Ritu Varma
-
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను: శ్రీవిష్ణు
‘‘తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే మేం గెలుస్తుంటాం. ఈసారి ప్రేక్షకులను గెలిపించాలనుకుంటున్నాను. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు మా ‘శ్వాగ్’ సినిమా నచ్చితే అభినందిస్తూ రెండు చప్పట్లు కొట్టండి చాలు. ఈ నెల 4న థియేటర్స్‌కి వచ్చి మీరు గెలిచి, నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌కి ‘గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2’ సినిమాలు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ‘శ్వాగ్’ కూడా అలాంటి సక్సెస్ ఇస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నటన చూశాక కమల్హాన్గారితో ΄ోల్చుతారు’’ అని తెలి΄ారు. ‘‘శ్రీ విష్ణు, వివేక్ ఆత్రేయ స΄ోర్ట్తోనే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ‘రాజ రాజ చోర’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్వాగ్’ని విశ్వప్రసాద్‌గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హసిత్ గోలి. -
శ్రీ విష్ణు స్వాగ్ ’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహారాణి రుక్మిణీదేవిగా రీతు వర్మ
అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు వర్మ. ఫిలింమేకర్స్ లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది రీతు వర్మ. ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతోంది.స్వాగ్ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది. మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్ లో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ..మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానుంది. శ్రీ విష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రానుంది. -
శ్రీవిష్ణు 'శ్వాగ్' టీజర్.. హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడే
‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు..
-
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్‌ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్‌గా ఫీలయ్యే బ్రాండ్స్‌లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్‌నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్‌లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
మెగా హీరోతో రిలేషన్లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!
మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఆ మధ్య వరుణ్-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
ఆకట్టుకుంటున్న విక్రమ్- రీతూవర్మ 'కరిచే కళ్లే’ సాంగ్
చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ధృవ నక్షత్రం’. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం" ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం’ నుంచి 'కరిచే కళ్లే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా..శ్రీలేఖ పార్థసారధి పాడారు. 'కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా...గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా...వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది..యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది...' అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట. బ్యూటిఫుల్ మెలొడీగా హ్యారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట అమ్మాయిల లవ్ ఆంథెమ్ కానుంది. -
Mark Antony Movie Review: ‘మార్క్ ఆంటోని’ మూవీ రివ్యూ
టైటిల్: మార్క్ ఆంటోని నటీనటుటు: విశాల్, ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతువర్మ, అభినయ తదితరులు నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ 1975-1995 మధ్య కాలంలో జరుగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెడతాడు. దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి. అయితే అది కనిపెట్టిన కొద్ది రోజులకే అతను చనిపోతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) మరణించడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. మార్క్‌కి తండ్రి ఆంటోనీ అంటే ద్వేషం. తన తల్లిని అతనే చంపాడని భావిస్తాడు. తండ్రిలా తాను రౌడీ కావొద్దని, కత్తులకు, తుపాలకు దూరంగా ఉంటూ మెకానిక్‌గా పని చేసుకుంటాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆంటోనీ ఎలా మరణించాడు? మరణించిన తండ్రిని మార్క్ ఎలా బతికించుకున్నాడు? మార్క్ తల్లిని హత్య చేసిందెవరు? ఈ కథలో ఏకాంబరం(సునీల్) పాత్ర ఏంటి? రమ్య(రీతూ వర్మ)తో మార్క్ ప్రేమాయణం ఎక్కడికి దారి తీసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే మార్క్ ఆంటోనీ. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టైమ్ ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జే సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్‌గా ముందుకు సాగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి 1975లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెట్టే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 1995కి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎస్జే సూర్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ పాత్రలు పండించే కామెడీ, డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. అయితే టైమ్ ట్రావెల్ మిషన్‌తో ప్రతిసారి గతంలోకి వెళ్లడం..మళ్లీ ప్రస్తుత కాలంలోకి రావడం.. కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురవుతారు. ఇంటర్వెల్ వరకు కథ యమ స్పీడ్‌గా ముందుకు వెళ్తుంది. ఇక సెంకడాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది. రిపీట్ సీన్స్ కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. టెలిఫోన్ని ఉపయోగించి చనిపోయిన వారిని బతికించుకోవడం కొంతవరకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆ తరహా సన్నివేశాలే రిపీట్ కావడం ఇబ్బందిగా, గందరగోళంగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే అనకొండ(మిషన్ గన్) ఫైట్ సీన్ అయితే హైలైట్. ఈ సన్నివేశంలో విశాల్ ఎంట్రీ, గెటప్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఎలాంటి లాజిక్కులు వెతక్కుండా వెళ్తే ‘మార్క్ ఆంటోనీ’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడం విశాల్‌కు అలవాటు. మార్క్ ఆంటోనిలో కూడా వైవిధ్యమైన పాత్రనే పోషించాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలకు తనదైన నటనతో న్యాయం చేశాడు. లుక్ పరంగానూ వ్యత్యాసం చూపించాడు. ఇక క్లైమాక్స్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. జాకీ మార్తాండగా, అతని కొడుకు మార్తాండ్‌గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. తెరపై ఆయన పండించిన కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. విశాల్, సూర్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు. ఇక గ్యాంగ్‌స్టర్ ఏకాంబరం పాత్రకు సునీల్ న్యాయం చేశాడు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త చిరంజీవి పాత్రలో సెల్వ రాఘవన్ తన పరిధిమేర చక్కగా నటించాడు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్‌లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో రీతూ వర్మ బ్యూటీఫుల్ (ఫొటోలు)
-
ఐదేళ్ల తర్వాత విక్రమ్ సినిమాకు మళ్లీ మోక్షం.. సంతోషంలో ఫ్యాన్స్
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్‌లో జరుపుకుంది. (ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం) ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు. తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) -
క్యూట్‌గా కనిపించే రీతూ వర్మ కూడా డోసు పెంచిందే! (ఫోటోలు)
-
కూకట్‌పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
అరేంజ్ మ్యారేజ్ నాకు సెట్ కాదు : నటుడు
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదుగుతున్న నటుడు అశోక్ సెల్వన్. ఓ మై కడవులే వంటి హిట్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలో తెలుగు చిత్ర, పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఈయన నాలుగు పాత్రల్లో నటించిన చిత్రం నిత్తం ఒరువానం. నటి రీతువర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కార్తీక్ దర్శకత్వంలో వైకామ్ 18 స్టూడియోస్, ఈస్ట్ రైజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అశోక్ సెల్వన్ గురువారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ నిత్తం ఒరువానం తన ఫేవరెట్ చిత్రం అన్నారు. ఇందులో భిన్నమైన నాలుగు పాత్రలు పోషించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. కాగా ఇందులో ముగ్గురు హీరోయిన్లతో నటించడం గురించి అడుగుతున్నారని చెప్పారు. చిత్రంలో కథానాయికల ఎంపిక అన్నది దర్శకుడిదేనన్నారు. అలాగే తనతో కలిసి నటించిన హీరోయిన్లలో నచ్చిన నటి ఎవరిని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన టాలెంట్ ఉంటుందన్నారు. అదే విధంగా మంచీ చెడూ ఉంటాయన్నారు. తనకు అందరూ నచ్చిన వారేనని చెప్పారు. పెళ్లెప్పుడన్న ప్రశ్నకు కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయం ఇదనీ, తాను సినీ నేపథ్యం నుంచి గానీ, ఉన్నత కుటుంబం నుంచి గానీ రాలేదన్నారు. శ్రమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఆసమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, అయితే తన మనస్తత్వానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి సెట్ కాదని చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మన్మధలీల చిత్రంలో నటించిన వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. మంచి హ్యూమరస్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి వేరే మాదిరిగా వెళ్లిందన్నారు. అన్ని రకాల పాత్రలో నటించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రం తదుపరి విడుదల కానుందనీ చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని అశోక్ సెల్వన్ చెప్పారు. -
ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది
‘‘థియేటర్స్‌లో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. ఈ సినిమా ఇంకెంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే అంశాలను అటుంచితే థియేటర్స్‌లో ప్రేక్షకుల చప్పట్లను వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమను ఇచ్చారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). రీతూ వర్మ హీరోయిన్గా కీలక పాత్రల్లో అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి నటించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘గొప్ప కథ రాసి, విజయానికి కారణమైన దర్శకుడు శ్రీ కార్తీక్‌కు ధన్యవాదాలు. థియేటర్స్ స్క్రీన్‌పై అమలగారు కనిపించినప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమలగారు ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ ప్రభుగారు అభిరుచిగల నిర్మాత. మౌత్ టాక్‌తో ప్రేక్షకులు మా సినిమాను ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘యువత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని విజయం సాధించేందుకు మార్గం చూపే చిత్రం ఇది. ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు’’ అన్నారు అమల. ‘‘శర్వానంద్–అమలగార్లు స్క్రీన్‌పై తల్లీకొడుకు లుగా ప్రేక్షకుల మనసును హత్తుకున్నారు. ఈ సినిమా అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. నటుడు ‘వెన్నెల’ కిశోర్, ఈ చిత్రం కెమెరామేన్ సుజిత్ పాల్గొన్నారు. -
‘ఒకే ఒక జీవితం’ మూవీ స్టిల్స్
-
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ
టైటిల్: ఒకే ఒక జీవితం నటీనటులు: శర్వానంద్, రీతూవర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నిర్మాతలు : ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు డైలాగ్స్: తరుణ్ భాస్కర్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ విడుదల తేది: సెప్టెంబర్ 9, 2022 కథేంటంటే.. ఆది(శర్వానంద్), శ్రీను(వెన్నెల కిశోర్), చైతూ(ప్రియదర్శి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆది మంచి గిటారిస్ట్ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి(రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆది సక్సెస్ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇరవేళ్ల క్రితం(మార్చి 28,1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్ ఫిగర్ ఇంకా ఎక్కువతుంది. ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్ బ్రోకర్‌గా మారుతాడు. ఇంగ్లీష్ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని బాధ పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదని ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలోకి సైంటిస్ట్ రంగీ కుట్టా పాల్ అలియాస్ పాల్ (నాజర్) ప్రవేశిస్తాడు. అతను టైమ్ మిషన్ కనిపెట్టడానికి 20 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంటాడు. చివరకు తను టైమ్ మిషన్‌ని కనిపెడతాడు. ఆ మిషన్‌తో ఆది,శ్రీను, చైతూలను భూత కాలంలోకి పంపుతానని చెబుతాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి ఆది వెనక్కి వెళ్లి రోడ్డు ప్రమాదం బారిన పడకుండా తన తల్లిని కాపాడుకున్నాడా? శ్రీను, చైతూలు పాత తప్పుల్ని సరిదిద్దుకున్నారా? లేదా? భూతకాలంలో ఈ ముగ్గురికి ఎదురైన వింత సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ఆదిత్య 369. ఆ మధ్య వచ్చిన ‘24’తో పాటు రీసెంట్గా విడుదలైన ‘బింబిసార’కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘ఒకే ఒక జీవితం’. అయితే ఆ సినిమాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది టైమ్ ట్రావెల్ చిత్రమే అయినప్పటికీ..ఇందులో ‘అమ్మ’ కథ దాగి ఉంది. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు. టైమ్ మిషన్‌లోకి వెళ్లేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది..కానీ ఒక్కసారి భవిష్యత్తులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముగ్గురు యువకులు.. చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకునేందుకు వెళ్లడం..తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం..ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శర్వానంద్, అమల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. వెన్నెల కిశోర్ పాత్ర సినిమాకు మరో ప్రధాన బలం. ఆ పాత్ర పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ప్రియదర్శి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చి దిద్దితే బాగుండేది. భూతకాలంలోకి వెళ్లిన శ్రీను, చైతూలను కూడా తమ ఫ్యామిలీలతో కలిసేలా చూపిస్తే.. కథ ఇంకాస్త ఎమోషనల్‌గా సాగేదేమో. క్లైమాక్స్ కూడా ఊహకి అందేలా ఉంటుంది. టైమ్ ట్రావెల్ సీన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. స్లో నెరేషన్ కూడా సినిమాకు కాస్త మైనస్. సైన్స్ గొప్పదని చెప్తూనే.. విధిని ఎవరు మార్చలేరనే విషయాన్ని బలంగా చూపించిన దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. శర్వానంద్‌ని నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఆది పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. రొటీన్ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నమైన పాత్ర తనది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం వెన్నెల కిశోర్ పాత్ర. బ్రోకర్ శ్రీనుగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో నవ్వించాడు. అదే సమయంలో కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. చైతూ పాత్రకి ప్రియదర్శి న్యాయం చేశాడు. తన పాత్రని ఇంకాస్త బలంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ సినిమాకు అమల పాత్ర మరో ప్లస్ పాయింట్. అమ్మ పాత్రకు చాలా బాగా సూట్ అయ్యారు. శర్వానంద్, అమల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఆది లవర్ వైష్ణవిగా రీతూ వర్మ మెప్పించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. సైంటిస్ట్ పాల్గా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇలాంటి సీరియస్ పాత్రలు చేయడం నాజర్‌కి కొత్తేమి కాదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రంలో హీరో గిటారిస్ట్. కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా గుర్తిండిపోయే పాటలు లేకపోవడం మైనస్. ‘అమ్మ’పాట మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. కానీ థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటని మర్చిపోతాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసి నాగార్జున, అఖిల్ ఎమోషనల్‌కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నాగ్ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్‌ని, అద్భుతంగా నటించిన శర్వానంద్‌ని అక్కినేని హీరోలు అభినందించారు. ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌ని కార్తీక్ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) -
‘ఒకే ఒక జీవితం’ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
గ్రీన్ కలర్ శారీలో ఏంజెల్లా మెరిసిపోతున్న రీతూ వర్మ (ఫోటోలు)