
లక్ష్మీ సౌజన్య, నాగశౌర్య, రీతూ వర్మ
నాగశౌర్య, రీతూ వర్మ జోరుగా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. నాగశౌర్య, రీతూ వర్మ తదితర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పీడీవీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment