
గూఢచారితో...
రీతూ వర్మ... ‘పెళ్లి చూపులు’తో ఈ హైదరాబాదీ అమ్మాయికి మంచి పేరొచ్చింది. అంతకు ముందు ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి సినిమాల్లో రీతు నటించారు. కానీ, ‘పెళ్లి చూపులు’ సినిమా ఇటు పరిశ్రమ వర్గాలు, అటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ విజయం రీతూ వర్మకి మంచి అవకాశాలను తీసుకొస్తోంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించనున్న ‘గూఢచారి’లో హీరోయిన్‌గా రీతూ వర్మకి అవకాశం లభించింది. శశి తిక్క, రాహుల్ ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘క్షణం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరోగా నటించనున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది.