Goodachari
-
గూఢచారి 2 షూటింగ్లో బాలీవుడ్ నటుడికి గాయం
బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరు గడించిన ఇమ్రాన్ హష్మి 'గూఢచారి 2' షూటింగ్లో గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని సెట్లో ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మెడ స్వల్పంగా కట్ అయ్యి రక్తం కారింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గూఢచారి 2 సినిమా విషయానికి వస్తే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా ఇమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు తెలుగులో పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీలోనూ విలన్‌గా నటిస్తున్నాడు.చదవండి: Shree Gopika: జూన్‌లో ఎంగేజ్మెంట్.. కట్ చేస్తే మరొకరితో నటి పెళ్లి -
నెక్స్ట్ 100 కోట్ల స్టార్ హీరో అతడే!
కంటెంట్ ఉంటే హీరో కటౌట్‌తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన హీరోలు కూడా అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచరీ కొట్టడంతో టిల్లు క్యూబ్ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు. ఆ రకంగా సిద్దు ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో తనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ అతన్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. అయితే ఇతడి కంటే ముందు తేజ సజ్జ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. అలాగే హీరో నాని దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.గీతగోవిందంతో విజయ్ దేవరకొండ, ఎఫ్-2 తో వరుణ్ తేజ్, 100 కోట్ల క్లబ్లో చేరగా.. కార్తికేయ-2 తో నిఖల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్లో చేరిన వాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉందని చెప్పొచ్చు. గతంలో శేష్ నటించిన గుఢచారి, హిట్-2, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో అడవి శేష్ పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శేష్ గుఢచారి-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభవం ఉంది. తనని స్టార్‌గా మార్చుకోవడంలో రైటింగ్ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాలి. గుఢచారి-2 తో అడివి శేష్ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. -
'గూఢచారి-2'లో ఇమ్రాన్ హష్మీ
బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీ తాజాగా తెలుగులో ‘జీ 2’లో నటించడానికి పచ్చజెండా ఊపారు. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా ‘జీ 2 ’(గూఢచారి 2) రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ని ‘ఎక్స్’లో షేర్ చేసిన అడివి శేష్.. ‘జీ 2’ యూనివర్స్‌లోకి బ్రిలియంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సార్‌కి స్వాగతం’’ అని పోస్ట్ చేశారు. దీనికి ఇమ్రాన్ హష్మీ రిప్లయ్ ఇస్తూ.. ‘సార్ అని ఫార్మాలిటీస్ అవసరం లేదు.. ఇమ్రాన్ అని పిలువు. మీ సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పోస్ట్ చేసారు. -
టాలీవూడ్ మూవీస్ సీక్వెల్స్ దందా
-
గురిపెట్టిన అడివి శేష్.. గూఢచారి-2 ప్రీ వెర్షన్ లుక్ వీడియో వచ్చేసింది
ఓ మిషన్ మీద ఒక గూఢచారి ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు వెళతాడు. ఆ మిషన్ ఏంటి? ఎలా విజయం సాధించాడు? అనేవి తెలియడానికి ఇంకా సమయం ఉంది. గూఢచారి పాత్రలో అడివి శేష్ హీరోగా రపొందనున్న చిత్రం ‘గఢచారి 2’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ రూపొందనుంది. కాగా తొలి భాగం భారతదేశంలో జరిగితే రెండో భాగం కథ ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణిస్తుంది. అడివి శేష్ కథ అందించిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. -
'గూఢచారి' మళ్లీ వస్తున్నాడు.. సీక్వెల్ అనౌన్స్ చేసిన అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్', 'హిట్'-2లతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న శేష్ తాజాగా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. శేష్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన గూఢచారి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. జీ2 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జనవరి 9న ముంబై అండ్ ఢిల్లీలో మూవీ గ్రాండ్ లాంఛ్ ఉండనున్నట్లు శేష్ తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది. #G2 it is! Just a little taste for the New Year ❤️ An Epic Action Film visualized by our Brilliant Director @vinaykumar7121 You will know what I mean when you see our “Pre Vision” Video. We will Launch MASSIVE on Jan 9 in Mumbai & Delhi. #HappyNewYear guys 🔥#Goodachari2 pic.twitter.com/WkZ46elqJ2 — Adivi Sesh (@AdiviSesh) December 29, 2022 -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
సర్ప్రైజ్కు రెడీ అయిన అడవి శేష్.. బిగ్ అప్డేట్ ఈ నెలలోనే..
అడివి శేష్ కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ‘గూఢచారి’ సినిమా విడుదలై మంగళవారం (ఆగస్ట్ 3) నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ‘‘నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాను పిల్లలు ఇష్టపడి చూశారు. ఆగస్టు నెల నాకు బాగా కలిసొస్తోంది. ఈ నెలలోనే నా తర్వాతి సినిమా ‘గూఢచారి 2’కు సంబంధించిన అతి పెద్ద అప్డేట్ తెలియజేస్తాను’’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అడివి శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. ‘హిట్ 2’ కూడా కమిట్ అయ్యారు. It’s #3YearsforGoodachari today :) My most loved film. It is especially The film children love the most. Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month!#G2 Announcement coming soon! pic.twitter.com/nD5RtlE7iw — Adivi Sesh (@AdiviSesh) August 3, 2021 -
త్రినేత్ర మళ్లీ వచ్చేస్తున్నాడు..
గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సీక్వెల్‌ల హవా నడుస్తోంది. కొత్త కథతో కుస్తీ పట్టేకంటే ఆల్రెడీ హిట్టైన స్టోరీనే అటూ ఇటూ మార్చి సీక్వెల్‌గా చుట్టేయవచ్చు. దీంతో బిజినెస్ కూడా పెంచుకోవచ్చని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘గూఢచారి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అడవి శేష్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధమవుతోంది. అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్ గురించి అధికార ప్రకటన చేశారు యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. 2019 మధ్యలో గూఢచారి 2 షూటింగ్ మొదలు కానుంది. గూఢచారి రెండో భాగం భారీ బడ్జెట్.. అద్భుతమైన లొకేషన్స్.. పెద్ద స్కేల్లో రాబోతుంది. తొలి భాగం కంటే మంచి ఔట్ పుట్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గూఢచారి సినిమా స్క్రిప్ట్ వర్క్ లో అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు దర్శకత్వం వహిస్తున్నాడు. 2020లో ఈ సీక్వెల్ విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనుంది. Thank you for the lovely wishes 😊 Scripting begins for a Bigger. Badder. Better. #Goodachari2 #Goodachariwillbeback @peoplemediafcy @vivekkuchibotla @AnilSunkara1 @AKofficiial @AAArtsOfficial @AbhishekOfficl @RahulPakala pic.twitter.com/JInm8l7cSA — Adivi Sesh (@AdiviSesh) December 17, 2018 -
గూఢచారి దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శశికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ బిగ్ బ్యానర్లో చేయనున్నాడట. యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శశికిరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ బ్యానర్లో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతుండగా నితిన్ హీరోగా వెంకీ కుడుముల (ఛలో ఫేం) దర్శకత్వంలో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి(మళ్ళీరావా ఫేం) దర్శకత్వంలో సినిమాలు సెట్స్‌మీదకు రానున్నాయి. వీటితో పాటు శశికిరణ్ చిత్రానికి కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే శశికిరణ్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరనేది వెల్లడించనున్నారు. -
ఒక్క సినిమా చేసినా చాలనుకున్నా
‘‘చిరంజీవిగారి క్లాప్‌తో మొదలైన నా ప్రయాణం ఇక్కడివరకు వచ్చింది. వచ్చిన కొత్తల్లో అందరిలా నేను కూడా స్టార్ అవుదామనుకున్నా. వరసగా పది ఫ్లాపులు వచ్చాయి. అయినా నా తర్వాతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు జగపతిబాబు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా రూపొందిన చిత్రం ‘గూఢచారి’. సుప్రియ ఓ కీలక పాత్ర చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ నెల 3న విడుదలైన ‘గూఢచారి’ సినిమాతో జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూనే ‘గూఢచారి’ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘నా 30 ఏళ్ల సినీ జీవితం ‘గూఢచారి’తో పూర్తవ్వడం హ్యాపీ. అందుకే ఈ చిత్రం నాకు స్పెషల్. ఒక్క సినిమా చేస్తే చాలనుకున్న నాకు 30 ఏళ్లు సినిమాలు చేసే అవకాశం కల్పించారు. ఈ థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించినందుకు జగపతిబాబుగారికి స్పెషల్ థ్యాంక్స్. మమ్మల్ని నమ్మిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శేష్. ‘‘జగపతి బాబుగారికి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా విజయం సమిష్టి కృషి’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘జగపతిబాబుగారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘జగపతి బాబుగారితో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ఈ సినిమాలో జగపతిబాబుగారు ఉన్నట్లు ముందుగా రివీల్ చేయలేదు. అందుకే ఈ సక్సెస్‌మీట్‌లో ఆయన 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేశాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
రాజమౌళి, పవన్ వద్ద మెళకువలు నేర్చుకున్నా
పశ్చిమగోదావరి, భీమవరం : గూఢచారి సినిమా యూనిట్ జిల్లాలోని భీమవరం, ఏలూరులో ఆదివారం సందడి చేసింది. చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను హీరో అడవి శేష్, చిత్రబృందం సందర్శించింది. మంచి కథలతో నిర్మించిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి గూఢచారి చిత్రమే నిదర్శనమని హీరో అడవి శేష్ అన్నారు. చిత్రం విజయోత్సవంలో భాగంగా ఆదివారం భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్ (మల్లీఫ్లెక్స్)కు వచ్చారు. తాను అనుష్క, సమంతలతో నటించాలనేది కోరికని అయితే సైజ్ జీరో సినిమాలో అనుష్కతో చిన్నపాత్ర చేయగా సమంతతో యాడ్‌లో కలిసి నటించినట్లు శేష్ తెలిపారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని, స్నేహితుల సహకారంతో డబ్బు ఖర్చు చేసి సినీపరిశ్రమకు వచ్చానని అయితే అవకాశాలు మాత్రం రాలేదని తనంతటతానే సృష్టించుకున్నానని శేష్ వివరించారు. కర్మ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన తనకు పంజా, రన్ రాజా రన్, క్షణం, గూఢచారి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకువచ్చినట్లు తెలిపారు. 2004లో గూఢచారి చిత్ర కథను తానే రాసుకున్నా అప్పటి స్నేహితుడు శశికిరణ్‌తో కలిసి తాజాగా మార్పులు చేసి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. గతంలో తాను రాజమౌళి, ఇంద్రగంటి, విష్ణువర్ధన్ వద్ద పనిచేశానని రాజమౌళితో సినిమా చేయాలనే కోరిక ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం 2 స్టేట్స్ చిత్రంలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్గా తాను హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులతో నృత్యం చేసిన శేష్ పట్టణంలోని శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం గూఢచారి చిత్రం యూనిట్ సందడి చేసింది. చిత్ర కథానాయకుడు అడవి శేష్ , దర్శకుడు శశికిరణ్ చిత్ర బృందం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. హీరో శేషు మాట్లాడుతూ గూఢచారి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. రాజమౌళి, పవన్ వద్ద మెళకువలు నేర్చుకున్నా ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రాజమౌళి, హీరో పవన్ కళ్యాణ్ వద్ద నేర్చుకున్న మెళకువలు తమ గూఢచారి చిత్రానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆ చిత్ర హీరో అడవి శేష్ పేర్కొన్నారు. గూఢచారి చిత్ర బృందం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ టూర్లో భాగంగా ఆదివారం స్థానిక బాలాజీ థియేటర్లో మ్యాట్నీషో సందర్భంగా థియేటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తొలుత థియేటర్లో ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను నటించిన తొలి చిత్రం కర్మ విమర్శకుల ప్రశంసలు పొందినా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదన్నారు. అయితే ఆ చిత్రం చూసిన దర్శకుడు విష్ణువర్థన్, హీరో పవన్‌కళ్యాణ్ తనకు పంజా సినిమాలో విలన్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారన్నారు. గూఢచారి చిత్రాన్ని 116 రోజుల పాటు 168 లొకేషన్లలో చిత్రీకరించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించామన్నారు. ఈ చిత్రాన్ని చూసిన హీరోలు నాగార్జున, నాని, హీరోయిన్ సమంతా తమ బృందాన్ని అభినందించారని చెప్పారు. ఈ చిత్రానికి మరో రెండు భాగాలున్నాయని, తన తదుపరి చిత్రాలు అవేనన్నారు. చిత్ర దర్శకుడు శశికుమార్ టిక్కా మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడూ కష్టపడి పనిచేశారని, చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుండడంతో తమ కష్టాన్ని మరిచిపోయామన్నారు. ఉషా పిక్చర్స్ మేనేజర్ సురేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గూఢచారి మళ్ళొస్తాడు
తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతోంది. పాతచింతకాయ పచ్చడి నుంచి బయటకొచ్చి కథే మూలంగా కథనం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాలూ పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. ఓ బలమైన కథతోఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన గూఢచారి... తెలుగు జేమ్స్‌బాండ్‌లా గుర్తింపు పొందింది. ప్రేక్షకులకుఓ మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తాయనితీయని కబురు అందించారుచిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క.ఆయన ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... శ్రీనగర్‌కాలనీ: మాది రాజమండ్రి. ఇంట్లో అమ్మానాన్న, అన్నయ్య, నేను. విజయవాడ లయోలా కాలేజీలో బీకాం చేశాను. అక్కడ కల్చరల్ వింగ్‌కు లీడర్ నేనే. కొత్త ఆలోచనలతో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాడిని. నేను చేసిన ఓ ఈవెంట్ చూసిన నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. బీకాం తర్వాత ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. అప్పుడే ఐడీబీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. జాబ్ ఆఫర్ వచ్చినప్పటికీ సినిమాలపై ఆసక్తితో 2007లో హైదరాబాద్ వచ్చేశాను. ఇంగ్లిష్ సినిమాకుఅవకాశం... సన్నిహితుల ద్వారా ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వెళ్లాను. మార్కెటింగ్ ఆఫర్ చేస్తే, నాకు క్రియేటివ్ సైడ్ ఆసక్తి ఉందని చెప్పాను. నా మొండితనం నచ్చి ఏజెన్సీ ఓనర్ సోదరుడు వాల్ట్ డిస్నీ యానిమేషన్ ఇంగ్లిష్ సినిమాలకు పనిచేసే ఉమాకాంత్ దగ్గరికి పంపించారు. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిల్డ్రన్ సినిమా ‘7 డేస్ ఇన్ స్లో మోషన్’ అనే ఇంగ్లీష్ చిత్రానికి ప్రోడక్షన్లో పని చేశాను. ఆ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే రూపొందించారు. తర్వాత న్యూయార్క్ వెళ్లి ‘న్యూయార్క్ ఫిలిం అకాడమీ’లో దర్శకత్వంపై శిక్షణ తీసుకున్నాను. అసిస్టెంట్‌గా ప్రయాణం ప్రారంభం... ఇంగ్లిష్ చిత్రానికి పనిచేసిన సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసే సూరి పరిచయమయ్యారు. ఇండియాకు తిరిగొచ్చాక ఆయన ద్వారా శేఖర్ కమ్ముల దగ్గర ‘లీడర్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నా పని విధానం నచ్చిన ఆయన సినిమాలకు ట్రై చేయమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే అడవి శేష్‌తో పరిచయం ఏర్పడింది. సినిమాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ పెద్ద ప్రొడక్షన్లో అవకాశం వచ్చింది. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ సమయంలో అమెరికాలో వెబ్ సీరిస్ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఇక వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే శేష్‌తో మంచి స్నేహం ఉంది. ఆయన అమెరికాలోనే ఉంటే.. ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే శేష్ నన్ను వద్దని వారించాడు. ‘సినిమా తీయాలనే నీ కలను నెరవేర్చుకో ముందు అని..’ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించాడు. మూల కథ శేష్‌దే... శేష్‌కు నేనో బ్యాంక్ దొంగతనం కథ చెప్పాను. కానీ అది వర్కవుట్ కాలేదు. అప్పుడు శేష్ నాకో కథ చెప్పాడు. అయితే అది ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదని, ఇద్దరం కలిసి 8 నెలలు శ్రమించి స్క్రిప్ట్ రెడీ చేశాం. స్పై, థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో తెలుగు జేమ్స్‌బాండ్‌లా గూఢచారిని రూపొందించాం. టెక్నాలజీ అడ్వాన్స్‌గా ఉండాలని దానిపై దృష్టిపెట్టాం. చిత్రంపై నమ్మకంతో నిర్మాతలు సైతం వెనుకాడలేదు. రచయిత అబ్బూరి రవి సలహాలు సూచనలిచ్చారు. 116 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ట్రైలర్‌కు, ఆ తర్వాత సినిమాకు వస్తున్న స్పందన మాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. గూఢచారి 2, గూఢచారి 3 చేయాలనే ఆలోచనలు మా ఇద్దరికీ ఉన్నాయి. సీక్వెల్‌కు ప్రయత్నాలు చేస్తున్నాం. యాక్షన్, కామెడీ ఇష్టం... నాకు యాక్షన్‌తో పాటు కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాం. సినిమా హిట్ అయిందనే గర్వం లేదు. హిట్ అయినా కాకున్నా సినిమానే జీవితం. నలుగురికి మంచి చేయాలనేదే నా భావజాలం. హైద రాబాద్‌లో ఫ్రీడమ్, ప్రశాంతత ఉంటుంది. ప్రశాసన్‌నగర్‌లోని పార్క్ అంటే ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని స్మార్ట్ అలెక్, బంజారాహిల్స్‌లోని టెర్రసన్ కెఫెకు వెళ్తుంటాను. సమయం దొరికితే ఇంట్లోనే ఉంటాను. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లి... నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నా భార్య దీపిక యూఎస్‌లో జాబ్ చేస్తుండేది. మ్యాట్రిమోనీలో ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అప్పటికి గూఢచారి పట్టాలెక్కలేదు. ఇరు కుటుంబాల అంగీకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్లికి అయ్యే ఖర్చును బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో అనాథలకు సహాయం చేస్తున్నాం. మా ఆలోచనలు మానవతా దృక్పథానికి దగ్గరగా ఉంటాయి. కొంచెం సెటిల్ అయ్యాక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. -
వైజాగ్ లో ‘గూఢచారి’ చిత్ర బృందం సందడి
-
‘గూఢచారి’ తరువాత..!
గూఢచారి సక్సెస్‌తో యంగ్ హీరో అడివి శేష్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బడా నిర్మాణ సంస్థలు ఈ యంగ్ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. అయితే శేష్ మాత్రం తన స్టైల్లో కూల్‌గా మరో సినిమా పనుల్లో బిజీ అయినట్టుగా తెలుస్తోంది. క్షణం సినిమా తరువాత గూఢచారి తెరకెక్కించేందుకు గ్యాప్ తీసుకున్న శేష్ ఈ సారి వెంటనే మరో సినిమా ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కూడా శేష్ కేవలం కథా కథనాలు మాత్రమే అంధించనున్నాడు. రామ్ జీ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతానికి క్షణం 2 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను క్షణం చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థే నిర్మించనుంది. -
‘గూఢచారి’ మూవీ రివ్యూ
టైటిల్ : గూఢచారి జానర్ : స్పై థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, శోభితా దూళిపాల, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్ సంగీతం : శ్రీచరణ్ పాకల దర్శకత్వం : శశి కిరణ్ తిక్క నిర్మాత : అభిషేక్ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్ క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తానే లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించాయి. శశి కిరణ్ దర్శకుడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.? రచయితగా అడివి శేష్ మరోసారి విజయం సాధించాడా..? కథ ; గోపి (అడివి శేష్) ‘రా’ అధికారి రఘువీర్ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్ చనిపోతాడు. దీంతో రఘువీర్ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్ కుమార్ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్ రాదు. (సాక్షి రివ్యూస్) ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్ కొడుకుని అని మెన్షన్ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్.. త్రినేత్ర 11గా అపాయింట్ అవుతాడు. కానీ అర్జున్ అపాయింట్ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్ అవుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్ బైక్ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అసలు ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్లు అర్జున్ చేసినట్టుగా ఎందుకు సృష్టించారు..? అర్జున్ ఈ మిస్టరీని ఎలా చేదించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బాండ్ తరహా కథ కావటంతో సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్ బాండ్లా అడవి శేష్ అద్బుతంగా నటించాడు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. తనే రాసుకున్న కథా కథనాలు కావటంతో అవకాశం ఉన్న ప్రతీ చోట తనని తాను చాలా బాగా ఎలివేట్ చేసుకున్నాడు. సినిమాలో జగపతి బాబు ఎంట్రీ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. మరోసారి ప్రతినాయక పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్ పాత్రలో ఆమె నటన సూపర్బ్. నెగెటివ్ షేడ్స్ ను కూడా చాలా బాగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. ఆమె.. గ్లామర్ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు చాలా ఏళ్ల కిందటే వచ్చినా.. ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి ఓ రేర్ కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్.. మనం కూడా బాండ్ సినిమాలను తెరకెక్కించగలమని మరోసారి ప్రూవ్ చేశాడు. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కాస్త బోరింగ్ గా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్ చూసిన తరువాత లవ్ సీన్స్ కూడా ఓకె అనిపిస్తాయి. అండర్ కవర్ ఆపరేషన్ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్ శానెల్ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లవ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కొత్తవి నేర్చుకోవడం ఇష్టం
అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రంలో కథానాయికగా నటించడం ద్వారా శోభిత ధూళిపాళ్ల తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అభిషేక్ నామా, టీజీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 3న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శోభిత చెప్పిన విశేషాలు.. ∙మాది తెనాలి. వైజాగ్‌లో ప్లస్ టు కంప్లీట్ చేసిన తర్వాత ముంబై వెళ్లాను. అక్కడే డిగ్రీ పూర్తి చేశా. ఆ టైమ్‌లోనే మిస్ ఇండియా పోటీలకు వెళ్లి సెలక్ట్ అయ్యాను. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు పడ్డాయి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. భరతనాట్యం, కూచిపూడిలో మంచి ప్రావీణ్యం ఉంది. ∙అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన ‘రామన్ రాఘవ్ 2.0’ నా కెరీర్ తొలి చిత్రం. ఈ సినిమాకు తొలి ఆడిషన్స్‌లోనే సెలక్ట్ కావడం, నా ఫస్ట్ సినిమానే అనురాగ్ కశ్యప్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారితో అసోసియేట్ అవ్వడంతో ఫుల్ హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా విడుదల తర్వాత అడవి శేష్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్ని భాషల్లో నటించిన నేను తెలుగమ్మాయినే కదా. అందుకే తెలుగు సినిమా అవకాశం రాగానే ఒకే చెప్పేశాను. అయినా సొంత భాషలో నటించడం వల్ల కలిగే తృప్తి వేరు. అలాగే అడవి శేష్ చెప్పిన ‘గూఢచారి’ కథ నాకు బాగా నచ్చింది. ఇందులో సమీరా పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మంచి ఫేజ్‌లో ముందుకు వెళ్తున్నాం అనిపిస్తోంది. ∙మా ఇంట్లో వారికి సినిమాల గురించి పెద్దగా తెలియదు. గ్లామర్ ఫీల్డ్‌లోకి వెళ్తున్నాను అని చెప్పగానే షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత బాగా ప్రోత్సహించారు. మిస్ ఇండియా గెలిచినప్పుడే తెలుగులో నటించమని కొందరు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను నటించాలనుకోలేదు. సో..ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ‘గూఢచారి’ టీజర్ రిలీజ్ తర్వాత మరికొంత మంది మళ్లీ అప్రోచ్ అవుతున్నారు. ప్రస్తుతం హిందీలో ‘ది బాడీ, ముథూన్, మేడ్ ఇన్ హెవెన్’ చిత్రాల్లో నటిస్తున్నాను. -
116 రోజుల్లో 158 లొకేషన్లలో..!
క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీ గూఢచారితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్ తరహా కథా కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను వెల్లడించారు చిత్రయూనిట్. ఈ సినిమాను 116 రోజుల్లో దాదాపు 158 డిఫరెంట్ లోకేషన్లలో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో చిత్రీకరించినట్టుగా వెల్లడించారు. అడివి శేస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభిత ధూళిపాళ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.. ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండటం మరో విశేషం. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. -
టాలీవుడ్ జేమ్స్ బాండ్ : గూఢచారి
క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్ తరహా సినిమాతో రెడీ అవుతున్నాడు శేష్. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేస్తూ ఇంట్రస్టింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. -
గూఢచారి టీజర్ రిలీజ్
-
గూఢచారి.. రేపు మేజర్ అనౌన్స్మెంట్
యంగ్ హీరో అడివి శేష్ వరుసగా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటగా ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆ మధ్య విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్లు ఇస్తున్న శేష్.. షూటింగ్ ముగిసినట్లు ప్రకటించాడు. ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్... గూఢచారి షూటింగ్ పూర్తయ్యింది. రేపు మేజర్ అనౌన్స్మెంట్’ అంటూ కాసేపటి క్రితం ఓ ట్వీట్ చేశాడు. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు టూ స్టేట్స్ రీమేక్ షూటింగ్లో కూడా అడివి శేష్ పాల్గొంటున్నాడు. రాజశేఖర్ కూతురు శివాని ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది. #Goodachari shoot has wrapped ladies & Gentlemen! Major announcement tomorrow! — Adivi Sesh (@AdiviSesh) 14 June 2018 -
ఎముకలు కొరికే చలిలో షూటింగ్
క్షణం సినిమాతో హీరోగా మంచి విజయం సాధించిన అడివి శేష్ ప్రస్తుతం గూఢాచారి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శశికిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తూ ఈ సినిమాకు అడివి శేష్ కథా కథనాలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో జరుగుతోంది. మైనస్ డిగ్రీల చలిలో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ లోకేషన్లు, అక్కడి వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు అడివి శేష్. ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభితా ధూళిపాల టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫస్ట్ లుక్.. పర్ఫెక్ట్ గూఢచారి
క్షణం, అమీ తుమీ హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్లో గూఢచారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
విలక్షణ పాత్రలో యువ హీరో!
సాక్షి, హైదరాబాద్: విలక్షణ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. ‘క్షణం’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటుడు మరో విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి’ .. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అయిన తెలుగమ్మాయి శోభితా దూళిపాల టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. విచిత్రంగా ఈ సినిమాను ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ప్రొడక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. -
బ్రెయిన్ డిజప్పాయింటెడ్.. హార్ట్ ఎంజాయింగ్
క్షణం సినిమాతో హీరోగా రచయితగా సక్సెస్ సాధించిన యంగ్ హీరో అడివి శేష్ మరో ఆసక్తిరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. అడివి శేష్ కథ అందిస్తున్న ఈ సినిమాతో శశికిరణ్ తిక్క దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ భయకర టెర్రరిస్ట్ ను పట్టుకునే గుఢచారిగా అడివి శేష్ నటిస్తున్నాడు. మిస్ ఇండియా అవార్డ్ సాధించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వర్షం కారణంగా అంతరాయం కలుగుతోంది. ఈ విషయాన్ని తనదైన స్టైల్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు శేష్. 'వరుణ దేవుడు ఆడుకుంటున్నాడు. షాట్ ఆలస్యమైంది. బ్రెయిన్ డిజప్పాయింటెడ్, మనసు మాత్రం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు. తరువాత 'చివరకు సూర్యుడు వచ్చాడు ఏరియాల్ షాట్ ల చిత్రీకరణ జరగబోతోంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. Rain gods playing. Shoot delayed. Brain disappointed. Heart enjoying the weather #Kakinada #Goodachari pic.twitter.com/2I9Z6OGw2g — Adivi Sesh (@AdiviSesh) 18 November 2017 The sun is finally out and I'm super excited with the aerial photography we are doing for #Goodachari ! — Adivi Sesh (@AdiviSesh) 18 November 2017