Emraan Hashmi
-
సాహసంలో భాగస్వామికి స్వాగతం
అడివి శేష్ స్పై మిషన్‌లో చేరారు వామికా గబ్బి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘జీ2’. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా, ‘జీ2’ రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నట్లు వెల్లడించారు. ‘వెల్కమ్ టు ది మిషన్. మైపార్ట్నర్ ఇన్ అడ్వెంచర్ (మిషన్కి స్వాగతం... సాహసంలో నా భాగస్వామి)’’ అని వామికా గబ్బిని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు అడివి శేష్. ‘‘జీ2’ ప్రయాణంలో భాగం కావడం హ్యాపీగా ఉంది’’ అని వామికా పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని తదితరులు నటిస్తున్న ‘జీ2’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. -
గూఢచారి 2 షూటింగ్లో బాలీవుడ్ నటుడికి గాయం
బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరు గడించిన ఇమ్రాన్ హష్మి 'గూఢచారి 2' షూటింగ్లో గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని సెట్లో ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మెడ స్వల్పంగా కట్ అయ్యి రక్తం కారింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గూఢచారి 2 సినిమా విషయానికి వస్తే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా ఇమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు తెలుగులో పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీలోనూ విలన్‌గా నటిస్తున్నాడు.చదవండి: Shree Gopika: జూన్‌లో ఎంగేజ్మెంట్.. కట్ చేస్తే మరొకరితో నటి పెళ్లి -
ఆ సినిమా చేస్తే కెరీర్ ముగిసినట్లేనని వార్నింగ్.. అయినా వినలేదు!
కొన్ని పాత్రలు కత్తి మీద సాములా ఉంటాయి. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎక్కడైనా తేడా వచ్చిందో.. మొత్తం కెరీరే దిక్కుతోచని పరిస్థితిలో పడుతుంది. అయినా సరే కొందరు తారలు ధైర్యం చేసి మరీ అటువంటి పాత్రలు చేస్తుంటారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా అంతే!నెగెటివ్ క్యారెక్టర్2010లో వచ్చిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' సినిమాలో షోయబ్ ఖాన్ పాత్ర... ఇది గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ మూవీ ఆఫర్ చేయగానే ఇమ్రాన్ వెంటనే ఓకే చెప్పేశాడు. కానీ అతడి బంధువు, డైరెక్టర్ మహేశ్ భట్ మాత్రం రిస్కు అవసరమా? అని హెచ్చరించాడు. అదొక నెగెటివ్ క్యారెక్టర్ అని.. ఆలోచించుకోమని సూచించాడు.రిస్కు తప్పదుఈ విషయాన్ని ఇమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'షోయబ్ పాత్రలో నటిస్తే నా కెరీర్ ఖతమవుతుందని మహేశ్ హెచ్చరించాడు. అయినా ఈ సినిమా చేశాను. తీరా పెద్ద హిట్టయింది. అప్పుడు మహేశ్.. వన్స్ అపాన్ ఎ టైమ్.. చిత్ర దర్శకుడు మిలన్ లుథిరాను పిలిచి తన అంచనా తప్పయిందంటూ క్షమాపణలు చెప్పాడు. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ చూస్తాం' అని పేర్కొన్నాడు.చదవండి: శివకార్తికేయన్ కుమారుడి బారసాల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
మీడియాతో ఇమ్రాన్ హష్మీ బర్త్ డే సెలబ్రేషన్
-
ఐశ్వర్యను ప్లాస్టిక్ అనేసిన హీరో.. దాని పరిణామాలు దారుణంగా..
ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.. సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా ఆ మాటలను వెనక్కు తీసుకోలేరు. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే పదాలే పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీకి ఇలాగే జరిగింది. 2014లో ఇతడు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లాడు. అక్కడ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో భాగంగా యాంకర్ ప్లాస్టిక్ అన్న పదం ప్రస్తావించగానే ఇమ్రాన్ ఐశ్వర్యరాయ్ పేరు చెప్పాడు. అందరూ షాక్ ఇంకేముంది.. ఐశ్వర్య అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోయిన్ నీ కంటికి ప్లాస్టిక్‌లా కనిపిస్తోందా? అని చెడుగుడు ఆడుకున్నారు. నిజానికి తను ఐశ్వర్య పేరు చెప్పగానే లొకేషన్లో ఉన్నవారంతా షాకయ్యారట! ఈ ఆన్సర్ ఉంచుదామా? తీసేద్దామా? అని అడిగితే సెట్లో ఉన్నవాళ్లు అలాగే ఉండనీయమని చెప్పారని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్. దాని వల్ల ఎదురైన పరిణామాలను(ట్రోలింగ్‌ను) చాలాకాలం పాటు భరించాల్సి వచ్చిందన్నాడు. అదొక గేమ్.. తప్పుగా అనుకోవద్దు ఈ విషయం గురించి గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఐశ్వర్యరాయ్‌కు పెద్ద అభిమానిని. నేను తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఆమెను ఎంతగానో అభిమానిస్తాను. షోలో యాంకర్ ఒక వస్తువు పేరు చెప్పగానే నన్ను ఎవరో ఒక సెలబ్రిటీల పేర్లు చెప్పమన్నారు. అందుకే ఆమె పేరు చెప్పానే తప్పితే అంతకు మించి ఏ ఉద్దేశమూ లేదు. దీన్ని అనవసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని వివరణ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. చదవండి: దేవిశ్రీప్రసాద్ ఇంట పండగ వాతావరణం.. తండ్రయిన సింగర్ సాగర్ -
'గూఢచారి-2'లో ఇమ్రాన్ హష్మీ
బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీ తాజాగా తెలుగులో ‘జీ 2’లో నటించడానికి పచ్చజెండా ఊపారు. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా ‘జీ 2 ’(గూఢచారి 2) రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ని ‘ఎక్స్’లో షేర్ చేసిన అడివి శేష్.. ‘జీ 2’ యూనివర్స్‌లోకి బ్రిలియంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సార్‌కి స్వాగతం’’ అని పోస్ట్ చేశారు. దీనికి ఇమ్రాన్ హష్మీ రిప్లయ్ ఇస్తూ.. ‘సార్ అని ఫార్మాలిటీస్ అవసరం లేదు.. ఇమ్రాన్ అని పిలువు. మీ సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పోస్ట్ చేసారు. -
ఖరీదైన కారు కొన్న ఓజీ నటుడు.. ఎన్ని కోట్లంటే?
ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో సినీ తారలు ఎప్పుడు ముందుంటారు. తమకిష్టమైన కొత్త కొత్త బ్రాండ్ కార్లను కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కార్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ బ్రాండ్ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువగా అలాంటి కార్లను కొనేందుకే ఇంట్రస్ట్ చూపిస్తారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరి కొత్త రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. ఇటీవలే టైగర్ 3లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన ఇమ్రాన్ హష్మీ విలాసవంతమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ కారును కొనేశారు. ఈ లగ్జరీ బ్రాండ్ కారు విలువ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇమ్రాన్ తన బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కారులో రైడ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించినఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో పఠాన్ సక్సెస్ తర్వాత షారుక్ ఖాన్ సైతం రోల్స్ రాయిస్ కారును కూడా కొనుగోలు చేశాడు. కాగా..ఇమ్రాన్ హష్మీ చివరిసారిగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్-3లో కనిపించారు. ఈ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. సెల్ఫీలో అక్షయ్ కుమార్‌తో పాటు ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం ఇమ్రాన్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియాంక అరుణ్ మోహన్, అర్జున్ దాస్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
మా మధ్య కెమిస్ట్రీ లేదు.. అందుకే అంత ఇబ్బంది: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆషికి బనాయా ఆప్నే సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. వీరభద్ర సినిమాతో తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇక్కడ తనకు సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయింది. కానీ మీటూ ఆరోపణలు చేసినందుకుగానూ చేతిలో అవకాశాల్లేక వెండితెరకు దూరమై చాలాకాలమైంది. అయితే తనకు మంచి గుర్తింపునిచ్చిన ఆషికి బనాయా ఆప్నే సినిమా గురించి, అందులోని ముద్దు సన్నివేశం గురించి మాట్లాడిందీ బ్యూటీ. మా మధ్య కెమిస్ట్రీ లేదు ఇమ్రాన్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించాను. చాకొలెట్ మూవీలోనూ మా మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్‌లో తీసేశారు. అయితే ఫస్ట్ టైమ్ అలాంటి సీన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిపడ్డాను. రెండోసారి మరీ అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నిజ జీవితంలో మా మధ్య ఎటువంటి కెమిస్ట్రీ లేదు. అయితే అతడికి అప్పటికే కిస్సర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది. అయినా నాకెందుకో అతడితో అటువంటి సీన్లో నటించడం అంత సౌకర్యంగా అనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాల సంగతి.. కాగా తనుశ్రీ దత్తా, ఇమ్రాన్ హష్మీ.. 'ఆషికి బనాయా ఆప్నే', 'చాకొలెట్: డీప్ డార్క్ సీక్రెట్స్', 'గుడ్ బాయ్.. బ్యాడ్ బాయ్' అనే సినిమాలు చేశారు. తనుశ్రీ దత్తా చివరగా 2013లో వచ్చిన హమ్ నే లీ హై శపథ్ సినిమాలో కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీ విషయానికి వస్తే ఇతడు గ్యాంగ్‌స్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, ద డర్టీ పిక్చర్, శాంఘై వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా టైగర్ 3 మూవీలో కనిపించాడు. చదవండి: తుపాన్ బాధితులకు అండగా నిలిచిన కోలీవుడ్ సెలబ్రిటీలు.. -
స్టేజీపై ఇద్దరు హీరోల ముద్దులాట, వీడియో చూశారా?
సినిమా సక్సెస్ అయిందంటే ఆ సంతోషమే వేరు. చిత్రయూనిట్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే! పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చేసినట్లే! అందుకే ఆ ఆనందాన్ని సక్సెస్ మీట్ల ద్వారా జనాలతో పంచుకుంటారు. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ మధ్య విజయాల్లేక అల్లాడిపోయిన బాలీవుడ్ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో తాజాగా టైగర్ 3 కూడా చేరింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ యాక్షన్ మూవీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆరు రోజుల్లోనే అన్ని కోట్లు మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 12న విడుదలవగా బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నవంబర్ 17న చిత్రయూనిట్ అభిమానుల కోసం ముంబైలో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సల్మాన్, కత్రినాతో పాటు ఇందులో విలన్‌గా నటించిన మరో హీరో ఇమ్రాన్ హష్మీ సైతం పాల్గొన్నాడు. వీరు టైగర్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. సల్మాన్ ముద్దులు.. వీడియో వైరల్ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ.. 'ఈ మూవీలో కత్రినా ఉంది. తనతో నేను చేసిన కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమాలో ఇమ్రాన్.. ఆతిష్ పాత్రలో లేకపోతే ఇలా జరిగి ఉండేది' అంటూ సరదాగా అతడి దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టాడు. సల్మాన్-ఇమ్రాన్ బ్రొమాన్స్ చూసిన జనాలు ఘొల్లుమని నవ్వారు. ముద్దు సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇమ్రాన్ హష్మీ గురించి సల్లూ భాయ్ మాట్లాడుతూ.. 'నేను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్‌కు అది బాగా అలవాటు.. దాన్ని మిస్ అవుతున్నాడేమో. అందుకే ఆ వెలితిని పూడ్చేశా' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
నువ్వు మొదలుపెట్టావ్.. నేను ముగిస్తాను!
‘దేశంలోని శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత’ అంటూ మొదలువుతుంది ‘టైగర్ 3’ తెలుగు ట్రైలర్. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రధారులుగా మనీష్శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన స్పై ఫిల్మ్ ‘టైగర్ 3’. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ చిత్రాల్లోని ఘటనలకు కొనసాగింపుగా ‘టైగర్ 3’ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘టైగర్ 3’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను నవంబరు 12న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ‘టపాసులు కాల్చడం నవ్వు మొదలు పెట్టావ్.. నేను ముగిస్తాను’, ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు, ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ఖాన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందాహై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’. -
అమితాబ్ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే
అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో రూమీ జాఫ్రీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చెహ్రే’. ఈ సినిమాలో క్రిమినల్ లాయర్‌గా అమితాబ్, క్రిమినల్‌గా ఇమ్రాన్ హష్మీ నటించారు. ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ‘‘కరోనా కేసులు పెరుగుతుండటం, సినిమాల ప్రదర్శనకు కొత్త గైడ్‌లైన్స్ రావడం వంటి అంశాల కారణంగా ముందుగా అనుకున్నట్లు మా సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయలేకపోతున్నాం. మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇందుకు ఆడియన్స్‌కు థ్యాంక్స్. త్వరలో మా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చెహ్రే’ చిత్రాన్ని మొదట 2020 జూలై 17న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ కారణంగా విడుదల కాలేదు. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా మరోసారి వాయిదా పడింది. -
పిస్తోలు ఫ్యాషన్ కోసమే.. భయపెట్టడానికి నా పేరు చాలు
ముంబైలో జాన్ అబ్రహమ్ డాన్‌గా మారి ఒక రాజకీయ నాయకుడి తమ్ముణ్ణి చంపేశాడు. ఇప్పుడు అతని తలమీద పదికోట్ల బహిరంగ విలువ నిర్థారించబడింది. ఎవరు ఆ తలను తెస్తే వారికి పది కోట్లు. ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ హష్మీ రంగంలోకి దిగాడు. ఈ తాజా మాస్ మసాలా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ‘కాంటె’, ‘జిందా’, ‘షూట్ అవుట్ ఎట్ వడాలా’ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సంజయ్‌గుప్తా దీని నిర్మాత, దర్శకుడు. జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి ప్రధాన తారాగణం. మన కాజల్ అగర్వాల్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. ఎనభైలలో జరిగిన ఈ కథను నాటి బాంబే గూండాయిజాన్ని ఈ సినిమాలో కథాంశంగా తీసుకున్నారు. గూండా మామూళ్లను ఎదిరించి గూండాగా మారిన పాత్రలో జాన్ అబ్రహమ్ కనిపిస్తాడు. ‘పిస్తోలు ఊరికే ఫ్యాషన్ కు పెట్టుకుంటాను. భయపెట్టడానికి నా పేరు చాలు’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. చూడాలి ప్రేక్షకులు ఏం తీర్పు చెబుతారో. -
బాలీవుడ్ ఫేక్ అంటున్న ప్రముఖ నటుడు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే లుట్ గయ్ అనే లవ్సాంగ్లో ఆడిపాడాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తైన అతడు బాలీవుడ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగుల ప్రపంచం అంతా ఫేక్ అని, అందుకే తన పని పూర్తయ్యాక ఈ ఫీల్డ్‌తో సంబంధం లేనట్లు దూరంగా ఉంటానని పేర్కొన్నాడు. తాజాగా ఇమ్రాన్.. సిద్ధార్థ్ ఖన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బీటౌన్‌లో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని బయటపెట్టాడు. "అందరి ముందు మనల్ని పొగుడుతున్నట్లే కనిపిస్తారు, కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తూ కిందకు లాగుతుంటారు. ఇదే పచ్చి నిజం. బాలీవుడ్లో జరిగేదిదే. అయినా వృత్తి కన్నా వ్యక్తిగత జీవితం ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకే నా పర్సనల్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నా పేరు ఇంకా బాలీవుడ్లో వినిపిస్తోందంటే దానికి కారణం నా స్నేహితులు, తల్లిదండ్రులే. వారు వాస్తవిక దృక్పథం అలవర్చుకోవడం నేర్పించారు. దానివల్లే నేనింకా ఇక్కడ నిలదొక్కుకునే ఉన్నాను. నా పనేదో నేను చేసుకున్న తర్వాత చిత్రపరిశ్రమకు దూరంగా ఉండటం వల్లే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే ఇమ్రాన్ తాజాగా నటించిన 'ముంబై సాగా' మార్చి 19న రిలీజవుతోంది. జాన్ అబ్రహం, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. దీనితో పాటు అమితాబ్ బచ్చన్ 'చెహెరే' సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. క్రిస్టల్ డిసౌజ, అను కపూర్, దృతీమాన్ చటర్జీ, రఘుబీర్ యాదవ్ సహా తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ! ఆ హీరోయిన్ను ఇద్దరు ప్రేమించారు, కానీ! -
కోటాలో ఇలాంటివి కామన్..
ముంబై ఐఐటీలోని యాభై శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు చీటింగ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు.. – 2014, ఆగస్టు – టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే దేశంలో ప్రతి గంటకు ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.– 2018, మార్చి – ఎకానమిక్ టైమ్స్ దేశంలోని మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌లో కేవలం 7 శాతం మందే ఉద్యోగానికి అర్హులు..– యాస్పైరింగ్ మైండ్స్ స్టడీ – 2016, జూలై – ఇండియా టుడే ఇండియన్ మార్కెట్లో కోచింగ్ సెక్టార్ విలువఅక్షరాలా 45 వేల కోట్ల రూపాయలు..– 2008, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ దేశంలో 297 నకిలీ టెక్నికల్ కళాశాలలు, 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు తేల్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)...– 2017, మార్చి – హిందుస్తాన్ టైమ్స్ ఈ డేటా విద్యకు సంబంధించిన సీరియస్ వ్యాసానికి నాందీప్రస్తావన కాదు.. తల్లిదండ్రుల కలలు, ఆశలు, ఆశయాల సాధనకు పిల్లలనుపరీక్షపెడితే వచ్చిన ఫలితం!! జీ5లో స్ట్రీమ్ అవుతున్న ‘వై చీట్ ఇండియా’ అనే సినిమా చూపించిన ప్రాక్టికాలిటీ! డాక్టర్, ఇంజనీర్ అనే ‘పుట్టుమచ్చ’తో ఉన్న పిల్లల కోసం ఎంసెట్,ఐఐటీ కోచింగ్ సెంటర్లు పోటీలునిర్వహిస్తున్నాయి.. చతికిలబడుతున్న విద్యార్థుల రాతను మెరిట్ స్టూడెంట్స్‌తో రీరైట్ చేయిస్తున్నాయి.. నకిలీ సర్టిఫికెట్స్‌తో పేరెంట్స్ కలను సాకారం చేస్తున్నాయి! ఇలాంటి రియల్ సిస్టమ్ అందించిన నకలు చీటీయే వై చీట్ ఇండియా!! ఆ కథే ఇక్కడ... రాకేశ్ సింగ్ ఉరఫ్ రాకేశ్... ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో విఫలమవుతాడు. అతని అన్న.. మెడికల్ ఎంట్రెన్స్ సీట్ సంపాదించి డాక్టర్ అవుతాడు. దాంతో ఆ ఇల్లు రాకేశ్‌కు అవమానాల పుట్టిల్లు అవుతుంది. అతని ఆసక్తులు, అభిరుచులకు ఆ ఇంట్లో విలువ ఉండదు. చివరకు పెళ్లి కూడా అతని ఇష్టానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఏ ఎంట్రెన్స్ అయితే తనను ఫెయిల్యూర్‌గా నిలబట్టిందో ఆ ఎంట్రెన్స్‌కు సంబంధించిన కోచింగ్ సెంటర్ పెట్టి సక్సెస్ సాధించాలనుకుంటాడు. సాధిస్తాడు కూడా! ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీలాంటి పట్టణంలో ఎంసెట్, ఐఐటీ, ఎంబీఏ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూంటాడు. పిల్లలను ఐఐటీ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఏంబీఏ గ్రాడ్యుయేట్స్‌గా చూడాలనుకునే తల్లిదండ్రుల ఆశయాలను క్యాష్ చేసుకుంటూంటాడు. సీట్ గ్యారెంటీ అనే ట్యాగ్‌లైన్‌తో పేరెంట్స్‌కు భరోసా కల్పిస్తుంటాడు. మిగిలిన శిక్షణాకేంద్రాల్లోలా మెరిట్ స్టూడెంట్స్‌ని కాకుండా సాధారణ విద్యార్థులనూ చేర్చుకుంటాడు. వీళ్ల కోసం డబ్బు అవసరం ఉన్న మెరిట్ స్టూడెంట్స్‌తో ఎంట్రెన్స్ పరీక్షలు రాయించి సీట్ తెప్పిస్తాడు. అలాగే అకడమిక్స్‌లో కూడా పరీక్షలు రాయించి పాస్ చేయిస్తూంటాడు. ఈ పద్ధతిలో దేశమంతా వ్యాపారం చేస్తూంటాడు. అలా ఝాన్సీలో సత్యేంద్ర అనే విద్యార్థి రాకేశ్ కంట్లో పడ్తాడు. సత్యేంద్ర స్టోరీ.. సత్యేంద్ర ఉరఫ్ సత్తూ... ఒక ప్రభుత్వ గుమాస్తా కొడుకు. అతనికి ఒక అక్క నూపుర్. కూతురిని బరువుగా.. కొడుకుని గారంగా చూసే కుటుంబానికి వారసుడు. నూపూర్‌కు ఎంబీఏ చేయాలనుంటుంది. ఆడపిల్లకు డిగ్రీ కన్నా ఎక్కువ చదువెందుకని వారించి డబ్బుతోపాటు తన ఆశనూ కొడుకు చదువుకి పెట్టుబడిగా పెడ్తాడు. కొడుకు ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని కోటాలోని పేరున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తాడు. టూత్ పేస్ట్ అయిపోయినా అబ్బాయి షాప్‌కి వెళ్లి టైమ్ వేస్ట్ చేయకుండా ఆ టైమ్‌ను నాలుగు సమ్స్ను సాల్వ్ చేసుకోవడానికి వినియోగించుకోవాలని.. పేస్ట్, సబ్బు, షాంపూలాంటివి తెచ్చిపెట్టడానికి హాస్టల్లో అదనంగా ఒక మనిషినీ ఏర్పాటు చేస్తాడు (కోటాలో ఇలాంటివి కామన్). సెకన్లను కూడా సమ్స్తో కాలిక్యులేట్ చేసుకుంటూ అరక్షణం కూడా వృథా కానివ్వకుండా కష్టపడి చదివి ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్ సంపాదిస్తాడు సత్తూ. అలా తదుపరి చదువుకోసం సన్నాహాల్లో ఉండగా రాకేశ్‌కు తారసపడ్తాడు ఒక సినిమా హాల్లో. సత్తూ, అతని స్నేహితులను సినిమా థియేటర్లో స్థానిక నేత అండ్ గ్యాంగ్ ఇబ్బంది పెడ్తూంటే వాళ్లను ఎదిరించి సత్తూ దృష్టిలో హీరో అవుతాడు రాకేశ్. ఆ పరిచయంలోనే సత్తూ ఐఐటీ ర్యాంకర్ అని తెలుస్తుంది రాకేశ్‌కి. కాలేజ్‌లు ఓపెన్ అయ్యేదాకా.. తన దగ్గర ఉద్యోగం చేసేందుకు అవకాశమిస్తాడు రాకేశ్. ఆ వలలో పడ్తాడు సత్తూ. అతని తండ్రినీ ఒప్పిస్తాడు రాకేశ్. అసలు కథ మొదలు.. రాష్ట్రాల ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు, ఇతర ప్రవేశ పరీక్షలు, సెమిస్టర్ ఎగ్జామ్స్.. ఇలాంటి వాటన్నిటికీ ఆయా ప్రాంతాల్లో, కాలేజీల్లోని విద్యార్థుల తరపున పరీక్షలు రాసేందుకు సత్తూని పంపిస్తూంటాడు రాకేశ్. డబ్బులూ బాగానే ముట్టజెప్తూండడంతో సత్తూ తండ్రి కూడా అదేదో మంచి ఉద్యోగమని సంబరపడ్తూంటాడు. ఆ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన సత్తూ కోల్‌కతాలో ఉన్నప్పుడు డ్రగ్స్‌కి అలవాటు పడి.. వ్యసనంగా మార్చుకుంటాడు. ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలవుతాడు. అప్పటికీ సత్తూ తండ్రికి అసలు విషయం తెలియదు. ఆసుపత్రి ఖర్చంతా రాకేశే భరిస్తాడు. అయితే సత్తూకి గాడ్‌ఫాదర్‌గా, బాస్‌గా, స్నేహితుడిగా ఇంటికి వస్తూన్న రాకేశ్ ఆకర్షణలో పడ్తూంది సత్తూ సోదరి నూపుర్. అతని పట్ల పెంచుకున్న ప్రేమతో తండ్రి చూసిన సంబంధాలనూ కాదంటుంది. ఆ విషయం రాకేశ్‌కూ అర్థమవుతుంది. సత్తూ ఆసుపత్రి పాలయినప్పడు చెప్తాడు తను వివాహితుడినని. మౌనంగా ఊరుకుంటుంది నూపుర్. సత్తూ కోలుకున్నాక నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఖతార్‌లో ఒక ఉద్యోగం చూపించి అతణ్ణి అక్కడికి పంపించేస్తాడు రాకేశ్. కొన్నాళ్లకు.. తను తన విద్యావ్యాపారాన్ని ముంబైకీ విస్తరింపచేస్తాడు రాకేశ్. బిజినెస్ మూడు పరీక్షలు.. ఆరు ఫలితాలుగా విరాజిల్లుతూన్న తరుణంలో అక్కడే.. ముంబైలో నూపుర్ తారసపడ్తూంది రాకేశ్‌కు. అక్కడొక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూంటుంది నూపుర్. తల్లిదండ్రులు, సత్తూ గురించి క్షేమసమాచారాలు తెలుసుకుంటాడు. మళ్లీ స్నేహం మొదలవుతుంది ఇద్దరి మధ్యా. ‘‘ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో ఫెయిల్ అయిన నాకు.. గంతకు తగ్గ బొంత చాలని.. ఓ సంబంధం చూసి పెళ్లిచేశారు. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వండి వడ్డించడమే ఇంటి కోడలు బాధ్యత అని గాఢంగా నమ్మే ఆమె మా అమ్మానాన్నకు కోడలైంది తప్ప నాకు భార్య కాలేకపోయింది. నువ్వు కాస్త లేట్‌గా కనిపించావ్’’ అంటాడు నూపుర్‌తో. కళ్లల్లో నమ్మకం కురిపిస్తుంది ఆమె. ముంబైలో కోచింగ్ సెంటర్ల మాఫియాను ఎదుర్కోవాల్సి వస్తుంది రాకేశ్‌కు. ఆ సమయంలోనే నూపుర్‌కు ఆఫీస్‌లో హెరాస్మెంట్ మొదలవుతుంది. ‘‘వేరే ఉద్యోగం చూసుకో’ అని సలహా ఇస్తాడు రాకేశ్. ‘ఎంబీఏ’ పట్టాలేంది ఈ తరహా జాబ్ ఎక్కడ దొరుకుతుంది? అంటుంది నూపుర్. ‘‘ఎంబీఏ చెయ్యి మరి’’ అంటాడు. ‘‘ప్రిపరేషన్‌కు టైమ్ ఎక్కడుంది?’’ అంటుంది నూపుర్. ‘‘అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు ఎంట్రెన్స్ ఫీ అయితే కట్టు’’ అంటాడు. కడ్తుంది. తన వృత్తి, వ్యాపారంలో భాగంగా ఎంట్రెన్స్ ముందు రోజు పేపర్ లీక్ చేయిస్తాడు. ఆ లీక్ అయిన పేపర్‌ను నూపుర్‌కు తెచ్చిస్తాడు. ‘‘కరెక్ట్‌గా ఇదే పేపర్ వస్తుందన్న గ్యారెంటీ ఏంటీ?’’ అని అడుగుతుంది నూపుర్. రుజువు చూపిస్తుంటే అక్కడే కాపు కాసి ఉన్న పోలీసులు వచ్చి రాకేశ్‌ను అరెస్ట్ చేస్తారు. అప్పుడుగాని గ్రహించడు అది నూపుర్ పని అని. ఎందుకు చేస్తుంది అలా? సత్తూ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ నకిలీ అని తేలడంతో అతని మీద ఇండియన్ ఎంబసీలో కంప్లయింట్ చేస్తాడు అతని బాస్. చట్టపరమైన చర్యలు తీసుకొని అతణ్ణి ఇండియాకు పంపించేస్తారు. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు సత్తూ. దాంతో ఆ కుటుంబం కుప్పకూలి పోతుంది. రాకేశ్ కోసం ఎంక్వయిరీ చేసిన నూపుర్‌కు అతను ముంబైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమే ముంబైకి మకాం మారుస్తుంది. యాదృచ్ఛికంగా కలిసినట్టు.. అతణ్ణి ఇంకా ప్రేమిస్తున్నట్టు నటించి.. ఎప్పటికప్పుడు అతని కదలికలను గమనిస్తూ.. అతని ప్రణాళికలను తెలుసుకుంటూ..పోలీసులకు చేరవేస్తుంది. అతను చేస్తున్న దందాను సరైన సాక్ష్యాధారాలతో పట్టించడానికి. అందులో భాగమే ఎంబీఏ నాటకం. విద్యావ్యవస్థలోని ఏ లొసుగులను రాకేశ్ వాడుకొని దాన్నో వ్యాపారంగా మలిచి.. తన తమ్ముడిలాంటి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడో.. ఆ లొసుగులనే ఉపయోగించుకొని అతణ్ణి పట్టించి తన పగ తీర్చుకుంటుంది నూపుర్.– సరస్వతి రమ -
షారుఖ్ ట్రైలర్‌పై 'పాక్' ఆర్మీ చిందులు!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన వెబ్ సిరీస్ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌పై పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చిందులు తొకుతున్నారు. ఈ ట్రైలర్‌పై గఫూర్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘మీరు ఇంకా బాలీవుడ్ భ్రమలోనే బతుకుతున్నారు. వాస్తవికత(రియాలిటీ) చూడాలంటే ‘రా’ గూఢాచారి కుల్‌భూషణ్ జాదవ్, వింగ్ కమాండర్ అభినందన్, 27 ఫిబ్రవరి 2019న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వివాదాన్ని గమనించండి. మీరు జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తి.. శాంతిని ప్రోత్సహించాలి. నాజీలుగా మారిన హిందుత్వ ఆరెస్సెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బావుంటుంది’ అని పేర్కొన్నారు. గూఢచర్యం నేపథ్యంతో వస్తున్న ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’లో ఇమ్రాన్ హష్మీ, వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాల (గూఢాచారి ఫేమ్) ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. బిలాల్ సిద్దిఖీ రాసిన పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది. ‘మా మొదటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ బార్డ్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గూఢచర్యం, ప్రతీకారం, ప్రేమ, విధి నిర్వహణల మధ్య సాగే ఓ ఉత్కంఠభరితమైన కథ’ అని షారుఖ్ ఈ ట్రైలర్‌ను పరిచయం చేస్తూ ట్వీట్ చేశారు. ట్రైలర్ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌తో ప్రారంభమవుతుంది. అక్కడ భారత గూఢాచారులు ఒక ముఖ్యమైన సమాచారాన్ని భారతదేశానికి చేరవేయడానికి ముందే పట్టుబడి శిరచ్ఛేదనంతో ప్రాణాలు కొల్పోతారు. గూఢాచారి ‘కబీర్ ఆనంద్ అలియాస్ అడోనిస్’ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. అనుకోని పరిస్థితుల నడుమ గూఢాచారిగా మారిన కబీర్, ఆ తర్వాత ముంబైలో ప్రొఫెసర్ అవతారం ఎత్తి జీవితాన్ని గడిపేస్తుంటాడు. దేశాన్ని కాపాడటానికి బలూచిస్తాన్‌కు వెళ్ళమని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అతనికి ఊహించనిరీతిలో పిలుపు వస్తుంది. దీంతో శోభితా ధూలిపాల, వినీత్ కుమార్ సింగ్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో భాగాంగా పాకిస్థాన్‌కు బయలుదేరతారు. రెస్క్యూ కమ్ సూసైడ్ మిషన్‌లొ ఈ ముగ్గురు గూఢాచారులు చేసిన ఉత్కంఠభరిత ప్రయాణమే ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’. శోభితా ధూళిపాల వర్ధమాన నటి, మోడల్, తెలుగమ్మాయి. తెనాలిలో జన్మించారు. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో రెండోస్థానంలో నిలిచిన ఆమె, మిస్ ఎర్త్ 2013లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. The trailer of our first @netflix series #BardOfBlood is here. A thrilling tale of espionage, vengeance, love and duty. Hope u enjoy it...@NetflixIndia @RedChilliesEnt @emraanhashmi @_GauravVerma @BilalS158 @ribhudasgupta pic.twitter.com/aftLjq3BA1 — Shah Rukh Khan (@iamsrk) August 22, 2019 -
పులినోట పసిబిడ్డ
బాలామృతం... తల్లిపాలు! బిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేవరకు కొనసాగించవచ్చు... డాక్టర్లు... ఆరోగ్యకార్యకర్తలు, ఎన్జీవోలు, ప్రభుత్వాలు కూడా ఈ మాటలే చెప్తున్నారు.. చెప్తున్నాయి. ‘‘టైగర్స్’’ అచ్చంగా ఈ అంశంమీద తీసిన సినిమా కాకపోయినా దీనికి సంబంధించింది. బిడ్డకు పాలిస్తున్న తల్లులకు డబ్బాపాలను పరిచయం చేసి... వాటిని వాడితేనే పిల్లలు బొద్దుగా.. ముద్దుగా తయారవుతారని చెప్పి... వందల మంది పసిపిల్లల చావులకు ప్రత్యక్షంగా కారణమైన ఓ మల్టీనేషనల్ బేబీ ఫుడ్ కంపెనీ నిర్వాకం.. పరోక్షంగా పనిచేసిన డాక్టర్ల లాలూచీ... ఈ రెండిటికీ వారధిగా ఉన్న ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ పోరాటం... ఈ సినిమా! 1990ల్లో పాకిస్తాన్లో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా 2014లో ‘‘టైగర్స్’’ను తెరకెక్కించారు భారతీయ చలనచిత్ర నిర్మాతలు. బోస్నియన్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ‘‘డానిస్ టానోవిచ్’’ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్క్రీన్ అయింది.. ప్రశంసలూ అందుకుంది.. కాని మన దేశంలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతోంది. సినిమాలోకి... అయాన్ (ఇమ్రాన్ హష్మి)... మెడికల్ రిప్రజెంటేటివ్. పాకిస్తానీ ఫార్మాసూటికల్ కంపెనీల మందులు ప్రమోట్ చేస్తూంటాడు. కానీ స్థానిక డాక్టర్ల దగ్గర్నుంచి సరైన స్పందన ఉండదు. మల్టీనేషనల్ కంపెనీల ప్రొడక్ట్స్ అయితేనే ప్రిస్క్రైబ్ చేస్తామంటూంటారు. మందుల ఆర్డర్లు రాకపోయినా.. ఆ ఊళ్లోని డాక్టర్లు, వాళ్ల ప్రాక్టీస్ పట్లయితే అవగాహన వచ్చేస్తుంది అయాన్‌కి. భార్య.. జైనాబ్ (గీతాంజలి థాప), అమ్మ (సుప్రియా పాఠక్), నాన్న (వినోద్ నాగ్‌పాల్), ఇద్దరు తమ్ముళ్లు అతని కుటుంబం. తండ్రి డాక్యుమెంట్ రైటర్. ఒకసారి ఓ వార్తాపత్రికలో పడిన ప్రకటనను అయాన్‌కు చూపిస్తుంది భార్య. టైప్ రైటింగ్ కూడా వచ్చిన చదువుకున్న వ్యక్తి ఆమె. ఆసక్తిగానే ఆ ప్రకటన చూసి అంతే నిరాశతో ఆ పేపర్‌ను మడతపెట్టేస్తాడు. ‘‘ఏమైందీ?’’ అడుగుతుంది జైనాబ్. ‘‘గ్రాడ్యుయేట్స్ కావాలట’’ చెప్తాడు. ‘‘ట్రై చేసి చూడు.. తప్పకుండా సెలెక్ట్ అవుతావ్’’ నమ్మకమిస్తుంది ఆమె. పాకిస్తాన్లో లాంచ్ చేయబోయే తమ ‘బేబీ ఫుడ్’ కంపెనీకి సమర్థులైన మెడికల్ రిప్స్ కావాలని ఓ మల్టీనేషనల్ కంపెనీ ఇచ్చిన ప్రకటన అది. వాళ్లు అడిగిన అన్ని అర్హతలూ ఉంటాయి అయాన్‌కు ఒక్క గ్రాడ్యుయేషన్ తప్ప. అయినా ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఏరియాలో ఆ కంపెనీ మార్కెటింగ్‌కి అధిపతి బిలాల్ (అదిల్ హుస్సేన్). అతను అడిగిన ప్రశ్నకు తప్పు జవాబు చెప్పాడని అయాన్‌ను రిజెక్ట్ చేస్తాడు బిలాల్. ‘‘నేను తప్పు చెప్పలేదు. అయినా మీకు కావల్సింది మీ క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేవాళ్లా? లేక మీ ప్రొడక్ట్స్ సేల్స్ పెంచేవాళ్లా?’’ అని సూటిగా అడిగి బిలాల్‌ను ఇంప్రెస్ చేస్తాడు. ఉద్యోగం దక్కించుకుంటాడు. అయాన్‌కు మెడికల్ డెలిగేట్ అనే హోదా ఇచ్చి.. ఆ ఏరియా సేల్స్ విభాగాన్ని అప్పగిస్తారు. తమ ప్రొడక్ట్‌ను ప్రిస్క్రైబ్ చేసేందుకు డాక్టర్లకు ఫ్రీ సాంపుల్స్తోపాటు ఖరీదైన కానుకలను అందిస్తుంటారు కంపెనీ వాళ్లు. దాంతో ఆ పట్టణంలోనే కాదు.. పాకిస్తాన్‌లోని చాలా ఊళ్లల్లో పీడియాట్రిషన్స్ అంతా తల్లిపాలు మాన్పించేసి ఈ పాలడబ్బాలను సూచిస్తుంటారు. అయాన్ తమ కంపెనీ పాలడబ్బాలను ప్రమోట్ చేయమని సంప్రదించిన డాక్టర్లలో డాక్టర్ ఫయాజ్ (సత్యదీప్ మిశ్రా) ఒకరు. కొన్నాళ్లకే అతను కరాచీ వెళ్లిపోతాడు స్పెషలైజేషన్ కోసం. కథ అడ్డం తిరుగుతుంది... డాక్టర్ ఫయాజ్ కరాచీ నుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడ అయాన్ చాలా ఎదుగుతాడు. ఆ బేబీ ఫుడ్ కంపెనీని ఆ ప్రాంతంలో లాభాల్లో నడిపిస్తుంటాడు తన మార్కెటింగ్ స్కిల్స్‌తో. సంపాదన పెరుగుతుంది. ఊళ్లో తన పరపతీ పెరుగుతుంది. పెద్ద ఇల్లు కొంటాడు. కొడుకు పుడ్తాడు. కుటుంబం సంతోషంగా ఉంటూంటుంది. ‘‘బేబీ ఫుడ్ లాభాల్లో ఉన్నట్టుంది..గుడ్ ’’ అంటాడు డాక్టర్ ఫయాజ్ తనను కలవడానికి ఆసుపత్రికి వచ్చిన అయాన్‌తో. ఆ మాటలో ఏదో వ్యంగ్యం వినిపిస్తుంది అయాన్‌కి. ‘‘సరే.. నేను వెళ్తా’’ అని అయాన్ వెళ్లబోతుంటే.. ‘‘ఫయాజ్.. ఆ పిల్లాడికి సీరియస్‌గా ఉంది’’ అంటూ లేడీ డాక్టర్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఫయాజ్ ‘‘నాతో రా’’ అంటూ అయాన్నీ లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ.. నాలుగు నెలల పిల్లాడు.. డీ హైడ్రేషన్‌తో చిక్కి శల్యమై.. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ పిల్లాడికి చికిత్సచేసి కన్సల్టేషన్ రూమ్‌లోకి ఫయాజ్ వెళ్తూండగా అడుగుతాడు అయాన్.. ‘‘ఏమైంది ఆ పిల్లాడికి?’’ అని. ‘‘మీరు ప్రమోట్ చేసే డబ్బా పాల వల్ల ఆ బిడ్డ డీ హైడ్రేట్ అయ్యాడు. నిక్షేపంగా తల్లిపాలు తాగుతున్న ఆ బిడ్డకు మీ కంపెనీ పాలడబ్బాను ప్రిస్క్రైబ్ చేసి తల్లిపాలు అందకుండా చేశారు. అయాన్... ఇక్కడున్నప్పుడు నువ్వు చెప్పినట్టే నేనూ ఆ డబ్బాపాలనే ప్రమోట్ చేశా.. కరాచీ వెళ్లాక తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశానో అని. కనీసం తాగడానికి శుభ్రమైన నీళ్లు దొరకని దేశం ఇది. కలుషితమైన నీటిలోనే ఈ పౌడర్ కలిపి పిల్లలకు తాగించడం వల్ల.. వందలమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా?’’ చెప్తాడు డాక్టర్ ఫయాజ్. ఆ మాట విని హతాశుడవుతాడు అయాన్. బాధ్యత వహించం.. కలత మనసుతోనే ఇంటి దారి పడ్తాడు అయాన్. దార్లో స్లమ్స్‌లో ఉండే తల్లులు.. మురికిగా ఉన్న ప్లాస్టిక్ క్యాన్లలోని నీటితోనే పాలపొడి కలిపి.. ఆ పాలను పిల్లలకు పట్టించడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్లో కూడా వందల సంఖ్యలో పసిపిల్లలు అనారోగ్యం పాలవడం.. ఆసుపత్రిలో చేరడం.. ప్రాణాలు పోవడం.. సాధారణమవుతుంది. ఈలోపే అయాన్‌కు కూతురు పుడ్తుంది. చనిపోతున్న పిల్లల్లో తన పిల్లలు కనిపిస్తుంటారు. ఒక నిశ్చయానికి వచ్చిన అయాన్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడమే కాక ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటానికీ దిగుతాడు. కుటుంబమూ అర్థం చేసుకొని అతనికి సపోర్ట్ చేస్తుంది. వెన్నంటే ఉంటాడు డాక్టర్ ఫయాజ్. ఆ కంపెనీ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు కంప్లయింట్ ఇస్తాడు. అది పెద్ద దుమారమే రేపుతుంది. దాని ప్రభావం కంపెనీ మీదే కాదు.. మెడికల్ ప్రాక్టీషనర్ల మీదా పడుతుంది. అందరూ అయాన్‌కు వ్యతిరేకం అవుతారు. బిలాల్ అయితే బెదిరింపులకు దిగుతాడు. దాడులు చేయిస్తాడు. అయినా అయాన్ వెరువడు. ఎన్జీవో.. డాక్యుమెంటరీ.. ఆ ఊళ్లో పసిపిల్లల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఓ ఫారిన్ ఎన్జీవో సంస్థాపకురాలైన మ్యాగీ (మరియం డి అబో)ని కలుస్తాడు అయాన్. అతనికి సహాయంగా నిలబడుతుంది మ్యాగీ. పాకిస్తాన్లో ఆ బేబీ ఫుడ్ కంపెనీ వల్ల జరుగుతున్న నష్టం, చనిపోయిన పిల్లల వివరాలు, తల్లుల బాధలు, అయాన్ చేస్తున్న న్యాయపోరాటం అన్నిటి గురించి విదేశీ పత్రికల్లో రాయిస్తుంది మ్యాగీ. ఓ డాక్యుమెంటరీ కూడా తీయిస్తుంది. ఇది యూరప్‌లో వైరల్ అవుతుంది. జర్మన్ టెలివిజన్ రిపోర్టర్ ఒకరు ఆ మల్టీ నేషనల్ కంపెనీ సిబ్బందినీ ఇంటర్వ్యూ చేస్తారు.. ‘‘పాకిస్తాన్ పిల్లల మరణాలకు బాధ్యత వహిస్తారా’’ అని ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు. ‘‘వహించం’’ అంటూ చాలా కఠినంగా జవాబిస్తాడు సిబ్బందిలో ఒకరు. దానికి కౌంటర్ పార్ట్‌గా అయాన్‌ను ఇంటర్వ్యూ చేయాలని అతణ్ణి జర్మనీకి పిలుస్తారు. అయితే అంతకుముందే బిలాల్ మిలిటరీ ఆఫీసర్ ద్వారా అయాన్ పిలిపించి.. బెదిరించి ఒక ఒప్పందానికి వచ్చేలా బలవంతపెడతాడు. ఇందులో మిలటరీ ఆఫీసర్ జోక్యం చేసుకోవడానికి కారణం ఉంది. అయాన్ ఆ బేబీ ఫుడ్‌ను మిలటరీ ఆసుపత్రికి, మిలటరీ క్యాంటీన్‌కు కూడా సప్లయ్ చేస్తాడు. ఆ వివరాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోనూ పొందుపరుస్తాడు. దాంతో ఆ మిలటరీ ఆఫీసర్ పేరూ బద్నామ్ అవుతుంది అన్నమాట. దాన్ని బిలాల్ అడ్వంటేజ్‌గా తీసుకొని ఆ మిలటరీ ఆఫీసర్ ద్వారా అయాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. తగ్గట్టుగానే మిలటరీ ఆఫీసర్ వ్యవహరిస్తాడు. అయాన్.. బిలాల్‌తో బేరం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తాడు. దాని తాలూకు ఫోన్ సంభాషణనంతా బిలాల్ రికార్డ్ చేస్తాడు. జర్మనీలో అయాన్ టెలివిజన్ కెమెరా ముందు కూర్చున్న టైమ్‌కి ఆ ఫోన్ సంభాషణను టెలివిజన్ చీఫ్‌కు వినిపిస్తారు మల్టీనేషనల్ కంపెనీ సిబ్బంది. మ్యాగీతో సహా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. అయాన్ నిజాయితీని శంకిస్తారు. కాని అయాన్ అసలు విషయం చెప్తాడు. తను బేరం కుదుర్చుకున్న మాట నిజమేనని, అయితే ఆరోజు రాత్రే ఆ విషయాన్ని తన తండ్రితో షేర్ చేసుకున్నానని, తండ్రి తిట్టి, వారించాడని, దాంతో ఆ ఒప్పందం జోలికి వెళ్లలేదని, డబ్బు తీసుకోలేదనీ చెప్తాడు.. రుజువు చేస్తాడు కూడా. ఇక్కడితో సినిమా సుఖాంతం అవుతుంది. ఇంత జరిగినా ఆ మల్టీనేషనల్ కంపెనీకి వ్యతిరేకమైన తీర్పేమీ వెలువడదు. కానీ ఆ పోరాటం చేసిన ఆ సేల్స్ రిప్రజెంటేటివ్.. సయ్యద్ ఆమిర్ రజా (అసలు పేరు) మాత్రం ఆ దేశం వదిలి వెళ్లిపోయాడు భార్యా పిల్లలను తీసుకొని. ప్రస్తుతం కెనడాలో టాక్సీడ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను. ఈ విషయాన్ని సినిమాలో చూపించరు. – సరస్వతి రమ -
‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’
‘రాజ్‌కుమార్ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!) రాజ్‌కుమార్ హిరాణీ -
17ఏళ్లుగా ముద్దులు పెడుతూ.. అలసిపోయా!
యుద్దంలో పోరాడే యోధులుంటారు కదా.. అలాగే ముద్దుల యుద్దంలో పోటీలేని ఓ వీరుడున్నాడు. ముద్దులుపెట్టడంలో అతన్ని మించినోడు లేడు. బాలీవుడ్లో సీరియల్ కిస్సర్‌గా ఫేమస్ అయ్యాడు ఇమ్రాన్ హష్మీ. ఆయన తీసిన ప్రతి సినిమాలో దాదాపు 20 లిప్‌లాక్‌లు ఉంటాయి. దీంతో బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ హీరోగా అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించాడు. అయితే ఇమ్రాన్ ప్రస్తుతం చీట్ఇండియా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు, ఈ చిత్రప్రమోషన్లో పాల్గొన్న ఇమ్రాన్.. పదిహేడేళ్లుగా ప్రతిసినిమాలో దాదాపు ఇరవై ముద్దులు పెడుతూ అలసిపోయానని చెప్పుకొచ్చాడు. ఇకపై తాను ఇలాంటి సీన్స్‌లో నటించకూడదని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘చీట్ ఇండియా’.. భారతీయ విద్యా విధానంలో ఉన్న మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలిపాడు. -
సెన్సార్ బోర్డ్ అభ్యంతరంతో టైటిల్ మార్పు
ఇటీవల సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. నిజ జీవిత గాథలు, సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతుండటంతో అవి వివాదాస్పదమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తెరకెక్కుతున్ననాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చీట్ ఇండియా పేరుతో రిలీజ్ రెడీ అవుతున్న ఓ సినిమా విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా సౌమిక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చీట్ ఇండియా సినిమా టైటిల్‌ను మార్చాలంటూ సెన్సార్ బోర్డ్ సూచించింది. టైటిల్ సినిమా కథా కథనాలను మిస్ లీడ్ చేసే విధంగా ఉందని బోర్డ్ అభిప్రాయపడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా టైటిల్‌ను ‘వై చీట్ ఇండియా’ అని మార్చేందుకు అంగీకరించారు. శ్రేయా ధన్వంతరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - బాద్షాహో
-
సీరియల్ కిస్సర్...
♦ ఇమ్రాన్‌కు కిస్సర్ బాయ్ అని పేరు. ♦ ఎవరి గురించైనా హిట్స్ అండ్ ఫ్లాప్స్ మాట్లాడుకుంటారు. ఇమ్రాన్ గురించి హిట్స్ అండ్ కిసెస్ మాట్లాడుకుంటారు. ♦ ఇమ్రాన్‌కు సినిమాలు చూసే అలవాటు లేదు. నిజంగా అతడి సినిమాలే అనేకం అతడు చూసుకోలేదు. ♦ పెళ్లయ్యాక ఇమ్రాన్ తెర మీద ముద్దులు మానేశాడు. భార్యకు నచ్చకపోవడమే కారణం. ♦ ఇమ్రాన్ ఇప్పుడు నిర్మాతగా మారాడు. రెండు దేశాల మధ్య యుద్ధంలో నలిగిన పాత్రతో ‘కెప్టెన్ నవాబ్’ సినిమా చేస్తున్నాడు. పాటల హీరో ఇమ్రాన్ హష్మీ సినిమాలో పాటలు బాగుంటాయని పేరు. ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం పాడే ‘యాలీ రహమ్ వాలీ’ పాట ఉంది కదా... అది ఇమ్రాన్ ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలోది. ‘జహర్’లో సినిమాలోని ‘ఓ లమ్హే ఓ బాతే’... దేశాన్ని ఊపు ఊపింది. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాలోని ‘ఆప్ కి కషిష్’ అయితే ఎన్ని చోట్ల మోగిందో చెప్పలేము. ఒక ముద్దు ఎంత డబ్బు సంపాదిస్తుంది? ఊహించండి. ఇమ్రాన్ హష్మీకి ముంబయ్‌లో శ్రీమంతులు నివసించే పాలి హిల్స్‌లో ఒక పెంట్ హౌస్ ఉంది. దాని ఖరీదు దాదాపు 40 కోట్లు. ఒకప్పుడు ఇమ్రాన్ ఒక సైకిల్ కొనుక్కోవడానికి కూడా యోగ్యత ఉన్న వ్యక్తి కాదు. ఇప్పుడు అంత ఖరీదైన ఇంటికి యజమాని. దానిని సంపాదించి పెట్టింది ఏమిటో తెలుసా? ముద్దే! ********* మహేష్ భట్ తండ్రి పేరు నానాభాయ్ భట్. ఈయన మొదటి భార్య ముస్లిం. పేరు షీరీన్. మహేష్ భట్, నిర్మాత ముకేష్ భట్, రచయిత రాబిన్ భట్ వీరికి పుట్టిన పిల్లలే. షీరీన్కు ఒక చెల్లెలు ఉంది. పేరు మెహర్బానో. ఒకప్పుడు ఈమె ‘పూర్ణిమ’ పేరుతో సినిమాల్లో నటించింది. ఈమె కొడుకు కుమారుడే ఇమ్రాన్ హష్మీ. ఆ విధంగా మహేష్‌భట్ సోదరులు ఇమ్రాన్‌కు పెదనాన్న వరుస అవుతారు. ముందు నుంచీ వీరిది సినిమా కుటుంబమే అయినా ఇమ్రాన్ హష్మీకి సినిమాలంటే ఆసక్తి లేదు. మామూలుగా డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ విపరీతంగా ఆడేవాడు కనుక మహా అయితే అందరిలాగే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ కావాలని అనుకునేవాడు. అయితే మహేష్ భట్ పిలిచి, ‘ఎందుకురా ఈ పని ఆ పని మనకో సంస్థ ఉంది. ఇందులోనే ఏదో ఒక పని చేయ్’ అని కోరాడు. దాంతో ఇమ్రాన్ మొదట ఎడిటింగ్‌లో ట్రై చేశాడు. నచ్చలేదు. ‘రాజ్’ సినిమా తీస్తుంటే దానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ పనీ నచ్చలేదు. ఇదంతా గమనించిన ముకేష్ భట్ యాక్టింగ్‌లో ట్రై చేయ్ బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. నేనేం యాక్టింగ్ చేసేది అన్నాడు ఇమ్రాన్. లేదు నువ్వు చేయగలవు అన్నాడాయన. ********* దర్శకుడు మహేష్ భట్ 26 ఏళ్ల వయసులోనే ‘లహూ కే దో రంగ్’, ‘అర్థ్’ వంటి సినిమాలతో వెలుగులోకి వచ్చాడు. ‘ఆషికీ, దిల్ హైకి మాన్తా నహీ, సడక్’ వంటి కమర్షియల్ హిట్స్ అనేకం ఇచ్చాడు. ముంబయ్ మత కలహాల నేపథ్యంలో ‘జఖ్మ్’, పర్విన్ బాబీతో తన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ‘ఫిర్ తేరి కహానీ యాద్ ఆయీ’ (ఇటీవల ఇదే కథ ‘ఓ లమ్హే’గా భట్ నిర్మాణంలో వచ్చింది) వంటి సినిమాలు తీశాడు. అయితే 1998 నాటికి దర్శకుడిగా మహేష్ భట్ సృజనాత్మకత ముగిసింది. ఇక కొత్త అవతారం దాల్చాడు. రచయితగా ఒక తమ్ముడు, నిర్మాతగా మరో తమ్ముడు ఉన్నాడు కనుక ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టి సినిమాలు తీయాలని నిశ్చయించుకున్నాడు. వీళ్ల బేనర్లో వచ్చిన ‘రాజ్’ చిన్న సినిమాలలో అతి పెద్ద హిట్. ఆ సినిమాలోని ‘ఆప్ కే ప్యార్ మే హమ్ సవర్ నే లగే’... పాట దేశాన్ని ఒక ఊపు ఊపింది. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా 2002లో 37 కోట్లు సంపాదించింది. కొంచెం సస్పెన్స్, లేదంటే కొంచెం హారర్, దానికి కాస్తంత రొమాన్స్ కలిపి సినిమాలు తీస్తే చూసేవారున్నారని దీనిని బట్టి భట్ సోదరులకు అర్థం అయ్యింది. అయితే ఈ తరహా సినిమాలు అందరు హీరోలూ చేయరు. వీటిని మెయిన్ స్ట్రీమ్ సినిమా లలో సెకండ్ గ్రేడ్‌గా చూస్తారు. కనుక తమ సినిమాలకు ఒక హీరో కావాలి. అతను తాము చెప్పినట్టు వినాలి. అవసరం ఉంది. ఎదురుగా మనిషి కనిపిస్తున్నాడు. అలా ఇమ్రాన్ హష్మీ హీరోగా కెమెరా ముందు నిలబడాల్సి వచ్చింది. *********** ఇమ్రాన్ హష్మీ తొలి సినిమా ‘ఫుట్‌పాత్’ (2003). ఇది సోసోగా ఆడింది. ఆ తర్వాత దర్శకుడు అనురాగ్ బసుతో ‘మర్డర్’ సినిమా మొదలెట్టారు. హీరోగా హష్మి. హీరోయిన్గా మల్లికా షెరావత్. దీనిని కొంచెం డోస్ పెంచి తీయాలని ముందే నిశ్చయించుకున్నారు. శృంగార సన్నివేశాలు విస్తృతంగా ఉండాలని నియమం. అప్పటి వరకూ అనేక సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నా మహేష్ భట్ సూచన ఏమిటంటే ‘ముద్దు’ను బహిరంగ పరచండి అని. హాలీవుడ్లో చీటికి మాటికి ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణం. అలా మన సినిమాల్లో ఎందుకు పెట్టుకోకూడదు, భారతీయులు మాత్రం ముద్దు పెట్టుకోరా అని మహేష్ భట్ పాయింట్. సరే ఇప్పుడు ముద్దు పెట్టుకోవాలి. ************ చాలా మంది ఏమనుకుంటారంటే ముద్దు పెట్టుకోవడం చాలా ఈజీ అని. ఎలాగైనా ముద్దు పెట్టుకోవడం ఈజీనే. కానీ తెర మీద అందంగా ముద్దు పెట్టుకోవడం, అసభ్యత లేకుండా ముద్దు పెట్టుకోవడం ఒక మగాడు ఒక స్త్రీని ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం అందులో ఇబ్బంది కనపడనివ్వకుండా పెట్టుకోవడం.. బాబోయ్ చాలా పెద్ద ఫీట్. ‘ముద్దు పెట్టుకోవడంలో మీ రహస్యం ఏమిటి?’ అని అడిగితే ‘ఇంకేముంది బోలెడంత మింట్ నోటిలో వేసుకోవడమే’ అని నవ్వుతూ చెబుతాడతడు. అయితే మింట్ మాత్రమే అతని విజయం కాదు. అతను హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం జనానికి నచ్చింది. కుర్రకారు ఆ ముద్దేదో తామే పెడుతున్నట్టుగా భావించుకుని సంతృప్తి పడటం మొదలైంది. మల్లికా షెరావత్‌తో తొలి ముద్దు పెద్ద హిట్. ఎంత హిట్ అంటే... ఇమ్రాన్ ఉంటే ఒక ముదై్దనా చూడొచ్చు అని జనం థియేటర్లకు వచ్చేంత! ************ ‘జహర్’, ‘చాక్లెట్’, ‘గ్యాంగ్‌స్టర్’, ‘జన్నత్’.... ఈ సినిమాలన్నీ ఇమ్రాన్ ముద్దుల వల్లే పెద్ద హిట్ అయ్యాయి. ఇండస్ట్రీ మెల్లగా అతణ్ణి ఈ స్థాయి ‘నాఝజరకం’ హీరోగానే చూడటం మొదలుపెట్టింది. ఇది కొన్నాళ్లు కొనసాగి ఉంటే ఇమ్రాన్ అయిపోయి ఉండేవాడే. సరిగ్గా అప్పుడే బాలాజీ సంస్థ తరఫున ఏక్తా కపూర్ ‘ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ మొదలెట్టింది. అందులో 1970ల కాలం నాటి ఒక పైలా పచ్చీస్ కుర్రాడిగా ఇమ్రాన్ నటించి అందరినీ ఆశ్చర్యపోయాడు. అదేంటి... రెండు పెదాలేసుకొని బతికేసే ఇతను ఇంత బాగా నటించగలడా అని సీరియస్ ప్రేక్షకులు కొందరు అనుకున్నారు. విశేషం ఏమిటంటే అమ్మ తల్లి ఏక్తా ఏదైనా కటాక్షించడం మొదలుపెడితే అసలు, కొసరు అంటూ ఉండదు. భారీగా ఉంటుంది. అందుకే ఏక్తా ఆ వెంటనే ఒక ముఖ్యమైన సినిమాలో ఇమ్రాన్‌కు వేషం ఇచ్చింది. ఆ సినిమాయే ‘డర్టీ పిక్చర్’. రాజీ పడని డైరెక్టర్ పాత్రలో ఇమ్రాన్ ఆ సినిమాలో దేశమంతటినీ ఆకర్షించాడు. నిజానికి దేశం మొత్తం మొదటిసారి ఇమ్రాన్‌ను తెర మీద చూసింది. అంతవరకూ ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఇమ్రాన్ ఈ సినిమాతో బాలీవుడ్లో తన జెండా బలహీనమైనది కాదని, ఇది నిలిచి ఎగిరేదని నిరూపించుకున్నాడు. విద్యా బాలన్, నజీరుద్దీన్ షా వంటి నటీనటుల పక్కన గట్టిగా నిలబడగలిగిన ఇమ్రాన్ ఇప్పుడు హీరోతో పాటు ‘ఆర్టిస్ట్’ కూడా. ************ ‘జన్నత్ 2, షాంఘై, మర్డర్ 2, ఏక్ థీ దాయన్...’ ఇవన్నీ ఇమ్రాన్ హిట్స్. వీటిని మించి బిపాషా బసుతో చేసిన ‘రాజ్3’ సినిమా 97 కోట్లు వసూలు చేసింది. ఈ సమయంలో మన క్రికెటర్ అజహరుద్దీన్ బయోపిక్ ‘అజహర్’లో నటించే అవకాశం ఇమ్రాన్‌కు వచ్చింది. ఒక ముంబై హీరో ఒక హైదరాబాదీ ఆటగాడి పల్స్‌ను పట్టుకోవడం కష్టం. కాని ఇమ్రాన్ ఆ విన్యాసం సాధించాడు. అజహరుద్దీన్లా నడవడం, బ్యాట్ పట్టుకోవడం, షాట్ కొట్టడం ఇవన్నీ నేర్చుకున్నాడు. సినిమా విజయం ముక్తసరిగా ఉన్నా ఇమ్రాన్ యాక్టింగ్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అజహర్‌కు క్లీన్ చిట్ ఇచ్చినా, అతగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆ నాటి కేసును విచారించిన అధికారి సినిమా రిలీజ్ అయ్యాక స్టేట్మెంట్ ఇచ్చాడనేది అదనపు సమాచారం. ************ 1988లో వచ్చిన ఆమిర్ ఖాన్ ఇప్పటికి దాదాపు 50 సినిమాలు పూర్తి చేశాడు. కానీ, 2002లో వచ్చిన ఇమ్రాన్ అప్పుడే నలభై సినిమాలకు చేరువ అయ్యాడు. సినిమాలు, కుటుంబం తప్ప వేరే వ్యాపకాలు లేకపోవడం, వేగంగా సినిమాలు ఎంచుకొని వేగంగా పూర్తి చేయడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది. ఆరేళ్లుగా ప్రేమించిన పర్వీన్ షహానీని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక కుమారుడు అయాన్. అయితే ఇంతలో చిన్న విషాదం. నాలుగేళ్ల వయసు ఉండగా అయాన్‌కు ఫస్ట్ స్టేజ్ కేన్సర్ ఉన్నట్టు కనుగొన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ పిల్లవాడు ఆరేళ్లు నిండి, హాయిగా ఉన్నాడు. ‘కానీ వాడికేదైనా అవుతుందేమోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అంటాడు ఇమ్రాన్. *********** తెలుగులో ఇప్పుడు హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది కాని దేశంలో ఈ ట్రెండ్‌ను మొదలెట్టి స్థిరంగా కొనసాగించిన హీరో ఇమ్రాన్ హష్మీ. హారర్, సెక్స్ ఈ రెండూ కలగలసిన ఫార్ములాను సభ్యత పరిధిలోకి స్త్రీ పురుషులు కలిసి చూసేలా చేయగలిగాడతడు. అన్నింటి కంటే మించి ప్రతి పనికీ ఒక స్పేస్ ఉంటుందనీ, దాన్ని సరిగ్గా చేస్తే ఆ స్పేస్‌ను ఆదరించి హత్తుకునే ప్రేక్షకులు ఉంటారనీ నిరూపించిన హీరో కూడా అతడు. చూడటానికి పెద్ద విశేషంగా కనిపించకపోయినా భిన్నమైన దారిలో నడవడం వల్లే అతడు ఇవాళ స్టార్ కాగలిగాడు. అందుకే ఇమ్రాన్‌ను చూస్తే ‘ప్చ్’ అని నిట్టూర్పు రాదు. ‘మ్చ్’ అని ముద్దు గుర్తుకు వస్తుంది. ‘మ్చ్’. – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
ఒకరితో పోల్చితే నాకు చిరాకు: హీరో
ప్రతి ఒక్క హీరోకు వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ చెప్పాడు. ఏ నటుడినైనా చూసి ఇతడు మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడంటూ, ఇతడు పలానా హీరోలా చేస్తున్నాడంటూ లేని పోని పోలికలు పెట్టకూడదని పేర్కొన్నాడు. అసలు విషయం ఏంటంటే.. గతంలో ఇమ్రాన్ హష్మీ నటించిన సినిమాలలో ముద్దు సీన్లు కచ్చితంగా ఉండేవి. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ ఇలాంటి సీన్లు బాగా పండిస్తున్నాడని, అందుకే అతడ్ని మరో ఇమ్రాన్ హష్మీ అంటూ కితాబిస్తున్నారు. ఈ విషయంపై హష్మీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఏ వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చి చూడరాదంటూ హితవు పలికాడు. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'రాజ్ రీబూట్'. విక్రమ్ భట్ ఈ మూవీ కథ చెప్పినప్పుడు తాను ఎలా ఎగ్జయిట్ అయ్యాయని, ఓ ప్రేక్షకునిలా మారి సినిమా చూడాలని ఉందన్నాడు. వాస్తవానికి తనకు హర్రర్ మూవీలలో నటించడం చాలా ఇష్టమన్న హష్మీ.. తన తొలి చిత్రం 'ఫుట్ పాత్' నుంచి ఇప్పటివరకూ చాలా నేర్చుకున్నానని తెలిపాడు. సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. -
నిర్మాతగా మారుతున్న మరో స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సీరియల్ కిస్సర్, ఇటీవల ప్రయోగాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ నిర్మిస్తున్న బాద్షాహో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్, ఆ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న సినిమా పనులు మొదలెట్టనున్నాడు. తన నిర్మాణ సంస్ధ తొలి ప్రాజెక్ట్‌ను ట్విట్టర్లో ప్రకటించాడు ఈ బాలీవుడ్ హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. కెప్టెన్ నవాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టూ కంట్రీస్ వన్ సోల్జర్(రెండు దేశాలు. ఒక సైనికుడు) అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. పోస్టర్లో ఇమ్రాన్ లుక్‌ను కూడా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. పాకిస్థాన్, భారత్‌లకు సంబందించిన ఆర్మీ యూనిఫాంలను ధరించిన ఇమ్రాన్, ఏ దేశానికి సంబందించిన సైనికుడు అర్ధం కాకుండా కన్య్ఫూజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబందించిన వివరాలేవి యూనిట్ సభ్యులు వెల్లడించటం లేదు. And here it is, my first home production movie !!... pic.twitter.com/LGm8YZgaii— emraan hashmi (@emraanhashmi) 26 August 2016 -
అతడికి నో చెప్పిన ఐష్!
ముంబై: అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'బాద్ షాహో' సినిమా తారాగణం ఇప్పటికే పలుమార్లు మారింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరు ఈ లిస్టులో చేరింది. మిలాన్ లుతరియా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షాహో'లో నటించేందుకు ఐష్ నిరాకరించింది. దిల్జిత్ దొసాన్ జహ్ స్థానంలో ఇమ్రాన్ హష్మిని తీసుకోవడం వల్లే ఆమె ఈ ఆఫర్ వదులుకుందని టాక్. ఇమ్రాన్ హష్మితో కొన్ని సీన్లు చేయాల్సి రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ కార్యక్రమంలో ఇమ్రాన్ ను 'ప్లాస్టిక్'గా ఐష్ వర్ణించింది. ఈ కారణంగానే అతడి పక్కన నటించేందుకు ఆమె అంగీకరించలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'బాద్ షాహో'లో మహరాణి గాయత్రి దేవి స్ఫూర్తితో ఈ పాత్రను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులోని పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని, ఇటువంటి పాత్రలు ఇంతకుముందు ఎవరూ పోషించలేదని మిలాన్ లుతరియా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావిస్తు్న్నారు. -
నడిరోడ్డుపై హీరోయిన్ కు ప్రపోజ్..!
సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట బాలీవుడ్ తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. జన్నత్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ కు మళ్లీ ఆ రోజులు గుర్తుకువచ్చేలా ఉన్నాయి. నడిరోడ్డుపై కారు ఆపి సోనాల్ కు ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేశాడు. హీరోయిన్ ను రోడ్డుపై ఆపి మరీ ప్రపోజ్ ఎంటని కంగారు పడకండి. సింగర్ అంకిత్ తివారీ, సోనాల్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఎడిషన్ 'బాడ్తమీజ్'. అంకిత్ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమిస్తాడు. దీంతో ఆమెకు ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. రోడ్డుపై కారు ఆపి నోనాల్ కు ప్రపోజ్ చేస్తాడు. ఇదే తీరుగా కొన్నేళ్ల కిందట జన్నత్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ఆమెకు ప్రపోజ్ చేసిన సీన్ అభిమానులకు ఇంకా గుర్తుంటుంది. దర్శకుడు సిద్ధాంత్ సచ్ దేవ్ ఈ సీన్ చూసి బాగా వచ్చిందని వారిని మెచ్చుకున్నాడట. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రస్తుతం 'జాక్ అండ్ జిల్' లో నటిస్తోంది. అందులోనూ ప్రపోజ్ చేసే సీన్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లోనూ లెజెండ్, డిక్టేటర్ మూవీలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. -
నేను స్త్రీలోలుడినా! 'అజార్'తో సీనియర్ క్రికెటర్ షాక్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం వివాదాలమయం. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజగా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఈ చిత్రంలో తన పాత్రను చిత్రించిన తీరు చూసి షాక్ తిన్నాడంట. తనను ఇంత దారుణంగా సినిమాలో చూపిస్తారా? అని ఆయన మండిపడుతున్నట్టు తెలుస్తోంది. 'అజార్' సినిమాలో రవిశాస్త్రి పాత్రను గౌతం గులాటీ పోషించాడు. సినిమాలో ఏ క్రికెటర్ పేరును పూర్తిగా ఉపయోగించలేదు. కానీ అజార్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సహ క్రికెటర్లు పిలుచుకొనే పొట్టిపేర్లనే ఇందులో వాడారు. అందులో భాగంగానే అజార్, రవి, నవజ్యోత్, మనోజ్, కపిల్ వంటి పేర్లను ఉపయోగించారు. వీళ్లందరూ అజార్‌తో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. కాబట్టి సహజంగానే సినిమాలో వీరి ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. అయితే, గౌతం గులాటీ 'రవి'గా కనిపించిన పాత్రను పూర్తిగా స్త్రీలోలుడిగా చిత్రించడం, ఓ సీరిస్ సందర్భంగా తన వెంట ఉన్న భార్యను మోసం చేసి అతను అమ్మాయితో గడిపినట్టు చూపించడం రవిశాస్త్రిని దిగ్భ్రాంత పరిచిందట. రవిశాస్త్రి కుటుంబం కూడా ఆయనను ఇలా చూపించారేమిటని మండిపడుతున్నారు. తన పాత్రను చూపించిన తీరును తప్పుబడుతూ ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన పాత్రను తప్పుగా చూపించడంపై ఇప్పటికే మనోజ్ ప్రభాకర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని 'అజార్' చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ కూడా సినిమాలో తనను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కక్షే కారణమా! క్రికెట్ ఆడుతున్న సమయంలో అజారుద్దీన్‌కు రవిశాస్త్రికి గొడవలు ఉన్నాయని చెప్తారు. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు వెలువడిన స్టింగ్ ఆపరేషన్ వెనుక హస్తం ఉన్న క్రికెటర్లలో రవిశాస్త్రి కూడా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిపై తన కక్షను తీర్చుకోవడానికి ఈ సినిమాలో ఆయన పాత్రను ఇలా విపరీతంగా చిత్రీకరించేందుకు అజార్ సహకరించి ఉంటాడని వినిపిస్తోంది. -
'బాక్సాఫీసు కలెక్షన్లు వణుకు పుట్టిస్తాయి'
ముంబై: సినీ ఇండస్ట్రీ ఏదైనా సరే తమ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తే షూటింగ్ కోసం పడ్డ పాట్లను క్షణాల్లోనే మరిచిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీలు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం శుభపరిణామమే అయినా.. కొన్ని సందర్భాల్లో నటీనటులకు వణుకు పుడుదందని హీరో ఇమ్రాన్ హష్మీ అంటున్నాడు. మర్డర్, గ్యాంగ్‌స్టర్, 'వన్స్ ఆప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై' సినిమాలు భారీగా వ్యాపారాన్ని అందించినందుకు ఆ సమయాల్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. షాంగై, ఎక్ థి దాయన్ లాంటి చిన్న మూవీలు చేసినప్పుడు చాలా థ్రిల్ అవ్వాల్సి వస్తుందన్నాడు. కొన్నిసార్లు మాత్రమే సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తాయని, మరికొన్ని సందర్బాల్లో మూవీ విడుదలంటే చాలు వణుకు పుడుతుందని చెప్పుకొచ్చాడు. ఇమ్రాన్ హష్మీ నటించిన మూవీలు హమారి అధురి కహానీ, మిస్టర్ ఎక్స్, రాజా నట్వర్ లాల్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ప్రయోగాలకు సిద్దమైనప్పుడు ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తాయని అప్పుడు చాలా టెన్షన్ ఉంటుందన్నాడు. రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లో మూవీలు చేసి కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావిస్తారని చెప్పాడు. ప్రయోగాలు చేయాలంటేనే హీరో, హీరోయిన్లు భయపడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. -
'అజార్'కు తొలిరోజు భారీ కలెక్షన్!
భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా తొలి మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 6.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా పట్ల రివ్యూలు పెదవి విరిచినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి టాక్ వస్తోంది. అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి విలక్షణ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. అజార్ మొదటి భార్య పాత్రలో ప్రాచి దేశాయ్ అభినయం విమర్శకుల ప్రశంసలందుకుంటుండగా.. రెండో భార్య సంగీత బిజిలానీగా నర్గీస్ ఫఖ్రీ, ఇమ్రాన్ మధ్య కెమిస్ట్రీ బాగా పండటం సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ తో, మంచి కలెక్షన్లతో ముందుకెళుతున్నదని, కలెక్షన్లకు సంబంధించినంతవరకు శనివారం, ఆదివారం అత్యంత కీలకమని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'ఎక్స్ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్'. ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ-నర్గీస్ ఫక్రీ మధ్య హాట్ హాట్ ముద్దుసీన్లను రెండోసారి తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో అజార్ రెండో భార్య సంగీత బిజ్లానీ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి ఇలా రెండోసారి తెరకెక్కించడం చాలా చికాకు తెప్పించిందట. అందుకే ఎక్స్ట్రా లిప్‌లాక్ సీన్లు చేయాలంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తాను తేల్చిచెప్పినట్టు నర్గీస్ వెల్లడించింది. 'సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని నాకు తెలియదు. ఇన్ని సీన్లు ఉండటం నాకు చికాకు తెప్పించింది. ఇందుకు ఎక్కువ చార్జ్ చేయాలనిపించింది. అందులోనూ ఎన్నో రీటేక్‌లు, రీషూట్లు ఉన్నాయి. వీటిని చేయడమంటే మాటలా' అంటూ నర్గీస్ కుండబద్దలు కొట్టింది. ముద్దుసీన్లు, ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించాలంటే తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని ఆమె తెలిపింది. 'రాక్‌స్టార్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ 36 ఏళ్ల భామ అదే సమయంలో సహ నటుడు ఇమ్రాన్ హష్మిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతను చాలా కూల్‌గా ఉంటాడని, ఎంత ఒదిగినా ఒదిగి ఉంటాడని, చాలా ప్రొఫెషనల్ అని చెప్తోంది. -
'ఆ హీరో ఓపిక చూస్తే ఆశ్చర్యమేస్తుంది'
ముంబై: బాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. క్రీడానేపథ్యం, జీవితకథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలపై అక్కడి ప్రేక్షక్షులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్లో సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అంతకంటే ఎక్కువ వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అజారుద్దీన్. అజార్ మూవీలో ఇమ్రాన్ హష్మీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇమ్రాన్ తో కలిసి నటిస్తున్న ప్రాచీ దేశాయ్ ఆ హీరోపై ప్రశంసలు కురిపిస్తుంది. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెబుతోంది. ఏ సీన్లో అయినా సరే డైరెక్టర్ చెప్పినట్టుగా ఇమ్రాన్ నటిస్తాడని, ఎంతో ఓపికగా ఉంటాడంటోంది. నిజంగానే గతంలో ఇమ్రాన్ చేసిన సినిమాలకు, ప్రస్తుత మూవీకి చాలా వ్యత్యాసాలున్నాయని వివరించింది. రీటేక్ లు ఎన్ని చేస్తున్నా ఇమ్రాన్ ఓపికగా ఉంటాడని సీన్ పైనే దృష్టిపెడతాడని ఈ విషయాన్ని అతడి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. వీటితో పాటు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ సహనాన్ని కోల్పోడంటూ పొగిడేసింది. ఇంకా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉందంటూ అజార్ మూవీలో నటిస్తున్న ప్రాచీ దేశాయ్ అంటోంది. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. -
నీ ధైర్యం అపూర్వం: అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. నటుడు ఇమ్రాన్ హష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. చాలా ధైర్యం గల తండ్రివి అంటూ కితాబునిచ్చారు. ఇమ్రాన్ ఆరేళ్ల కుమారుడు అయాన్ కేన్సర్‌తో పోరాడిన విషయం తెలిసిందే. 2014లో అయాన్ కిడ్నీ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని కెనడా తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎంతో బాధాకరమైన ఆ చికిత్సను అయాన్ విజయవంతంగా ఎదుర్కొన్నాడు. చాలా ధైర్యం కలిగిన తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు, ఒక్కటే చెప్పగలం.. అయాన్ మనోధైర్యం సాటిలేనిదని పేర్కొంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందిస్తూ ఇమ్రాన్ అమితాబ్‌ను 'ఒరిజినల్ సూపర్ హీరో' అని కొనియాడారు. అయాన్ బ్యాట్ మ్యాన్ కావాలని కోరుకుంటాడు, కానీ బ్యాట్ మ్యాన్ మీలా కావాలని కోరుకుంటాడు.. మీరే అసలైన సూపర్ హీరో అంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. కాగా తన కొడుకు జీవితం, కిడ్నీ కేన్సర్‌పై పోరాటం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. Thank YOU for being such a brave Father .. and to Ayaan ,..what can one say .. his strength and will is unbeatable https://t.co/oz5afn1pag — Amitabh Bachchan (@SrBachchan) 10 April 2016 Thanks @SrBachchan for the note. Ayaan aspires to be Batman. And Batman aspires to be you. U r d original superhero! pic.twitter.com/ViwFcQ5tbR — emraan hashmi (@emraanhashmi) 9 April 2016 -
'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో'
ఇమ్రాన్ హష్మీని ఉద్దేశించి సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: పసిప్రాయంలోనే కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయాన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఈ ఆరేళ్ల బాలుడు తండ్రి కంటే పెద్ద హీరో అని వ్యాఖ్యానించారు. తన కొడుకు జీవితం, కిడ్నీ కేన్సర్‌పై పోరాటం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ఆవిష్కరించారు. ఆయాన్‌కు కేన్సర్ సోకినట్టు తేలగానే అతణ్ని కెనడా తీసుకెళ్లి అత్యంత ఖరీదైన చికిత్స ఇప్పించారు. ఏడు నెలలపాటు చేసే ఈ వైద్యం అత్యంత బాధాకరమైనదని హష్మీ పేర్కొన్నారు. ఆయాన్ వంటి చిన్నారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కిస్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని కేన్సర్ బాధితులంతా చదవాలని పిలుపునిచ్చారు. -
క్రికెట్ లెజెండ్ ట్రూ స్టోరీ 'అజార్'
బాలీవుడ్ వెండితెర మీద బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే క్రీడానేపథ్యంతో తెరకెక్కిన బయోపిక్‌లు ఘనవిజయం సాధించగా తాజాగా మరో నిజజీవిత కథ వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇండియన్ క్రికెట్లో అందరి కంటే సక్సెస్ ఫుల్ క్రికెటర్ గానే కాక అదే స్థాయిలో వివాదాస్పద క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న అజారుద్దీన్ జీవిత చరిత్రను అజార్ పేరుతో సినిమాగా రూపొందించారు. ఇమ్రాన్ హష్మీ అజార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదల అయ్యింది. అజర్ జీవితంలోని వివిధ కోణాలను ఈ సినిమాతో అభిమానుల ముందే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు చిత్రయూనిట్. అజార్ జీవితంలోని క్రికెట్, వివాదాలు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై ఉన్న ఎన్నో అనుమానాలపై ఈ సినిమాతో క్లారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ ను కూడా అదే అంశాలతో రూపొందించారు. ఈ సినిమా అజార్ పాత్రలో నటించిన ఇమ్రాన్‌కు స్వయంగా అజారుద్దీన్ క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. ఏక్తాకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టోని డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. లారాదత్తా, హుమా ఖురేషి, నర్గీస్ ఫక్రీ, గౌతమ్ గులాటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అజార్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. -
ఇమ్రాన్ ఆత్మకథ: ' ద కిస్ ఆఫ్ లైఫ్'
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ రచయితగా మారుతున్నాడు.తన జీవిత కథను ద కిస్ ఆఫ్ మై లైఫ్ పేరుతో అభిమానులకు అందించనున్నాడు. అయితే బాలీవుడ్లో హాట్ హీరో ఇమేజ్ ఉన్న ఈ హీరో తన ఆత్మ కథలో మాత్రం జీవితంలోని విషాదాలనే నేపథ్యంగా తీసుకున్నాడట. తెర మీద స్టార్ హీరోగా వెలుగిపోతున్న ఇమ్రాన్ ఒక దశలో తన జీవితంలో ఎంతో బాదపడిన సందర్భాన్ని ఈ ఆత్మకథలో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్ హాష్మీని ఎన్నో ఏళ్లుగా వేదిస్తున్న సమస్య తన కొడుకు అయాన్ క్యాన్సర్‌తో బాధపడటం. తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ సహానిని పెళ్లి చేసుకున్నాడు ఇమ్రాన్. తరువాత కొడుకు పుట్టిన ఆనందం ఈ దంపతులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. కొడుకుకు క్యాన్సర్ అని తెలియంటంతో తల్లడిల్లి పోయారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి ఎంతో వేదనకు గురయ్యారు. అందుకే క్యాన్సర్‌ను జయించిన తన కొడుకు జీవితాన్నే తన ఆత్మకథలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు. ఇంగ్లీష్, హిందీ, మరాఠి భాషల్లో విడుదలవుతున్న ఈ పుస్తకానికి 'ద కిస్ ఆఫ్ లైఫ్ : హూ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్' అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరకల్లా ఈ పుస్తకాని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బ్రయోగ్రఫికల్ ఫిలిం అజార్లో నటిస్తున్నాడు. -
అజార్ కు ఇమ్రాన్ హష్మి స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి.. భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మరపురాని పుట్టినరోజు కానుకను అందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్న ఇమ్రాన్.. సోమవారం 53వ పడిలో అడుగుపెట్టిన అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో తెలుపు రంగు టెస్ట్ టీమ్ జెర్సీని ధరించి కనబడుతున్న ఇమ్రాన్.. వయస్సులో ఉన్నప్పటి అజహర్‌ను ప్రతిబింబిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ మాట్లాడుతూ.. ఈ సినిమా నటుడిగా ఇమ్రాన్‌ను మరోసారి తనను తాను కనుగొనేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేసవిలో విడుదల కానుంది. Happy 53rd Birthday @mpazhar. Here is my birthday present.Me as You in #Azhar! #HappyBirthdayAzhar @AzharTheFilm pic.twitter.com/0LWBie2GmT — emraan hashmi (@emraanhashmi) February 8, 2016 -
కొడుకు బాధ చూసి.. పుస్తకం రాస్తున్న హీరో
ముంబై: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ రచయితగా మారారు. కేన్సర్‌తో బాధపడుతున్న కొడుకు ఆర్యన్ (5) చూసి చలించిపోయిన ఇమ్రాన్ ఓ పుస్తకం రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ పుస్తకంలో కేన్సర్‌పై పోరాటం గురించి రాయనున్నారు. 36 ఏళ్ల ఇమ్రాన్ తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ షహానీని వివాహం చేసుకున్నారు. కాగా వీరి ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ కేన్సర్ బారినపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాధి తొలి దశలో ఉంది. ఆర్యన్ చికిత్స పొందుతున్నాడు. 'నా జీవితంలో గత రెండేళ్లుగా కష్టాలు చవిచూస్తున్నా. ఇద్దరు గొప్ప గురువులను గుర్తించా. వారిద్దరూ కేన్సర్, నా కొడుకు. నాకెదురయిన అనుభవాలపై ఓ పుస్తకం రాయబోతున్నా' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ పుస్తకం విడుదల కావచ్చని భావిస్తున్నారు. పెంగ్విన్ బుక్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. ఇదిలావుండగా ఇమ్రాన్.. టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిసున్న చిత్రంలో నటిస్తున్నారు. -
మాజీ క్రికెటర్ 'అజహర్' షూటింగ్ ప్రారంభం
ముంబై: పేదరికంలో పుట్టాడు.. రోజూ సైకిల్ మీద వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయ జట్టులో స్థానం పొందాడు. విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని జీవితకాల నిషేధానికి గురయ్యాడు..కోర్టు తీర్పుతో విముక్తుడయ్యాడు. ఇలా ట్విస్టుల మీద ట్వీస్టులతో డ్రామాకు ఏమాత్రం తగ్గని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితగాధ 'అజహర్' టైటిల్ తో వెండితెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైనట్లు అజహర్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ ట్విట్ చేశాడు. 'అజహర్ జర్నీని ప్రారంభించాం.. మాకు విజయం చేకూరాలని విష్ చేయండి' అంటూ నెటిజన్లను అభ్యర్థించాడు. మే 13, 2016న విడుదల కానున్న ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఏక్తాకపూర్ నిర్మాత. -
కుక్క ముద్దే బెస్ట్: ఇమ్రాన్ హష్మీ
ముంబై: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీకి 'సీరియల్ కిస్సర్'గా పేరు. ఇమ్రాన్ నటించిన చిత్రాల్లో దాదాపుగా లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలుంటాయి. వెండితెరపై ఇమ్రాన్ చాలామంది హీరోయిన్లతో ఘాటైన దృశ్యాల్లో నటించాడు. అయితే ఇమ్రాన్‌కు నచ్చిన ముద్దు మాత్రం ఏ హీరోయిన్‌తోనూ కాదు.. అతని కుక్కుతోనేనట. పెంపుడు కుక్క ముఖంపై అప్యాయంగా చుంబించడం తనకు ఎంతో ఇష్టమని ఇమ్రాన్ చెప్పాడు. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ యాంకరింగ్ చేస్తున్నరియాల్టీ షో 'ఫరా కా దావత్' లో ఇమ్రాన్ పాల్గొన్నాడు. ఫరా ఖాన్ అడిగిన పలు ప్రశ్నలకు ఇమ్రాన్ సమాధానం చెప్పాడు. -
విద్యా, ఇమ్రాన్‌ల మరో కహాని
-
కిస్... ‘బోర్డర్’ క్రాస్..!
హీరో ఇవ్రూన్హష్మీ వుుద్దులు ‘హద్దులు’ దాటుతున్నారుు. తాజా చిత్రం ‘రాజా నట్వర్లాల్’లో పాకిస్థాన్ టాప్ హీరోరుున్ హుమైవూ వూలిక్తో నటించిన వుుద్దు సీను.. అక్కడ కలకలం రేపుతోంది. ఈ ‘వుుద్దు’ కట్ చేయూలని అక్కడి జనాలు గోల చేస్తున్నారు. పాక్ సంస్కృతిని వూలిక్ భ్రష్టు పట్టిస్తుందంటూ వుండిపడుతున్నారనేది ‘ది గార్డియున్’ కథనం. డెరైక్టర్.. తీవ్రత లేదంటేనే తాను చేశానని, ఏది ఏమైనా.. అతను పాకిస్థానీ కానందుకే ఈ గొడవంతా అంటోందీ ‘స్వీట్హార్ట’. రీమేక్ ‘సింగమ్’ రోరింగ్! సొంతగా ఆలోచించే పనిలేకుండా... దక్షిణాది చిత్రాల రీమేక్‌లతో కలెక్షన్ కింగ్లైపోతున్నారు బాలీవుడ్ బిగ్ స్టార్లు. పూరీ ‘పోకిరి’ని సల్మాన్ ‘వాంటెడ్’గా చేసుకుని బంపర్ హిట్ కొట్టేశాడు. ఈ దెబ్బకు రీమేక్‌లనే నవుు్మకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా అజయ్ దేవ్‌గణ్ తమిళ్ రీమేక్ ‘సింగమ్ రిటర్న్స్’ బాక్సాఫీసు వద్ద సింహ గర్జన చేస్తోంది. 15 రోజుల్లో ఏకంగా రూ.136.14 కోట్లు వసూలు చేసి సంచలనాలు నమోదు చేస్తోంది. ఐస్.. వైరస్..! ఇదేదో ‘సవాళ్ల సీజన్’లా ఉంది. ఐస్ బకెట్ చాలెంజ్ ఎక్కించిన ఈ వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. టాప్ స్టార్లను బాగా పట్టేసింది. తాజాగా వులయూళ సూపర్‌స్టార్ వువుు్మటి... బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు ఓ కొత్త సవాలు విసిరాడు... ‘మై ట్రీ చాలెంజ్’! తాను స్వయుంగా మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్ మీడియూలో పోస్ట్ చేశాడు. మొక్కలతో ఎన్నో ఉపయోగాలున్నాయుంటున్నాడు. వురి షారూఖ్ ఎలా స్పందిస్తాడో! -
రాజా నట్వర్ లాల్‌గా వస్తున్న ఇమ్రాన్
-
ముద్దు పెట్టడం ఒక కళ.. అదో ఆర్ట్
మూవీ బజ్: ముద్దు పెట్టడం ఒక కళ.. అది అందరికీ వచ్చేది కాదంటున్నాడు ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ. ఆన్‌స్క్రీన్‌పై చుంబనాలతో విరుచుకుపడే హష్మీ.. మిగతా వారికి తనలా ముద్దించడం సాధ్యం కాదని బడాయి పోతున్నాడు. పెదాలకు లంగరేయడంలో వెయ్యి గంటల ఎక్స్పీరియన్స్ ఉన్న తనకూ, ఈ విషయంలో కనీసం పది గంటల పనితనం లేని వారికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పుకొచ్చాడు. ఐ హర్ట్ హమ్‌షకల్స్ మూవీ సాజిద్ ఖాన్ డెరైక్షన్‌లో మళ్లీ నటించేది లేదంటోంది బిపాసాబసు. ఈ సినిమాలో తన రోల్‌ను కేవలం ఆరు నిమిషాలకే పరిమితం చేయడంపై గుర్రుగా ఉన్న బిపాసా.. షాజిద్‌పై దుమ్మెత్తి పోసింది. ఆ ఆరు నిమిషాలూ తానేం చేశానో తనకే అర్థం కాలేదంటోంది. డెరైక్టర్ నిర్వాకం వల్ల తాను హర్ట్ అయ్యానని.. సినిమా చూసినవాళ్లూ ఈ విషయం అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చింది. డోన్ట్ ట్రస్ట్ సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ హన్సిక అందరికీ ఓ వార్నింగ్ ఇచ్చింది. తన మేనేజర్‌నని చెప్పి ఎవరైనా ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే తనకేం సంబంధం లేదని చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు తన దృష్టికి వచ్చాయన్న హన్సిక.. తన సినిమా వ్యవహారాలన్నీ తన తల్లే చూసుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక మీదట తన మేనేజర్‌నంటూ చెప్పుకునే వారిని నమ్మొద్దని సలహా ఇచ్చింది. -
'ముద్దు సీన్లలో హీరోలు నాకు పోటీ ఇవ్వడం లేదు'
ముంబై: బాలీవుడ్ లో 'సీరియల్ కిస్సర్' అనే ట్యాగ్ ఆ హీరోకు మాత్రమే సొంతం. హిందీ చలన చిత్ర సీమలో ప్రస్తుత టాప్ హీరోయిన్ల అందర్ని దాదాపు ముద్దులతో ముంచెత్తిన ఘనత ఆయనది. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ. ముద్దు సీన్లలో నాతో యువ హీరోలు పోటీ పడలేకపోతున్నారని తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా హిందీ తెరకు పరిచయమైన హీరోలు నాతో పోటీ పడటం లేదు అని ఇమ్రాన్ అన్నారు. తెరమీద యువ హీరోలు కేవలం ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ ముద్దుల్లో ఫీల్ ఉండటం లేదని తనతో ఎవరో అన్నారని ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ముద్దు సీన్లలోతన 1000 గంటల అనుభవం ముందు కుర్రకారు తేలిపోతున్నారని ఆయన అన్నారు. అ మర్దర్, జహార్, వో లమ్హే చిత్రాల్లో ముద్దలతో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’!
‘‘విభిన్న తరహాలో సాగే సినిమాలు చేయడం నాకు ఆసక్తి. అందుకే ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలు ఎన్నుకుంటాను. ఈ చిత్రం విడుదలైన రోజున కాస్త టెన్షన్ పడ్డాను. కానీ, ఆదివారం హౌస్‌ఫుల్ కావడంతో రిలీఫ్ అనిపించింది. సినిమా చూసినవాళ్లందరూ వినూత్న అనుభూతికి గురి చేసిందని, కథ కొత్తగా ఉందని అంటుంటే ఆనందంగా ఉంది’’ అని నీలకంఠ చెప్పారు. ఆయన దర్శకత్వంలో మధుర శ్రీధర్, ఎమ్.వి.కె. రెడ్డి నిర్మించిన ‘మాయ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు పెరిగాయని మధుర శ్రీధర్ చెబుతూ - ‘‘కన్నడ నిర్మాత శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఒరియా, బెంగాలీ భాషల రీమేక్ హక్కులకు సంప్రతింపులు జరుగుతున్నాయి. హిందీలో ఇమ్రాన్ హష్మీతో రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టాం’’ అన్నారు. -
ముద్దుల్లో మొనగాడు..!
బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీని పాకిస్థాన్ నటి హుమైమా మాలిక్ తెగ పొగిడేస్తోంది. రాజా నట్వర్లాల్ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హుమైమా-హష్మీల మధ్య పలు శృంగార దృశ్యాలున్నాయి. వీటి గురించి హుమైమా మాట్లాడుతూ... ‘రాజా నట్వర్లాల్లో ఇమ్రాన్‌తో కలిసి నటించడం సౌకర్యంగానే అనిపించింది. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ప్రత్యేకించి ముద్దు దృశ్యాలను చిత్రీకరించే రోజు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఎందుకంటే నా నటజీవితంలో ఇప్పటిదాకా ముద్దు సీన్లలో నటించలేదు. తొలిసారి కావడంతో షూటింగ్ ముందు రోజంతా అసౌకర్యంగానే ఫీలయ్యాను. అయితే అప్పటికే ముద్దు సీన్లను పండించడంలో అనుభవమున్న ఇమ్రాన్ నా భయాన్నంతా పోగొట్టాడు. అసభ్యంగా ఉందన్న అభిప్రాయం ఏమాత్రం కలగకుండా చేశాను. మొత్తానికి అంతా బాగానే జరిగిపోయింది. పలు శృంగార దృశ్యాలను కూడా అసభ్యతకు ఏమాత్రం తావులేకుండా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే ఇటువంటి దృశ్యాల్లో నటించిన తర్వాత నేను మళ్లీ పాకిస్థాన్‌కు వెళితే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాను. అది కేవలం నటన మాత్రమే. నా నటనతో పాకిస్థాన్‌కు పేరుప్రఖ్యాతులు సంపాదించిపెట్టాను. ‘బోల్’ సినిమా ఆడిషన్స్ కోసం దేశవిదేశాల నుంచి ఎంతోమంది వచ్చినా నేను ఎంపిక కావడం, ఆ చిత్రంలో నా నటనకు లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడాన్ని పాకిస్థాన్ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా. నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నా. విమర్శించేవారు కూడా ఉంటారు. వారి విమర్శలను పట్టించుకుంటే కెరీర్లో నేను ఇంతకుమించి ముందుకెళ్లలేన’ని చెప్పింది. ఇదిలాఉండగా తాను ఇకపై బికినీ వేసుకొని తెరపై కనిపించనని స్పష్టం చేసింది. -
వాన అనుభవం బాగుందన్న హుమైమా
బాలీవుడ్లో తొలిసారిగా వానపాటలో నర్తించిన పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్.. ఆ అనుభవం చాలా బాగుందని చెబుతోంది. ఇమ్రాన్ హష్మీతో కలిసి 'రాజా నట్వర్లాల్' అనే సినిమాలో 'తేరే హోకే రహేంగే' అనే వానపాటకు ఆమె నర్తించింది. తాను వానపాటలో నటించడం ఇదే తొలిసారని, ఈ అనుభవం చాలా బాగుందని ఆమె చెప్పింది. బాలీవుడ్లో వానపాటల్లో ఎలా చేస్తారో తెలుసుకోడానికి ఆమె పలు వానపాటల వీడియోలు ముందుగా చూసి మరీ చేసిందట. తొలిసారి తాను వానపాటలో నటించానని, ముందు రోజు రాత్రంతా బాలీవుడ్ వానపాటలను చూస్తూనే ఉన్నానని పాట ఆవిష్కరణ సందర్భంగా హుమైమా చెప్పింది. వానపాటల్లో నర్తించడం చాలా ఆసక్తికరమైన అనుభవమని, దాన్ని తాను చాలా ఆస్వాదించానని తెలిపింది. రెండు రోజుల పాటు చాలా కష్టపడి ఆ పాట షూటింగ్ చేశామని వివరించింది. ఈ పాటను అరిజిత్ సింగ్ పాడాడు. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన 'రాజా నట్వర్లాల్' సినిమాలో పరేష్ రావల్, కే కే మీనన్ కూడా ఉన్నారు. ఇది ఆగస్టు 29న విడుదల కానుంది. -
ఉచితంగా సినిమాలు చేయను
సినిమాల్లో ఎలా నటించినా నిజజీవితంలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉంటానని చెబుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ‘రాజా నట్వర్లాల్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుల వీరుడు ఉచితంగా సినిమాలు చేయనని చెప్పాడు. నటించడం తన కెరీర్లో భాగమని, అందుకే ఉచితంగా ఎవరి బ్యానర్‌లోనూ నటించనని చెబుతున్నాడు. అంతమాత్రాన తాను కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే వ్యక్తిని కానన్నాడు. ‘డబ్బు అనేది అందరికీ అవసరమైందే. అంతమాత్రానా దానినే సర్వస్వం అనుకోవడం కూడా సరికాదు. డబ్బులు తీసుకోకుండా సినిమాల్లో నటించడం వంటివి నేను చేయన’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. బాలీవుడ్లో దశాబ్ద కాలంగా నటిస్తున్న ఈ హీరోకు మర్డర్, రాజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై వంటి చిత్రాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఫుట్‌పాత్, దిల్ తో బచ్చా హై జీ, ఘన్‌చక్కర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా నటుడిగా ఇమ్రాన్‌కు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తే ఇప్పటిదాకా రెట్టింపు డబ్బు తనవద్ద ఉండేదని, పాత్రలు నచ్చినందునే సినిమాలు అంగీకరించానని చెబుతూనే ఇకపై పాత్రలతోపాటు నటించినందుకు ఇచ్చే పారితోషికం కూడా నచ్చితేనే పచ్చజెండా ఊపుతాన ంటున్నాడు. ఇక రాజా నట్వర్లాల్ సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా చూస్తూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోతే అది ముమ్మాటికీ వారిని వారు మోసగించుకున్నట్లే అవుతుందని, సినిమా అంత బాగా కుదిరిందని చెప్పాడు. ఘన్‌చక్కర్ సినిమా కోసం కూడా ప్రయోగాలు చేసి, వైఫల్యాన్ని ఎదుర్కొన్న తాను ఈసారి ప్రయోగాత్మక చిత్రం ద్వారా ప్రేక్షకుల మన్ననలందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పాడు. -
తమిళ నటితో ఇమ్రాన్ హష్మీ లిప్-లాక్
చెన్నై: తమిళ టీవీ, సినీ నటి శాండ్రా అమీ బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఇమ్రాన్ హష్మీ హీరోగా దర్శకుడు ఆంథోనీ హష్మీ రూపొందిస్తున్న సినిమాలో ఆమె అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ తమిళ ప్రియురాలిగా ఆమె కనిపించనుంది. 'ఇమ్రాన్ ప్రియురాలిగా ఈ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్నా. ఆయనతో కలిసి కొన్ని సీన్లలో కనిపిస్తా. దర్శకుడు ఆంథోనీ నా ఫోటోలు చూసి ఈ పాత్రకు నేనైతే సరిపోతానని చెప్పి నన్ను ఎంపిక చేశారు. మొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటిస్తుండడం సంతోషంగా ఉంది' శాండ్రా అమీ పేర్కొంది. అధర చుంబన సన్నివేశంలో ఆమె నటించనుంది. కథ అనుగుణంగా ఇమ్రాన్ తో లిప్-లాక్ సీన్ చేయాల్సివస్తోందని వెల్లడించింది. బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఇమ్రాన్ ఇప్పుడు తమిళ నటితో లిప్-లాక్ కు రెడీ అయ్యాడు. ఆమె నటించిన 'శివప్పు ఇనక్కు పిడిక్కుమ్' తమిళ సినిమా త్వరలో విడుదలకానుంది. -
ఇమ్రాన్... అందరికీ జాన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మికి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ పేర్కొంది. ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో నటిస్తోంది. ‘వాస్తవానికి ఇమ్రాన్‌ను పాకిస్థానీయుడని తమ దేశ ప్రజలు అనుకుంటారు. ఇమ్రాన్ సినిమా విడుదలైతే మా దేశంలో ఓపెనింగ్స్ బాగుంటాయి’ అని అంది. ప్రేక్షకులు ఇమ్రాన్‌ను ఎంతో ఇష్టపడతారని, ఎక్కువమంది అతనిని పాకిస్థానీ జాతీయుడిగానే భావిస్తార ని తెలిపింది. అందువల్ల తాను నటిస్తున్న ‘రాజా నట్వర్లాల్’ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది. వృత్తికి అంకితమవుతాడంటూ ప్రశంసల జల్లు కురిపించింది. -
అతను రొమాన్స్ సీన్లలో దిట్ట!
ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి రొమాన్స్ సీన్లను అద్భుతంగా పండిస్తాడని పాకిస్తాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ స్పష్టం చేసింది. ఇమ్రాన్ కి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని ఆమె పేర్కొంది. ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది. -
అధరామృత దీపిక
పెదవి ముద్దు కోసం కథానాయకుడు చొరవ చూపిస్తాడు. కథానాయిక సిగ్గు పడుతుంది. కొంచెం కష్టమైనా ఇద్దరూ ఆ సీన్‌ని ఎలాగోలా పండించేస్తారు. ఇది మొన్నటిదాకా తెరపై జరిగిన కథ. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. కథానాయికే ముందు చొరవ చూపిస్తుంటే.. కథానాయకుడు సిగ్గు పడాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ అనూహ్యమైన మార్పుకి కారణం ‘దీపికా పదుకొనే’ అని ముక్తకంఠంతో అంటోంది బాలీవుడ్. ఆమెను ‘లేడీ ఇమ్రాన్ హష్మీ’గా అభివర్ణిస్తున్నవారు అక్కడ కోకొల్లలు. తాను నటించిన ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ హీరోలకు తన అధరామృతాన్ని అందించిన ఘనత దీపిక పదుకొనేది. ‘బెస్ట్ లిప్లాకర్’ అనే అవార్డు ఏర్పాటు చేస్తే ప్రతి ఏడాదీ ఆ పురస్కారం దీపికానే వరిస్తుందని అక్కడ చాలామంది అభిప్రాయం. అందుకేనేమో... దీపికాతో ‘కాక్టైల్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హోమీ ఆడ్జానియా ఆమెతోనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సినిమా పేరు ‘లిప్‌లాక్’. టైటిల్‌ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీపిక కూడా ఈ సినిమాకు పచ్చజెండా ఊపేసిందట. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ‘కాక్టైల్’ సినిమాలో దీపికాను టూపీస్ బికినీలో చూపించి పెను సంచలనానికే తెరలేపిన హోమీ ఆడ్జానియా... ఈ రీసెంట్ ‘లిప్‌లాక్’తో ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తాడో చూడాలి. -
కుమారుడి క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు ఇమ్రాన్!
నాలుగేళ్ల తన కుమారుడి చికిత్స కోసం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విదేశాలకు వెళ్లనున్నారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయన్ కు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ఇటీవలే వైద్యులు గుర్తించారు. అయితే తొలి దశలోనే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడికి విదేశాల్లో కెమోథెరఫీ చికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు. జనవరి 15 తేదిన ఆయన్ కు సర్జరీ చేసి కిడ్నీ నుంచి ట్యూమర్ ను వ్యైద్యులు విజయవంతంగా తొలగించారు. మంగళవారం ఆయన్ ను ఆస్పత్రి నుంచి విడుదల చేయనున్నారు. ఇటీవల క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ వ్యాధికి గురవ్వడంతో అమెరికాలో కెమోథెరపీ చికిత్స నిర్వహించారు. ఆయన్ కు అమెరికాలో కెమోథెరఫి నిర్వహించాలని ఇమ్రాన్ కు యువరాజ్ సింగ్ సూచించినట్టు తెలుస్తోంది. -
అజారుద్దీన్ పాత్రలో హష్మి
బాలీవుడ్లో డర్టీ పిక్చర్, పాన్ సింగ్ తోమార్, భాగ్ మిల్కా భాగ్ చిత్రాల తర్వాత జీవిత కథల నేపథ్యం ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకుంది. తాజాగా బాక్సర్ మేరి కోమ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఓ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. అదే ఊపులో క్రికెటర్ అజారుద్దీన్ బయోపిక్‌గా ఓ చిత్రంగా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అజార్ పాత్రకోసం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మిల పేర్లను పరిశీలించారు. అయితే చిట్టచివరకు ఆ అవకాశం ‘సీరియల్ కిస్సర్’ హష్మీని వరించింది. స్వతహాగా క్రీడలంటే ఇష్టపడే హష్మీ... తనకు అజారుద్దీన్ పాత్ర దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. క్రీడాకారుడిగానే కాకుండా ఎంపీగా సేవలందిస్తున్న అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, భార్యతో విడాకులు, ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోవడం లాంటి అనేక ఆసక్తికర అంశాలు ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రానికి నిర్మాత అని సమాచారం. -
బాలీవుడ్ తెరపై అజారుద్దీన్ గా అజయ్ దేవగన్?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథా చిత్రాల జోరు పెరిగింది. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అయితే అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ లో ఏ హీరోతో చేయించాలనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. తెరపై అజారుద్దీన్ పాత్రను పోషించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ పాత్ర అజయ్, ఇమ్రాన్ లలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.