రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఓ సెన్సేషన్. తెలుగులో సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ సాధించే రేంజ్ వరకు ఎదిగిపోయాడు. 'బాహుబలి'తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాబట్టి రావడానికి ఎంత లేదన్న మరో 3-4 ఏళ్లయినా పడుతుంది. మరోవైపు రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేయబోతుంది.
(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!)
తెలుగు దర్శకుల్లో రాజమౌళి రూటు సెపరేటు. చేసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ఇతడు.. వేల కోట్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడి జీవితంలో కొన్ని విషయాలతో 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీ తీశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జో రూసో, ప్రభాస్, రానా, జూ.ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్‌లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా? అనేది చూడాలి.
(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)
Comments
Please login to add a commentAdd a comment