![Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/rimi3.jpg.webp?itok=FReldy5f)
Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore: బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్‌ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్ జతిన్ వ్యాస్‌ను అంధేరిలోని జిమ్‌లో కలిసినట్లు రిమీ సేన్ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని పేర్కొంది. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్‌లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్ వ్యాస్ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్‌పై ఐపీసీ సెక్షన్‌లు 420, 409 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. రౌనక్ జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్.
Comments
Please login to add a commentAdd a comment