Katrina Kaif
-
హీరోయిన్ కత్రినా డైట్ ప్లాన్: రెండుపూటల భోజనం, షట్పావళి అంటే..?
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఎంత ఫిట్‌గా నాజుగ్గా ఉంటారో తెలిసిందే. ఆమె తన అభినయం, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తీగలాంటి శరీరంతో బ్యూటిఫుల్‌గా ఉండే కత్రినా ఏం తింటుంది ఎలాంటి డైట్ ఫాలో అవుతోందో ఆమె వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు చెప్పుకొచ్చింది. కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ ఆమె తీసుకునే ఆహారమేనని అన్నారు. ఇంతకీ ఆమె ఎలాంటి డైట్‌ఫాలో అవుతుందంటే..?న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా కత్రినా డైట్ గురించి, ఆమె ఫిట్నెస్ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె సోషల్ మీడియాలో చెప్పే డైట్ ప్లాన్లను గుడ్డిగా అస్సలు ఫాలో అవ్వదని అన్నారు. ఆమె ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటుంది. అది శరీరాకృతిని మంచిగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనేది కత్రినా ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, ఆరోగ్యకరంగా, ఫిట్‌గా ఉండే డైట్ల గురించి తనను సంప్రదిస్తూ ఉంటుందని అన్నారు. పలు రకాల సందేహాలు నివృత్తి చేసుకుని గానీ ఫాలో అవ్వదని కూడా చెప్పారు. కత్రినా ఆయిల్ ఫుల్లింగ్, షట్పావళి, నాసికా క్లీనింగ్ తదితర స్వీయ సంరక్షణను తప్పనిసరిగా పాటిస్తారని పేర్కొన్నారు. షట్పావళి అంటే..షట్పావళి అనేది ఆయుర్వేద ఆచారం. దీని ప్రకారం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా 100 అడుగులు నడవడం జరుగుతుంది. ఈ పురాతన అభ్యాసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు..ముఖ్యంగా జీర్ణక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిభోజననతరం నడవడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ప్రేరేపించి పేగులు, పెరిస్టాలిక్ కదలికను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇలా నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్ వినయోగాన్ని సులభతరం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిహృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిఇది కేలరీలను బర్న్ చేసి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తుందిహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది.రోజుకు రెండు పూటలా తినడం మంచిదేనా..?రోజుకు రెండు పూటలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనాల మధ్య 6 గంటల లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ అనేది మన శరీరానికి తదుపరి భోజనానికి ముందు పోషకాలను పూర్తిగా జీర్ణం చేయడానికి, గ్రహించడానికి, సమీకరించడానికి సమయాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.రోజుకు కేవలం రెండు పూటలా భోజనం చేయడం అనేది తరచుగా 'అడపాదడపా ఉపవాసం' అని పిలిచే పద్ధతి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందిటైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి లేదా నిర్వహించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.అజీర్ణం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆకలిని నియంత్రిస్తుందిమానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. (చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
అలాంటి డ్రెస్‌లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో లండన్ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామన్లు వారిని క్లిక్‌మనిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ పక్షులు కనిపించారంటే వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరినీ ఫాలో అవుతూ తమ కెమెరాలకు పని చెప్తుంటారు. కత్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్‌లో అయితే మరీనూ.. అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట!ఫోటోలు తీయొద్దుఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ వెల్లడించారు. 'ఒకసారి కత్రినా.. తమ ఫోటోలు తీయొద్దని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత యష్ రాజ్ స్టూడియోస్‌కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశల్‌తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది. మిగతావి డిలీట్ చేయమని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్‌తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చదవండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్.. అంతేకాదు! -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్‌కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్‌క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్‌తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
పెళ్లై మూడేళ్లు.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు తల్లి కావడం ఆనందంగా ఉంది. దీపికా పదుకొణె తాను గర్భవతి అనే శుభవార్తను పంచుకుంది. ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ గర్భవతి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఇంటికి త్వరలో ఒక చిన్న గెస్ట్ వస్తాడని నెటిజన్లు అంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడకు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంటగా వెళ్లారు. ఆ సమయంలో ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో పదేపదే దాచుకోవడం కెమెరాల కంట పడింది. ఆ విడీయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీంతో కత్రినా, విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు అంటున్నారు. దీపికా పదుకొనే తర్వాత కత్రినా కైఫ్ కూడా స్వీట్ న్యూస్ ఇస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. విక్కీ , కత్రినా 2021 డిసెంబర్ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంటే వారి పెళ్లి జరిగి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పుడు వారిద్దరూ తల్లితండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే వారిద్దరూ రియాక్ట్ కావాల్సిందే. -
అలాంటి సీన్స్‌లో నటించిన భార్య.. భర్త రియాక్షన్ ఇదే
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జోడీగా నటించిన భారీ యాక్షన్ చిత్రం టైగర్- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్పై యూనివర్స్‌లో భాగంగా గత రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్‌లో కత్రినా కైఫ్‌పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్‌ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్‌గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్‌పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్‌లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు. -
మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్
ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’. 1994లో విడుదలైన 'మోహ్రా' చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి రవీనా టాండన్ దుమ్ములేపారు. ఈ ఐకానిక్ పాట చిత్రీకరించడం గురించి ఆమె తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: రాఘవేంద్ర రావు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు ఇస్తున్న నెటిజన్లు) నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేయడంతో చాలా ఇబ్బంది పడినట్లు రవీనా చెప్పుకొచ్చింది. అక్కడ చుట్టూ ఇనుప చువ్వలతో పాటు అపరిశుభ్రంగా ఉంది. దీంతో పాట చిత్రీకరణలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు రవీనా తెలిపింది. అంతేకాకుండా చెప్పులేకుండా చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్ చేయడం చాలా కష్టమనిపించినట్లు చెప్పింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు ఆ బాధను భరిచలేకపోయానని తెలిపింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: భక్త కన్నప్పలో ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్) ఆ పాట దెబ్బతో సుమారు మూడు రోజులకు పైగానే అనారోగ్యానికి గురికావడం జరిగిందని గుర్తుచేసుకుంది. తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్... తెరవెనుక చెప్పలేనన్ని కథలను దాచిపెడుతుంది. రిహార్సల్స్ సమయంలో గాయాలు మామూలే, అయినా తామందరం వాటిని సహిస్తామని తెలిపింది. పాట చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినా అదీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ బాధలన్నీ మరిచిపోయామని రవీనా టాండన్ చెప్పింది. ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాలో కూడా రీమేక్ చేశారు. అందులో అక్షయ్‌కుమార్ - కత్రినాకైఫ్ నటించారు. -
రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?
Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్‌తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్‌తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?) 2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్‌ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్‌ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిస్తే.. సారా అలీ ఖాన్‌తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. -
దీపావళికి తిరిగొస్తున్న టైగర్..
-
మాజీ లవర్ కత్రినా కైఫ్ భర్తని అవమానించిన సల్మాన్ ఖాన్
-
ఎకానమీ క్లాస్‌లో బాలీవుడ్ జంట.. మరీ ఇంత చీప్‌గానా..!
ఎల్లప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తారలు.. వెకేషన్‌కు టైం కేటాయిస్తూనే ఉంటారు. సెట్స్, షూటింగ్‌లంటూ బిజీబిజీగా గడుపుతూ అలిసిపోతుంటారు. అందుకే తీరిక దొరికినప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా రిఫ్రెష్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు అప్పటికప్పుడు బ్యాగు సర్దేసుకుని విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా రొటీన్‌గా జరిగేదదైనా ఈ ట్రిప్‌లో కాస్త వెరైటీ కూడా ఉందండోయ్. అదేంటంటే ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం. అది చూసిన జనాలు అదేంటి? వీళ్లు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలు అయి ఉండి ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం గ్రేట్ అని కొందరంటుంటే.. మరీ చీప్‌గా కాకుండా బిజినెస్ క్లాస్ లేదంటే ఫస్ట్ క్లాస్‌లో అయినా వెళ్లాల్సిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోలో కత్రినా తన గుర్తు పట్టకుండా ఉండేందుకు బ్లాక్ క్యాప్‌తో పాటు.. మాస్క్‌ను ధరించి ఉంది. అంతే కాకుండా ఈ క్లిప్‌లో స్టార్ జంట పక్కపక్కనే కూర్చుని వారి వారి మొబైల్స్‌లో నిమగ్నమైపోయారు. ఇక వీడియో మొదట్లో కత్రినా మాస్క్ తొలగించి ఫోన్లో బిజీగా ఉండగా.. ఓ అభిమాని సీక్రెట్‌గా రికార్డ్ చేశారు. అది గమనించిన కత్రినా వెంటనే మాస్క్ ధరించింది. ఈ వీడియోను చూస్తే వీరిద్దరూ ఏదో సీక్రెట్ వెకేషన్ వెళ్తున్నట్లు అర్థమవుతోంది. తమని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఇలా ఎకానమీ క్లాస్‌లో వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారని కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి.. వారి ప్రైవసికి భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ జంట హాలిడే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్.. బాలీవుడ్ నటి ఫిదా
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆర్సీ15'. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తిస్థాయిలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టన్నింగ్ లుక్‌లో ఉన్న పిక్స్ చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'స్టిల్ ఇన్ థాట్స్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. చరణ్ లుక్ చూసి ఫిదా అయినా బాలీవుడ్ కత్రినా కైఫ్ లైక్ చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో షూట్లో ఉన్నా ఫోటోను కియారా అద్వానీ అతని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పెళ్లి తర్వాత తొలిసారి అలా.. కత్రినా, విక్కీ ఫోటోలు వైరల్.. !
బాలీవుడ్ రొమాంటిక్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో వివాహబంధంతో ఒక్కటైన ఈ ప్రేమజంట త్వరలోనే తెరపై కనువిందు చేయనున్నారు. పెళ్లి తర్వాత స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో ఇద్దరు కలిసి నటించనుండగా ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరలయ్యాయి. They should go get married! 💘🤣#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/vyo78G7hDe — Nush (@tanyeahok) September 13, 2022 (చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది) అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కత్రినా కైఫ్, భర్త విక్కీ కౌశల్‌తో అనుబంధాన్ని వివరించింది. తామిద్దరం డేటింగ్ చేయలేదని ఆమె వెల్లడించింది. మీడియాలో తమపై వస్తున్న కథనాలు చూస్తే చాలా తమాషాగా అనిపిస్తుందని తెలిపింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేశారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు. I'm so excited for the ad🤩 My babies🫶🏻🫶🏻🫶🏻#KatrinaKaif #VickyKaushal #VicKat pic.twitter.com/kVHCxtPLxB — Merve (@itsewrem) September 13, 2022 -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
Samantha-Katrina: సమంత బాటలో కత్రీనా.. సేమ్ సీన్ రిపీట్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో.. అత్యంత సన్నిహితులు సమక్షంలో గురువారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం విక్ట్రీనా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో అందంగా.. మేడ్ ఫర్ ఇచ్ అదర్‌లా ఉన్నారు ఇద్దరు. ముఖ్యంగా కత్రీనా సబ్యసాచి డిజైన్ చేసిన ఎరుపు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. వివాహ తంతు జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న వేళ.. పట్టరాని సంతోషంతో కత్రినా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విక్కీ జీవితాంతం ఆమె చేతిని వీడనంటూ.. గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతోంది. (చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..) దీన్ని చూసిన నెటిజనులు సమంతను గుర్తు చేసుకున్నారు. చైతూతో వివాహం జరుగుతున్న వేళ సమంత కూడా ఇలానే పట్టరాని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. విక్ట్రీనా వివాహంలో కూడా ఇదే సీన్ రిపీట్ కావడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. (చదవండి: పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్, ఇదిగో ప్రూఫ్..) ఇక నూతన దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
కత్రీనా కారు ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. తర్వాత ?
Katrina Kaif Car Stopped By Traffic Police In Mumbai: బీటౌన్‌లో అత్యంత ట్రెండింగ్ టాపిక్ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ వివాహం. డిసెంబర్ 7 నుంచి 10 వరకు వారి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. మంగళవారం సంగీత్, తర్వాత మెహందీ, అనంతరం 9న విక్కీ, కత్రీనాల వివాహం కానుండగా, 10న రిసెప్షన్ జరగనుందని సమాచారం. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అధికారికంగా ఎప్పుడూ ప్రకటిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆ సమయంలో డిసెంబర్ 5న కత్రీనా, విక్కీ సాధారణంగా ముంబై రోడ్లపై దర్శనమిచ్చారు. జిమ్‌కు కలిసి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కత్రీనాకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో కత్రీనా కారును ట్రాఫిక్ పోలీసు ఆపి, తనిఖీ చేయడానికి ముందుకు వస్తాడు. డ్రైవింగ్ సీటు దగ్గరికి వస్తూ కిటికిలోంచి లోపలికి చూస్తాడు. ఒక్కసారిగా కత్రీనా చూసి షాక్ అయిన పోలీసు డ్రైవర్‌తో మాట్లాడి ఓకే చేసి కారు పంపిస్తాడు. అయితే కత్రీనా పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు కారు తనిఖీ చేయడాన్ని చూసి జనం చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోపై కూడా నెటిజన్లు కామెంట్స్ చేశారు. కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లి గురించి సరదాగా కామెంట్స్ చేస్తూ, వివాహ కబురు త్వరగా చెప్పాలని కోరారు. అలాగే మరొక వీడియోలో ఓ అభిమానితో కత్రీనా సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. అభిమాని కోరిక మేరకు క్యాట్ ఏమాత్రం వెనుకాడకుండా సెల్ఫీ దిగడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆమె మంచి స్వభావాన్ని తెగ ఇష్టపడుతూ.. 'అందమైన మనసున్న వధువు' అని ఓ నెటిజన్ ప్రశంసించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
Kiara Advani Comments On Katrina And Vicky Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం ప్రస్తుతం బీటౌన్ హాట్ టాపిక్ అని తెలిసిన సంగతే. వీరిద్దరూ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో పెళ్లి చేసుకోబోతునట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం కోసం ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాహం గురించి ఇటు కత్రీనా, అటు విక్కీ అధికారికంగా పెదవి విప్పలేదు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే వీరి షాదీకి హాజరయ్యేవారు ఎవరెవరూ అనేది ఇంకో టాపిక్‌గా మారింది. అయితే క్యాట్, విక్కీ వివాహంపై బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 3) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారి పెళ్లి గురించి అడిగితే కియార మొదట ఆశ్చర్యపోయింది. 'నిజంగానా ? వార్తలు విన్నాను, కానీ నాకేం తెలీదు. నన్నైతే ఇప్పటివరకు ఆహ్వానించలేదు.' అని చెప్పుకొచ్చింది 'కబీర్ ఖాన్' ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరీమణులు అల్విరా, అర్పిత, వారి కుటుంబ సభ్యులు కత్రీనా, విక్కీల వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. వారికి కూడా ఇంతవరకూ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారని సమాచారం. డిసెంబర్ 4 నుంచి 12 మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందట. డిసెంబర్ 7న 'సంగీత్', మరుసటి రోజు 'మెహందీ' కాగా పెళ్లి తర్వాత ఈ నెల 10న ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకకు సుమారు 120 మంది బాలీవుడ్ పెద్దలు అతిథులుగా విచ్చేయనున్నారని సమాచారం. ఇదీ చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..! -
సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్
Katrina Kaif And Vicky Kaushal Wedding Date: హీరోయిన్ల పెళ్లి కబురంటే ఆ సందడే వేరు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనేది బజింగ్ టాక్. అయితే మీడియాకు దూరంగా ఈ వేడుకనుఎంతో రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు ఈ లవ్‌బర్డ్స్. కానీ బీటౌన్ ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు. అతిరథ మహా రథులట, ఎగ్జోటిక్ సెర్మనీ, టైగర్ సఫారీ అట, అంతేకాదండోయ్ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులకు బోలెడన్ని కండిషన్లట. 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్న ఈ స్టార్ జంట ఈ రోజో రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద తమ పెళ్లిని నమోదు చేసుకోనున్నారు. ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ ఎగిరి పోనున్నారు. హాట్ టాపిక్‌గా నిలుస్తోన్న క్యాట్-విక్కీ వెడ్డింగ్ అంచనాలపై ఓ లుక్కేద్దాం. View this post on Instagram A post shared by Six Senses Fort Barwara (@sixsensesfortbarwara) -
కత్రీనా కైఫ్-రణ్వీర్ సింగ్ మధ్య పోటీ.. ఎవరు గెలుస్తారో ?
Katrina Kaif And Ranveer Singh: కొవిడ్ కారణంగా చాలా నెలలు థియేటర్లన్ని మూసివేశారు. నెలల తరబడి వినోదం పంచేందుకు సినిమాలు ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ విడుదలై ప్రేక్షకులు ముందుకు వెళ్దామా అని తహతహలాడాయి. ఇక ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. ఇటీవల పలు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. అందుకే వచ్చే సంవత్సరమైనా ప్రేక్షకుల ముందుకు వెళ్దామని సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. అవి వాటి రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న 'సర్కస్', కత్రీనా కైఫ్ 'ఫోన్ భూత్' సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలను వచ్చే ఏడాది జూలై 15న రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. అక్షయ్ కుమార్ హీరోగా 'సూర్యవంశీ' తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పుడు ఆయన రణ్వీర్ సింగ్‌తో రూపొందిస్త్నున చిత్రమే 'సర్కస్'. ప్రముఖ రచయిత షేక్స్పియర్ నాటకం 'ది కామెడీ ఎర్రర్స్' పుస్తకం ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. గుర్మీత్ సింగ్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం 'ఫోన్ భూత్'. ఈ సినిమా హార్రర్ కామెడీ తరహాలో సాగనుంది. ఇందులో సిద్ధాంత్ ఛతుర్వేది, రితేష్ సిద్వానీ నటిస్తున్నారు. రణ్వీర్ సింగ్ 'సర్కస్', కత్రీనా కైఫ్ 'ఫోన్ భూత్' రెండూ కామెడీ నేపథ్యంలోనే రానున్నాయి. ఈ రెండింట్లో ఏ చిత్రాన్ని బాక్సాఫీస్ వరించనుందో చూడాలి. -
విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..?
Vicky And Katrina Wedding: బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కైషల్ వివాహం రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 7-12 తేదీల మధ్య వీరి వివాహ వేడుకలు నిర్వహించనున్నారట. ఈ హోటల్లో బుకింగ్ కూడా పూర్తయిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వీఐపీల వివాహలను నిర్వహించడానికి చాలా ఈవెంట్ కంపెనీలు కలిసి పని చేస్తాయి. వేర్వేరు ఈవెంట్ల కోసం రకరకాల కంపెనీలను ఎంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈవెంట్ కంపెనీల ప్రతినిధులు సవాయ్ మాధోపూర్‌లోని వివిధ హోటళ్లలో గదులు వెతుకుతున్నారట. మరోవైపు కత్రీనా, విక్కీల బృందాలు కూడా పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాయని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృంద మంగళవారం సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుంది. హోటల్ యాజమాన్యం నుంచి అందిన సమాచారం ప్రకారం పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆ టీమ్ పర్యవేక్షిస్తుంది. వరుడు గుర్రం మీద కూర్చొని ఏ ప్రదేశం నుంచి వస్తాడు, మెహందీ ఎక్కడ నిర్వహిస్తారు మొదలైనవాటిని బృందం రెక్కీ చేస్తుందట. అయితే కత్రీనా, విక్కీ వివాహం చేసుకుంటున్న సిక్స్ సెన్సెస్ హోటల్ బర్వార్కు ప్రాచీన చరిత్ర ఉందట. ఇది 14వ శతబ్దంలో నిర్మించినట్లు చెప్పబడే చిత్రాలు ఇక్కడ ఉన్నాయని సమాచారం. ప్యాలెస్‌లో 48 లగ్జరీ సూట్లు ఉన్నాయి. ఇవి సుమారు 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతిని వర్ణిస్తాయి. సమకాలీన రాజస్థానీ స్టైల్లో రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతను సూక్ష్మంగా పొందుపరిచారు. 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతి చిత్రాలను అక్కడ చూడవచ్చు. హోటల్ టెర్రస్ నుంచి పలు తోటలు, బార్వార గ్రామీణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. విక్కీ కౌషల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌ను విక్కీ గానీ కత్రీనా గానీ తిరస్కరించలేదు, ధ్రువీకరించలేదు. -
విక్కీ కౌషల్ కాబోయే భార్యకు ఈ లక్షణాలు ఉండాలట..
ప్రస్తుతం బీటౌన్‌లో విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ, పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్. వారిద్దరూ సీక్రెట్‌గా వివాహ కార్యక్రమాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తనకు ఎలాంటి భార్య కావాలో, ఆమెకు ఉండే లక్షణాలేంటో చెప్పాడు విక్కీ. ఇటీవల 'ఇన్ టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' పోగ్రామ్‌లో అతిథిగా హాజరైన విక్కీ కౌషల్ తన కాలేజ్ డేస్‌ను గుర్తు చేసుకున్నాడు. అలాగే తన మూలాల గురించి, తన వివాహ ప్రణాళికల గురించి షోలో చెప్పుకొచ్చాడు. విక్కీ వివాహ ప్రణాళికల గురించి అడిగినప్పుడు ఇలా చెప్పాడు. 'జీవితంలో ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతాను. నాకు కాబోయే భార్య ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుభూతి చెందాలి. మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి అవగాహన ఉండాలి. ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. ఇద్దరి ప్లస్‌లు మైనస్‌లను ప్రేమించాలి. ఒకరినొకరం బెస్ట్‌గా మార్చుకోవాలి.' అయితే కత్రీనా, విక్కీ వివాహ వేడుకలు, ప్రణాళికల గురించి మాత్రం పెదవి విప్పలేదు విక్కీ కౌషల్. కత్రీనా, విక్కీ వివాహం రాజస్థాన్‌లో ఉన్న సవాయ్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో జరగనుందని సమాచారం. వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 వరకు జరుగుతాయని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వేడుకల ఏర్పాటు అనేక కారణలున్నాయట. పెళ్లిలో వేసుకునే రాజామాన్ సింగ్ సూట్ అత్యంత ఖరీదనైది. దీని విలువ వైబ్‌సైట్ ప్రకారం నివాసం, పెళ్లి తేదీలు, లభ్యతను బట్టి రూ. 64,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందట. మరోవైపు కత్రీనా, విక్కీ కౌషల్ బృందాలు వివాహానికి సన్నాహాలు మెదలు పెట్టాయని సమాచారం. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈ టీమ్స్ పర్యవేక్షిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: విక్కీ మాజీ ప్రేయసీ
బాలీవుడ్ నటులు విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయన్న సంగతి తెలిసిందే. వారు సీక్రెట్‌గా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో రోకా చేసుకున్నారని కూడా విన్నాం. తాజాగా వారి వివాహ వేడుకలు డిసెంబర్ 7, 9 మధ్య రాజస్థాన్‌లో జరుగుతాయని సమాచారం. ఆ వేడుకలకు వధూవరులు సబ్యసాచి ఔట్ఫిట్స్ ధరించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయాలపై విక్కీ కౌషల్ మాజీ ప్రేయసీ హర్లీన్ సేథీ స్పందించింది. కత్రీనా, విక్కీ కౌషల్ ప్రేమాయణం పుకార్లపై తనకు ఎలాంటి స్పష్టత లేదంది. వారి రిలేషన్షిప్ గురించి తనకు ఎలాంటి బాధలేదని హర్లీన్ చెప్పిందట. హర్లీన్ ఇప్పుడు మూవ్ ఆన్ అయిందని, తన పనిలో మునిగిపోయిందని ఆమె సన్నిహితులు ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్ తీస్తున్న 'ది టెస్ట్ కేస్ 2' గురించి ఎక్జైటింగ్‌గా ఉందని చెప్పారు. ఈ సిరీస్‌లో హార్లిన్ చుట్టు కథ తిరుగుతుందని తెలిపారు. అయితే విక్కీ ప్రేమ వ్యవహారం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు తనను అందులోకి లాగొద్దు అని చెప్పిందని సమాచారం. చదవండి: విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా? ఇంతకుముందు ఓ ఇంటర్యూలో విక్కీ ఒంటరిగా ఉన్నానని చెప్పాడు. 2019లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో విక్కీని హర్లీన్ అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరు విడిపోయారనే పుకార్లు మొదలయ్యాయి. కత్రీనా కైఫ్‌తో విక్కీ సన్నిహితంగా ఉండటం కూడా వారి బ్రేకప్‌కు కారణమట. కత్రీనా గతంలో హీరో రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్షిప్లో ఉండగా, విక్కీ హర్లీన్ సేథీతో డేటింగ్ చేశాడు. -
విక్కీ కౌషల్, కత్రీనా ప్రేమ మందిరం.. పెళ్లి తర్వాత మకాం అక్కడేనా?
బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్, విక్కీ కౌషల్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వారు ప్రేమలో మునిగితేలుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఐదు రోజుల క్రితం కత్రీనా కైఫ్‌కు సన్నిహితుడైన ఏక్ థా టైగర్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో వీరిద్దరికి రోకా జరిగిందని అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ హీరో హీరోయిన్లు వారి రిలేషన్‌ను ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వీరికి సంబంధించి ఇంకో గాసిప్ బయటికొచ్చింది. విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ వారి వివాహం తర్వాత అపార్ట్మెంట్లోకి మారనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అందుకు ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్‌లో మరో పాపులర్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఉంటున్నట్లు సమాచారం. జుహులోని రాజ్‌మహల్ అల్ట్రా లగ్జరీ భవనంలో ఓ ఫ్లాట్‌ను ఐదేళ్లకు రెంట్‌కు తీసుకున్నట్లు రియల్ ఎస్టేట్ వెబ్ హెడ్ వరుణ్ సింగ్ చెప్పాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే కత్రీనా కైఫ్ తన ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఇంతకుముందు చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఈ అల్లరి పిడుగు హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లవ్ ఎఫైర్ నడిపారు. సుమారు ఏడేళ్ల క్రితం ఈ రిలేషన్ పీక్స్‌లో సాగింది. అయితే ఈ విషయాన్ని కత్రీనా కైఫ్ గానీ, సల్మాన్ ఖాన్ గానీ బయటపెట్టలేదు. అనంతరం బ్రేకప్ కూడా జరిగింది. రణ్‌బీర్ కపూర్‌తోనూ సీరియస్‌గా లవ్ ట్రాక్ నడిపిందని ప్రచారం సాగింది. పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ బంధం కూడా ఎన్నో రోజులు నిలువలేదు. అక్షయ్ కుమార్‌తో పలు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. అప్పుడు వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అలాగే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించడం, పలు ప్రైవేట్ పార్టీల్లో కలిసి పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ అమ్మడి ప్రేమ వ్యవహారాలేవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించకపోవడం విశేషం. -
కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్ టీస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’. దానికి కపిల్ శర్మ హోస్ట్. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ వచ్చారు. విక్కీ, క్యాట్ డేటింగ్లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ టీజ్ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియోని నెట్లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్‌కి కూడా వెళ్లారు. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో