Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్‌ఆర్‌ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్‌తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్‌లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్‌తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?)
2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్‌ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది.
ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్)
బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్‌ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు.
కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిస్తే.. సారా అలీ ఖాన్‌తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్‌ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment