ex girl friend
-
సల్మాన్ ఖాన్ సిగరెట్లతో కాల్చి వేధించేవాడు : హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌పై అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్,హీరోయిన్ సోమీ అలీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అతన్ని లైంగిక ఉన్మాదిగా అభివర్ణించిన సోమీ తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపించింది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్‌ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కానీ చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్స్ నడిపాడు. వాటిలో సోమీ అలీ కూడా ఒకరు. పాకిస్తాన్లో పుట్టిన సోమీ అమెరికాలో స్థిరపడింది. 1993లో అవతార్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ క్రమంలో సల్మాన్‌తో స్నేహం ప్రేమగా మారింది. అప్పట్లో వీరి రిలేషన్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉండేది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్నాళ్లకే సల్మాన్-సోనీ అలీ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీని వదిలి అమెరికా వెళ్లిపోయింది. దీనికి సల్మానే కారణం అనూ రూమర్స్ కూడా వినిపించాయి. తాజాగా ఆమె సల్మాన్ తో డేటింగ్లో ఉన్నప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'సల్మాన్ ఒక ఉమెన్ బీటర్. పిరికిపంద, సిగరేట్‌తో కాల్చడం, శారీరక వేధింపులకు గురిచేయడం అతడి నైజం' అంటూ సోనీ అలీ తాజాగా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. తర్వాత కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే సోమీ అలీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే?
స్పేస్ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన షేర్ చేసే పోస్ట్‌ల నుంచి వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల వరకు ప్రతీది వైరల్ గా మారి వార్తల్లోకెక్కుతుంది. చివరికి మస్క్ టీనేజ్ ఫొటోలను వేలం వేయగా వాటికి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే వాటి కోసం జనాలు ఎగబడి మరీ లక్షలు పోసి కొన్నారు. మస్క్ టీనేజ్ ఫోటోలకి భారీ డిమాండ్.. ఏకంగా కోటి! ఎలాన్ మస్క్పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జెన్నిఫర్ గ్విన్ అనే యువతితో డేటింగ్లో ఉన్నాడు. ఇతర ప్రేమికుల మాదిరిగానే మస్క్ కూడా వారి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఆమెకు కొన్ని ఫోటోలు, ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో లేరు, ఎవరిపనుల్లో వారు బిజిగా ఉన్నారు. తాజాగా మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ వీళ్లకు సంబంధించిన ఫొటోలను, వస్తువులను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. అందులో 18 ఫోటోలు, మస్క్ చేతితో వ్రాసిన పుట్టినరోజు కార్డు, తనకు బహుమతిగా ఇచ్చిన బంగారు హారాన్ని ఉంచింది. బోస్టన్‌కు చెందిన ఓ సంస్థ వేలం వేసింది. మస్క్, జెన్నిఫర్ కలిసి ఉన్న ఫోటో ఏకంగా రూ.1.3 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోటోను రివీల్ చేయలేదు. కాగా ఇంత మొత్తానికి ఆ ఫోటో అమ్ముడువుతుందని ఎవరూ ఊహించలేదట. మస్క్ గిఫ్ట్‌గా ఇచ్చిన నెక్లెస్‌కు రూ. 40 లక్షలు, బర్త్‌డే కార్డుకు రూ.13 లక్షలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌తో లీగల్ వార్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో ట్విటర్‌ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపిన మస్క్, ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్నారు. SOLD: Elon Musk’s ex-girlfriend sold photos and mementos for more than $165,000 @RRAuction.https://t.co/NNGUJwtBDd#Auction #Consign #RemarkableResults pic.twitter.com/QTbjbefU5Q — RR Auction (@RRAuction) September 15, 2022 చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై అతడి మాజీ ప్రేయసి సోమి అలీ మరోసారి విరుచుకుపడింది. సల్మాన్‌తో పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన సోమి బ్రేకప్ అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా చెక్కేసింది. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్న ఆమె సమయం వచ్చినప్పుడల్లా సల్మాన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే సల్మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరోసారి విమర్శలు గుప్పించింది. తనతో సహా ఇతర మహిళలను సల్మాన్ కొట్టేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: ‘లైగర్’లో ముందుగా ఆమెను హీరోయిన్గా అనుకున్నా: పూరీ ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మైనే ప్యార్ కియా’ పోస్టర్ షేర్ చేస్తూ.. సల్మాన్‌ను ఉమెన్ బీటర్(మహిళలను కొట్టే వ్యక్తి) అని ప్రస్తావించింది. ‘సల్మాన్ ఖాన్‌ను గొప్పగా కీర్తించడం మానేయండి. అతనో శాడిస్ట్. ఎంతటి శాడిస్టో మీకు తెలియదు. తరచూ అమ్మాయిలు కొడుతూంటాడు. నాతో సహా ఎంతోమంది మహిళలపై అతడు చేయి చేసుకున్నాడు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని ఓ పార్టీలో సల్మాన్ కొట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. కాగా పాకిస్తాన్లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి సల్మాన్‌ను ఇష్టపడి ఇండియాకు వచ్చింది. ముంబైలో దిగిన ఆమె ఇటూ అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు మోడల్‌గా కెరీర్‌ను బిజీ చేసుకుంది. ఈ క్రమంలో సల్మాన్ మనసు దోచుకున్న ఆమె పదేళ్ల పాటు అతడితో రిలేషన్లో ఉంది. ఆ తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా సల్మాన్‌కు బ్రేకప్, సినిమాలకు గుడ్‌బై చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సోమీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ వస్తోంది. -
నా మాతృదేశం పాకిస్తాన్ నుంచి బెదిరింపులు: హీరోయిన్ ఆందోళన
Salman Khan Ex Girlfriend Said Pakistan Is Dangerous For Me: పాకిస్తానీలు తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ పేర్కొంది. తన మాతృ దేశమైన పాకిస్తాన్ నుంచే సోమీకి బెదిరింపులు రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తరచూ పాకిస్తాన్ మగవాళ్ల నన్ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్జీవో అని ఆమె పేర్కొంది. సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా వెళ్లిపోయిన సోమీ అలీ అక్కడ ఓ ఎన్జీవోను స్థాపించి హ్యుమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యే బాధితులకు సహాయం అందిస్తోంది. చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్ తన ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది ఆమె. ముఖ్యంగా గే విక్టిమ్స్‌కి సోమీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమట. ఈ క్రమంలో ‘నువ్వు ఎప్పుడు పాకిస్తాన్ వస్తే వదిలిపెట్టెదే లేదు. నిన్ను చంపి తీరుతాం’ అంటూ తరచూ అక్కడి పురుషుల నుంచి తనకు మెయిల్స్ వస్తుంటాయని, అందుకే తాను కొన్నేళ్లుగా పాక్‌కు వెళ్లడం లేదని సోమీ స్పష్టం చేసంది. అక్కడికి వెళితే తనకు ప్రాణ గండం తప్పదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో కాగా పాకిస్తాన్లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి సల్మాన్‌ను ఇష్టపడి ఇండియాకు వచ్చింది. ముంబైలో దిగిన ఆమె ఇటూ అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు మోడల్‌గా కెరీర్‌ను బిజీ చేసుకుంది. ఈ క్రమంలో సల్మాన్ మనసు దోచుకున్న ఆమె పదేళ్ల పాటు అతడితో రిలేషన్లో ఉంది. ఆ తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా సల్మాన్‌కు బ్రేకప్, సినిమాలకు గుడ్‌బై చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సోమీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ వస్తోంది. -
సల్మాన్‌కు మాజీ ప్రేయసి కత్రినా నుంచి స్పెషల్ విషెస్
Katrina Kaif Special Birthday Wishes to Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మాజీ ప్రేయసి నుంచి బర్త్‌డే విషెస్ అందాయి. నిన్న(సోమవారం)సల్మాన్ తన 56వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు సహా పలువురు ప్రముఖుల నుంచి సల్లూ భాయ్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ లిస్ట్‌లో సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షిస్తుంది. 'హ్యాపీయెస్ట్ బర్త్‌డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నా' అంటూ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కత్రినా చేసిన ఈ విషెస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కత్రినా- సల్మాన్‌లు పార్ట్నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ కపుల్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం సల్మాన్-కత్రినా జోడీగా టైగర్-3 సినిమాలో నటిస్తున్నారు. -
పెళ్లి జరిగి 4 రోజులు.. భర్త ముందే మాజీ ప్రియుడు..
పట్నా: వివాహం జరిగిన 4 రోజులకే ఓ నవ వధువు దారుణ హత్యకు గురైంది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమె మాజీ ప్రేమికుడు నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో భగాన్ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది. షబ్నం భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన 4వ రోజు షబ్నం ఆమె భర్తతో కలిసి వాహనంలో పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన ఆమె రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. రాజ్‌పాల్ తనతో రావాలని ఆమెను బలవంతం చేయగా, ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపాడు. వెంటనే కోపంతో రాజ్‌పాల్ షబ్నం పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకి పెట్టి కాల్పులు జరిపాడు. అనంతరం తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. ఇద్దరినీ జిల్లా సదర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు షబ్నం చనిపోయినట్లు ప్రకటించారు. అదే క్రమంలో రాజ్‌పాల్‌ను పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాకు తరలించాలని సూచించారు. అయితే, అతను కూడా దారిలోనే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
డైరెక్టర్లు తమతో గడపాలన్నారు: హీరోయిన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, పాకిస్తాన్ మోడల్ సోమి అలీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె బాలీవుడ్ పరిశ్రమ, సల్మాన్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 1991లో సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశతో పరిశ్రమలో అడుగు పెట్టిన సోమి 1998 వరకు సినిమాల్లో నటించారు. తర్వాత కొంతకాలానికే తెరపై కనుమరుగయ్యారు. ఇండస్ట్రీలో ఉన్నది కొంతకాలమే అయిన బాలీవుడ్ తనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేరీర్ ప్రారంభంలో నా సినిమాలు బాగానే ఆడాయి. తర్వాత కొన్ని ప్లాప్‌లు చుశాను. ఆ సమయంలో నాకు అవకాశాలు తగ్గాయి. అవకాశాల ఇస్తామని చెప్పి కొంతమంది డైరెక్టర్లు నాతో శృంగారం చేయాలని ప్రయత్నించారు. అదే సమయంలో నేను ఓ భయంకరమైన రిలేషన్ షిప్లో ఉన్నాను. అది వాటన్నింటికంటే దుర్భరమైనదిగా ఇప్పుడు అనిపిసోంది’ అంటూ సోమి, సల్మాన్‌తో ప్రేమ విషయాన్ని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్‌ఖాన్ బాలీవుడ్లో పలువురు అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వారిలో సల్మాన్ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికి గుర్తొచ్చేది మాత్రం సోమీ అలీనే. ఆమె హీరోయిన్గా కంటే సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. చదవండి: పెళ్లి తర్వాత నటించనన్నావ్.. మరి ఇదేంటి?! ‘ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాం..సల్మాన్ మోసం చేశాడు’ -
‘ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాం..సల్మాన్ మోసం చేశాడు’
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ పలువురు అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వారిలో సల్మాన్ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికి గుర్తొచ్చేది మాత్రం పాకిస్తాన్ నటి సోమీ అలీ. ఆమె హీరోయిన్గా కంటే సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 20 ఏళ్ల క్రితం తామిద్దరం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని, ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నామని, అయితే సల్మాన్ తనను మోసం చేశారని, అందుకే సల్మాన్ నుంచి విడిపోయానని ఆరోపించింది. అప్పటినుంచి ఎవరి లైఫ్‌లో వాళ్లు మూవ్ ఆన్ అయ్యామని తెలిపింది. 'నిజానికి హీరోయిన్ అవ్వాలనే ఆశతో పరిశ్రమకు రాలేదని, కేవలం సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశయంతోనే ఇండియాకు వచ్చాను. 'మైనే ప్యార్ కియా' సినిమా చూసి సల్మాన్‌తో ప్రేమలో పడ్డాను. దాదాపు ఆరేళ్ల పాటు ఇద్దరం డేటింగ్ చేశాం. ఆ సమయంలో సల్మాన్ ఇంటికి చాలా సార్లు వెళ్లేదాన్ని. వాళ్ల పేరెంట్స్ చాలా మంచివారు. అందిరిని సమానంగా ఎలా చూడాలో వాళ్ల దగ్గరనుంచి నేర్చుకున్నా. వాళ్లు మతం గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ప్రతీ వ్యక్తిని సమానంగా ట్రీట్ చేసేవారు. ఎవరు ఇంటికి వెళ్లినా ఎంతో ఆప్యాయంగా చేరదీసేవాళ్లు. ముఖ్యంగా సల్మా ఆంటీ(సల్మాన్ ఖాన్ మదర్)చాలా స్వీట్. వారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ సల్మాన్ నుంచి మాత్రం నేను ఒక్క విషయం కూడా నేర్చుకోలేదు' అని చెప్పుకొచ్చింది. ముంబైలో మోడలింగ్‌లో చేస్తుండగానే సోమీకి హీరోయిన్గా అవకాశం వచ్చింది.1992లో బులండ్ అనే చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ఖిలాడీ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన అంత్(1994), కృష్ణ అవతార్(1993)తో పాటు ‘అవో ప్యార్ కరేనా’(1994) చిత్రాల్లో నటించిన సోమీ.. సల్మాన్‌తో డేటింగ్ చేశారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట అప్పట్లో హోట్టాపిక్గా ఉండేది. అయితే సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టిన ఆమె `నో మోర్ టియర్స్` అనే ఎన్జీఓని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ సినిమాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా, తనకు మూవీస్‌పై ఆసక్తి లేదని, మళ్లీ ఇండస్ర్టీలోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపింది. గతంలో కత్రినా కైఫ్, సంగీత బిజ్లాని, ఐశ్వర్య రాయ్ వంటి టాప్ హీరోయిన్లతో సల్మాన్ ప్రేమాయణం నడిపారు. ప్రస్తుతం మోడల్ యూలియా వంతూర్‌తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ టాక్. చదవండి : ‘హీరోయిన్ అవ్వాలని రాలేదు.. సల్మాన్ కోసమే వచ్చాను’ సల్మాన్ మొదటి జీతం: మరీ అంత తక్కువా? -
ఒక్క కన్నీటి బొట్టు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్ అయి ‘ఇద్దరు’గా మిగిలారు. అమ్మాయి ఏడ్చింది. అబ్బాయి ఏడ్వలేదనుకుంది. ‘నా కోసం ఒక్క కన్నీటి బొట్టు.. నీ దగ్గర లేదా’ అని అడిగింది. అతడి చేత కన్నీళ్లు పెట్టించడానికి.. ట్రక్కునిండా ప్రేమను పంపింది. ‘‘రెండు కళ్ల నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి’’ అంటాడు క్రిష్. (డైరెక్టర్ కెవీ రెడ్డి ఆయన). ‘‘ఊ’’ అంటుంది కీర్తి సురేశ్. (నటి సావిత్రి ఆమె). మళ్లీ చెప్తాడు క్రిష్. ‘‘రెండు కళ్ల నుంచి కాదమ్మాయ్. ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి’’ ‘‘ఊ’’ అని తల ఊపుతుంది. పాట మొదలౌతుంది. ‘నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’. కీర్తి సురేశ్‌కి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీటి బొట్లు వచ్చేస్తాయి! రెండంటే రెండు బొట్లే అడిగి ఉంటాడు క్రిష్. రెండంటే రెండు బొట్లే రాలుస్తుంది కీర్తి సురేశ్. ‘మహానటి’లోని సన్నివేశం ఇది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు ) ∙∙ మిస్ ఝావో ఓ కుర్రాడిని ప్రేమించింది. అతడూ ఆమెను ప్రేమించాడు. ఇద్దరిదీ చైనా. జీబో అనే ప్రాంతంలో ఉంటారు. ఉండేది జీబోలోనే అయినా, ప్రేమ మొదలైనప్పట్నుంచీ ఒకరి మనసుల్లో ఒకరు ఉంటున్నారు. ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈమధ్యే విడిపోయారు. బ్రేకప్ చెప్పేశాడు ఆ కుర్రాడు. ఝావో తట్టుకోలేకపోయింది. తల్లడిల్లిపోయింది. ‘నీకోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’ అని పాడుకుంది. అతడు పట్టించుకోలేదు. కాల్ చేయలేదు. కాల్ చేస్తే తియ్యలేదు. ఏడ్చింది. తన లెక్క ప్రకారం అతడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అతడు ఏడ్వడం లేదని, హాయిగా ఉన్నాడని ఆమెకు తెలిసింది! అతడు ఏడుస్తూ లేకపోవడం చూసిన వారెవరో వచ్చి ఆమెకు చెప్తే తెలిసింది. ∙∙ ఝావో బాయ్‌ఫ్రెండ్ అప్పుడే నిద్ర లేచాడు. కళ్లు నలుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. గది నిండా ఉల్లి సంచులు! వెయ్యి కిలోల ఉల్లిపాయలు. డెలివరీ బాయ్ ట్రక్కులో తీసుకొచ్చి అక్కడి దింపేసి వెళ్లిపోయాడు. సంచుల్లో చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్‌లో ఎవరిదో చేతి రాత! ఎవరిదో ఏంటి.. తన గర్ల్ ఫ్రెండ్ ఝావోదే! అక్షరాలు పైకే కనిపిస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు నీ వంతు’’ అని రాసి ఉంది! ‘తిక్క పిల్ల’ అనుకున్నాడు. ఈలోగా, ‘‘ఏంటి బాబూ, ఇన్ని ఎర్ర ఉల్లిపాయల సంచులూ’’ అని పక్కింటి వాళ్లొచ్చి అడిగారు. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు. ‘‘నా ఫ్రెండే. ప్రతి దానికీ అతి చేస్తుంటుంది. అందుకే విడిపోయాం. విడిపోయినందుకు తను ఏడుస్తోందట. నన్నూ ఏడవమని ఈ ఉల్లిపాయల్ని పంపింది. బ్రేకప్ అయినప్పట్నుంచీ నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా ఫ్రెండ్స్ అందరితో చెబుతోందట! ఏడ్వనందుకు చెడ్డవాణ్ణి అయ్యాను’’ అని ఫీల్ అయ్యాడు. ఈ ఫీలింగేదో ఫోన్ చేసి ఆ పిల్ల దగ్గరే ఏడిస్తే హ్యాపీగా ఫీల్ అయి ఉండేది కదా పాపం. బ్రేకప్ అవడం అంటే మరింత దగ్గరవడం. ఉల్లి సంచుల్ని చూస్తూ తల పట్టుకున్న మిస్ ఝావో బాయ్‌ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ ఇంటికి మిస్ ఝావో డెలివరీ చేసిన ఉల్లిపాయలు -
మాజీ గర్ల్‌ఫ్రెండ్ లేఖ రాస్తే.. దిద్ది మార్కులేశాడు!
మాజీ గర్ల్‌ఫ్రెండ్ సారీ చెబుతూ అతడికి ఓ లేఖ రాసింది. మామూలుగా అయితే దాన్ని చూసి మళ్లీ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి, లేదా తన మనసు విరిగిపోయిందంటూ జవాబు ఇవ్వాలి. ఇదేమీ చేయని ఆ కుర్రాడు.. ఆమె రాసిన లేఖలో తప్పులన్నింటినీ ఎంచి, వాటిని ఎర్ర ఇంకుతో పక్కన రాసి, ఆ లేఖను ఓ ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టాడు. అమెరికాలోని స్టెట్సన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి ట్వీట్ చేసిన ఈ లేఖ.. బాగా వైరల్ అయ్యింది. తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె ఓ సుదీర్ఘ లేఖ రాసింది. నోట్ పుస్తకంలోని కాగితం చించి మరీ ఆమె లేఖ రాసింది. అందులో ఆమె చాలా తప్పులు రాయడంతో ఆమె స్నేహితుడు నిక్.. వాటన్నింటినీ ఎర్ర ఇంకుతో మార్క్ చేశాడు. ''మీ మాజీ గర్ల్ ఫ్రెండ్ క్షమాపణ లేఖ రాస్తే దానికి గ్రేడింగ్ ఇచ్చి, వెనక్కి తిప్పి పంపాలి'' అని అంటూ నిక్ ఆ లేఖను ఫొటో తీసి ట్వీట్ చేశాడు. పరిచయం చాలా సుదీర్ఘంగా ఉందని, అందులో చాలా వరకు వాక్యాలు రిపీట్ అయ్యాయని నిక్ రాశాడు. తాను అతడిని ఎప్పుడూ మోసం చేయలేదని రాయగా.. దాన్ని రుజువు చేయడానికి ఎలాంటి వివరాలు లేవని అన్నాడు. ఆమెకు వందకు గాను కేవలం 61 మార్కులు మాత్రమే ఇచ్చాడు. అతడి ట్వీట్‌ను లక్ష మందికి పైగా రీట్వీట్ చయగా, 3 లక్షల లైకులు వచ్చాయి. అయితే మాజీ గర్ల్‌ఫ్రెండ్ రాసిన లేఖను ఇలా బయటపెట్టడం మాత్రం సరికాదని ఎక్కువ మంది తిట్టిపోశారు. -
గర్ల్‌ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..
మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్‌ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్‌తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్‌తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ చేయకపోవటంతో నిరాశతో ఇంటికి చేరింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ప్రేమ విఫలమైందన్న బాధలో ఉన్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ. 40 వేలు తనకు చెల్లించాలంటూ సమన్లు పంపాడు ఆ బాయ్‌ఫ్రెండ్ లాయర్. రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని చూస్తున్నాడు లాయర్ బాయ్‌ఫ్రెండ్. ఈ విషయంపై పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్టాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెబుతున్నాడు. ఎంతగానో ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్.. ఖర్చులు చెల్లించమంటూ కోర్టుకెక్కడంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది జుర్స్కోయా. -
పెళ్లి మండపం వద్దే వరుడి చెంప చెళ్లుమనిపించింది!
డెహ్రాడూన్: ఓ పెళ్లి మండపం వద్ద చేసుకున్న ఘటన అచ్చం సినిమాలో క్లైమాక్స్ ను తలపించింది. అంగరంగం వైభవంగా పెళ్లికి సిద్ధమైన ఓ వరుడి చెంప చెళ్లుమనిపించింది అతని మాజీ ప్రేయసి. అది హరిద్వార్ లోని అవదిపుర్హాల్ గ్రామం. కాసేపట్లో జరిగే పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. వరుడు తరుపు వారు, వధువు తరపువారు పెళ్లి వేడుకను తిలకించడానికి ఆసీనులై ఉన్నారు. అయితే ఈ లోగా ఓ ట్విస్ట్. వరుడి ప్రేమించి మోసం చేసిన మాజీ ప్రేయసి ఆ వేడుక వద్ద దర్శనిమిచ్చింది. తనను ప్రేమించి వేరే అమ్మాయిని చేసుకుంటావా అంటూ నిలదీసింది. దీనికి పెళ్లి కొడుకు ముఖం చాటేయడంతో.. అతనిపై ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇక సహనం కోల్పోయిన ఆ యువతి వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనతో పెళ్లి మండంలో అలజడి రేగింది. ఆ వరుడి మాజీ ప్రేయసిని అక్కడున్న ఇతర అతిథులు అడ్డుకున్నారు. 'అతనితో నాకు కోర్టు ద్వారా గతంలోనే పెళ్లి అయిందని.. చాలా కాలం నుంచి తామిద్దరం 'సహజీవనం'చేస్తున్నామని అక్కడున్న పెద్దలకు స్పష్టం చేసింది. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈసారి చెంప చెళ్లు మనిపించడం సరిపెట్టను. నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తా' అంటూ ఆ యువతి వరుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది. ఈ సన్నివేశాన్ని కళ్లారా చూసిన 'నవ వధువు' ఆ వరుడు తనకొద్దంటూ పెళ్లిని రిజెక్ట్ చేసింది. ఈ గొడవ అక్కడ పంచాయతీ వరకూ వెళ్లింది. ఆ పంచాయతీ పెద్దలు తీర్పు ఏమి ఇస్తారా?అని అంతా ఆసక్తిగా గమనించారు. అయితే పంచాయతీ పెద్దలు ఒక మంచి తీర్పుతో ఇరు కుటుంబాల మధ్య రాజేసుకున్న విభేదాలను చల్లార్చాలని భావించారు. ఆ వరుని తమ్మునితో అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటందనే సలహా ఇచ్చారు. దీనికి రెండు పక్షాల నుంచి మద్దతు రావడమే కాకుండా.. ఆ వధువుకు అందుకు సమ్మతించింది. గత ఆదివారం ఆ జంట దండలు మార్చుకుని ఒక్కటైంది.