
బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీ తాజాగా తెలుగులో ‘జీ 2’లో నటించడానికి పచ్చజెండా ఊపారు. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా ‘జీ 2 ’(గూఢచారి 2) రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్‌ని ‘ఎక్స్’లో షేర్ చేసిన అడివి శేష్.. ‘జీ 2’ యూనివర్స్‌లోకి బ్రిలియంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సార్‌కి స్వాగతం’’ అని పోస్ట్ చేశారు. దీనికి ఇమ్రాన్ హష్మీ రిప్లయ్ ఇస్తూ.. ‘సార్ అని ఫార్మాలిటీస్ అవసరం లేదు.. ఇమ్రాన్ అని పిలువు. మీ సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పోస్ట్ చేసారు.
Comments
Please login to add a commentAdd a comment