
మన దేశంలో జనాలు ఏది ఎక్కువ ఇష్టపడతారో అంటే టక్కున చెప్పే మాట సినిమాలు, క్రికెట్. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాట ఉండాల్సిందే. స్టార్ హీరోహీరోయిన్లు వస్తారు, తమదైన డ్యాన్సులతో ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తారు. మిగతా సీజన్ల మాటేమో గానీ ఈ సీజన్ (IPL 2025) ప్రారంభోత్సవానికి సగం బాలీవుడ్ వచ్చే ప్లాన్ చేశారట.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)
ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో 2-3 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి తొలి మ్యాచ్ కోల్ కతా vs బెంగళూరు (KKR vs RCB) మధ్య జరగనుంది. కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఎలానూ ఉంటాడు. మరోవైపు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, 'యానిమల్' తృప్తి, శ్రద్దా కపూర్, తమన్నా, ఊర్వశి రౌతేలా, కరీనా కపూర్, పూజా హెగ్డే.. ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు స్టార్ సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘెషల్, అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా ఫెర్ఫార్మ్ చేయనుంది.
అయితే వీళ్లేం ఊరికే రారుగా. ఐపీఎల్ మేనేజ్ మెంట్ లేదా ఆయా ఫ్రాంఛెజీలు కోట్ల రూపాయల పారితోషికం చెల్లిస్తాయట. మొత్తంగా రెండు మూడు గంటల పాటు జరిగే ప్రోగ్రామ్ కోసం రూ.40-50 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని టాక్. వీటిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)
Comments
Please login to add a commentAdd a comment