
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.
'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.
(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)
కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.
అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)
Comments
Please login to add a commentAdd a comment