Salman Khan Ex Girlfriend Somi Ali Calls Him Women Beater, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Salman Khan Ex Girlfriend: అతడు ఎంతటి శాడిస్టో మీకు తెలియదు.. సల్మాన్‌పై మాజీ ప్రియురాలు ఘాటూ వ్యాఖ్యలు

Published Sat, Aug 20 2022 9:09 AM | Last Updated on Sat, Aug 20 2022 10:16 AM

Salman Khan Ex Girlfriend Somi Ali Calls Him Women Beater in Her Latest Post - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌పై అతడి మాజీ ప్రేయసి సోమి అలీ మరోసారి విరుచుకుపడింది. సల్మాన్‌తో పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన సోమి బ్రేకప్‌ అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా చెక్కేసింది. ప్రస్తుతం ఓ ఎన్‌జీవోతో కలిసి పనిచేస్తున్న ఆమె సమయం వచ్చినప్పుడల్లా సల్మాన్‌ను టార్గెట్‌ చేస్తుంది. ఇప్పటికే సల్మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరోసారి విమర్శలు గుప్పించింది. తనతో సహా ఇతర మహిళలను సల్మాన్ కొట్టేవాడంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

చదవండి: ‘లైగర్‌’లో ముందుగా ఆమెను హీరోయిన్‌గా అనుకున్నా: పూరీ

ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మైనే ప్యార్ కియా’ పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. సల్మాన్‌ను ఉమెన్‌ బీటర్‌(మహిళలను కొట్టే వ్యక్తి) అని ప్రస్తావించింది. ‘సల్మాన్‌ ఖాన్‌ను గొప్పగా కీర్తించడం మానేయండి. అతనో శాడిస్ట్‌. ఎంతటి శాడిస్టో మీకు తెలియదు. తరచూ అమ్మాయిలు కొడుతూంటాడు. నాతో సహా ఎంతోమంది మహిళలపై అతడు చేయి చేసుకున్నాడు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ని ఓ పార్టీలో సల్మాన్‌ కొట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా..

కాగా పాకిస్తాన్‌లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి సల్మాన్‌ను ఇష్టపడి ఇండియాకు వచ్చింది. ముంబైలో దిగిన ఆమె ఇటూ అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు మోడల్‌గా కెరీర్‌ను బిజీ చేసుకుంది. ఈ క్రమంలో సల్మాన్‌ మనసు దోచుకున్న ఆమె పదేళ్ల పాటు అతడితో రిలేషన్‌లో ఉంది. ఆ తరువాత వచ్చిన మనస్పర్థల కారణంగా సల్మాన్‌కు బ్రేకప్‌, సినిమాలకు గుడ్‌బై చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న సోమీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement