Restarts
-
వికాస్ ఇంజిన్ రీస్టార్ట్ విజయవంతం: ఇస్రో
సాక్షి, బెంగళూరు: మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో శుక్రవారం వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా రీస్టార్ట్ చేసినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంఛర్లకు ద్రవీకృత ఇంధన దశల్లో వికాస్ ఇంజిన్ ఎంతో కీలకమైందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్ లాంఛర్ల పునరి్వనియోగానికి సంబంధించిన సాంకేతికతలో జనవరి 17వ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటనలో ఇస్రో అభివర్ణించింది. వివిధ పరిస్థితుల్లో విక్రమ్ ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసి, పనితీరును అంచనా వేసేందుకు వరుస గా పరీక్షలు చేపట్టనున్నట్లు వివరించింది. ‘ఈ పరీక్షలో 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను పనిచేయించి, 120 సెకన్ల పాటు ఆపేశాం. తిరిగి స్టార్ట్ చేసి ఏడు సెకన్లపాటు పనిచేయించాం. ఈ పరీక్షలో ఇంజిన్ మామూలుగానే పనిచేసింది. అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుంది’అని ఇస్రో వివరించింది. డిసెంబర్ 2024లో నూ ఇలాంటి పరీక్షనే విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. అప్పుడు కేవలం ఏడు సెకన్లపాటే ఇంజిన్‌ను మండించి, 42 సెకన్ల వరకు ఆపేసి ఉంచామని వివరించింది. -
అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో అమర్నాథ్ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్తరణి, శేష్నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ఆదివారం మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకుతోడు కొండ చరియలు విరిగిపడుతుండడంతో అమర్నాథ్ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్లో మంచు సైతం కురిసింది. సోమవారం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ వాసి దుర్మరణం రాజాం సిటీ(ఆంధ్రప్రదేశ్): ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి రావు మృతి చెందారు. బొద్దాం గ్రామానికి చెందిన రవి రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్య కల్యాణితో కలిసి వారం క్రితం కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో రవి రావు ప్రాణాలు కోల్పోయారు. కల్యాణితో పాటు మరికొందరిని సహాయక సిబ్బంది రక్షించారు. -
వచ్చే నెలలో వైజాగ్‌లో...
హీరో రామ్‌చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని సెప్టెంబరులో ఆరంభించనున్నట్లు అప్డేట్ ఇచ్చారు శంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్లో ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. సెప్టెంబర్ 1నుంచి తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్–శంకర్ సినిమా కూడా రీ స్టార్ట్ కానుంది. ‘‘ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2, రామ్ చరణ్‌తో ‘ఆర్సి 15’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ‘ఆర్సి 15’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్‌లో జరగనుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్
కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’, ‘శభాష్ నాయుడు’, విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్ హిట్ సాధించారు కాబట్టే కమల్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్’ కంటే ముందు కమల్ ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్ అయ్యుండేది. కానీ దర్శకుడు శంకర్‌కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు, ‘ఇండియన్ 2’ సెట్స్‌లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్ చొరవతో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్ ఉన్నారు. కాజల్ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉందట ‘ఇండియన్ 2’ టీమ్. 1986లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్’కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్ నాయుడు’. 2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ కూడా ఓ నిర్మాత. షూటింగ్‌కి బ్రేక్ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్ 2, శభాష్ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. -
Amarnath Yatra 2022 : అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. గుహకు చేరే మార్గం వరదల్లో దెబ్బతినడంతో సైన్యం తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా 1.13 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 11న యాత్ర ముగియనుంది. -
15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది. ‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
IPL 2021: అహ్మదాబాద్‌లో ఆగిన ఆట
కరోనా దెబ్బతో అర్ధాంతరంగా ఆగిన ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు మరోసారి వచ్చేసింది. 2020లో యూఏఈలో విజయవంతంగా నిర్వహించినా... బీసీసీఐ అతి విశ్వాసం కారణంగా ఈ ఏడాది భారత్‌లోనే లీగ్ మొదలైంది. చివరకు కోవిడ్ దెబ్బకు టోర్నీని సగంలోనే ఆపి వేయాల్సి వచి్చంది. అయితే లీగ్‌తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయలను దృష్టిలో ఉంచుకుంటూ మళ్లీ యూఏఈనే నమ్ముకున్న బోర్డు, విరామం తర్వాత మళ్లీ పోటీలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరిగే పోరుతో లీగ్ పునః ప్రారంభం కానుంది. దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్లో మే 2న అహ్మదాబాద్‌లో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. మే 4న కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా... నైట్‌రైడర్స్ టీమ్‌లోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఆ మ్యాచ్‌ను షెడ్యూల్ నుంచి తప్పించిన గవరి్నంగ్ కౌన్సిల్ తర్వాతి రోజు లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆపై మన దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతంగా కొనసాగడంతో భారత్‌లో టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. దాంతో చర్చోపర్చల అనంతరం భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటూ బీసీసీఐ రెండో దశ పోటీల షెడ్యూల్ విడుదల చేసింది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఇప్పుడు ధనాధన్ క్రికెట్‌తో సగటు అభిమానులకు ధనాధన్ వినోదం లభించనుంది. అక్టోబర్ 15న ఫైనల్... ఒక్కో సీజన్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ సహా మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న టీమ్‌లు కూడా పుంజుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రతీ జట్లలో కొందరు కీలక ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. తొలి దశలో ఆడిన ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా), స్టోక్స్, బట్లర్ (రాజస్తాన్), బెయిర్‌స్టో (సన్‌రైజర్స్), వోక్స్ (ఢిల్లీ), వాషింగ్టన్ సుందర్ (బెంగళూరు) వేర్వేరు కారణాలతో ఇప్పుడు బరిలోకి దిగడం లేదు. తొలి దశ పోటీలకు దూరమైన శ్రేయస్ అయ్యర్, నటరాజన్ ఈసారి ఆడనుండగా... షమ్సీ, హసరంగ, చమీరా, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ ఎలిస్, రషీద్, టిమ్ డేవిడ్, లూయీస్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్లో కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా నగరాల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో స్థానిక ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుండటం విశేషం. -
జోరుగా.. హుషారుగా...
నాగశౌర్య, రీతూ వర్మ జోరుగా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. నాగశౌర్య, రీతూ వర్మ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
తిరుపతిలో శ్రీకారం
శర్వానంద్, ప్రియాంక అరుళ్మోహన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ .బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత గురువారం ‘శ్రీకారం’ చిత్రం షూటింగ్‌ను పునః ప్రారంభించారు. తిరుపతిలో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు, సీనియర్ నరేశ్‌లతో పాటు మరికొంతమంది నటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ. జె. మేయర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జె. యువరాజ్, ఆర్ట్: అవినాశ్ కొల్లా. -
అన్ని జాగ్రత్తలతో...
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ మధ్యే హీరో నితిన్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అలాగే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. బుధవారం మళ్లీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రభుత్వం విధించిన జాగ్రత్తలు పాటిస్తూ, ఈ షూటింగ్‌ను జరుపుతున్నారు. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ తో ఈ సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
నేటి నుంచి టేకాఫ్..
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశీయ విమాన యానం పునఃప్రారంభమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా విమాన ప్రయాణాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 4.20 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి పట్నాకు తొలి విమానం బయల్దేరనుంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు మరో విమానం ఉదయం 4.30 గంటలకు బయల్దేరుతుంది. ఈ రెండు కూడా ఇండిగో విమాన యాన సంస్థ విమానాలే. అయితే, పలు రాష్ట్రాలు విమానాల పునఃప్రారంభాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా విస్తృతి తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణాలకు అనుమతించడం సరికాదని మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తొలుత వ్యతిరేకించాయి. కాగా, సుమారు 1,050 విమాన సర్వీసుల బుకింగ్స్‌ను విమానయాన సంస్థలు ప్రారంభించాయి. అలాగే, ప్రయాణీకులు, విమాన సిబ్బందికి సంబంధించిన క్వారంటైన్ నిబంధనలు ఒకే తీరులో కాకుండా, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటం పైనా ఉండటంపైనా సందిగ్ధత నెలకొంది. తాము వెళ్తున్న రాష్ట్రాల్లోని క్వారంటైన్ నిబంధనలను ప్రయాణీకులు తెలుసుకోవాలని ఎయిర్ఏసియా ప్రకటించింది. క్వారంటైన్ సంబంధిత ఖర్చులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో గందరగోళం నెలకొనడంతో పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఆదివారం పలు దఫాలు చర్చలు జరిపారు. విమానాశ్రయాల్లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపైనా చర్చించారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన క్వారంటైన్ నిబంధనలను ప్రకటించాలని కోరారు. ఏ రాష్ట్రమైనా విమాన ప్రయాణాలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తమ విమానాల షెడ్యూల్స్‌లో మార్పు ఉంటుందని పలు విమాన యాన సంస్థలు వెల్లడించాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాలకు వెళ్లడానికి పైలట్లు, ఇతర సిబ్బంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ దిగిన తరువాత 14 రోజుల హోం క్వారంటైన్ సిబ్బంది అందరికీ ఉంటుందా? అనే విషయంపైనా స్పష్టత లేదని ఒక పైలట్ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి వస్తున్న విమాన ప్రయాణీకులకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలు ప్రత్యేక క్వారంటైన్ నిబంధనలను ప్రకటించాయి. పలు ఆంక్షలు, మార్గదర్శకాల మధ్య సోమవారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయంగా విమానాలను నడిపేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ముంబై నుంచి 50 విమానాలు మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉం డడంతో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోజు కు కేవలం 50 విమానాల రాకపోకలకు అను మతి ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బగ్దో గ్రా ఎయిర్‌పోర్టుల్లో మే 28 నుంచి విమానాల సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణానికి సిద్ధంగా విమానాలు -
గోల్డెన్ చారియట్ మళ్లీ షురూ
న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో అత్యంత విలాసవంతమైనదిగా పేరున్న గోల్డెన్ చారియట్ రైలు పునఃప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి గోవా వరకు వెళ్ళే ఈ రైలు దేశవిదేశీ టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ రైలులో 18 బోగీలుంటాయి. 84 మందికి సరిపోయే 44 గెస్ట్ రూములున్నాయి. అయితే ఈ రైల్లో ప్రయాణించే వారి సంఖ్య అతి తక్కువగా ఉండడంతో గత మార్చిలో దీన్ని రద్దు చేశారు. కొత్తగా నిర్ణయించిన రైలు వేళలు, టికెట్ ధరలు మరో వారంలో వెల్లడిస్తామని ఐఆర్సీటీసీ చెప్పింది. మొదట నెలకి రెండుసార్లు రాకపోకలు ప్రారంభించనున్నట్టు కెఎస్‌టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పుష్కర్ తెలిపారు. గతంలో ఈ రైలు చార్జీ రూ. 43 వేలు (600 అమెరికన్ డాలర్లు)గా ఉండేది. బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ రైలు బందిపూర్, మైసూర్, హలేబిద్, చిక్‌మంగుళూరు, హంపీ, బీజాపూర్‌ల మీదుగా గోవాకి చేరేది. ఇప్పుడు కూడా ఇదే మార్గంలో దీన్ని నడపనున్నారు. -
ఊపిరిపీల్చుకుంటున్న చెన్నై.. విమానాలు ఓకే
చెన్నై: చెన్నై మహానగరం ఇప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. మెల్లగా తేరుకుంటోంది. భారీ వర్షాలతో ముంచెత్తిన వరదల కారణంగా ఇసుమంత జాగ కూడా విడువకుండా, మిద్దెలను సైతం తనలో ముంచేసుకున్న వర్షపు నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో కాస్త సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవకాశం దొరికినట్లయింది. రవాణా సౌకర్యాలకు ఎలాగో ప్రస్తుతం అవకాశం లేకపోయినప్పటికీ వాయు మార్గాలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూతపడిన విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. అరక్కోణం నుంచి పూర్తి స్థాయిలో కాకున్నా కొద్ది స్థాయిలో ఓ ఏడు విమాన సర్వీసులను ప్రైవేటు విమానాల ద్వారా అందించేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, జాతీయ విపత్తు దళం కూడా తన సహాయక చర్యలను వేగవంతం చేసింది. చెన్నైకి మరో రెండు యుద్ధ నౌకలు చేరుకున్నాయి. వీటిలో 30 టన్నుల ఆహార పదార్ధాలు, తాగు నీరు తెప్పించారు. మరోపక్క, రేపటి వరకు అన్ని రైళ్లను దక్షిణమద్య రైల్వే రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై పరిస్థితి అప్పుడే మెరుగవుతుందని మాత్రం చెప్పలేం. -
రియాక్టర్‌ను మళ్లీ ప్రారంభించింది
టోక్యో: అణురియాక్టర్లు పేలి భారీ నష్టాన్ని చవి చూసిన జపాన్ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసే చర్యలు ప్రారంభించింది. గతంలో పేలిపోయిన రియాక్టర్ స్థానంలో కొత్తదానిని నిర్మించి తిరిగి అణువిద్యుత్ ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించింది. 2011లో ఫుకుషిమాలోని అణురియాక్టర్లు పేలిపోయి భారీ స్థాయిలో రేడియోథార్మికత వాతావరణంలోకి విడుదల కావడంతోపాటు వేల కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2013 సెప్టెంబర్ నాటికి దాదాపు అన్ని కమర్షియల్ రియాక్టర్ల వాడకాలను దాదాపుగా జపాన్ తగ్గించింది. అయితే, గతంలో రియాక్టర్ల ప్రమాదం జరిగిన యుషు ఖగోషిమాలోని సెందాయ్ ప్లాంట్‌లో మాత్రం తిరిగి రియాక్టర్‌ను పునరుద్ధరించే పనిని ప్రారంభించింది. అది ఇప్పటికీ సిద్ధం కావడంతోపాటు ఇటీవలె ప్రారంభానికి తిరిగి అనుమతులు లభించడంతో మంగళవారం ప్రారంభించారు. మరోపక్క, గతంలో జరిగిన ప్రమాదం తెలిసి కూడా మరోసారి రియాక్టర్ ను ప్రారంభించడాన్ని నిరసిస్తూ దాదాపు 400మంది ఆందోళన కారులు సెందాయ్ ప్లాంట్ వద్ద నిరసన తెలిపారు. మంగళవారం ఏకంగా ప్రధాని కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేస్తున్నారు. -
తిరిగి ప్రారంభం కానున్న 'మదీన' హోటల్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోనే పేరెన్నికగల ‘మదీనా’ హోటల్ మళ్లీ ప్రారంభం కానుంది. అనివార్య కారణాలతో 2009లో మూతపడ్డ ఈ హోటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి హోటల్ నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. నోరూరించే ఇరానీ చాయ్.. కమ్మనైన బిర్యానీ.. రంజాన్ మాసంలో ఘుమఘుమలాడే హలీం తయారు చేయడం ఈ హోటల్ ప్రత్యేకత. మళ్లీ ఇలాంటి రుచులను త్వరలోనే ప్రజలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్న ఈ హోటల్‌ను రంజాన్ మాసం అనంతరం ప్రారంభించనున్నారు. కాగా ఈ హోటల్ ప్రారంభానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. మక్కా మదీనా అలావుద్దీన్ వక్ఫ్ ఆధీనంలో ఉన్న ఈ భవనం అద్దె గతంలో సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకు వెళుతుండేది. తాజాగా ఎనిమిది నెలలుగా అద్దె తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు వెళుతుంది. 60 ఏళ్ల చరిత్ర మదీనా హోటల్ సొంతం 1944వ సంవత్సరంలో మదీనా హోటల్ భవనానికి హబీబ్ అలావుద్దీన్ అనే యజమాని శంకుస్థాపన చేయడం జరిగింది. కాగా అలావుద్దీన్ హైదరాబాద్ నగరంలో ఐస్, సోడా వ్యాపారాలు నిర్వహిస్తూ ఈ భవనం కట్టాడు. ప్రస్తుతం అలావుద్దీన్ కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 1948లో ఈ భవనం పూర్తయ్యింది. 1956 మార్చి 12న ఇరాన్ దేశానికి చెందిన ‘హసన్ జాబెద్’ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మదీనా హోటల్‌ను చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ప్రారంభించారు. మొదటి సారి ఈ హోటల్లో ఇరానీ ఛాయ్‌ను కేవలం 12 పైసలకు, హలీంను 25 పైసలు, బిర్యానీ 75 పైసలకు విక్రయించారు. దేశంలోనే తొలిసారిగా హలీం భారతదేశానికి హలీం రుచి చూపించిన ఘనత మదీనా హోటల్‌కు దక్కుతుంది. ఇరాన్ దేశానికి చెందిన హసన్ జాబెద్ తమ దేశంలో ఎంతో పేరుగాంచిన హలీంను 1956లో రంజాన్ మాసంలో మదీనా హోటల్లో ప్రారంభించాడు. కాగా అప్పట్లో హలీంను తయారు చేసిన కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అయిపోయేదని నిర్వాహకులు వెల్లడించారు. -
జన్మభూమికి కొత్త పాటలు సిద్ధం!
హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం కోసం సరికొత్తగా నాలుగు పాటలను టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ పాటలను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరాం రచించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. గతంలో జన్మభూమి టైటిల్ సాంగ్‌ను వందేమాతం శ్రీనివాస్ అందించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జన్మభూమి - మన ఊరు' పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. తమ సొంత గ్రామానికి, ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన ప్రకటనలో వెల్లడించారు.