సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ 'ట్రైలర్‌ -3' విడుదల.. దుమ్ములేపిన కత్రినా | Salman Khan's Tiger 3 Telugu Trailer Released | Sakshi
Sakshi News home page

Tiger 3 Telugu Trailer: సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ 'ట్రైలర్‌ -3' విడుదల.. దుమ్ములేపిన కత్రినా

Published Mon, Oct 16 2023 1:30 PM | Last Updated on Mon, Oct 16 2023 1:40 PM

Salman Khan Tiger 3 Telugu Trailer Released - Sakshi

రెండు చిత్రాలతో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంట ప్రేక్షకులను  మెప్పించిడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ కొల్లగొట్టాయి. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్‌ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాయి. తాజాగా టైగర్‌-3 మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  ఈ  సీక్వెల్‌ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకుడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. సల్మాన్ ఖాన్ సీక్రెట్ ఇండియన్‌ రా ఏజెంట్ అని, అతను తన దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.

ట్రైలర్‌లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. నవంబర్‌ 12న దివాళి కానుకగా టైగర్‌-3 విడుదల అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement