
Salman Khan Ex Girlfriend Said Pakistan Is Dangerous For Me: పాకిస్తానీలు తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ పేర్కొంది. తన మాతృ దేశమైన పాకిస్తాన్ నుంచే సోమీకి బెదిరింపులు రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తరచూ పాకిస్తాన్ మగవాళ్ల నన్ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్‌జీవో అని ఆమె పేర్కొంది. సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా వెళ్లిపోయిన సోమీ అలీ అక్కడ ఓ ఎన్‌జీవోను స్థాపించి హ్యుమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యే బాధితులకు సహాయం అందిస్తోంది.
చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్
తన ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది ఆమె. ముఖ్యంగా గే విక్టిమ్స్‌కి సోమీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమట. ఈ క్రమంలో ‘నువ్వు ఎప్పుడు పాకిస్తాన్ వస్తే వదిలిపెట్టెదే లేదు. నిన్ను చంపి తీరుతాం’ అంటూ తరచూ అక్కడి పురుషుల నుంచి తనకు మెయిల్స్ వస్తుంటాయని, అందుకే తాను కొన్నేళ్లుగా పాక్‌కు వెళ్లడం లేదని సోమీ స్పష్టం చేసంది. అక్కడికి వెళితే తనకు ప్రాణ గండం తప్పదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో
కాగా పాకిస్తాన్‌లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి సల్మాన్‌ను ఇష్టపడి ఇండియాకు వచ్చింది. ముంబైలో దిగిన ఆమె ఇటూ అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు మోడల్‌గా కెరీర్‌ను బిజీ చేసుకుంది. ఈ క్రమంలో సల్మాన్ మనసు దోచుకున్న ఆమె పదేళ్ల పాటు అతడితో రిలేషన్‌లో ఉంది. ఆ తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా సల్మాన్‌కు బ్రేకప్, సినిమాలకు గుడ్‌బై చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సోమీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment