గర్ల్ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం.. | Russian lawyer sues ex-girlfriend for expenses incurred on dates | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..

Published Sat, Jun 4 2016 10:55 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

గర్ల్ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..

గర్ల్ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..

మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్తో సన్నిహితంగా ఉండేది.

ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ చేయకపోవటంతో నిరాశతో ఇంటికి చేరింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ప్రేమ విఫలమైందన్న బాధలో ఉన్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ. 40 వేలు తనకు చెల్లించాలంటూ సమన్లు పంపాడు ఆ బాయ్ఫ్రెండ్ లాయర్.

రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని చూస్తున్నాడు లాయర్ బాయ్ఫ్రెండ్. ఈ విషయంపై పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్టాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెబుతున్నాడు. ఎంతగానో ప్రేమించిన బాయ్ఫ్రెండ్.. ఖర్చులు చెల్లించమంటూ కోర్టుకెక్కడంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది జుర్స్కోయా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement