సాక్షి, బెంగళూరు: మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో శుక్రవారం వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా రీస్టార్ట్ చేసినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంఛర్లకు ద్రవీకృత ఇంధన దశల్లో వికాస్ ఇంజిన్ ఎంతో కీలకమైందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్ లాంఛర్ల పునరి్వనియోగానికి సంబంధించిన సాంకేతికతలో జనవరి 17వ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటనలో ఇస్రో అభివర్ణించింది.
వివిధ పరిస్థితుల్లో విక్రమ్ ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసి, పనితీరును అంచనా వేసేందుకు వరుస గా పరీక్షలు చేపట్టనున్నట్లు వివరించింది. ‘ఈ పరీక్షలో 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను పనిచేయించి, 120 సెకన్ల పాటు ఆపేశాం. తిరిగి స్టార్ట్ చేసి ఏడు సెకన్లపాటు పనిచేయించాం. ఈ పరీక్షలో ఇంజిన్ మామూలుగానే పనిచేసింది. అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుంది’అని ఇస్రో వివరించింది. డిసెంబర్ 2024లో నూ ఇలాంటి పరీక్షనే విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. అప్పుడు కేవలం ఏడు సెకన్లపాటే ఇంజిన్‌ను మండించి, 42 సెకన్ల వరకు ఆపేసి ఉంచామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment