బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ రిమీ సేన్. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. 2003లో హంగామా సినిమాతో హిందీలో అరంగేట్రం చేసిన రిమీ సేన్.. ఆ తర్వాత గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్‌మాల్, బాగ్‌బాన్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. అవేంటో తెలుసుకుందాం.
రిమిసేన్ మాట్లాడుతూ.. "ఇక్కడ నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కేవలం నాది ఫర్నీచర్ రోల్. హంగామా, జానీ గద్దర్ లాంటి చిత్రాల్లో మాత్రమే మంచి పాత్రలు చేశా. ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ వర్కవుట్ కాలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో కలిసి పనిచేసినప్పటికీ ఇండస్ట్రీలో ఎవరితోనూ కనెక్ట్ కాలేదు. సహాయం కోసం ఎవరినీ చేయి చాచి అడగలేదు' అని రిమీ సేన్ పేర్కొంది. అంతే కాదు.. కేవలం కామెడీ సినిమాలతో విసిగిపోయి నటనకు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది.
ఎవరైనా మీ ఫర్మామెన్స్ సరిగ్గా చేయలేదని మీప్లేస్‌లో ఎవరినైనా భర్తీ చేశారా? అని రిమి సేన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. "ఇండస్ట్రీలో టాలెంట్ అనేది నెక్ట్స్. ముందు మీరు వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. లేకపోతే ఏ పని జరగదు. లేదంటే మీ టాలెంట్ స్టోర్ రూమ్‌కు పరిమితం కావాల్సిందే. ఛాన్సుల కోసం అలా అందరినీ అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదు' అని చెప్పుకొచ్చింది. కాగా.. తన సన్నిహితుడు రౌనక్ జతిన్ వ్యాస్ ద్వారా రూ.4 కోట్లు మోసపోయానని రిమీ సేన్ ఇటీవలే వెల్లడించింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన రెండేళ్ల తర్వాత తాజాగా బాంబే హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment