![Salman Khan 56th Birthday: Katrina Kaif Special Birthday Wishes to Salman Khan - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/28/Katrina-Kaif1.jpg.webp?itok=E99_3GzX)
Katrina Kaif Special Birthday Wishes to Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మాజీ ప్రేయసి నుంచి బర్త్‌డే విషెస్ అందాయి. నిన్న(సోమవారం)సల్మాన్ తన 56వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు సహా పలువురు ప్రముఖుల నుంచి సల్లూ భాయ్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ లిస్ట్‌లో సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షిస్తుంది.
'హ్యాపీయెస్ట్ బర్త్‌డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నా' అంటూ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కత్రినా చేసిన ఈ విషెస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక కత్రినా- సల్మాన్‌లు పార్ట్‌నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ కపుల్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం సల్మాన్-కత్రినా జోడీగా టైగర్-3 సినిమాలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment