపోయేది. ఎలా ఎగరేయాలో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు వికాస్ గాలికి వ్యతిరేక దిశలో ఫ్లైట్ వెళ్లాలి అని చెబుతుంటే గాలిపటానిది కూడా సేమ్ కాన్సెప్ట్ కదా అనిపించింది. అప్పుడు అది తెలియక మా అన్నకు అసిస్టెంట్‌గా ఉండిపోయా (నవ్వుతూ). ఇంతకీ అమ్మానాన్న∙ఎప్పుడు అవ్వాలని? అయ్య బాబోయ్. అప్పుడే? జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నాకు పప్పుచారు టేస్ట్ సరిగ్గా కుదిరితే ఆ రోజంతా హ్యాపీగా అనిపిస్తోంది. మా ఇంటి ముందు ఉన్న చెట్టుకి పువ్వు పూచినా, గడ్డి మీద వాటర్ బబుల్స్ చూసినా పిచ్చ హ్యాపీగా ఉంటోంది. వేసవి కాలంలో మంచి మామిడి పండుని ఎలా ఆస్వాదిస్తామో ఇప్పుడు జీవితాన్ని నేనలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫేజ్ చాలా బాగుంది. అలా అని ఈజీ అనడం లేదు. అనను కూడా. హైదరాబాద్‌లో ఉంటే వంట చేసేవాళ్లు, కారు డ్రైవ్ చేసేవాళ్లు ఉంటారు. అందుకే ఎక్కువ టైమ్ ఉన్నట్టు అనిపించేది. లేనిపోని ఆలోచనలు వచ్చేవి. ఇక్కడ ఆకలేస్తే నేనే లేవాలి, వండుకుని తినాలి. దాంట్లో వచ్చే ఆనందం బావుంది. ఇండిపెండెంట్‌గా ఫీల్ అవుతున్నాను. పెళ్లయిపోతే అంతే సంగతులని కొందరు అంటుంటారు.. మీరేమంటారు? చాలా మంది అమ్మాయిలకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మనం పెళ్లి మీద జోక్స్ చేస్తుంటాం. భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదర్ అని. కానీ అలా ఏం ఉండదు. మంచి మ్యారేజ్‌లో ఫ్రీడమ్ చాలా ఉంటుంది. కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. నాకైతే నా మ్యారీడ్ లైఫ్ అలానే అనిపిస్తోంది. ఫ్రీడమ్ స్టార్ట్స్ విత్ ఏ గుడ్ రిలేష¯Œ షిప్. పెళ్లనేది స్వతంత్రానికి శుభం కార్డ్ మాత్రం కాదు. ఇంట్రడక్ష¯Œ సీనే అని నేనంటాను. -
మాస్ మార్కెట్లోకి బెనెల్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి... భారత్‌లో మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జబక్ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఆ సమయానికి తమ తయారీ కేంద్రం కూడా రెడీ అవుతుందని, ఆ ప్లాంటులో ఇవి రూపుదిద్దుకుంటాయని చెప్పారాయన. 200 సీసీలోపు మోడళ్ల ధర ఎక్స్‌షోరూంలో రూ.2 లక్షల లోపే ఉంటుందని పేర్కొన్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బెనెల్లి ప్రస్తుతం 18 రకాల మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో మూడు మోడళ్లు.. మహవీర్ గ్రూప్ కంపెనీ అయిన ఆదీశ్వర్ ఆటోరైడ్ ఇండియా (ఏఏఆర్ఐ) భారత్‌లో బెనెల్లి పంపిణీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఏఏఆర్ఐ అసెంబ్లింగ్ ప్లాంటును నెలకొల్పింది. ఈ కేంద్రంలో డిసెంబర్ తొలి వారంలో ద్విచక్ర వాహనాల అసెంబ్లింగ్ మొదలు కానుంది. రెండో వారం నుంచి ఇవి విక్రయ కేంద్రాలకు చేరతాయని వికాస్ వెల్లడించారు. ‘అసెంబ్లింగ్ ప్లాంటు కోసం కంపెనీ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. వార్షిక సామర్థ్యం ఒక షిఫ్టుకు 7,000 యూనిట్లు. బెనెల్లి టీఎన్టీ 300, 302ఆర్, టీఎన్టీ 600ఐ బైక్‌లను రీలాంచ్ చేస్తున్నాం. వీటి ధరలు ఎక్స్ షోరూంలో వరుసగా రూ.3,50,000, రూ.3,70,000, రూ.6,20,000గా ఉంటాయి. అయిదేళ్ల వారంటీ ఇస్తున్నాం. ప్రస్తుతం 15 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. మరో 25 కేంద్రాలు మార్చికల్లా రానున్నాయి’ అని వివరించారు. -
పైలెట్‌తో స్వాతి పెళ్లి
‘అష్టా చమ్మా’ సినిమాలో ‘మహేశ్ మహేశ్...’ అంటూ కలవరించే మహేశ్ అభిమానిగా కనిపిస్తారు ‘కలర్స్’ స్వాతి. కానీ ప్రస్తుతం ఆమె కలవరిస్తున్న పేరు వికాస్ అట. కొంటె చూపుతో ఓ కొంటె చూపుతో అంటూ వికాస్ అనే పైలెట్ స్వాతి మనసుని దోచేశారట. ఇక్కడున్న ఫొటోని చూసి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే పొరబడ్డట్టే. ఇది సినిమాలోని పెళ్లి ఫొటోనే. నిజమైన పెళ్లి మరో 15రోజుల్లో జరగనుంది. ‘అష్టా చమ్మా, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించక ముందు చిన్ని తెరపై ‘కలర్స్’ స్వాతిగా బోలెడంత పాపులార్టీ సంపాదించుకున్నారామె. ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే వధువు కానున్నారు. కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో ఈ నెలాఖరున మూడు ముళ్లు వేయించుకోనున్నారు. స్వాతి వివాహ విషయమై ఆమె కుటుంబ సభ్యులను ‘సాక్షి’ సంప్రదించగా – ‘‘కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో స్వాతి పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుక ఈ నెల 30న కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య హైదరాబాద్‌లో జరగనుంది’’ అన్నారు. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేసే వికాస్, స్వాతిది లవ్, అరేంజ్డ్ మ్యారెజ్ అట. పెళ్లి జరిగిన రెండు రోజులకే కేరళలోని కొచ్చిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఎందుకంటే వికాస్ మలయాళీ. ఇదిలా ఉంటే.. స్వాతి అధికారికంగా కాబోయే భర్త ఫొటోను బయటపెట్టలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోమవారం నెట్లో హల్చల్ చేసింది. -
సంచలన నిర్ణయం.. తీవ్ర దుమారం
సాక్షి, ముంబై: శివసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహం సాకుతో ఓ జంటకు పాస్‌పోర్ట్‌లు నిరాకరించి వివాదంలో చిక్కకున్న అధికారికి సన్మానం చేయాలని తీర్మానం చేసింది. ఈ మేరకు శివసేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సదరు అధికారి వికాస్ మిశ్రా బదిలీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ శనివారం యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు ఓ మెమొరాండం సమర్పించింది. ‘వికాస్ తన విధులను తాను సక్రమంగా నిర్వహించారు. పాస్‌పోర్ట్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశం. యూపీ ప్రభుత్వం ముస్లింల సానుభూతి కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవటం సహేతుకం కాదు. అందుకే గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాదు వికాస్‌ను ఘనంగా సన్మానించాలని శివసేన నిర్ణయించింది’ అని ఆ పార్టీ ప్రతినిధుల బృందం మీడియాకు తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. పలువురు బీజేపీ నేతలు శివసేనపై విరుచుకుపడుతున్నారు. మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ 2007లో తన్వీ సేథ్ అనే హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగులు. తాజాగా వీరిద్దరూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రా మాత్రం వారి దరఖాస్తులను తిరస్కరించాడు. పైగా మతం మార్చుకోవాలంటూ సిద్ధిఖీకి సూచనలు చేశాడు. దీంతో వారు సుష్మాస్వరాజ్‌ను ఆశ్రయించగా, విదేశాంగ శాఖ చొరవతో వారికి పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. మరోపక్క క్రమశిక్షణ చర్యల కింద పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రాను లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు బదిలీ చేశారు. -
క్వార్టర్స్‌లో వికాస్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ పంఘల్ (49 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ బౌట్లలో అమీర్ గినిఫిడ్ (మొరాకో)పై వికాస్... శర్విన్ (మారిషస్)పై అమిత్... ఆమిన్ (మొరాకో)పై మనీశ్ గెలుపొందారు. మరోవైపు మనోజ్ (69 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో అబ్దుల్ కబీర్ (మొరాకో) చేతిలో ఓడిపోయాడు. -
పక్కా వ్యూహంతోనే గర్భిణి హత్య
హైదరాబాద్: పక్కా వ్యూహంతోనే గర్భిణి బింగీ అలియాస్ పింకీని హత్య చేశారని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వికాస్ కశ్యప్(32), అమర్‌కాంత్ ఝా(24)ను రిమాండ్‌కు తరలించామన్నారు. గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. జనవరి 27 రాత్రి సిద్ధిఖీనగర్‌లోని ఇంట్లో గర్భిణి బింగీ టీవీ చూస్తుండగా వికాస్, అమర్‌కాంత్, మమత ఝా దాడికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం బింగీ మృతదేహాన్ని బాత్ రూమ్‌లో ఉంచి 28న మిషీన్‌తో కాళ్లు, చేతులు కోశారని చెప్పారు. శరీర భాగాలను బస్తాల్లో మూటగట్టి జనవరి 29 తెల్లవారుజామున యమహా బైక్‌పై అమర్‌కాంత్, మమత ఝా శ్రీరాంనగర్‌లో పడేశారన్నారు. బైక్‌ను బోరబండలోని పాత ఇంట్లో పడేసిన అమర్ ఫిబ్రవరి 3న బిహార్‌కు పరారయ్యాడని తెలిపారు. మమత ఝా, అనిల్ ఝా అరెస్టు తర్వాత అమర్‌కాంత్‌ను 12న బిహార్‌లో పట్టుకున్నట్లు చెప్పారు. వికాస్‌ను మాదాపూర్ ఎస్వోటీæ పోలీసులు 14న అరెస్ట్ చేశారన్నారు. పక్కా వ్యూహంతో హత్య... బిహార్‌కు చెందిన బింగీ.. వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో సహజీవనం చేస్తూనే మమత ఝాతోనూ వికాస్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇది గొడవకు దారితీయడంతో వికాస్‌ను మమత ఝా తన కొడుకు అమర్కాంత్తో పాటు ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కు పంపింది. కొద్ది రోజులకే మమత ఝా, అనిల్ ఝా కూడా హైదరాబాద్‌కు వచ్చారు. నలుగురు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వికాస్ ఫోన్ కూడా చేయకపోవడంతో గర్భవతి అయిన బింగీ అతని మామ ద్వారా ఫోన్ నంబర్ తెలుసుకుంది. బింగీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వికాస్ అడ్రస్ మాత్రం చెప్పలేదు. ఒకసారి ఫోన్ వికాస్ వద్ద పనిచేసే అతను ఎత్తి అడ్రస్ చెప్పాడు. దీంతో బింగీ 45 రోజుల క్రితమే సిద్ధిఖీనగర్‌కు వచ్చింది. వికాస్ ఆమెకు నచ్చజెప్పి నాగపూర్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే చెప్పకుండా హైదరాబాద్ వచ్చాడు. 48 గంటల్లోనే బింగీ కూడా సిద్ధిఖీనగర్ చేరుకుంది. తాను కూడా ఇక్కడే ఉంటానని చెప్పడంతో వికాస్, మమత జీర్ణించుకోలేక హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. హత్యకు 8 రోజుల ముందే కటింగ్ మిషీన్, ప్లాస్టిక్ బ్యాగ్‌లు, బస్తాలు కొనుగోలు చేశారు. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలన్న దానిపై రెక్కీ నిర్వహించి బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో వేయాలని నిర్ణయించుకున్నారు. హత్య అనంతరం ఇంటర్ పరీక్షలు రాసేందుకు బిహార్ వెళ్లిన అమర్‌కాంత్‌ను పోలీసులు కాపుకాసి మరీ పట్టుకున్నారు. అలాగే చాట్ బండిని అమ్మేందుకు యత్నిస్తూ వికాస్ పోలీసులకు చిక్కాడు. -
మానవ్... ప్రపంచ నంబర్‌వన్
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇన్నాళ్లూ భారత్ తరఫున ఎవరూ చేరుకోలేని టాప్ ర్యాంక్‌కు యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ చేరుకున్నాడు. అండర్–18 బాలుర సింగిల్స్ విభాగంలో అతను ‘టాప్’ లేపాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఈ గుజరాతీ సంచలనం 6,396 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. గత నెలలోనే రెండో స్థానానికి ఎగబాకిన ఈ 17 ఏళ్ల సూరత్ కుర్రాడు రోజుల వ్యవధిలో అగ్రతాంబూలం అందుకున్నాడు. సాధారణంగా చైనా, జపాన్ ప్లేయర్ల ఆధిపత్యం ఉండే టేబుల్ టెన్నిస్‌లో ఓ భారత ఆటగాడు మొదటి ర్యాంకులో నిలవడం గొప్ప విషయం. చైనా ప్లేయర్ వాంగ్ చుకిన్ (6,220) రెండో స్థానంలో ఉండగా, భారత సంతతికి చెందిన అమెరికన్ కనక్ జా (6,159) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. హైదరాబాదీ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ నిలకడగా 24వ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. అగ్రస్థానంపై స్పందించిన మానవ్ ‘ఇంత త్వరగా నంబర్‌వన్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఎప్పుడైతే టాప్–5లో నిలిచానో అప్పట్నించి నాలో ఆత్మవిశ్వాసం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు టాప్ ర్యాంక్ దక్కింది’ అని అన్నాడు. -
ఐఏఎస్ కుమార్తెకు వేధింపులు!
చండీగఢ్: హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్(23), అతని స్నేహితుడు ఆశిష్ కుమార్(27) తనను వెంటాడి వేధించారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద కేసు పెట్టి, బెయిల్‌పై విడుదల చేశారు. శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నిందితులు న్యాయశాస్త్ర విద్యార్థులు. రేడియో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న బాధితురాలు(28) తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వెళ్తున్న ఆమెను మద్యం సేవించిన నిందితులు టాటా సఫారీ వాహనంలో 5 కిలోమీటర్లు వెంటాడారు. ఆమె కారుకు తమ వాహనాన్ని అడ్డంగా నిలిపి వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరింది. తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తానని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సోమవారం చెప్పారు. కేంద్రం, బీజేపీ దర్యాప్తును నీరుగారుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మరోపక్క.. తాను ఐఏఎస్ కుమార్తెను కాకుండా గ్రామీణ యువతినై ఉంటే దుండగులతో పోరాడలేకపోయి ఉండేదాన్నని బాధితురాలు పేర్కొన్నారు. -
రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్తక్కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 11వ తేదీన రోహ్తక్లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు. -
మన పంచ్ అదిరింది!
►సెమీస్‌లో శివ, వికాస్, సుమీత్, అమిత్ ►నాలుగు పతకాలు ఖాయం ►ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఈ ప్రదర్శనతో నలుగురు భారత బాక్సర్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు. మరో నలుగురు భారత బాక్సర్లు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు), మనీష్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. జాంగ్ (చైనా) చేతిలో గౌరవ్, లతిపోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో కవీందర్, బ్యామ్బా (మంగోలియా) చేతిలో మనోజ్, నుర్యదైవ్ (తుర్క్మెనిస్తాన్) చేతిలో మనీష్ ఓడిపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో కార్నెలిస్ (ఇండోనేసియా)పై... శివ థాపా 5–0తో లాయ్ చు ఎన్ (చైనీస్ తైపీ)పై... వికాస్ 5–0తో బ్రమహేంద్ర (ఇండోనేసియా)పై... సుమీత్ 4–1తో యు ఫెంగ్కాయ్ (చైనా)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్; బతార్సుక్ (మంగోలియా)తో శివ థాపా; డాంగ్యున్ లీ (కొరియా)తో వికాస్; జఖోన్ (తజికిస్తాన్)తో సుమీత్ తలపడతారు. -
క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధూరి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతోమసక్ కుటియా (థాయ్‌లాండ్)తో జరిగిన బౌట్లో వికాస్ రెండు నిమిషాల్లోపే విజయం సాధించాడు. గౌరవ్ బిధూరి పాయింట్ల ప్రాతిపదికన యుటపాంగ్ తాంగ్డీ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా, అమిత్ ఫంగల్ సునాయాసంగా రమీష్ రహమాని (అఫ్ఘానిస్తాన్)ను చిత్తు చేశాడు. అయితే మరో భారత ఆటగాడు ఆశిష్ కుమార్ 64 కేజీల విభాగంలో ఇక్బొల్‌జొన్ ఖొల్‌దరొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హైదరాబాద్ : నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బేగంబజార్‌కు చెందిన వికాస్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్
కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు పొందలేని వారిలో నైపుణ్యతను పెంచి వారికి ఉపాధి కల్పించేందుకు ‘వికాస్’ సంస్థ కృషి చేస్తుందని కలెక్టర్‌హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లో బుధవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయవర్సిటీతోపాటు వికాస్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేష¯ŒS మిషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఏడాదికి 10 వేల చోప్పున మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది లక్ష్యమన్నారు. నన్నయ వర్సిటీ పరిధిలోని 450కిపైగా గల అనుబంధ కళాశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి కల్పించడమే తమ థ్యేయమని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు అన్నారు. 5 వరకు శిక్షణ : ఉభయ గోదావరి జిల్లాల్లోని 12 హెచ్ఆర్డీ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని ఏపీఎస్ఎస్టీసీ ప్రాజెక్టు డైరెక్టర్ వీఎ¯ŒSరావు తెలిపారు. అనంతరం వారు ఉభయ గోదావరి జిల్లాల్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లి నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యాచ్‌కి 60 మందికి శిక్షణ ఇస్తారని, 30 రోజుల శిక్షణ అయిన వెంటనే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ ఎస్‌ఎస్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. రంగయ్య, మేనేజర్ విజయ్‌కుమార్, డీఆర్డీఏ జేడీఎం ఎం.సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
పుష్కర అధికారిగా వికాస్ రాజ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాల కోసం నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు గాను ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాల నిర్వహణను వికాస్‌రాజ్ పర్యవేక్షిస్తారు. ఈ పుష్కరాల కోసం జరుగుతున్న ప్రత్యేక పనులను, ఇతర ఏర్పాట్లను కూడా ఆయన ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్‌రాజ్ ప్రస్తుతం చిన్న నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పుష్కరాల జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులయిన వికాస్‌రాజ్ గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే పుష్కర పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం వాడపల్లికి వెళతారని, అక్కడ జరుగుతున్న పుష్కర పనులను పరిశీలిస్తారని సమాచారం. -
కమ్మాడ్ తోంగ్ ఎన్కౌంటర్ బూటకం
-దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి వికాస్ భద్రాచలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం ఠాణా పరిధిలోని కమ్మాడ్ తోంగ్ గ్రామంలో ఈ నెల 23వ తేదీన సోడిపాండు(50) అనే గ్రామస్తుడిని సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు బూటకపు ఎన్కౌంటర్ చేశాయని మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి వికాస్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. కమ్మాడ్తోంగ్ గ్రామంపై దాడి చేసి ఇళ్లలో ఉన్న ప్రజల్ని పట్టుకుని కొట్టారని.. కొందర్ని విడిచి పెట్టారని తెలిపారు. గ్రామస్తుల ముందే పాండును అడవిలోకి తీసుకెళ్లి డ్రస్ తొడిగించి చెట్టుకు కట్టేసి కాల్చి చంపారని పేర్కొన్నారు. లక్ష రివార్డు ఉన్న జన్మిలీషియా కమాండర్ ఎన్కౌంటర్లో చనిపోయాడని బస్తర్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి బూటకపు ప్రచారం చేస్తున్నాడని ఆ ప్రకటనలో ఆరోపించారు. -
మంగళసూత్రం మింగిన దొంగ
గొలుసు రికవరీకి దారేది? బయటకి తీయలేమంటున్న వైద్యులు తలబాదుకుంటున్న పోలీసులు హైదరాబాద్: చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. శనివారం రాత్రి వారు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ వైపునకు వాకింగ్ వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న మాణికేశ్వరినగర్‌కు చెందిన వికాస్ (22) అనే దొంగ.. ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రం తెంపుకొని పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి చిలకలగూడలో వికాస్‌ను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా జేబులోంచి గొలుసు తీసి అమాంతం మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో నిందితుడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాలని పోలీసులు కోరగా అందుకు మొదట వైద్యులు నిరాకరించారు. గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్ల్లిన ప్రతిసారీ ఎవరు చెక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా సమాధానమిచ్చారు. చివరికి నిందితుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. అయితే, దొంగ మింగిన బంగారం ఎప్పుడు బయటకు వస్తుందో... ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు. -
‘కటారా’ దోషులకు 25 ఏళ్ల జైలు
-
‘కటారా’ దోషులకు 25 ఏళ్ల జైలు
నితీశ్ కటారాది పరువు హత్య అని ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ మానవత్వం లేకుండా, పాశవికంగా చంపేశారు వికాస్, కజిన్ విశాల్, సుఖ్‌దేవ్‌లకు కఠిన శిక్ష అవసరం న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 594 పేజీల సుదీర్ఘ తీర్పులో నితీశ్‌ది పరువు హత్యేనని తేల్చి చెప్పింది. దోషులైన రాజకీయ నేత డీపీ యాదవ్ కుమారుడు వికాస్(39), ఆయన కజిన్ విశాల్(37), మరో అనుచరుడు సుఖదేవ్ పహిల్వాన్(40)లు పకడ్బందీ ప్రణాళికతో, కర్కశంగా హత్య చేశారని, అందుకు వారికి కింది కోర్టు విధించిన 14 ఏళ్ల జైలుశిక్ష సరిపోదని పేర్కొంది. వికాస్, విశాల్‌లకు 25 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో 5 ఏళ్లు జైళ్లోనే గడపాలని పేర్కొంది. చెరో రూ. 50 లక్షలను జరిమానాగా విధించింది. అదే సమయంలో వారికి మరణ శిక్ష విధించాలన్న హతుడి తల్లి అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. డీపీ యాదవ్ కుమార్తె భారతి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న నితీశ్ కటారాలు ప్రేమించుకున్నారు. వారి కులాలు, అంతస్తులు వేరువేరు. దాంతో ఆ అనుబంధాన్ని అంగీకరించని భారతి సోదరుడు వికాస్.. తన కజిన్ విశాల్, అనుచరుడు సుఖదేవ్‌లతో కలసి 2002 ఫిబ్రవరి 16 రాత్రి ఘజియాబాద్‌లో నితీశ్‌ను కిడ్నాప్ చేసి, అనంతరం దారుణంగా హతమార్చాడు. దీనిపై కటారా తల్లి నీలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వికాస్, విశాల్, సుఖ్‌దేవ్‌లను అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2008 మే 30న ఢిల్లీ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఈ ముగ్గురికి మరణశిక్ష విధించాలని కోరుతూ నీలం ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేశారు. దీంతోపాటు ముగ్గురు దోషులు కూడా అప్పీలు చేసుకున్నారు. వీటన్నింటిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థలోని తప్పుడు విశ్వాసాల పరంగా జరిగిన ‘పరువు హత్య’గా కటారా హత్యను అభివర్ణించింది. మానవత్వం లేకుండా, పకడ్బందీ ప్రణాళికతో వారు ఒడిగట్టిన ఈ దారుణానికి 14ఏళ్ల జైలుశిక్ష ఏమాత్రం సరిపోదని స్పష్టం చేసింది. వారిలో పశ్చాత్తాపం కనిపించకపోవడం, తాము చట్టాలకు అతీతులమనే భావన, దుందుడుకు ప్రవర్తనను గుర్తించిన కోర్టు.. వారు మరింత ఎక్కువ కాలం జైళ్లో ఉండటం అవసరమంది. వికాస్, విశాల్‌లకు విధించిన యావజ్జీవ శిక్షను 25 ఏళ్లకు, సుఖ్‌దేవ్‌కు 20 ఏళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది. శిక్షా కాలంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా, హంతకులకు ఉరిశిక్ష విధించాల్సిందేనని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కటారా తల్లి నీలం చెప్పారు. కోర్టు సూచించిన నష్టపరిహారం తనకు అవసరం లేదని పేర్కొంది. కోర్టు తీర్పులోని ఇతర అంశాలు.. దోషులు పెరోల్ కోరితే.. నిర్ణయం తీసుకునే ముందు కటారా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలి. వారి అభ్యర్థనలను పరిశీలనలోకి తీసుకోవాలి. విశాల్, వికాస్‌లు చెల్లించే జరిమానా మొత్తం రూ. కోటిలో(ఒక్కొక్కరు రూ. 50 లక్షల చొప్పున) కేసు నిర్వహణకు రూ. 50 లక్షలను ఢిల్లీ ప్రభుత్వానికి, రూ. 10 లక్షలను యూపీ ప్రభుత్వానికి చెల్లించాలి. మిగతా రూ. 40 లక్షలను కోర్టు ఖర్చులకు గానూ హతుడి తల్లికి ఇవ్వాలి. ఎయిమ్స్ మెడికల్ బిల్లులకు గానూ రూ. 2. 39 లక్షలను వికాస్ ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ కేసు నిర్వహణకు ప్రభుత్వానికైన ఖర్చు రూ. 5.8 కోట్లు. అందులో రూ. 75 లక్షలు దోషుల భద్రతకే ఖర్చయింది. ఈ వివరాలు ప్రజలకు, న్యాయవ్యవస్థలోని విభాగాలకూ తెలియాల్సిన అవసరం ఉంది. తద్వారా కేసుల విచారణలో అనవసర వాయిదా అభ్యర్థనలు తగ్గుతాయి. ప్రతీ కేసు విచారణఖర్చును, పట్టే సమయాన్ని.. గంటలు, నిమిషాల లెక్కన లెక్కించాలి. వికాస్ మరో 19 ఏళ్లు, విశాల్ మరో 18 ఏళ్లు, సుఖ్‌దేవ్ మరో 16 ఏళ్లు జైల్లో గడపాల్సి ఉంటుంది. -
వికాస్, తేజోధర్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: కె. వికాస్ (85 బంతుల్లో 115; 15 ఫోర్లు), బి. తేజోధర్ (72 బంతుల్లో 114; 16 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో ‘ఎ’ డివిజన్ వన్డే నాకౌట్ లీగ్ టోర్నమెంట్లో సౌత్ ఎండ్ రేమండ్స్ జట్టు 321 పరుగుల భారీ తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఎండ్ 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రంగారెడ్డి జట్టు 15.2 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్ (5/26), హర్షవర్ధన్ (5/22) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఇంటర్నేషనల్ సీసీ: 105 (విపిన్ 28, నైరుత్ రెడ్డి 5/22, నసీర్ 3/12), దక్కన్ బ్లూస్: 106/1 (రఘు 51 నాటౌట్). మాంచెస్టర్: 100 (ముస్తఫా 3/18), రెడ్ హిల్స్: 103/6 (చైతన్య 3/22). పీకేసీసీ: 104 (అగ్రజ్ 41, జగన్ 3/19, సాయి 3/27), శాంతి ఎలెవన్: 55 (రాహుల్ 4/14, శామ్యూల్ 3/16). స్టార్లెట్స్: 189/8 (సురేశ్ 55, రతన్‌తేజ 37, వాహెద్ 3/34), పికెట్: 130 (తహసీన్ 48, సంతోష్ 41, రతన్‌తేజ 4/28). సాగర్ ఎలెవన్: 138 (అఖిల్ 30, విశాల్ 4/18), నటరాజ్: 139/5 (రహీముద్దీన్ 38, కిషోర్ 30). గోల్కొండ సీసీ: 40 (విద్యానంద్ 5/15, షానవాజ్ 3/7), మహమూద్ సీసీ: 41/0. క్లాసిక్: 214/5 (నవీన్ 52, ఖుబింద్ 49), విజయ్ సీసీ: 174/9 (సుబ్రహ్మణ్యం 45, సాయిరామ్ 32, అస్లాం సిద్దిఖీ 4/13). సన్‌షైన్: 168 (చరణ్ 43, భరద్వాజ్ 30), ఎస్ఎన్ గ్రూప్: 172/5 (శంతన్ 93, మెర్విన్ 34). యాదవ్ డెయిరీ: 213 (సాత్విక్ 30, నరసింహ 6/36, ఫైజల్ 3/40), పీఎన్ యంగ్‌స్టర్స్: 214/7 (శ్రీకాంత్ 47, నరసింహ 37, కమ్రాన్ 36, హసీబ్ 32, రోహిత్ 3/30). కాకతీయ: 263 (సాయి 90, రవి 32, శశాంక్ 4/41), విజయానంద్: 198/9 (సన 89, పవన్ 3/34). -
బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
బెంగళూరు : వ్యూహం ఫలించక కిడ్నాపర్లు పోలీసు కాల్పుల్లో గాయపడి ఇక్కడి కేసీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి కేసీ జనరల్ ఆస్పత్రికి చేరుకుని కిడ్నా పర్లు ధర్మారాం (22), జితేంద్ర (24) పరిస్థితిపై (వీరు రాజస్తాన్‌కు చెందినవారు) ఆరా తీశారు. వివరాలు... కాటన్‌పేట సమీపంలోని సుబ్రమణ్య కాలనీలో నివాసముంటున్న ఆమన్రాం ఇక్కడి చిక్కపేటలో దుస్తు ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతని కుమారుడు వికాస్ (6). బుధవారం మధ్యాహ్నం వికాస్ స్కూల్ వ్యాన్‌లో ఇంటికి బయలుదేరిన సమయంలో ఆ వాహనం అనుసరిస్తూ ధర్మారాం, జితేంద్ర వచ్చారు. వికాస్ ఇంటి సమీపంలో వాహనం దిగిన వెంటనే నిందితులు బాలుడిని బైక్‌లో కిడ్నాప్ చేశారు. కొంత సమయం అనంతరం కిడ్నాపర్లు బాలుడు తండ్రి ఆమన్రాంకు ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. లేదంటే కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆమన్‌కు వస్తున్న ఫోన్లను ట్రాప్ చేసింది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కిడ్నాపర్లు చెప్పిన విధంగా ఆమన్ నగదుతో హరిశ్చంద్ర ఘాట్‌కు చేరుకున్నాడు. నగదు అక్కడి ఫుట్‌పాత్‌పై పెట్టాలని సూచించారు. నగదు బ్యాగ్ పెట్టిన ఒక్క నిముషానికే కిడ్నాపర్లు బ్యాగ్ తీసుకోడానికి వచ్చారు. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోడానికి యత్నించారు. నిందితులు మారణాయుధాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ తుపాకి కాల్పు లు జరిపారు. రెండు బుల్లెట్లు ధర్మరాం, జితేంద్ర కాళ్లలోకి దూసుకెళ్లడం తో వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఈ మేరకు పోలీసులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అభినందించారు. -
ఏది తేలిక?!
చట్టం వింత చూడండి... కమిలిన కన్నుతో వెళ్లి ఏ ఆడకూతురైనా కేసు వేయడం తేలిక. అదే ఆడకూతురు తన ఇష్టం లేకుండా భర్త తనపై పదే పదే లైంగిక చర్యకు పాల్పడుతున్నాడని చెప్పినప్పుడు మాత్రం ఏ చట్టమూ వినదు, ఏ సెక్షనూ పట్టించుకోదు. ఏమిటి పరిష్కారం? చట్టాలు మారాలి. లేదా మగాళ్లు మారాలి. ఏది తేలిక? ఇండియాకు ఒక ‘రేప్ లా’ ఉంది. అయితే ఆ ‘లా’ లో భారతీయ వివాహితకు (భర్త జరిపే అత్యాచారం నుంచి) మాత్రం రక్షణ లేదు! ఇందుకు తాజా నిదర్శనం జస్టిస్ వీరేందర్ భట్ ఇచ్చిన తీర్పు. ‘‘తాగొచ్చి అత్యాచారం చేసినప్పటికీ అతడు భర్త కనుక, ‘రేప్ లా’ పరిధిలోకి ఈ కేసు రాదు కనుక నిందితుడు నిర్దోషిగా భావించడమైనది’’ - ఇదీ తీర్పు సారాంశం. అంటే భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకోవడం వైవాహిక సంస్కృతిలో ఒక భాగం అనుకోవాలా?! మనసా వాచా కర్మణా అతడు ఆమెను శారీరకంగా లోబరచుకోవడం అన్నది దాంపత్యంలో సహజం, సర్వ సాధారణం అని సరిపెట్టుకోవాలా?! ‘‘దేశంలోని అత్యధిక శాతం వివాహితల లైంగిక హక్కును ఈ తీర్పు నిరాకరిస్తోంది. భారతీయ న్యాయ వ్యవస్థ వైఫల్యానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు’’ అని స్త్రీవాదులతో పాటు, సామాన్య మహిళలూ దేశవ్యాప్తంగా ఆవేదనతో ఎలుగెత్తారంటే ఇదెంత దురదృష్టకరమైన తీర్పో చూడండి. అసలేం జరిగింది? గత ఏడాది మార్చిలో వికాస్ అనే వ్యక్తి ఒక యువతిని ఢిల్లీ శివార్లలోని ఘాజియాబాద్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ‘తీసుకువచ్చాడు’. అప్పటికి ఆమె పూర్తి స్పృహలో లేదు. ఆ స్థితిలోనే ఆమె చేత పెళ్లి పత్రాలపై అతడు సంతకాలు చేయించాడు. తర్వాత ఆమెను ‘తీసుకెళ్లి’ మరికాస్త మత్తుమందిచ్చి అత్యాచారం జరిపి, పారిపోయాడు. ఇదీ బాధితురాలి వాదన. కాదు, గోడు. ఇక జడ్జిగారు. ‘‘వికాస్ తాగినట్లు కానీ, తన భార్యకు మత్తుమందు ఇచ్చినట్లుగానీ సాక్ష్యాధారాలు లేవు కనుక అతడు నిర్దోషి అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అతడు నిజంగానే తన భార్యపై అత్యాచారం జరిపి ఉన్నప్పటికీ ఆ చర్యను ఇండియన్ రేప్ లా ప్రకారం నేరంగా పరిగణించడానికి లేదు’ అని రూలింగ్ ఇచ్చేశారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో (నిర్భయ కేసులో) దేశ ప్రజలంతా ఎన్నడూ లేనంతగా ఆగ్రహోదగ్రులయ్యాక మన దేశం ‘రేప్ లా’ ను మరింత శక్తిమంతం చేసింది. చేసి సరిగ్గా ఏడాది. ఇంతలోనే ఆ శక్తిని అవహేళన చేస్తున్నట్లుగా భట్ గారి తీర్పు! ‘రేప్ లా’ ను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసే పనిని ప్రభుత్వం అప్పట్లో జస్టిస్ వర్మ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది. ఆయన ఇప్పుడు లేరు. చనిపోయారు. పోతూ పోతూ అన్నట్లుగా, భర్త జరిపే అత్యాచారాన్ని కూడా నేరంగా పరిగణించాలని సిఫారసు చేశారు. అయితే వర్మ కమిటీ చేసిన ఈ సిఫారసు తిరస్కారానికి గురయింది! భారతీయ కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటాయి కనుక భర్త జరిపే అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే... తప్పుడు కేసులు ఎక్కువై మొత్తానికి వైవాహిక వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న భయంతో న్యాయ పండితులు ఈ ఒక్క క్లాజును ‘రేప్ లా’ లో చేర్చలేకపోయారు.