
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సంగీత్‌లో అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్ చేయడం అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. సినిమా తారలు తగ్గేదేలే అంటూ స్టేజీని రఫ్ఫాడించారు.
బాలీవుడ్ జంట ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. అటు సల్మాన్ ఖాన్, అనంత్‌తో కలిసి హిందీ పాటకు చిందేశాడు. లవ్ బర్డ్స్ జాన్వీ కపూర్-శిఖర్ పహారియా, మానుషి చిల్లర్, వీర్ పహారియా కలిసి డ్యాన్స్ చేశారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన గాత్రంతో అదరగొట్టాడు. బేబీ, పీచెస్, లవ్ యువర్‌సెల్ఫ్ వంటి సాంగ్స్ ఆలపించాడు.
ఈ ఫంక్షన్‌కు విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, అనన్య పాండే, సల్మాన్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, రితేశ్ దేశ్‌ముఖ్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ముంబైలో ఘనంగా జరగనుంది. జూలై 14న రిసెప్షన్ జరగనుంది.
Ranbir and Alia dancing along with Akash and shloka Ambani on “Show me the thumka” 🔥#RanbirKapoor #AliaBhatt pic.twitter.com/MiJsXO5cxI
— ritika ❤️🔥 | L&W ERA (@ritikatweetssx) July 6, 2024
చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment