బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల రేస్ 3 సినిమాతో నిరాశపరిచిన సల్మాన్ ప్రస్తుతం ‘భారత్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇండో పాక్ బార్డర్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతులు లభించకపోవటంతో పంజాబ్‌లో సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ సన్నివేశంలో భాగంగా సల్మాన్ పాకిస్తాన్ జెండాను ఎగురవేయాల్సి వచ్చిందట. దీంతో ఆ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తులు ఆ సీన్ చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు సల్మాన్‌పై కేసు కూడా నమోదు చేశారు. అయితే సినిమా షూటింగ్ కోసం చేసింది కాబట్టి లీగల్ సమస్యలు ఎదురుకావన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment