sues
-
ఇన్ఫోసిస్‌కు షాక్.. కోర్టుకు వెళ్లిన కాగ్నిజెంట్
భారత ఐటీ సర్వీస్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై యూఎస్‌కు చెందిన ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కోర్టుకు వెళ్లింది. తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. గతంలో ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటోందని కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్ లేఖాస్త్రం సంధించిన 8 నెలల తర్వాత కాగ్నిజెంట్ ఈ రూపంలో ఇన్ఫోసిస్‌కు షాకిచ్చింది.నివేదికల ప్రకారం.. తమ డేటాబేస్‌ల నుంచి ఇన్ఫోసిస్ చట్టవిరుద్ధంగా డేటాను సేకరించిందని, పోటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి దాన్ని ఉపయోగించిందని కాగ్నిజెంట్ వ్యాజ్యంలో పేర్కొంది. అయితే కాగ్నిజెంట్ ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. “ఇన్ఫోసిస్‌కు దావా గురించి తెలిసింది. మేము ఆ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నాం. విషయాన్ని కోర్టులో చూసుకుంటాం” అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు.న్యూజెర్సీ ముఖ్య కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్.. ట్రైజెట్టో ఫేసెస్, క్యూఎన్ఎక్స్టీ సాఫ్ట్వేర్లను అందిస్తోంది. హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి ఇన్ఫోసిస్ 'టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్'ను రూపొందించిందని, ట్రైజెట్టో డేటాను ఇన్ఫోసిస్ ఉత్పత్తికి రీప్యాక్ చేసిందని నివేదికలు పేర్కొన్నాయి.బెంగుళూరుకు చెందిన భారతీయ ఐటీ మేజర్ క్యూఎన్ఎక్స్టీ నుంచి రహస్యమైన ట్రైజెట్టో సమాచారం, వాణిజ్య రహస్యాలను సేకరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని ఫిర్యాదులో కాగ్నిజెంట్ పేర్కొంది. ఇందు కోసం భారీ నష్టపరిహారాన్ని కాగ్నిజెంట్ కోరింది. అలాగే తమ వ్యాపార రహస్యాల దుర్వినియోగాన్ని ఆపాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించాలని అభ్యర్థించింది. -
అంతా మీవల్లే.. రూ.50 కోట్లు ఇవ్వండి!.. టాలీవుడ్ హీరోయిన్
ప్రముఖ నటి, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 'రిమీ సేన్' తన కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కారు తయారీదారుపై దావా వేసింది. ఇందులో భాగంగానే నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్‌లకు నోటీసు పంపించడం కూడా జరిగింది.నటికి ఇబ్బంది కలిగించిన కారు ఏదనేది స్పష్టంగా వెల్లడించలేదు. అయితే నోటీసును 'సుభమిత్ర సేన్' (రిమీ సేన్ అసలు పేరు) పేరుతో పంపించింది. రిమీ సేన్ 2022 ఆగష్టు 25న కారులోని రియర్ ఎండ్ కెమెరా పనిచేయకపోవడం వల్ల వెనుకవైపు నుంచి పిల్లర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే తన కారులోని సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత డీలర్‌షిప్‌లను దాదాపు 10 సార్లు సందర్శించింది. ఎన్ని సార్లు సర్వీస్ సెంటర్లను సందర్శించినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.తన కారులోని సమస్యలపై విసుగు చెందిన రిమీ సేన్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి పరిహారంగా రూ. 50 కోట్లు కోరుతూ డీలర్‌షిప్‌లకు, తయారీదారులకు లీగల్ నోటీసు పంపింది. అంతే కాకుండా చట్టపరమైన ఖర్చులను కవర్ చేయడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరింది.కార్ కంపెనీ, దాని సర్వీస్ పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. కొన్ని సంస్థలు వినియోగదారుల పట్ల శ్రద్ద వహించడం లేదు. సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే నేను పిల్లర్‌ను ఢీ కొట్టాను. ఆ సమయంలో వెనుక మనిషి ఉంటే.. అది ఎంత పెద్ద నష్టాన్ని కలిగించేదో ఊహించవచ్చు. వారి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలితీసుకునేదని రిమీ సేన్ వెల్లడించింది. నాకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. -
డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ఒక్కోసారి తమ జీవితాన్ని లేదా కెరీర్‌ని కోల్పోవాల్సి వస్తుంటుంది. 'వ్యైద్యో నారాయణ హరిః" అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చి మరీ రోగి చికిత్స తీసుకోవడానికి వైద్యుడి వద్దకు వస్తాడు. వైద్యులు కూడా ఆ మాటను నిజం చేసేలా వారి సమస్యను నయం చేయాలే గానీ మరింత విపత్కర స్థితిలో పడేయకూడదు. ఇలా వైద్యుడి తప్పిదాల కారణంగా ప్రాణాలు లేదా భవితవ్యాన్ని కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఒక స్పీచ్ థెరపిస్ట్. ఏం జరిగిందంటే..అలిసన్ వింటర్‌బోథమ్ అనే 55 ఏళ్ల స్పీచ్ థెరపిస్ట్ 2020 నవంబర్‌లో దంత వైద్యడు డాక్టర్ అరాష్ షహరాక్ వద్ద పంటి సమస్యకు చికిత్స తీసుకుంది. ఆమె కొంతకాలంగా కుడి జ్ఞాన దంతంతో ఇబ్బంది పడతుండంతో చికిత్స కోసం వైద్యుడు షహారాక్ వద్దకు వచ్చింది. అయితే ఈ జ్ఞానదంతం రిమూవ్ చేసే సర్జరీలో నాలుక తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత నుంచి అలిసన్ వింటర్‌బోథమ్ పరిస్థితి ఘెరంగా మారిపోయింది. ఆమె జిహ్వ నాడి దెబ్బతిని కొద్దిగా మాట్లాడినా భయానక నొప్పిని భరించాల్సి వచ్చేది. చెప్పాలంటే పెదవి విప్పి మాట్లాడాలంటేనే నరకం అనేలా పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. హాయిగా రెండు మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి. అసలు నాలుకకు సంబంధించిన చికిత్స ప్రక్రియలో ఇలాంటి రిస్క్ ఉంటుందని ముందుగా హెచ్చరించకపోవడంతోనే తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అలిసన్ ఆరోపిస్తోంది. స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే నాకు ఈ పరిస్థితి కారణంగా తన కెరీర్ నాశనమయ్యిందంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అంతేగాదు తాను ఎదర్కొంటున్న ఈ నొప్పిని మంటతో పోల్చారు. మాట్లాడుతున్న ప్రతిసారి నాలుక కాలిపోతున్నట్లుగా జలదరింపు వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. అందువల్లో తాను రోజుకి ఇద్దరు లేదా ముగ్గురు క్లయింట్లకు మాత్రమే స్పీచ్థెరపిస్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాని పిటిషన్లో వివరించారు. అందుకుగానూదంత వైద్యుడు తనకు దాదాపు రూ. 11 కోట్లు వరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైద్యుడు షహరక్ మాత్రం తాను అతనికి ఈ చికిత్స ప్రక్రియ గురించి కూలంకషంగా వివరించానని, ఇలా ఇంత పెద్ద రిస్క్ ఎదురవ్వుతుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. న్యాయస్థానం వాదోపవాదాలు, విచారణ అనంతరం ఏం తీర్పు ఇస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి క్రిటికల్ సర్జరీ విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలు గురించి పేషంట్‌కి వివరించి లేదా సన్నద్ధం చేసి గానీ వైద్యలు ముందుకుపోకూడదు. అలా కాదని ముందుకువెళ్లితే ఒకవేళ రోగికి ఏదైన నష్టం వాటిల్లితే అందుకు భాద్యులు ఎవరూ అనేది ఒక్కసారి ఆలోచించండి.(చదవండి: హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!) -
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్‌ను బోట్‌కి అనుసంధానించే టౌలైన్‌ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్‌ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్ ఇచ్చారు. 10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ పై దావా వేశారు.అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) భారత సంతతికి చెందిన ట్విటర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ కోర్టుకెక్కారు. ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె వెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటటర్ తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని ముగ్గురూ ఆరోపించారు. (వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్) కాగా గత ఏడాది అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత భారీ ఖర్చు తగ్గించే చర్చల్లో భాగంగా పలుక కీలక మార్పులను చేపట్టిన మస్క్ ప్రధానం అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్, గద్దె,సెగల్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) -
ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని అయితే దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే. అలాగే రిమోట్ పనివిధానాన్ని రద్దు చేసిన మస్క్ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. ట్విటర్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) -
మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు: కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది.ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఉద్యోగి, జిల్ ప్రీజీన్ ఆరోపణలను కొట్టి వేయాలని ఇన్ఫోసిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు తాజాగా తిరస్కరించింది. అమెరికా నియామకాల్లో వయస్సు, లింగ, జాతి వివక్ష చూపారని ఆమె ఇన్ఫోసిస్‌పై దావా వేశారు. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) కంపెనీలోని సీనియర్ సిబ్బంది వయస్సు, లింగం, జాతి ఆధారంగా నియామకాల్లో వివక్షతో, పక్షపాతంగా వ్యహరించారంటూ గత ఏడాది అమెరికా కోర్టులో జిల్ ప్రీజీన్ ఫిర్యాదు చేశారు. ఈ పద్ధతి జాతి వివక్ష, చట్టవిరుద్ధమని వాదించినందుకు ఒత్తిడికి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇన్ఫోసిస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్సల్టింగ్ హెడ్ మార్క్ లివింగ్స్టన్, అప్పటి ప్రీజీన్ పార్టనర్స్ డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్లపై కేసు నమోదైంది. అయితే దీనిపై ఇన్ఫోసిస్ స్పందనను కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ప్రీజీన్ చేసిన క్లెయిమ్‌లను విచారణకు స్వీకరిస్తూ, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఇన్ఫీ వాదనను తిరస్కరించారు. అంతేకాదు ఈ ఆరోపణలపై వచ్చే 21 రోజుల్లోగా తమ స్పందనను తెలియ జేయాలని కూడా ఆదేశించింది. దీనిపై ఇన్ఫోసిస్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ఇన్ఫీలో టాలెంట్ అక్విజిషన్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్‌లను రిక్రూటింగ్ నిపుణురాలు జిల్ ప్రీజీన్ ఈ కేసు వేశారు. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, ఇంట్లో పిల్లలున్న మహిళలతోపాటు 50 ఏళ్లు పైబడిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంక్షలు విధించారని జిల్ ఆరోపించారు. నియామకాల్లో వివక్ష చూపేలా తనపై ఒత్తడి చేశారని ఆమె ఆరోపించారు. వీటిని వ్యతిరేకించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించి ప్రతీకారం తీర్చు కున్నారనేది జిల్ ఆరోపణ. ఇది న్యూయార్క్ నగర మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన అంటూ జిల్ ప్రిజీన్ సెప్టెంబర్ 2021లో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నైట్స్ ఖండన మరోవైపు ఆధునిక యుగంలో జాతి, లింగం, వయసు ఆధారిత వివక్ష ఇది తీరని విషాదమంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్)ఇన్ఫోసిస్ తీరును తప్పుబట్టింది. పని చేయాలనే కోరిక జీవితాన్ని విలువైనదిగా మారుస్తుందని అలాంటి ప్రయత్నాలను అడ్డు కోవడం నేరమని వ్యాఖ్యానించింది. #Discrimination due to age is one of the great tragedies of modern life. The desire to work and be useful is what makes life worth living, and to be told your efforts are not needed because you are the wrong age is a crime.#ITEmployees #StrongerTogether #JusticeforEmployees pic.twitter.com/X7dDBTOQ5R — Nascent Information Technology Employees Senate (@NITESenate) October 8, 2022 -
పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ..
తనను గట్టిగా కౌగిలించుకోవడంపై కోపగించుకున్న ఓ మహిళ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ ఆఫీసులో ఉండగా మగ సహోద్యోగి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింతతో ఆమె నొప్పితో విలవిల్లాడిపోయి గట్టిగా కేకలు వేసింది. అతను విడిచిపెట్టిన తర్వత కూడా ఛాతీలో నొప్పి రావడంతో తాత్కాలికంగా ఆయిల్ మసాజ్ చేసుకొని ఉపశమనం పొందింది. అయితే అయిదు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. మహిళ ఆసుపత్రి బిల్లులకు భారీగా డబ్బు ఖర్చైంది. అంతేగాక ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లేని పరిస్థితి రావడంతో ఆదాయాన్ని కోల్పోయింది. అనంతరం కోలుకుంటున్న సమయంలో సదరు మహిళ తనను హగ్ చేసుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన పరిస్థితిని తెలిపింది. అయితే ఆ వ్యక్తి తన కౌగిలింత వల్ల ఇంత గాయం అయ్యిందా? రుజువు ఏంటని ఆమెనే ఎదరు ప్రశ్నించాడు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు దీంతో చివరికి ఆ మహిళ చివరికి తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది, తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు 10,000 యువాన్లు (రూ. 1.16 లక్షలు) పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ అయిదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ కార్యకలాపంలో కూడా మహిళ పాల్గొన్నట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. -
ట్విటర్-మస్క్ వార్: ‘అయ్యో రామ ఇదేం విచిత్రం’!
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్ రద్దుపై ఊహించినట్టుగానే న్యాయ పోరాటానికి దిగింది ట్విటర్. టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ మంగళవారం దావా వేసింది. ప్రతీ ట్విటర్ షేర్‌కు అంగీకరించిన 54.20 డాలర్ల చొప్పున విలీనాన్ని పూర్తి చేయాలని ఆదేశించాలని డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ మధ్యలో నాలుగు రోజుల విచారణనుషెడ్యూల్ చేయాలని కూడా ట్విటర్ కోర్టును కోరింది. మస్క్ ఆరోపణలను కుంటిసాకులు మాత్రమేనని కొట్టిపారేసిన ట్విటర్, రెగ్యులేటర్లకు సమాచారం లేకుండానే జనవరి-మార్చి మధ్య కంపెనీలో "రహస్యంగా" షేర్లను పోగు చేసుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు ఈ సందర్బంగా ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు కంపెనీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. కోర్టు విజయం తమదే, ఆందోళన అవసరం లేదంటూ వారికి ఒక లేఖ రాశారు. ఇది కూడా చదవండి : Elon Musk: ట్విటర్ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్ అయితే ట్విటర్ న్యాయపోరాటంపై ఇప్పటికే విభిన్నంగా స్పందించిన మస్క్ మరోసారి ట్విటర్లో వ్యంగ్యంగా స్పందించారు. ట్విటర్ దావా గురించి ప్రస్తావించకుండానే ‘‘అయ్యో రామ..ఇదేం విచిత్రం (Oh the irony lol)’’ అన్నట్టుగా ట్వీట్ చేశారు. కాగా ఫేక్, స్పామ్ అకౌంట్ల సమాచారం ఇవ్వడంలో ట్విటర్ వైఫల్యం కారణంగానే డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు గతవారం మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Oh the irony lol — Elon Musk (@elonmusk) July 12, 2022 -
ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!
గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో స్క్విడ్ గేమ్ చూశావా..చూశావా అంటూ ఒక్కటే చర్చా..! స్క్విడ్‌గేమ్ నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్క్విడ్ గేమ్‌కు వస్తోన్న క్రేజ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌పై దావా...! గత నెలలో స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌కు ఓటీటీ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు.అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ రూపోందించిన స్క్విడ్ గేమ్ కంటెంట్‌పై వీక్షకుల సంఖ్య పెరగడంతో నెట్వర్క్ ట్రాఫిక్, మెయింటెనెన్స్ పనుల ఖర్చులను చెల్లించాలని దక్షిణ కొరియా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎస్కె బ్రాడ్‌బ్యాండ్ నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేసినట్లు ఎస్కె ప్రతినిధి శుక్రవారం తెలిపారు. చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! గతంలో నెట్‌ఫ్లిక్స్‌పై సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ కోర్టు నెట్వర్క్ ట్రాఫికింగ్ విషయంలో జరిమానాలను చెల్లించాలని పేర్కొంది. ఎస్కే బ్రాడ్‌బ్యాండ్ తన దావాలో...2018 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఎస్కే నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది. ఎస్కె బ్రాడ్‌బ్యాండ్ క్లెయిమ్‌ను రివ్యూ చేస్తామని , కస్టమర్లు ప్రభావితం కాకుండా ఉండేలా ఎస్కె బ్రాడ్‌బ్యాండ్‌తో కలిసి పనిచేసేందుకు చర్చిస్తామని నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియా రెండో అతిపెద్ద నెట్వర్క్ ట్రాఫికర్‌గా నెట్‌ఫ్లిక్స్ నిలిచింది. యూట్యూబ్కాకుండా అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్ లాంటి దిగ్గజ కంపెనీలు నెట్వర్క్ ట్రాఫికింగ్ ఫీజులను చెల్లిస్తున్నాయని ఎస్కే బ్రాడ్‌బ్యాండ్ పేర్కొంది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 16 వేల ఉద్యోగాలను ఇచ్చామని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అంతేకాకుండా దక్షిణకొరియాలో సుమారు రూ. 4840 కోట్లను పెట్టుబడులపెట్టామని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అమెరికాలో ఫాస్టర్ స్ట్రీమింగ్ వేగంతో నెట్‌ఫ్లిక్స్ సేవలను అందించినందుకుగాను కామ్‌క్యాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌కు ఏడు సంవత్సరాలుగా వాడుకుంటుంది. చదవండి:అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన టాటా మైక్రో ఎస్యూవీ -
కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్
కాలిఫోర్నియా: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ టెకీకి భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. తన ప్రకటనల సమీక్ష ప్రక్రియను దాటవేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మోసపూరిత ప్రకటనలు, తప్పుడు సమాచారాన్ని అందించేలా సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నందుకు ఫేస్బుక్ బసంత్ గజ్జర్ పై దావా వేసింది. ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, మోసపూరిత ప్రకటనలతో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బసంత్ గజ్జర్ సంస్థ లీడ్‌క్లోక్ పై ఈ దావా వేసింది.కోవిడ్-19కి సంబంధించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంతో పాటు, అనేక ఇతర సాంకేతిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. కరోనాకు సంబంధించి నకిలీ వార్తలు, తప్పుడు ప్రకటనలకు సంబంధిచి యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్, క్రిప్టోకరెన్సీ, డైట్ పిల్ప్ తదితర నకిలీ వార్తలతో ఫేస్ బుక్ నిబంధనలను ఉల్లఘించాడని పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోని ఆటోమేటెడ్ అడ్వర్టైజింగ్ రివ్యూ ప్రాసెస్ నుంచి తప్పించుకునేలా యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు ఆరోపించింది.థాయ్‌లాండ్‌లో ఉన్నగజ్జర్ లీడ్‌క్లోక్ ద్వారా క్లోకింగ్ సాఫ్ట్వేర్ సాయంతో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపూరిత ప్రకటనలను నడుపుతున్నాడని ఫేస్బుక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లిటిగేషన్ డైరెక్టర్ జెస్సికా రొమెరో ఒక ప్రకటనలో తెలిపారు. (కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే) అలాగే గూగుల్, ఓత్, వర్డ్ ప్రెస్, షాపీఫై లాంటి ఇతర సాంకేతిక సంస్థలను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఈ క్లోక్డ్ వెబ్సైట్లలో కొన్ని ప్రముఖుల చిత్రాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. లీడ్‌క్లోక్ కస్టమర్లను గుర్తించడంతోపాటు, వారిపై అదనపు అమలు చర్యలు తీసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపింది. తాజా పరిణామంతో గోప్యతకు సంబంధించి, ఫేక్ న్యూస్ నివారణకు ఇతర సెక్యూరిటీ చర్యల్ని చేపట్టినట్టు వెల్లడించింది. కాగా క్లోకింగ్ అనేది హానికరమైన టెక్నిక్. దీనిద్వారా ఆయా సైట్లలోకి చొరబడి, వెబ్సైట్ స్వభావానికి విరుద్ధంగా, నకిలీ వార్తలు, ప్రకటనలు ఇస్తుంది. అంతేకాదు సంబంధిత సంస్థల సమీక్ష వ్యవస్థలను బలహీనపరుస్తుంది. మోసపూరిత ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహిస్తుంది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఎన్డీటీవీకి రాఫెల్ సెగ : రూ.10వేల కోట్ల దావా
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన రాఫెల్ డీల్ సెగ ఎన్డీటీవీని తాకింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వివాదంలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎన్డీటీవీపై కోట్ల రూపాయల దావా వేసింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో రిలయన్స్ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం ‘ట్రూత్ వెర్సస్ హైప్స్’పై ఈ కేసు ఫైల్ చేసింది. అయితే దీనిపై ఎన్డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. కాగా రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వివాదానికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ వ్యాఖ్యలతో మరింత అగ్గి రగిలింది. ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్‌గయా’ అంటూ మోదీపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
సింగ్ బ్రదర్స్ మధ్య ముసలం
న్యూఢిల్లీ: రాన్‌బాక్సీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్నినెలలుగా సింగ్‌బ్రదర్స్ మధ్య నెలకొన్న అసంతృప్తి ఇపుడిక కోర్టుకెక్కింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్, సింగ్ బ్రదర్స్‌లో ఒకరైన శివిందర్ సింగ్, సోదరుడు మల్వీందర్‌పై పోరుకు సై అన్నాడు. సోదరుడు, మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్, స్థాపకుడు మల్వీందర్, రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీలను తమ వ్యాపార భాగస్వామిగా తప్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు శివిందర్ మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు. తన అన్నయ్య మల్వీందర్, గోదాని సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలతో తమ సంస్థల ప్రయోజనాలతోపాటు, వాటాదారుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. చాలాకాలంగా ఈ విషయం వ్యక్తిగతంగా తనను బాధిస్తున్నప్పటికీ కుటుంబగౌరవం, ప్రతిష్ట కోసం మౌన ప్రేక్షకుడిలాగా ఉండిపోయానన్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకనుంచి తాను స్వత్రంత్రంగా వ్యాపారాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రిలిగేర్, ఫోర్టిస్ పతనం, అక్రమాల నేపథ్యంలో కేసును దాఖలు చేసినట్టు తెలిపారు. అయితే ఈ పరిణామంపై స్పందించేందుకు మాల్వీందర్ సింగ్ నిరాకరించారు. -
ఫేస్బుక్లో ఫోటోలు.. తల్లిదండ్రులపై కూతురు కేసు
వియన్నా: ఫోటోలు తీయడమే ఆలస్యం సోషల్ మీడియాలో ఉంచడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది. కొందరైతే కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసమే పనిగట్టుకొని కొన్ని పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల(చివరికి సొంత పిల్లలు) ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచేవారు కూడా ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ఈ ఉదంతం. తన అనుమతి లేకుండా.. కనీసం తన మనోభావాలను పట్టించుకోకుండా తన చిన్ననాటి ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారని ఆస్ట్రియాలో ఓ 18 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై కేసుపెట్టింది. తనకు సంబంధించిన సుమారు 500 ఫోటోలను 2009 నుంచి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాటిని తొలగించడానికి వారు నిరాకరించారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఫోటోలు 700 మంది ఫ్రెండ్స్‌కు షేరయ్యాయని.. అందులో అభ్యంతరకరమైన, తన మనోభావాలను దెబ్బతీసే ఫోటోలు సైతం ఉన్నాయని ఆ యువతి వెల్లడించింది. 'కనీసం నేను టాయ్లెట్లో ఉన్నానా లేక నగ్నంగా బెడ్‌పై ఉన్నానా అనే విచక్షణ లేకుండా నా బాల్యానికి సంబంధించిన ఫోటోలను పబ్లిక్‌లో ఉంచారు' అని సదరు యువతి వాపోయింది. తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడం హక్కు అనే భావనలొ తన తండ్రి ఉన్నారని ఆమె వెల్లడించింది. ఈ కేసు నవంబర్‌లో విచారణకు రానుంది. సోషల్ మీడియాలో ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, సమాచారాన్ని ఉంచడం పట్ల ఆస్ట్రియాలో కఠినమైన చట్టాలే ఉన్నాయి. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల నుంచి యువతికి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉందని యువతి తరఫు లాయర్ వెల్లడించారు. ఫ్రాన్స్‌లో అయితే ఇతరుల ఫోటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురిస్తే.. 45 వేల యూరోల వరకు జరిమానా పాటు ఏడాది జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. తమ పిల్లల ఫోటోలను వందలకొద్ది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. -
పరువు నష్టం దావా వేసిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌ను ఇటీవల కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థల్లో ప్రచురితమైన కథనాలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. మెలానియా ట్రంప్ గత జీవితం, ఆమె అమెరికాకు వచ్చి ట్రంప్ భార్యగా మారిన క్రమం లాంటి తదితర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల 'డెయిలీ మెయిల్'లో కథనం ప్రచురితమైంది. ఓ స్లోవేకియన్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ డెయిలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అందులో.. గతంలో మెలానియా ట్రంప్ మోడలింగ్ చేసిన ఏజెన్సీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు మోడలింగ్ ఏజెన్సీ సంపన్నులకు మహిళలను సరఫరా చేసేదంటూ డెయిలీ మెయిల్ ఆరోపణలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెలానియా డెయిలీ మెయిల్‌తో పాటు అలాటి కథనాన్నే ప్రచురించిన మరో మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశారు. డెయిలీ మెయిల్ వెల్లడించిన కథనం వంద శాతం అసత్యమని.. అది తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉందని మెలానియా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై మేరీలాండ్‌లోని మోంట్గోమరీ కోర్టులో గురువారం పరువునష్టం దావా వేసినట్లు ఆమె ప్రతినిథి చార్లెస్ హార్డర్ తెలిపారు. 150 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. మెలానియా పరువునష్టం దావా వేసిన రెండు గంటల్లోనే డెయిలీ మెయిల్ తన కథనాన్ని ఉపసంహరించుకోవడం విశేషం. అంతేకాదు.. తాము ప్రచురించిన కథనం ఉద్దేశం మెలానియా 'ఎస్కార్ట్'గా పనిచేశారని కాదని డెయిలీ మెయిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఘాటుగా వండుతోందని కోర్టు నోటీసులు
లండన్: తన పక్కింటి మహిళ తుమ్ములు దగ్గులు వచ్చేలా స్పైసీ ఫుడ్ తయారు చేసిందని మరో మహిళ కోర్టు మెట్లెక్కింది. అలా వంటలు చేయడం ద్వారా ఊపిరి సంబంధమైన వ్యాధులు వస్తాయని ఆమె కోర్టుకు చెప్పి ఆ మహిళకు నోటీసులు పంపించింది. జోనా లూయిస్ క్రెడ్లిన్ అనే ఓ పెంపుడు జంతువుల ప్రేమికురాలు తన ఇంటి పక్కన మహిళ చాలా ఘాటుఘాటుగా వంటలు చేస్తుందని, దానికి కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, తన శ్వాస కోశాలు దెబ్బతింటాయని లండన్ హైకోర్టుకు వెళ్లింది. తాను నిద్రపోయే సమయంలో కూడా ఆమె అలాంటి వంటలు చేయడంతో ఆ ఘాటు గాలిలో కలిసి తనకు నిద్రాభంగం చేస్తుందని అదొక్కటే కాకుండా ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయని కూడా ఆమె కోర్టుకు వివరించింది. దీంతో కోర్టు ఆ పొరుగు మహిళకు నోటీసులు ఇచ్చింది. ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. -
గర్ల్‌ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..
మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్‌ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్‌తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్‌తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ చేయకపోవటంతో నిరాశతో ఇంటికి చేరింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ప్రేమ విఫలమైందన్న బాధలో ఉన్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ. 40 వేలు తనకు చెల్లించాలంటూ సమన్లు పంపాడు ఆ బాయ్‌ఫ్రెండ్ లాయర్. రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని చూస్తున్నాడు లాయర్ బాయ్‌ఫ్రెండ్. ఈ విషయంపై పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్టాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెబుతున్నాడు. ఎంతగానో ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్.. ఖర్చులు చెల్లించమంటూ కోర్టుకెక్కడంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది జుర్స్కోయా. -
అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది
తిరువనంతపురం: మా ప్రొడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఉదరగొట్టే యాడ్లను రోజూ చూస్తూనే ఉంటాం. అవి అన్ని వట్టి మాటలే అనే విషయం మనకూ తెలుసు. కానీ, ఓ యాడ్‌ను సీరయస్‌గా తీసుకున్నచాతూ అనే శిల్పి ఏకంగా ఓ సబ్బును సంవత్సరం పాటూ వాడాడు. అయినా అతను ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విసిగిపోయిన అతను ఏకంగా ఆ యాడ్‌లో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ, సదరు సంస్థపై 2015 సెప్టెంబర్‌లో వాయానంద్లోని వినియోగదారుల కోర్టులో కేసు పెట్టాడు. దీంతో చాతూకు, ఇందులేఖ సంస్థ రూ.30,000లు పరిహారంగా ఇవ్వడానికి అంగీకరించింది. సమాజంలో ఎంతో పలుకుబడి ప్రభావం ఉన్న మమ్మూట్టీ నటించిన ఇందులేఖ సబ్బు యాడ్‌ను చూసి ఆ సబ్బును వాడానని కానీ, కొంచెం కూడా మార్పు రాలేదని చాతూ తెలిపాడు. ఇందులేఖ సబ్బు ట్యాగ్‌లైన్- 'సౌందర్యం నిన్గలే తేడి వరుం' (అందం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది) అనే విషయాన్ని కూడా కోర్టు వాదనల సందర్భంగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. దీంతో కేసుపై ఏమీ వాదించకుండానే ఆ వ్యక్తికి పరిహారం చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.