ఇమ్రాన్... అందరికీ జాన్ | Emraan, Salman enjoy huge fan following in Pakistan: Humaima Malik | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్... అందరికీ జాన్

Published Sat, Jul 26 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

ఇమ్రాన్... అందరికీ జాన్

ఇమ్రాన్... అందరికీ జాన్

ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మికి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ పేర్కొంది.  ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాలో నటిస్తోంది. ‘వాస్తవానికి ఇమ్రాన్‌ను పాకిస్థానీయుడని తమ దేశ ప్రజలు అనుకుంటారు. ఇమ్రాన్ సినిమా విడుదలైతే మా దేశంలో ఓపెనింగ్స్ బాగుంటాయి’ అని అంది.

 ప్రేక్షకులు ఇమ్రాన్‌ను ఎంతో ఇష్టపడతారని, ఎక్కువమంది అతనిని పాకిస్థానీ జాతీయుడిగానే భావిస్తార ని తెలిపింది. అందువల్ల తాను నటిస్తున్న ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది.

ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్‌లాల్’  సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది. వృత్తికి అంకితమవుతాడంటూ ప్రశంసల జల్లు కురిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement