Rimi Sen
-
అంతా మీవల్లే.. రూ.50 కోట్లు ఇవ్వండి!.. టాలీవుడ్ హీరోయిన్
ప్రముఖ నటి, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 'రిమీ సేన్' తన కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కారు తయారీదారుపై దావా వేసింది. ఇందులో భాగంగానే నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్‌లకు నోటీసు పంపించడం కూడా జరిగింది.నటికి ఇబ్బంది కలిగించిన కారు ఏదనేది స్పష్టంగా వెల్లడించలేదు. అయితే నోటీసును 'సుభమిత్ర సేన్' (రిమీ సేన్ అసలు పేరు) పేరుతో పంపించింది. రిమీ సేన్ 2022 ఆగష్టు 25న కారులోని రియర్ ఎండ్ కెమెరా పనిచేయకపోవడం వల్ల వెనుకవైపు నుంచి పిల్లర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే తన కారులోని సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత డీలర్‌షిప్‌లను దాదాపు 10 సార్లు సందర్శించింది. ఎన్ని సార్లు సర్వీస్ సెంటర్లను సందర్శించినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.తన కారులోని సమస్యలపై విసుగు చెందిన రిమీ సేన్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి పరిహారంగా రూ. 50 కోట్లు కోరుతూ డీలర్‌షిప్‌లకు, తయారీదారులకు లీగల్ నోటీసు పంపింది. అంతే కాకుండా చట్టపరమైన ఖర్చులను కవర్ చేయడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరింది.కార్ కంపెనీ, దాని సర్వీస్ పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. కొన్ని సంస్థలు వినియోగదారుల పట్ల శ్రద్ద వహించడం లేదు. సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే నేను పిల్లర్‌ను ఢీ కొట్టాను. ఆ సమయంలో వెనుక మనిషి ఉంటే.. అది ఎంత పెద్ద నష్టాన్ని కలిగించేదో ఊహించవచ్చు. వారి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలితీసుకునేదని రిమీ సేన్ వెల్లడించింది. నాకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. -
ఆ అవసరం ఇంకా రాలేదన్న చిరంజీవి హీరోయిన్.. రూమర్స్‌పై స్పందించిన నటి!
బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) -
ఛాన్సుల కోసం అడుక్కోవడం నాకు రాదు: చిరంజీవి హీరోయిన్
బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ రిమీ సేన్. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. 2003లో హంగామా సినిమాతో హిందీలో అరంగేట్రం చేసిన రిమీ సేన్.. ఆ తర్వాత గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. అవేంటో తెలుసుకుందాం.రిమిసేన్ మాట్లాడుతూ.. "ఇక్కడ నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కేవలం నాది ఫర్నీచర్ రోల్. హంగామా, జానీ గద్దర్ లాంటి చిత్రాల్లో మాత్రమే మంచి పాత్రలు చేశా. ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ వర్కవుట్ కాలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో కలిసి పనిచేసినప్పటికీ ఇండస్ట్రీలో ఎవరితోనూ కనెక్ట్ కాలేదు. సహాయం కోసం ఎవరినీ చేయి చాచి అడగలేదు' అని రిమీ సేన్ పేర్కొంది. అంతే కాదు.. కేవలం కామెడీ సినిమాలతో విసిగిపోయి నటనకు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది.ఎవరైనా మీ ఫర్మామెన్స్ సరిగ్గా చేయలేదని మీప్లేస్లో ఎవరినైనా భర్తీ చేశారా? అని రిమి సేన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. "ఇండస్ట్రీలో టాలెంట్ అనేది నెక్ట్స్. ముందు మీరు వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. లేకపోతే ఏ పని జరగదు. లేదంటే మీ టాలెంట్ స్టోర్ రూమ్‌కు పరిమితం కావాల్సిందే. ఛాన్సుల కోసం అలా అందరినీ అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదు' అని చెప్పుకొచ్చింది. కాగా.. తన సన్నిహితుడు రౌనక్ జతిన్ వ్యాస్ ద్వారా రూ.4 కోట్లు మోసపోయానని రిమీ సేన్ ఇటీవలే వెల్లడించింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన రెండేళ్ల తర్వాత తాజాగా బాంబే హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. -
మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు!
ఫ్రెండ్ అని నమ్మితే నిలువునా మోసం చేశాడంటోంది హీరోయిన్ రిమి సేన్. మాయమాటలు చెప్పి ఫ్రెండ్‌గా దగ్గరై.. డబ్బులిచ్చాక కనబడకుండా పారిపోయాడని వాపోయింది. రూ.4.14 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్పై రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది రిమి సేన్. తాజాగా ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది.ఇంటికి వచ్చి..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం జిమ్‌లో రోనక్ను కలిశాను. మంచి ఫ్రెండయ్యాడు. తనతో స్నేహం చేశాను. కానీ నన్ను మోసం చేశాడు. అహ్మదాబాద్‌లోనూ ఇలాగే చాలామందిని మోసం చేశాడని విన్నాను. తను నా ఇంటికి కూడా వచ్చాడు. మా అమ్మతో కలిసి తిన్నాడు. అంత క్లోజ్‌గా ఉన్న వ్యక్తి తర్వాత సడన్‌గా ప్లేటు తిప్పేశాడు. అధిక వడ్డీ అని చెప్పి నా దగ్గరి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. దానిపై తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చేవాడు. ఒక్క నెల మాత్రమే..ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తే దానిపై 12- 15 శాతం వడ్డీ తీసుకొస్తానన్నాడు. అలా రూ.4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల ఐదారు లక్షలు చేతికిచ్చాడు. తర్వాత వాళ్ల నాన్నకు కరోనా వచ్చిందని, డబ్బులు ఇవ్వలేనని చెప్పేసరికి నమ్మేశాను. నెలల తరబడి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడంతో ఇదంతా స్కామ్ అని అర్థమైంది. ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడా కేసు సీఐడీకి బదిలీ అయినట్లు ఫోన్ వచ్చింది. వడ్డీతో సహా..కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. బహుశా రెండురోజుల్లో అరెస్ట్ వారంట్ జారీ చేస్తారు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. వడ్డీతో సహా నాకు రూ.14 కోట్లు రావాల్సి ఉంది. పోలీసులకు లొంగిపోయుంటే నేను ఇచ్చిన అసలు మాత్రమే తీసుకుని వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు.. కాబట్టి నేను ఎంతదూరమైనా వెళ్తాను అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. కాగా రిమి సేన్.. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్.. ఎలా అంటే ?
Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore: బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్‌ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్ జతిన్ వ్యాస్‌ను అంధేరిలోని జిమ్‌లో కలిసినట్లు రిమీ సేన్ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని పేర్కొంది. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్ వ్యాస్ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్పై ఐపీసీ సెక్షన్లు 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. రౌనక్ జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్. -
అజ్ఞాతవాసం: రిమీ... కనిపించట్లేదేమి!
అచ్చమైన బెంగాలీ అమ్మాయి. కానీ తెలుగు సినిమాతో నటి అయ్యింది. ‘నీ తోడు కావాలి’ అంటూ దీపక్‌ని అడిగింది.‘అందరివాడు’తో అందరికీ దగ్గరవ్వాలని చూసింది. కొన్నాళ్లపాటు కెరీర్లో వేగంగా దూసుకుపోయింది. కానీ ఉన్నట్టుండి ఆ వేగానికి బ్రేక్ పడింది. ఇప్పుడామె చేతిలో అవకాశాలు లేవు. అసలామె ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెళ్లింది? ఏం చేస్తోంది? అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కొందరు ఎదురు చూస్తుంటారు. కానీ రిమీసేన్ అలా చూడలేదు. తనే అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. కోరుకున్న చోటికి చేరుకుంది. కానీ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. రిమీ అసలు పేరు... శుభోమిత్రాసేన్. 1981, సెప్టెంబర్ 11న కోల్‌కతాలో పుట్టింది. ఎందుకోగానీ ఊహ తెలిసినప్పట్నుంచీ ముఖానికి మేకప్ వేయాలన్న తపనతోనే ఉంది. కానీ ఇంట్లోవాళ్లు అంగీకరించలేదు. కళలు కూడుపెట్టవు, చదువుకోమన్నారు. మనసులో బాధ ఉన్నా మౌనంగా వారికి తల వంచింది రిమీ. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది కానీ మనసు మాత్రం కళారంగంవైపే లాగుతూ ఉంది. రిమీ అంతర్మథనాన్ని ఆమె తాతయ్య అర్థం చేసుకున్నారు. వెళ్లి నచ్చింది చేయమన్నారు. దాంతో రిమీ ఆనందానికి అవధులు లేవు. తల్లిని తోడు తీసుకుని ముంబై రెలైక్కింది. అయితే ఆమె ముంబై వచ్చినంత తేలిగ్గా అవకాశాలు ఆమె దగ్గరకు రాలేదు. చాలా కష్టపడింది. ఎలాగో యాడ్స్‌లో నటించే చాన్స్ సంపాదించింది. చిన్నా చితకా ప్రకటనలు చాలానే చేసింది. కానీ ఆమిర్‌ఖాన్‌తో చేసిన కోకో కోలా యాడ్... ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కోలా యాడ్ చూసిన టాలీవుడ్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘నీ తోడు కావాలి’ చిత్రంలో రిమీని హీరోయిన్గా తీసుకున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. టాలీవుడ్ ఆమెను అంతగా ప్రోత్సహించనూ లేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఆమెను సాదరంగా ఆహ్వానించింది. మంచి మంచి అవకాశాలిచ్చింది. హంగామా, బాగ్బన్, ధూమ్, స్వప్నేర్ దిన్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, దోస్త్, ధూమ్ 2, హ్యాట్రిక్, జానీ గద్దార్, దే తాలీ, షకత్ సిటీ, హార్న్ ఓకే, ప్లీజ్, యహాకే హమ్ సికిందర్, థాంక్యూ... ఇలా ఒకదాని తరువాత ఒకటిగా చేసుకుంటూ పోయింది రిమీ. ఈ కమ్రంలోనే 2005లో ‘అందరివాడు’లో చిరంజీవి సరసన నటించింది. ఈ సినిమాతో పాటు ధూమ్ 1, 2 చిత్రాలు కూడా రిమీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే వాయువేగంతో సాగిపోతోన్న రిమీ కెరీర్‌కు సడెన్‌గా బ్రేక్ పడింది. 2011లో ‘షాగిర్ద్’ చిత్రం తరువాత ఆమె మళ్లీ తెర మీద కనిపించలేదు. అటు తెలుగులో కానీ, ఇటు హిందీలో కానీ మెరిసింది లేదు. ఉన్నట్టుండి అలా ఎలా మాయమైపోయింది? అసలేం జరిగింది? కాంట్రవర్సీయే కారణమా... రిమీ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి, ఆమె సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడానికి ఓ కాంట్రవర్సీయే కారణం అన్నమాట బాలీవుడ్లో వినిపిస్తోంది. ‘గోల్మాల్’ రిలీజైన తరువాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ... రిమీ కెరీర్‌ని ఖతమ్ చేసిందంటారు చాలామంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె గోల్మాల్ దర్శకుడు రోహిత్‌శెట్టి గురించి చేసిన ఓ కామెంట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ‘‘రోహిత్ చాలా గొప్ప దర్శకుడు. తను తలచుకుంటే ఓ నల్ల ఆఫ్రికన్‌ని కూడా అందంగా చూపించగలడు’’ అంది రిమీ. ఈ కామెంట్ ఓ పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఒక బ్రిటిష్ ఆఫ్రికన్ గ్రూప్ రిమీ స్టేట్మెంట్ని బహిరంగంగా ఖండించింది. ‘ఇది అర్థం లేని కామెంట్ మాత్రమే కాదు, ఆఫ్రికన్లను అవమానించే కామెంట్, ఇలా మాట్లాడే అర్హత ఆమెకి లేదు’ అంటూ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో రిమీకి కష్టాలు మొదలయ్యాయి. నోరు సంభాళించుకోకపోతే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు బాలీవుడ్ పెద్దలు క్లాస్ పీకారని, అయినా రిమీ లక్ష్యపెట్టకపోవడంతో వాళ్లంతా ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టారని, అందుకే ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయని వినికిడి. అయితే ధూమ్ 3 తీసినప్పుడు ఆమెని ఓ ఐటెమ్ సాంగ్ చేయమని అడిగారని, ముందు రెండు భాగాల్లో హీరోయిన్గా చేసిన తాను ఇప్పుడు ఐటెమ్ సాంగ్ చేయడమేంటంటూ రిమీ కోప్పడిందనే వార్తలు వచ్చాయి ఆ మధ్య. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ... రిమీ చేతిలో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేదన్నది నిజం. ఆమె మన ముందుకొచ్చి మూడేళ్లు అయ్యిందన్నదీ నిజం. చాలాకాలం తరువాత ఆ మధ్య ఓ ఫంక్షన్లో కనిపించిన రిమీ... తెరమీద కూడా మళ్లీ కనిపిస్తుందా? ఇంతకుముందులా బిజీ నటి అవుతుందా? చూద్దాం... ఆ రోజు వస్తుందేమో!