
ప్రస్తుతం బీటౌన్‌లో విక్కీ కౌషల్, కత్రీనా కైఫ్ ప్రేమ, పెళ‍్లి వ్యవహారం హాట్ టాపిక్. వారిద్దరూ సీక్రెట్‌గా వివాహ కార్యక్రమాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తనకు ఎలాంటి భార్య కావాలో, ఆమెకు ఉండే లక్షణాలేంటో చెప్పాడు విక్కీ. ఇటీవల 'ఇన్ టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' పోగ్రామ్‌లో అతిథిగా హాజరైన విక్కీ కౌషల్ తన కాలేజ్ డేస్‌ను గుర్తు చేసుకున్నాడు. అలాగే తన మూలాల గురించి, తన వివాహ ప్రణాళికల గురించి షోలో చెప్పుకొచ్చాడు.
విక్కీ వివాహ ప్రణాళికల గురించి అడిగినప్పుడు ఇలా చెప్పాడు. 'జీవితంలో ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతాను. నాకు కాబోయే భార్య ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుభూతి చెందాలి. మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి అవగాహన ఉండాలి. ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. ఇద్దరి ప్లస్‌లు మైనస్‌లను ప్రేమించాలి. ఒకరినొకరం బెస్ట్‌గా మార్చుకోవాలి.' అయితే కత్రీనా, విక్కీ వివాహ వేడుకలు, ప్రణాళికల గురించి మాత్రం పెదవి విప్పలేదు విక్కీ కౌషల్.
కత్రీనా, విక్కీ వివాహం రాజస్థాన్‌లో ఉన్న సవాయ్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌లో జరగనుందని సమాచారం. వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 వరకు జరుగుతాయని తెలుస్తోంది. అయితే అధికారిక ప‍్రకటన రావాల‍్సి ఉంది. ఈ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వేడుకల ఏర్పాటు అనేక కారణలున్నాయట. పెళ్లిలో వేసుకునే రాజామాన్ సింగ్ సూట్ అత్యంత ఖరీదనైది. దీని విలువ వైబ్‌సైట్ ప్రకారం నివాసం, పెళ్లి తేదీలు, లభ్యతను బట్టి రూ. 64,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందట.
మరోవైపు కత్రీనా, విక్కీ కౌషల్ బృందాలు వివాహానికి సన్నాహాలు మెదలు పెట్టాయని సమాచారం. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈ టీమ్స్ పర్యవేక్షిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment