ప్రముఖ నటి, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 'రిమీ సేన్' తన కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కారు తయారీదారుపై దావా వేసింది. ఇందులో భాగంగానే నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్‌లకు నోటీసు పంపించడం కూడా జరిగింది.
నటికి ఇబ్బంది కలిగించిన కారు ఏదనేది స్పష్టంగా వెల్లడించలేదు. అయితే నోటీసును 'సుభమిత్ర సేన్' (రిమీ సేన్ అసలు పేరు) పేరుతో పంపించింది. రిమీ సేన్ 2022 ఆగష్టు 25న కారులోని రియర్ ఎండ్ కెమెరా పనిచేయకపోవడం వల్ల వెనుకవైపు నుంచి పిల్లర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే తన కారులోని సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత డీలర్‌షిప్లను దాదాపు 10 సార్లు సందర్శించింది. ఎన్ని సార్లు సర్వీస్ సెంటర్లను సందర్శించినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
తన కారులోని సమస్యలపై విసుగు చెందిన రిమీ సేన్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి పరిహారంగా రూ. 50 కోట్లు కోరుతూ డీలర్‌షిప్లకు, తయారీదారులకు లీగల్ నోటీసు పంపింది. అంతే కాకుండా చట్టపరమైన ఖర్చులను కవర్ చేయడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరింది.
కార్ కంపెనీ, దాని సర్వీస్ పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. కొన్ని సంస్థలు వినియోగదారుల పట్ల శ్రద్ద వహించడం లేదు. సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే నేను పిల్లర్‌ను ఢీ కొట్టాను. ఆ సమయంలో వెనుక మనిషి ఉంటే.. అది ఎంత పెద్ద నష్టాన్ని కలిగించేదో ఊహించవచ్చు. వారి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలితీసుకునేదని రిమీ సేన్ వెల్లడించింది. నాకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment